Lorry Driver
-
‘డ్యాష్ క్యామ్’లకు డిమాండ్
తేలికపాటి, భారీ వాహనాలకు డ్యాష్ బోర్డుల వద్ద కెమెరాల ఫిక్సింగ్ 2016 ఫిబ్రవరి 21.... కుషాయిగూడలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు...ఏపీ 29 బీటీ 6615 లారీ వల్ల జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా చీకటిమామిడికి చెందిన భూపతి మధుసూదనరావు చనిపోయారు. అది ప్రమాదంకాదంటూ లారీ డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు..మధుసూదనరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ⇒ ఈ ఉదంతం చోటు చేసుకున్న చోట సీసీ కెమెరాలు లేకపోతే..! ‘ఆనవాయితీ’ ప్రకారం లారీ డ్రైవర్ కేసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి వాటితో పాటు డ్రైవర్లకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచి్చనవే డ్యాష్ క్యామ్స్గా పిలిచే డ్యాష్ బోర్డు కెమెరాలు. నగరంలో వీటి వినియోగం ఇటీవల కాలంలో 30 శాతం పెరిగినట్లు కార్ డెకార్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఉదంతాలతో పాటు మోసాలు ఎన్నో... కుషాయిగూడలో జరిగిన మధుసూదన్ రావు తరహా ఉదంతాలతో పాటు ప్రమాదాల పేరుతో కొందరు చేసే మోసాలు అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి. తమ వారిని ఉద్దేశపూర్వకంగా వాహనాలకు ఎదురుగా, పక్కన నుంచి సమీపంలోకి పంపించే వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లిన వాళ్లను ఆ వాహనాలు తాకితే చాలు తక్షణం కింద పడిపోతారు. అక్కడే ఉండే వారి సంబం«దీకులు యాక్సిడెంట్ అంటూ హడావుడి చేస్తారు. మరికొన్ని ముఠాలైతే నిర్మానుష్య, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. ఫలానా చోట యాక్సిడెంట్ చేసి, పట్టించుకోకుండా వచ్చేస్తున్నావంటూ డ్రైవర్లను మోసం చేస్తున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన వారి ప్రధాన ఉద్దేశం..బెదిరించి డబ్బు గుంజడమే. హైఎండ్ వాహనాలకు ఇన్‌బుల్ట్‌గా... కీలక సందర్భాల్లో వినియోగించడంతో పాటు ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఉద్దేశించినవే డ్యాష్ క్యామ్‌లు. ఇటీవల అనేక హైఎండ్ వాహనాల్లో నలు వైపులా దృశ్యాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన కెమెరాలు ఇన్బుల్ట్గానే వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఖరీదు చేసిన వాటితో పాటు పాత మోడల్స్‌కు చెందిన, సాధారణ వాహనాలను మాత్రం కేవలం వెనుక వైపు మాత్రమే కెమెరా ఉంటోంది. కొన్నింటిలో అసలు కెమెరానే ఉండట్లేదు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ డ్యాష్ క్యామ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు... ఏది పెద్ద వాహనమైతే దాని చోదకుడిదే తప్పు అన్నట్లు నమోదు చేసే ‘ఆనవాయితీ’ ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి ఈ డ్యాష్ క్యామ్స్ చెక్ చెబుతున్నాయి. డ్యాష్ క్యామ్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో... ఇటీవల కాలంలో వాహన చోదకులు వినియోగిస్తున్న డ్యాష్ క్యామ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఆద్యంతం ఏమి జరిగిందో ఈ వీడియో రుజువులను అందిస్తుంది. తప్పు ఎవరిది అనేది నిర్ధారించడంలో, బీమా క్లెయిమ్‌లను పొందడానికి ఉపయోగపడుతుంది. వాహనాలను యజమానులకు అప్పగించినప్పుడు వారి ప్రవర్తన తదితరాలను ఎప్పటికప్పుడు యజమానికి తెలిసేలా చేస్తుంది. పార్కింగ్ మోడ్‌లోనూ పనిచేసే కెమెరాల వల్ల హిట్–అండ్–రన్ కేసుల్లో కీలక సాక్ష్యాలు లభిస్తాయి. కొత్త డ్రైవర్లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ వీటిలో నమోదైన ఫీడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు డాష్ క్యామ్‌లు ఉన్న వాహనాలకు ప్రీమియంల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పార్కింగ్ మోడ్‌లో పని చేసేవీ వాడాలి ఈ డ్యాష్ క్యామ్ వాహనం డ్యాష్ బోర్డ్ లేదా విండ్ïÙల్డ్ పైన, రియర్ వ్యూ మిర్రర్ పక్కన/కింద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లు కోఠికి చెందిన కార్ డెకార్స్ నిపుణులు సయ్యద్ ముస్తాఖ్ చెప్తున్నారు. కొన్ని కేవలం ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. వీటి వల్ల వాహనం పార్క్ చేసి ఉన్నప్పుడు చోటు చేసుకునే ఉదంతాల్లో ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ ఆధారంగా వాహనం పార్కింగ్ చేసి ఉన్నప్పుడూ పని చేసేవి బిగించుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత స్టోరేజ్ కెపాసిటీ, మంచి క్యాలిటీ ఉన్న వీడియోను అందించే వాటికే మొగ్గు చూపాలని స్పష్టం చేస్తున్నారు. -
లారీడ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
-
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా..
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామశివారులో ఆర్టీసీ బస్సు శుక్రవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంథని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దుబ్బపల్లి శివారులోకి చేరుకుంది. ఇదే సమయంలో డ్రైవర్ రతన్ గుట్కా వేసుకుంటున్నాడు. పక్కనుంచి లారీ వెళ్తుంగా ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ రోడ్డువైపు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రాజీవ్ రహదారి పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులు దాదాపు 40మందికి పైగా ప్రయాణుకులు ఉన్నారు. ఇందులో దేవిక(సెంటినరీకాలనీ), మల్లయ్య(మంథని), శ్రీరాముల స్వామి(కరీంనగర్) తలకు గాయాలు తీవ్రగాయాలు కాగా, మితాగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుడు శ్రీరాముల స్వామి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. -
అతను టిప్పర్ డ్రైవరే..కానీ..! సీఎం జగన్ అదిరిపోయే కౌంటర్
-
తాను నడుపుతున్న లారీ.. తనకే మృత్యు శకటమై..
కరీంనగర్: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరిఖని–మంథని ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఎండీ మన్సూర్ ఆలం(48) దుర్మరణం చెందాడు. తాను నడుపుతున్న లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మన్సూర్ ఆలం భూపాలపల్లిలో నివాసం ఉంటున్నాడు. లారీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఓసీపీ–3 సీహెచ్‌పీ వద్ద బొగ్గు డంప్‌చేసి గోదావరిఖని నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రామగిరి మండలం సుందిళ్ల గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ బ్రేకులు ఆగిపోయాయి. దీన్ని గమనించని డ్రైవర్ మన్సూర్ ఆలం లారీ ఆపలేదు. దీంతో ముందు ఉన్న మరోలారీని ఢీకొట్టుకున్నాడు. ఈప్రమాదంలో మన్సూర్ ఆలం క్యాబిన్ నుంచి కిందపడ్డాడు. తాను నడుపుతున్న లారీ కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవి చదవండి: మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా.. -
పరోట తిని వ్యక్తి మృతి
అన్నానగర్: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్పట్టికి చెందిన రామకృష్ణన్ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్ మిల్లుకు వచ్చారు. గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై..
రాజేంద్రనగర్: పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో ముందుకు కదిలాడు. గగన్‌పహాడ్ ఓవర్ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు. లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్‌పాత్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు
అన్నానగర్: ప్రియురాలు ప్రియుడిని కత్తితో నరికి హత్య చేసింది. కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురం పక్కన వడపొన్పరప్పి సమీపంలోని మనలూర్ గ్రామంలో కల్కువారి చెరువు ఉంది. ఇందులో శుక్రవారం తెల్లవారుజామున గోనె సంచి ఉంది. దానిపై రక్తపు మరకలు ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వడపరప్పి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిరుకోవిలూర్ డీఎస్పీ తిరుమేణి, ఇన్స్పెక్టర్ పాండియన్, సబ్ ఇన్స్పెక్టర్లు ఇళంగోవన్, మాణిక్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గోనెసంచెను స్వాధీనం చేసుకుని చూడగా ఓ యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో మనలూరికి చెందిన తంగదురై (21)గా గుర్తించారు. ఇతను అదే ఊరిలో ఉన్న రాళ్ల క్వారీలో లారీ డ్రైవర్. ఆ సమయంలో క్వారీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన అయ్యనార్ భార్య విజయప్రియ (29)తో తంగదురైకి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఏడాది నుంచి విజయప్రియ తంగదురైను దూరంగా పెట్టింది. ఇది తట్టుకోలేని తంగదురై విజయప్రియను తరచూ కలుస్తూ ఎందుకు మాట్లాడడం మానేశావు అంటూ వేధించేవాడు. ఈ స్థితిలో తంగదురై రెండు రోజుల క్రితం మద్యం తాగి విజయప్రియ ఇంటికి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన విజయప్రియ కత్తితో తంగదురై మెడను కోసేసింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం తంగదురై మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసి ఏమీ తెలియనట్లు నటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో విజయప్రియను పోలీసులు అరెస్టు చేశారు. విజయప్రియ భర్త మూడేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయప్రియకు 12 ఏళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉండడం గమనార్హం. -
మామిడి కాయల లోడు లారీ బోల్తా
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో స్క్యూ బ్రిడ్జి వద్ద మామిడి కాయల లోడు లారీ బోల్తా పడటంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం నూజివీడు నుంచి మామిడి కాయల లోడుతో చిత్తూరు వెళుతున్న లారీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ అదపు తప్పి స్క్యూబ్రిడ్జి తూర్పు భాగంలో కిందపడింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద కొందదిటి శివ, మల్లేశ్వరి దంపతుల కుమారుడు సంజీవ్ (3)కు స్నానం చేయించి, బట్టలు వేసేందుకు తల్లి ఇంటిలోకి వెళ్లింది. ఇంతలో పెద్ద శబ్దంతో లారీ బోల్తా పడింది. లారీ బాలుడిపై పడింది. స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసలు సంఘటన స్ధలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కింద పడిన లారీని అర్ధరాత్రికి పైకి తీశారు. దాని కింద ఉన్న సంజీవ్‌ను 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. పిల్లాడి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి క్యాజువాలిటి ముందు నిరసనకు దిగారు. మృతదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎస్కె ఖాదర్‌బాషా, పటమట, కృష్ణలంక సీఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ హరిబాబు, క్లీనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు థ్యాంక్స్ చెబుతున్న ట్రక్ డ్రైవర్లు.. ఎందుకో తెలుసా!
సిమ్లా: భారత్‌లో ఇటీవల అదానీ గ్రూప్ వెర్సస్ హిండెన్‌బర్గ్ వివాదం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ నివేదిక కారణంగా అదానీ ఆస్తులు చూస్తుండగానే కరిపోతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని అస్త్రంగా మార్చుకుని కేంద్రంపై దాడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్లు హిండెన్‌బర్గ్ నివేదికు ధన్యవాదాలు చెబుతున్నారు. అసలు ఈ రిపోర్ట్ ట్రక్ డ్రైవర్లకు ఏం చేసింది, వారేందుకు థ్యాంక్యు చెప్తున్నారో తెలుసుకుందాం! థ్యాంక్యూ హిండెన్‌బర్గ్ ట్రక్ డ్రైవర్లు సిమెంట్ సరఫరాకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఈ కారణంగా ప్లాంట్ నడపడం లాభదాయకం కాదని అదానీ సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని గాగల్, దార్లఘాట్‌లోని అదానీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని సుమారు 7,000 మంది ట్రక్కు యజమానులు, డ్రైవర్లు వారాల తరబడి నిరసన ర్యాలీలను మొదలుపెట్టారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం ట్రక్ డ్రైవర్లకు.. అదానీ గ్రూప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ‘హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిని తర్వాత అదానీ గ్రూప్‌పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న ఈ సంస్థ ఇటువంటి సమయంలో తమ ప్లాంట్లను మూసివేస్తే అది తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి అదానీ ప్రతినిధులు ట్రక్ డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ సారి సిమెట్ సరఫరాకు వసూలు చేస్తున్న మొత్తంలో 10 నుంచి 12 శాతం తగ్గించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ట్రక్ డ్రైవర్లు తమ ఆందోళనను విరమించారు. అంతేకాకుండా సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, ఇకపై అవి యథావిధిగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిందంటే కారణం.. హిండెన్‌బర్గ్ నివేదిక వల్లేనని భావించిన ట్రక్ డ్రైవర్లు ఈ సందర్భంగా హిండెన్ బర్గ్ థ్యాంక్స్ చెబుతున్నారు. చదవండి 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ! -
ప్రియుడితో కలిసి రెండేళ్ల కొడుకును చంపిన తల్లి
-
బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..
సాక్షి, వైఎస్సార్ కడప: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన మారుతినాయక్ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇతను 14 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన కవితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్ళపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. లారీడ్రైవర్‌గా పనిచేసే మారుతినాయక్‌కు అదే వృత్తిలో ఉండే వినోద్ అనే యువకుడు పరిచమయ్యాడు. తరుచూ మారుతినాయక్ ఇంటికి వస్తూపోతూ ఉండే వినోద్ కవితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్దిరోజుల పాటు అక్కడక్కడ తిరుగుతూ మూడు నెలల క్రితం బద్వేలులోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుండేవారు. అప్పట్లో మారుతినాయక్ తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. చదవండి: (కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..) ఈ క్రమంలో కవిత, వినోద్‌లు బద్వేలులో ఉన్నట్లు తెలిసి మారుతినాయక్ తన సోదరితో వచ్చి కవితను ప్రశ్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్ పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది, కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మారుతినాయక్ బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే 15 రోజుల కిందట రాత్రివేళల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తుండటంతో వినోద్ తీవ్రంగా కొట్టడంతో మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఇరువురు కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ప్రస్తుతానికి బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారించి తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. -
తప్పుదారి చూపిన గూగుల్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణికులు!
అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్‌లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్‌ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు. దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్‌వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు -
ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌పై రవాణా అధికారులు దాష్టీకానికి పాల్పడిన ఘటన సోమవారం ఏలూరులో జరిగింది. మహబూబ్ నగర్, మక్తల్ ప్రాంతానికి చెందిన బీ.రాజు లారీలో పత్తి లోడును తణుకుకు తీసుకెళ్తున్నాడు. లారీ ఏలూరు చేరుకోగా ఆశ్రం ఆసుపత్రికి సమీపంలో మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ ఈ.మృత్యుంజయ రాజు లారీని ఆపి పత్రాలు చూపాలని కోరారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలను చూపించారు. పత్రాలు సక్రమంగా ఉన్నా రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఇన్సెపెక్టర్ ఒత్తిడి తెచ్చారు. లంచం ఇచ్చేది లేదని రాజు తెగేసి చెప్పాడు. ఆగ్రహించిన ఇన్సెపెక్టర్, అతని కారు డ్రైవర్, హోమ్ గార్డులు లారీ డ్రైవర్‌పై దాడి చేసి కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని అడగడంతో మరింత రెచ్చిపోయి కొట్టారు. రూ. 15 వేలు లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు.. నీకు రూ. 20 వేలు జరిమానా విధిస్తున్నామని బెదిరించారు. ఈ తతంగాన్నంతా లారీ డ్రైవర్ తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తుండగా దానిని రవాణా అధికారులు లాక్కుని పగుల కొట్టారు. నిబంధనల మేరకు సరుకు రవాణా చేస్తున్న తన వద్ద లంచం డిమాండ్ చేయడమే కాక ఇవ్వడానికి నిరాకరించడంతో దాడి చేసి కొట్టి, తన ఫోన్‌ను ధ్వంసం చేయడంపై డ్రైవర్ రాజు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రవాణ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, రవాణా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తనపై దౌర్జన్యం చేసిన రవాణా అధికారులకు శిక్ష పడేవరకూ తాను పోరాటం కొనసాగిస్తానని డ్రైవర్ జు ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా లేకపోయినా ఇన్సెపెక్టర్ విధించిన జరిమానా కట్టేస్తానని చెప్పి రవాణా శాఖకు రూ. 20 వేలు మొత్తాన్ని చెల్లించాడు. చదవండి: (Vizag: ఇన్ఫోసిస్ కోసం చకచకా.. విశాఖలో పూర్తి స్థాయి కార్యకలాపాలు) షోకాజ్ నోటీసులు జారీ ఈ సంఘటనపై విచారణ చేపట్టిన రవాణా శాఖ ఉన్నతాధికారులు మోటార్ వెహికల్ అధికారి మృత్యుంజయ రాజు లారీ డ్రైవర్‌పై దౌర్జన్యం చేయడంతోపాటు అతని నుంచి లంచం డిమాండ్ చేసినట్టుగా గుర్తించారు. దీనిపై ఇన్సెపెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని జిల్లా ఇన్ఛార్జ్ ఉప రవాణా కమీషనర్ పురేంద్ర తెలిపారు. ఇన్సెపెక్టర్ కారును, అతని ఎన్ఫోర్స్మెంట్ ఐడీని స్వాధీనం చేసుకున్నామని, రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనలో ఇన్సెపెక్టర్ కారు డ్రైవర్‌తో పాటు హోం గార్డుపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
లారీ డ్రైవర్ కు కనిపించిన పులుల గుంపు..
-
చెక్‌పోస్టు గార్డును ఢీకొట్టి చంపిన లారీడ్రైవర్
నవీపేట: ఆపేందుకు ప్రయత్నించిన చెక్‌పోస్టు గార్డును లారీతో ఢీ కొట్టి వెళ్లిపోయాడు ఓ డ్రైవర్. తీవ్ర గాయాలతో గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పరిధి నవీపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నవీపేటలోని బాసర రహదారి పక్కన ఉన్న చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెక్‌పోస్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఈర్నాల మందగోల్ల శ్రీనివాస్ (47) అటుగా వస్తున్న లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయితే లారీ డ్రైవర్ లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో శ్రీనివాస్ తన బైక్‌పై వాహనాన్ని వెంబడించి అభంగపట్నం శివారులో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీడ్రైవర్ శ్రీనివాస్‌ను వేగంగా ఢీకొ ట్టగా...అతడు రోడ్డు మీదే ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
లంచం ఇవ్వకుంటే పిస్టల్‌తో కాల్చేస్తా.. ఫారెస్డ్ గార్డ్ బెదిరింపులు
మైసూరు(బెంగళూరు): కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ సమాజంలో మంచి పేరుతో పాటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంటే మరికొందరు లంచానికి ఆశపడుతున్నారు. తాజాగా లంచం కోసం ఓ ఫారెస్ట్ గార్డ్ హల్ చల్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అడిగినంత డబ్బు ఇవ్వక పోతే పిస్టల్‌తో కాల్చి వేస్తామని ఫారెస్డ్ గార్డు లారీ డ్రైవర్‌ను బెదిరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక–తమిళనాడు సరిహద్దులో పోలార్ వద్ద చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డు అటుగా వచ్చిన లారీని నిలిపి సోదా చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పిస్టల్‌తో కాల్చివేస్తామని లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశాడు. దృశ్యాలను సదరు లారీ డ్రైవర్ సెల్ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సదరు ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చదవండి: వీడియో: తప్పతాగిన సెక్యూరిటీ గార్డు వీరంగం.. లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు! -
కర్నూలులో లారీ డ్రైవర్ కిడ్నప్ కలకలం
-
హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్
Woman Driving Truck Video Viral: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. మగవారికి సమానంగా తాము సత్తా చాటగలమని నిరూపిస్తున్నారురు. భూమినుంచి అంతరిక్షం వరకు ఎందులోనూ తీసిపోమంటూని ముందుకు సాగుతున్నారు. ఆటో, బస్సు డ్రైవర్లుగానూ రాణిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ లారీ డ్రైవర్ అవతారమెత్తింది. ముఖంపై చిరునవ్వు చిందిస్తూ మహిళ లారీ డ్రైవ్ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పెద్ద లారీని మహిళ హైవేపై ఎంతో కాన్ఫిడెంట్‌గా డ్రైవింగ్ చేస్తోంది. ఆమె మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఆ వాహనంలోని వ్యక్తి మహిళను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేశారు. ఈ సమయంలో మహిళ సరదాగా నవ్వడం కెమెరా కంటికి చిక్కింది. అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు లేకుండా లారీ నడుపుతూ దూసుకెళ్లింది. దీనిని అవినాష్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p — Awanish Sharan (@AwanishSharan) July 17, 2022 సోషల్ మీడియోలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.94లక్షల మంది వీక్షించారు. దాదాపుగా 11వేలకు పైగా లైకులు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్స్ మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు.. ‘ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆ చిరునవ్వు అద్భుతం, ఇన్సిరేషనల్, మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్! -
పార్కింగ్ గొడవ.. ముగ్గురిపై లారీ ఎక్కించి పరార్
తిరువళ్లూరు(చెన్నై): మద్యం మత్తులో జరిగిన గొడవలో లారీ ఎక్కించి ఒకరిని హత్య చేసి, ఇద్దరిని గాయపరిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఉత్తరపెరుంబక్కం గ్రామం దగ్గరలో ఉన్న ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు లారీలను పార్కింగ్ చేస్తారు. బుధవారం రాత్రి స్థానిక గ్రామానికి చెందిన కమలకన్నన్, కుమరన్, నవీన్ తదితరులు లారీ యార్డు వద్ద మద్యం సేవిస్తుండగా, అక్కడే పార్కింగ్ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీని బయటకు తీయడానికి డ్రైవర్ లాల్‌సింగ్ యత్నించాడు. ఈ సమయంలో వారు తాము మద్యం సేవించిన తరువాతే లారీలను బయటకు తీయాలని లారీడ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ లాల్‌సింగ్ ఆ ముగ్గురిపై లారీ ఎక్కించి పరారయ్యాడు. ఈ సంఘటనలో అక్కడికక్కడే కమల కన్నన్ మృతి చెందగా, ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
మహిళతో లారీ డ్రైవర్ గొడవ.. సెల్‌ఫోన్ లాక్కుని..
గుంటూరు రూరల్: పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకునే ఓ మహిళ ప్రాణాలను లారీ డ్రైవర్ బలి తీసుకున్నాడు. మృతురాలి పిల్లలు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట సుగాలీ కాలనీకి చెందిన ప్రతామ రమణమ్మ (40) భర్త కొన్ని సంవత్సరాల కిందట మృతి చెందాడు. అప్పటినుంచి చిత్తు కాగితాలు ఏరుకోవడంతోపాటు చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను పోషిస్తుంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తనతోపాటు తన ముగ్గురు పిల్లలు, ఆడపడుచు, ఆడపడుచు భర్త కలిసి గుంటూరు రూరల్ మండలంలోని నాయుడుపేటలోని డంపింగ్ యార్డు సమీపంలో కాగితాలు ఏరుకునేందుకు బయలుదేరారు. బస్సుకు ఎక్కువ చార్జీ అవుతుందని లారీలో అయితే తక్కువతో ప్రయాణించవచ్చని అదే దారిలో వస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన లారీని చిలకలూరిపేటలో ఎక్కారు. అనంతరం నాయుడుపేట వద్ద లారీని ఆపాలని డ్రైవర్‌ను కోరారు. లారీ ఆగటంతో ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు, రమణమ్మ దిగారు. అనంతరం రమణమ్మ డ్రైవర్‌కు రూ.100 ఇచ్చింది. డ్రైవర్ రూ.300 ఇవ్వాలని రమణమ్మతో గొడవకు దిగాడు. ఇరువురు వాదులాడుకుంటుండగా డ్రైవర్ రమణమ్మ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని లారీని ముందుకు లాగించాడు. సెల్‌ఫోన్‌కోసం కదులుతున్న లారీని ఎక్కేందుకు ప్రయత్నించింది. లారీని డ్రైవర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు. కాలుజారి రమణమ్మ కిందపడింది. అదే లారీ ఆమెపైకి ఎక్కింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు కేకలు వేశారు. డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ ఆంజనేయులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి, బంధువుల నుంచి సమాచారం సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ లారీని ప్రత్తిపాడు సమీపంలో నిలిపివేసి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
జలజ: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది
ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్’’ అంటోంది జలజా రతీష్. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్‌నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ. కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్‌కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు ట్రిప్‌ను ప్లాన్ చేసేలా చేసింది. భర్తతో కలిసి.. లాంగ్ ట్రిప్‌కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్ లోడింగ్ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్‌ల మీదుగా కశ్మీర్ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు. లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్‌ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్ ట్రిప్‌ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్లో ప్లైవుడ్ ట్రాన్స్పోర్ట్ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్ దించి, అక్కడ పంచదారను లోడ్ చేసుకుని కేరళ లో అన్లోడ్ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. జలజ తన ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు. సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా.. ‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్మర్గ్, పంజాబ్ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది. రోజూ చేసే పని అయినా రొటీన్‌కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. -
'ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు'
సాక్షి, శంఖవరం/పిఠాపురం: ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలైన సంఘటన కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్ సమీపాన చోటుచేసుకుంది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన మేడపోతుల శివ ఈశ్వరుడు (38) లారీ డ్రైవర్‌గా, ఆకుల రామ్‌కుమార్ (35) క్లీనర్‌గా పని చేస్తున్నారు. వారు ఆదివారం కత్తిపూడిలోని ఒక డీలర్ వద్ద లారీలో డ్రింకులు లోడు చేసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లారీపై టార్పాలిన్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో తీవ్రస్థాయిలో విద్యుదాఘాతానికి గురైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీఐ కిశోర్‌బాబు, అన్నవరం ఎస్సై రవికుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు) మృతుల్లో ఒకరైన శివ (పాతచిత్రం) ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు మృతులిద్దరిదీ చిన్నప్పటి నుంచీ మోటారు ఫీల్డే. వాస్తవానికి ఒకరు లారీ డ్రైవర్. మరొకరు ట్రాక్టర్ డ్రైవర్. ఒక్కోసారి ఇద్దరూ కలిసి డ్రైవర్, కీనర్లుగా లారీపై వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం లారీపై డ్యూటీకి బయలుదేరారు. ఎంత లేటైనా రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. ఈ ప్రమాదంతో కొత్త ఇసుకపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు శివ ఈశ్వరుడికి భార్య శాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు రామ్‌కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, అప్పుడప్పుడు లారీపై క్లీనర్‌గా వెళ్తూండేవాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, ఇక తమకు దిక్కెవరని ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టిస్తోంది. -
ప్రాణాన్ని బలి తీసుకున్న వివాహేతర సంబంధం
సాక్షి, వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి తాలుకా అన్నియ అడిగలార్ నగర్‌కు చెందిన లారీ యజమాని వెంకటేశన్(35).. చిన్న వేపంబట్టు గ్రామానికి చెందిన లారీ మెకానిక్ శంకర్ మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది. ఆగ్రహించిన శంకర్ ఇనుప రాడ్డుతో వెంకటేశన్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శంకర్, అతని భార్య భాగ్యలక్ష్మి ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓసూరులో శంకర్, భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగ్యలక్ష్మి, వెంకటేశన్‌కు ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు.. ఈ కారణంగా వెంకటేశన్ తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి గొడవ పడినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన శంకర్ ఇనుప రాడ్డుతో వెంకటేశన్ తలపై కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ! -
వెళ్లిన ప్రతిసారీ వాయింపే!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రవల్లి చౌరస్తా నుంచి 45 కి.మీ. దూరంలో ఉన్న కర్నూలుకు లారీ సరుకుతో వెళ్తోంది. అక్కడ సరుకు దింపి తిరిగి రావాలి. కేవలం 45 కి.మీ దూరమే. కానీ లారీ డ్రైవర్ రూ.1,700 ‘సరిహద్దు రుసుము’చెల్లించాల్సి వచ్చింది. దూరంతో నిమిత్తం లేదు.. సరిహద్దు దాటితే చాలు రుసుం చెల్లించాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విచిత్ర పరిస్థితి ఇది. ఇక్కడే కాదు.. తెలంగాణ సరిహద్దు దాటి సరుకు రవాణా వాహనం పొరుగునున్న ఉన్న ఏపీలోకి ప్రవేశిస్తే చాలు.. రూ.1700 చెల్లిస్తేనే చెక్‌పోస్టు వద్ద అనుమతి లభిస్తుంది. దీంతో లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. నిత్యం తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లే వేల సంఖ్యలో లారీలు ఈ విధంగా రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా రోజుకు రూ.కోటికి పైగా చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో ఉన్న 60 శాతం లారీలకు యజ మాని–డ్రైవర్ ఒక్కరే. ఉపాధి కోసం లారీ కొనుక్కుని సరుకును రవాణా చేసుకునే వారే ఎక్కువ. ఎక్కువ లారీలు ఉండి పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారికి ఈ సరిహద్దు రుసుం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ స్వయం ఉపాధి కోసం లారీలు నడుపుతున్న చిరు వ్యాపారులకు మాత్రం భరించలేని భారంగా మారింది. నెలలో ఎన్నిసార్లు సరిహద్దు దాటితే అన్నిమార్లు రుసుము చెల్లించాల్సి రావటం వారికి పెద్ద సమస్యగా మారింది. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఇక్కడ ఎందుకిలా.. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా సరిహద్దు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేషనల్ పర్మిట్ విధానం ఉంటుంది. దాని ప్రకారం వార్షికంగా రూ.17 వేలు చెల్లిస్తే ఎక్కడికైనా ఎలాంటి అదనపు రుసుము లేకుండా వెళ్లొచ్చు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేనివారు, పొరుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే వారు ‘కౌంటర్ సిగ్నేచర్’పర్మిట్ తీసుకుంటారు. దీని ప్రకారం రూ.5 వేలు చెల్లిస్తే చాలు ఏడాది పాటు మరే సరిహద్దు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించొచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేకపోవటం సమస్యకు కారణమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలా ఉండగా, పొరుగు రాష్ట్రాలతో ఈ విధానం కొనసాగింది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది అమల్లోకి రాలేదు. ఫలితంగా సరిహద్దు దాటిన ప్రతిసారీ రూ.1700 చెల్లించాల్సి వస్తోంది. కొన్ని లారీలు సరుకు తీసుకుని ఏపీకి నెలలో ఏడెనిమిది మార్లు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో రుసుం పెనుభారంగా పరిణమిస్తోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. రాష్ట్రంలో 5.76 లక్షల లారీలున్నాయి. వీటిల్లో 1.75 లక్షలు హెవీ లారీలే. 40 శాతం లారీలకు నేషనల్ పర్మిట్ ఉండగా, మిగతావి ఎక్కువగా ఏపీతోనే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం అందుబాటులోకి తేవాలని యజమానులు కోరుతున్నా ఇంతవరకు ఫలితం లేదు. గతంలో చర్చల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ దీనికి సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వైపు నుంచి చొరవ లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని రాష్ట్రానికి చెందిన లారీల యజమానులు విమర్శిస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాం ఎక్కువగా ఏపీతోనే లావాదేవీలుంటున్నందున ఆ రాష్ట్రానికి సరుకు తరలిస్తూ, భారీ రుసుములు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నాం. మాలో చిన్న వ్యాపారులే ఎక్కువ. దీంతో కౌంటర్ సిగ్నిచర్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా చర్యల్లేవు. ఈ విషయమై మాట్లాడేందుకు తెలంగాణ యంత్రాంగం నుంచి మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదు. – రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ లారీ యజమానుల సంఘం -
వివాహమై 18 ఏళ్లు.. భార్యపై అనుమానంతో..
సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్): అనుమానంతో భార్యను గొంతుకోసి హతమార్చిన సంఘటన గురువారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ముస్కే రాజు వివరాల ప్రకారం... అశోక్‌నగర్ బస్తీకి చెందిన ఆసిఫ్ లారీ డ్రైవర్. ఇటీవల డ్రైవర్ పనికి వెళ్లకుండా ఇంటిపట్టున ఉంటున్నాడు. భార్య షాహిన్(39)పై అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయాలని పథకం ప్రకారం.. ఇంట్లో ఉన్న కొడుకు సోహెల్‌ను బ్యాంక్‌కు పంపించాడు. కూతురు తమన్న స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లింది. అదే అదునుగా భావించిన ఆసిఫ్ టీవీ సౌండ్‌ను పెంచి కత్తితో భార్య షాహిన్ గొంతుకోశాడు. అంతటితో ఆగకుండా రక్తం మడుగులో పడిపోయిన భార్య చనిపోయిందో లేదోనని కత్తితో కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. ఆ తర్వాత షాహిన్ చనిపోయిందని నిర్థారించుకుని ఆసిఫ్ వన్‌టౌన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని ఏసీపీ ఎంఏ రహెమాన్ సందర్శించారు. మృతురాలి తల్లి సుల్తానాతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ రాజు తెలిపారు. కుమారుడు పదో తరగతి, కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. గతం నుంచే గొడవలు... కాగజ్‌నగర్‌కు చెందిన ఆసిఫ్‌కు 18ఏళ్ల క్రితం బెల్లంపల్లికి చెందిన షాహిన్‌తో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి బెల్లంపల్లిలోనే రూంను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆసిఫ్ పని చేయకుండా ఇంటి వద్దనే ఉండడంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. తన పద్ధతి మార్చుకుంటానని ఆసిఫ్ నమ్మబలకడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసును సైతం షాహిన్ ఉపసంహరించుకుంది. -
దారుణం: చెట్టుకింద నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టి డంప్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టిన డంప్ చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన రామ్‌నరేశ్(32) జయభేరి కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా పనిచేస్తూ కంపెనీకి చెందిన ఓ షెడ్లో నివాసముంటున్నాడు. ఈనెల 16న రాత్రి 10.30 గంటల సమయంలో షెడ్ సమీపంలోని ఓ చెట్టుకింద రామ్‌నరేశ్ నిద్రిస్తుండగా అది గమనించని టిప్పర్ సిబ్బంది మట్టిని అతనిపై డంప్ చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యంపై కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..) -
శవాన్ని క్యాబిన్లో వేసుకుని 250 కి.మీ.
కొణిజర్ల: లారీకి పైన టార్పాలిన్ కట్టే విషయంలో జరిగిన గొడవ చివరకు క్లీనర్ హత్యకు దారితీసింది. ఏపీలోని కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ పోలోతు నైపురాజు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడకు చెందిన క్లీనర్ రాజు (45)తో కలిసి కాకినాడ నుంచి పామాయిల్ లోడుతో మంథని వెళ్లాడు. అక్కడ సరుకు అన్లోడ్ అయిన తర్వాత శనివారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ వెళ్లి నూకలు లోడ్ చేసుకుని కాకినాడ బయలుదేరారు. కరీంనగర్ వచ్చేసరికి లారీకి పైన కట్టిన టార్పాలిన్ తాళ్లు లూజు కావడంతో బిగించాలని డ్రైవర్ సూచించగా క్లీనర్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. క్లీనర్ కత్తితో డ్రైవర్‌పై దాడి చేయబోయాడు. వెంటనే డ్రైవర్ నైపురాజు చాకుతో ఎదురుదాడి చేసి క్లీనర్ పొట్ట చీల్చి వేశాడు. శవాన్ని క్యాబిన్‌లోనే వేసుకుని 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్‌స్టేషన్ ఎదుట లారీ నిలిపేసి పోలీసులకు లొంగిపోయాడు. -
వాగులో కొట్టుకుపోయిన లారీ
-
వాగులో కొట్టుకుపోయిన లారీ
సాక్షి, సిద్ధిపేట: వాగులో లారీ కొట్టుకుపోయిన ఘటన కోహెడ మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వరదలో చిక్కుకున్న లారీ డ్రైవర్ శంకర్ గల్లంతయ్యారు. శంకర్‌ను కాపాడే యత్నంలో గజ ఈతగాళ్లు తాడును అతనికి అందివ్వగా.. తాడును విడిచిపెట్టడంతో వాగులో కొట్టుకుపోయారు. ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. శంకర్ ఆచూకీ దొరకక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్, ఆర్డీవోలను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రెస్క్యూ బృందం శంకర్ ఆచూకీ కోసం హెలికాఫ్టర్ ద్వారా గాలిస్తున్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘు, ఎస్ఐ రాజా కుమార్, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరంగల్, కరీంనగర్ సిద్దిపేట నుండి గజ ఈతగాళ్లను రప్పించి ప్రయత్నాలు చేపట్టారు. -
లాక్డౌన్: కానిస్టేబుల్‌పై లారీ డ్రైవర్ దాడి
సాక్షి, బోధన్ రూరల్: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడో లారీ డ్రైవర్. కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జిల్లాలోకి రాకుండా నియంత్రిస్తున్నారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున బోధన్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ (పీబీ13ఏఎల్9637)ని పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే, సదరు లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతివేగంగా దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు వెంబడించి లారీని పట్టుకుని వివరాలు సేకరిస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ గురుప్రీత్‌సింగ్ కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ జీవన్ తలకు గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్ అహ్మద్ తెలిపారు. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది? ) సాక్షి, ఇందూరు(నిజామాబాద్ ): ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వాహనాలపై వేసుకుని బయట తిరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు సర్క్యూలర్ ద్వారా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన లాక్డౌన్ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని శాఖల్లో రొటేషన్ ప్రకారం ఉద్యోగులను కార్యాలయాలకు విధులకు అనుమతించిందన్నారు. కానీ కొందరు ఉద్యోగులు విధుల్లో లేకున్నా కూడా వాహనాలకు ఆన్‌డ్యూటీ స్టిక్లర్లు అతికించుకుని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారని, ఈ విషయా లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఇ టువంటి ఉద్యోగులపై యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. (స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం' ) ఈ విధంగా ప్రవర్తించడం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాక వైరస్ వ్యాప్తికి కారణం కావడంతో పాటు ఆ కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం కలుగుతుందని తద్వారా ఆ కు టుంబాలకు కూడా ప్రమాదకరమని తెలిపారు. అయితే అత్యవసర విధులు నిర్వహించే పో లీ సు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగి్నమాపక, తదితర శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాలయాల వేళలు త ర్వాత కూడా విధులకు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలున్నాయన్నారు. కావునా ఆ యా కార్యాలయాలకు చెందిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొందరు అధికారుల కుటుంబ సభ్యులు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల్లో నిబంధనలకు విరుద్దంగా స్టిక్కర్లు అతికించుకుని బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరు అతిక్రమించినా అధికారు లు, ఉద్యోగులు, సిబ్బందిపైన సీరియస్‌గా కఠనంగా చర్యలు తీసుకుంటామన్నారు. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా ) ప్రజలు తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్త.. కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు వచ్చే అన్ని ప్రాంతాలతో పాటు రైతులు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వైరస్ నిరోధించడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధిహామీ ప నులు, వ్యవసాయ పనులు చేయడానికి కూలీ లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.బ్యాంకులు, కిరాణా దుకాణా లు, మాంసం దుకాణాల వద్ద జనం ఎక్కు ఉంటారని ఇక్కడ మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు సంబంధిత యాజమాన్యాలు కూడా వారి ప్రాంతాలకు వచ్చే ప్రజలు క్రమ శిక్షణ, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. దుకా ణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాల న్నారు. ఈ జాగ్రత్త చర్యలు తీసుకోని వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. (ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ ) -
కరోనా : అయ్యో! తిరుపతికి ఎంత కష్టం..
సాక్షి, ఆదిలాబాద్ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలను కూడా వణికిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా పాటిస్తున్నారనే చెప్పాలి. అది ఎంతలా అంటే ఎవరైనా కొత్తవారు ఊరికి వస్తే వారిని ఊర్లోకి అడుగుపెట్టనివ్వకుండా ఊరి బయటే ఉంచుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక లారీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన తిరుపతి వృత్తిరిత్యా లారీ డ్రైవర్. కాగా తిరుపతి ఇటీవలే తన లారీలో గుజరాత్‌కు వెళ్లి అక్కడి నుంచి మందుల లోడ్ తీసుకొని విశాఖపట్నంకు వెళ్లాడు. విశాఖలో మెడిసిన్స్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఏప్రిల్ 5న తన సొంత గ్రామమైన మాన్కపూర్‌కు చేరుకున్నాడు. అయితే సొంతూరు వచ్చిన తిరుపతిని గ్రామస్తులు ఊర్లోకి రానీయకుండా ఊరి బయటే అడ్డుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్‌కు వెళ్లి వచ్చిన తిరుపతిని ఊరి బయట వేసిన టెంట్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలంటూ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు లేకుంటేనే తిరుపతిని ఊర్లోకి అడుగుపెట్టనీయాలని తీర్మానించకున్నారు. అప్పటివరకు తిరుపతి ఊరి బయట వేసిన టెంట్లో ఉంటూ అక్కడి పొలాల్లోనే స్నానం,మిగతా కార్యక్రమాలను తీర్చుకోవాలన్నారు. కాగా తిరుపతికి భోజనం అందించేందుకు వచ్చే కుటుంబసభ్యులు ఎవరైనా సరే కొంత దూరానా పెట్టి తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. 'మా గ్రామం లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తుంది. తిరుపతి మా గ్రామస్తుడే అయినా బయటికి వెళ్లి వచ్చాడు కాబట్టి 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. ఇది ఒక్క తిరుపతికే కాదు.. మా ఊరి నుంచి ఎవరు బయటికి వెళ్లినా ఇదే వర్తిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా కట్టుబాటుతో ఇప్పటికే ఐదు రోజులుగా తిరుపతి ఒక రకంగా గ్రామ బహిష్కరణ అనుభవిస్తున్నాడు. కరోనా అరికట్టెందుకు గ్రామస్తుల నిర్ణయం మేరకు మరో తొమ్మిది రోజులు తిరుపతి ఊరి బయట టెంట్లో ఉండక తప్పదని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొన్నారు. -
సంతానం లేదని దారుణం.. భార్యను
కర్ణాటక, బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంటిలో దాచిపెట్టిన ఘటన కలబురిగి జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. కలబురిగి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామానికి చెందిన లారీ డ్రైవరు శ్రీశైల్‌కు పదేళ్ల క్రితం సంగీతా సక్కరగి (35)తో వివాహమైంది. వీరికి పుట్టిన బిడ్డ ఇటీవల మృతి చెందింది. అప్పటి నుంచి సంతానం కలగలేదు. పిల్లలు పుట్టలేదనే కారణంతో భార్యను శ్రీశైల్ వేధించేవాడు. మరో వివాహం చేసుకోవడానికి విడాకులు ఇస్తానని బెదిరించేవాడు. ఇదే విషయంపై మూడురోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన శ్రీశైల్, భార్య సంగీతా మెడకు తాడు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి మిన్నకుండిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీయగా విషయం బయటపడింది. పోలీసులు శ్రీశైల్, అతని తల్లి పార్వతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
డ్రైవర్ లేకున్న 100మీ. ముందుకు కదిలిన లారీ
-
కదలని చక్రం లారీ డ్రైవర్ల కొరత
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: లారీడ్రైవర్.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉద్యోగం.. మోటార్ ఫీల్డ్‌పై ఆసక్తితో చాలా మంది ఇటుగా వెళ్లేవారు. లారీలపై క్లీనర్లుగా పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్‌లు పొంది గొప్పగా భావించేవారు. లారీ డ్రైవర్ అనేమాట స్టేటస్ సింబల్‌గా కూడా ఉండేది. మోటారు పరిశ్రమ, లారీ పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జిల్లాలో వేలాది కుటుంబాలు జీవించేవి. నాలుగు టైర్ల లారీల నుంచి పది టైర్ల లారీల వరకు పరిశ్రమ విస్తరించినా, టైర్లు పెరిగినంత సులభంగా ఈ పరిశ్రమలో అభివృద్ధి చోటుచేసుకోలేదు. పాత రోజుల్లో డ్రైవర్‌గా లారీ ఎక్కాలంటే పెద్ద సిఫారసు ఉండాలి. ముందుగా మెకానిక్ షెడ్లో వర్కర్‌గా చేరాలి. తర్వాత లారీ మీద క్లీనర్‌గా పనిచేయాలి. డ్రైవర్‌ను గురూ అంటూ మచ్చిక చేసుకోవాలి. తర్వాత డ్రైవర్‌గా మారాలి. ఇదంతా గతం. రానురాను పరిస్థితులు మారడంతో లారీ డ్రైవర్ల కొరత ఈ రంగంలో కనిపిస్తోంది. లారీ డ్రైవర్లుగా పనిచేసేందుకు ఎవరూ మక్కువ చూపకపోవడంతో డ్రైవర్లకు డిమాండ్ పెరిగింది. డ్రైవింగ్ కళాశాల ఏర్పాటు డ్రైవర్ల సమస్యను ముందుగానే ఊహించిన లారీ యజమానుల సంఘం డ్రైవర్ల శిక్షణ కోసం డ్రైవింగ్ కళాశాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ సీటు కావాలన్నా సిఫార్సులతోనే వచ్చేది. ప్ర స్తుతం బతిమాలినా ఎవరూ డ్రైవర్లుగా కళాశాలకు వెళ్లని పరిస్థితి నెలకొంది. 20 శాతం మంది మాత్రమే.. జిల్లాలో ఒక్క తాడేపల్లిగూడెంలో వెయ్యి లారీలకు పైగా ఉన్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు, చింతలపూడి వంటి ప్రాంతాల్లో మరో వెయ్యికి పైగా లారీలు ఉన్నాయి. వీటిని నడపడానికి కేవలం అందుబాటులో 20 శాతం మంది మాత్రమే డ్రైవర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాల డ్రైవర్లే దిక్కు చేపలు, ఇతర సరుకులను తీసుకువెళ్లే నేషనల్ పర్మిట్ లారీల్లో ఎక్కువగా పనిచేసేది అసోం, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు. డ్రైవర్ ఉద్యో గం ఒడుదుడుకులతో కూడుకుంది కావడం, శారీరక శ్రమ ఉండటం, మా రుతున్న పరిస్థితులు, డ్రైవర్ అంటే సమాజంలో గుర్తింపు లేకపోవడం డ్రైవర్లు తగ్గడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయం వస్తున్నా.. ఆదరణ సున్నా.. డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు జీతం, బేటా, కమీషన్లు అన్నీ కలిపి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంటుంది. దూర ప్రాంతాలకు టిప్పులకు వెళితే డ్యూటీ దిగే సమయానికి రూ.20 వేలకు పైగా మిగులుతుంది. అసోం, కోల్‌కత, ఒడిసా, బిహార్ వంటి రాష్ట్రాలకు చేపలు, కోడిగుడ్లు లోడులు తీసుకువెళితే రూ.లక్ష కిరాయిలో ఫిక్స్‌డ్‌గా డ్రైవర్‌కు రూ.30 వేల వరకు ముట్టచెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఖర్చులు తడిసిమోపెడు లారీకి థర్డ్ పార్టీ ఇన్సూ్యరెన్స్గా రూ.45 వేలు కట్టాలి. మరమ్మతులు పెరిగాయి. ఆపరేటర్‌కు గుర్తింపులేదు. ఇలా ఖర్చులు పెరిగిపోవడంతో డ్రైవర్లు దొరక్క ఓనర్ కమ్ డ్రైవర్ వ్యవస్థగా లారీ పరిశ్రమ మారిపోయింది. యజమానులే డ్రైవర్లుగా లారీలను నడుపుతున్నారు. పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో ఆదాయాలు ప్రభుత్వాలకు సమకూరుతున్నా.. వ్యవస్థలో కష్టాలు గురించి పట్టించుకునేవారు లేరు. కునారిల్లుతున్న ఈ పరిశ్రమలో డ్రైవర్‌గా చేరడానికి చాలా మందికి ఇష్టం లేకపోవడమే డ్రైవర్ల కొరతకు కారణంగా కనిపిస్తోంది. చేతి చమురు వదులుతుంది పది టైర్ల లారీకి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేలు ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. కిరాయిలు, ఖర్చులు, టోల్గేట్లు ఇలా ఖర్చులు మోతతో ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిదే ఏమీ ఉండటం లేదు. లారీలు తిప్పలేకపోతున్నాం. ఇంటికి పట్టుకుని వెళ్లేది ఏమీ ఉండటం లేదు. మాకు చేతి చమురు వదులుతుంది. అరకొర జీతాలతో లారీలపై పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. –ఎస్.రాజారావు, లారీ డ్రైవర్, తాడేపల్లిగూడెం -
లారీ డ్రైవర్ ఆత్మహత్య
విశాఖపట్నం, పీఎం పాలెం(భీమిలి): దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరవానిపాలెంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... బోరవానిపాలెంకు చెందిన బోయి నరసింగరావు అలియాస్ ఉట్టోడు (45)లారీ డ్రైవర్. సుమారు 5 సంవత్సరాలుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు అందరూ ఇంట్లో నిద్రపోయాక తాను మేడ మీదకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు కుటుంబ సభ్యులు మేడ మీద చూడగా అక్కడ కనిపించలేదు. పరిసరాల్లో వెతగ్గా ఓజోన్ ప్రాంతంలోని లే అవుట్లో చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ రమే‹ష్ దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. -
విషాదం.. తండ్రీకొడుకు జలసమాధి
సాక్షి, బొమ్మనహాళ్: శిద్దరాంపురంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయి కుమారుడు, రక్షించబోయి తండ్రి నీటమునిగి చనిపోయారు. ఎస్ఐ నాగమధు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జిలాన్ (35) లారీ డ్రైవర్‌గా వెళ్తూ పొలం పనులు కూడా చూసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం జిలాన్ తన కుమారుడు మహమ్మద్ గౌస్ (7)తో పాటు మరో బాలుడు ఆదివారం ఉదయం పొలం చూడటానికి వెళ్లారు. అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో నీటిని చూద్దామని ప్రయత్నించిన మహమ్మద్ గౌస్ అదుపుతప్పి నీటిలో పడ్డాడు. కుమారుడిని రక్షించేందుకని జిలాన్ వెంటనే బావిలోకి దూకాడు. ఇద్దరూ నీటిలో మునిగి పైకి రాలేకపోయారు. వెంట వెళ్లిన మరో బాలుడు కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని ప్రజలు బావి వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. ఎంతసేపటికీ ఆచూకీ లభించకపోవడంతో చివరకు గ్రామంలోని గజ ఈతగాళ్లను పిలిపించారు. మధ్యాహ్నానికి తండ్రీకొడుకులు జిలాన్, మహమ్మద్ గౌస్‌ల మృతదేహాలు వెలికితీశారు. వీరు బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. జిలాన్‌కు భార్య ఫరీదా, కుమార్తె రోషిణి ఉన్నారు. ఎస్ఐ నాగమధు కేసు నమోదు చేశారు. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల (నల్లజర్ల): రాష్ట్రీయ రహదారిపై ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. నల్లజర్ల మండలం దూబచర్లలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుది. స్థానికుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డ్రైవర్ సవరపు హరీష్ (25) టిప్పర్ లారీలో చిప్స్ లోడు వేసుకుని గౌరీపట్నం నుంచి గుండుగొలను వైపునకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్ నుంచి టైల్స్ లోడుతో వస్తున్న లారీ హరీష్ లారీని ఢీకొట్టింది. దీంతో చిప్స్ లోడు లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. రెప్పపాటులో లారీ అగ్నికి ఆహుతైంది. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన హరీష్ సజీవదహనమయ్యాడు. టైల్స్ లారీ డ్రైవర్ మాత్రం వాహనంలోంచి బయటకు దూకి ప్రా ణాలను దక్కించుకున్నాడు. సంఘటనా స్థలాన్ని నల్లజర్ల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సమిశ్రగూడెంలో విషాద ఛాయలు నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్ సవరపు హరీష్ (25) అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. హరీష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి భార్య సౌందర్యతో పాటు రెండేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలంలో హరీష్ మృతదేహన్ని చూసి కుటుంబసభ్యులు, బం«ధుమిత్రులు గుండెలవిసేలా రోధించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం హరీష్ మరణవార్త తెలుసుకుని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యువకుడైన హరీష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని మృతి పార్టీకి, కుటుంబసభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ గాజుల రంగారావు, సొసైటీ అధ్యక్షుడు గజ్జరపు శ్రీరమేష్, ఎంపీపీ మన్యం సూర్యనారాయణ, రాష్ట్ర నాయకులు ముళ్లపూడి శ్రీనివాసకుమార్చౌదరి తదితరులు సంతాపం తెలిపారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం రూరల్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. లారీ కాలువలోకి బోల్తా కొట్టి క్లీనర్ మృతిచెందిన ఘటన గురువారం నందమూరు అక్విడెక్ట్ వద్ద చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ పి.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు నుంచి తణుకు క్వారీ డస్ట్‌తో వెళ్తున్న లారీ తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడెక్ట్ వద్దకు వచ్చే సరికి లారీ డ్రైవర్ కంటిపూడి దుర్గారమేష్ నిర్లక్ష్యం కారణంగా అక్విడెక్ట్ రెయిలింగ్‌ను ఢీకొని కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కేబిన్‌లో ఇరుక్కుని చాగల్లుకు చెందిన లారీ క్లీనర్ కేతా ఈశ్వరరావు (35) మృతి చెందగా, దొమ్మేరుకు చెందిన లారీ డ్రైవర్ కంటిపూడి దుర్గారమేష్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహకారంతో కేబిన్‌లో ఇరుక్కున్న లారీ క్లీనర్ కేతా ఈశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం రూరల్ ఏఎస్సై ఎస్వీఎస్ఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు వైపు వెళ్తున్న లారీ, ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి రావడంతో ఆ లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీకొని కాలువలోకి బోల్తా పడినట్టు లారీ డ్రైవర్ కంటిపూడి దుర్గారమేష్ చెబుతున్నాడు. -
సమ్మెను లెక్క చేయకుండా లారీ నడిపాడని..
సిద్దిపేటటౌన్: దేశవ్యాప్తంగా లారీలు సమ్మెలో ఉంటే నువ్వు మాత్రం ఎందుకు నడుపుతున్నావని లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడి చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన దేశెట్టి యాదగిరి వృత్తి రీత్యా లారీ డ్రైవర్. ఎప్పటిలాగే శుక్రవారం రాజీవ్ రహదారిపై లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. అదే రహదారిపై సమ్మె చేస్తున్న ఆలిండియా లారీ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన లారీ డ్రైవర్లు జెట్టి కనకయ్య, సత్తయ్య, మధు, శంకర్, రాజు, మల్లేశంలు దేశెట్టి యాదగిరిపై కర్రలతో దాడి చేసి అతని లారీ అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా లారీ రిజిస్ట్రేషన్ పేపర్లు లాక్కున్నారు. ఈ మేరకు బాధితుడు సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
డ్రైవరే దొంగ!
అద్దంకి (ప్రకాశం): చెడు వ్యసనాలకు బానిస కావడం.. తాను కొనుగోలు చేసిన లారీలకు కిస్తీలు చెల్లించలేకపోవడంతో ఆ డ్రైవర్ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన లారీలో లోడైన సెల్ఫోన్లు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూసిన డ్రైవర్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. దర్శి డీఎస్సీ నాగేశ్వరరావు స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా మెట్టుపాలయమ్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొడగంటి రంగనాథన్ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ నుంచి రూ.7,25,67,582 విలువైన రెడ్మీ నోట్ ఎంఐ ఫోన్ల లోడ్‌తో కలకత్తాలోని హుగ్లీకి బయల్దేరింది. లారీ ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటలకు ఐదో నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పంజాబీ దాబా వద్ద నిలిపాడు. మేదరమెట్ల వెళ్లి వచ్చే సరికి 6400 రెడ్మీ కంపెనీ సెల్ఫోన్లు ఉన్న లారీ అపహరణకు గురైందంటూ ఈ నెల 19న లారీ డ్రైవర్ మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి లారీ కోసం గాలించారు. చివరకు లారీ అద్దంకి మండలం కొంగపాడు పొలాల్లోని సుబాబుల్ తోటల్లో గుర్తించారు. లారీని ఎవరూ అపహరించలేదని, అపహరిస్తే అక్కడ ఎందుకు వది వెళ్లారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. డ్రైవర్‌ను తమ దైనశైలిలో విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. తన అప్పుల కోసం సెల్‌ఫోన్ లోడ్ లారీని మాయం చేసినట్లు డ్రైవరే నేరం అంగీకరించాడు. పోలీసులు ఆయన్ను కటకటాల వెనక్కి నెట్టారు. లోడ్ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన సీఐ హైమారావు, మేదరమెట్ల ఎస్ఐ పాండురంగారావు, హెచ్‌సీ కోటేశ్వరరావు, అంజుల్లా బృందాన్ని డీఎస్పీ అభినందించారు. -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
వరదయ్యపాళెం: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిన్న పాండూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన హనుమంతు (35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం వెదురుకర్రల లోడుతో గిద్దలూరు నుంచి తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న పాండూరు వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో టీ తాటేందుకు లారీని రోడ్డు పక్కన ఆపాడు. టీ దుకాణంలోకి వెళ్లిన హనుమంతు టీ తాగి తిరిగి లారీ వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని సమీపంలోని చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో క్లీనర్, వెదురుకర్రల యజమాని గిద్దలూరుకు తరలించారు. గిద్దలూరు టౌన్‌కు చెందిన హనుమంతుకు ఏడాది క్రితం పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతని తెలిసింది. వాహనం ఆగిన తర్వాత గుండెపోటు రావడం పెనుప్రమాదం తప్పిందంటూ స్థానికులు చర్చించుకున్నారు. -
ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
బుచ్చిరెడ్డిపాళెం: లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఓ లారీ అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన పట్టణంలోని కామాక్షికాలనీ సమీపంలో ముంబయి జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. కృష్ణపట్నం నుంచి బొగ్గుతో వెళ్తున్న లారీ బుచ్చిరెడ్డిపాళేనికి రాగానే డ్రైవర్ కునుకు వేయడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమయ్యేలోగా ఓ చెట్టును ఢీకొంది. పక్కనే ఇంటి ముందు భాగాన్ని ఢీకొంది. చెట్లు మొదళ్లతో సహా బయటకు వచ్చింది. ఇంటి ముందు భాగమంతా పూర్తిగా దెబ్బతింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగింది. లారీ బోల్తా పడింది. స్వల్పగాయాల పాలైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటి ముందు భాగంలో ఎవరూ నిద్రించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
భీమవరం అర్బన్: భీమవరం మండలం లోసరి గ్రామంలో టిప్పర్ లారీకి విద్యుత్ వైరు తగిలి మంటలు చెలరేగి లారీతోపాటు డ్రైవర్ కాలిపోయిన దుర్ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోసరి గ్రామంలో జాతీయ రహదారి 216(ఏ) విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా జి.కొండూరు నుంచి కంకర రాళ్లను సుమారు 10 టిప్పర్ లారీల ద్వారా చేరవేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి ఏపీ16టీఈ 6850 లారీ నుంచి రాళ్ల అన్‌లోడింగ్‌కు హైడ్రోలిక్ సిస్టం ద్వారా ట్రక్కును పైకి లేపి రాళ్లు అన్ లోడింగ్ చేశారు. అన్ లోడింగ్ అయిన తరువాత ట్రక్కును యథాస్థానానికి దించకుండా ముందుకు లారీని పోనివ్వటంతో పైనున్న 11 కేవీ విద్యుత్ వైరు లారీ పైభాగంలో తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జి.కొండూరు గ్రామానికి చెందిన డ్రైవర్ పొజ్జూరు నరసింహరావు (45) లారీలో సజీవ దహనమైపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నరసింహరావు మోకాళ్ల వరకు ఎముకలు కూడా మిగిలకుండా దహనమైన ఘటన స్థానికులను కలచి వేసింది. నరసింహరావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తెకు ఇటీవలే వివాహం చేశాడు. అతని కుమాడు పొజ్జూరు గోపి ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్సై శ్రీరామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ డ్రైవర్‌కి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
-
ఓటీపీ అడిగారు..రూ.20 వేలు కాజేశారు
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం) : హనుమాన్ జంక్షన్‌కు చెందిన గేదల లక్ష్మణ ఓ లారీ డ్రైవర్. లారీకి మరమ్మతులు చేయిస్తుండగా సెల్‌ఫోన్ మోగింది. హిందీలో మాట్లాడటంతో అర్ధం కాక ఫోన్ పెట్టేశాడు. పదేపదే ఫోన్‌చేసి బ్యాంకు అకౌంట్ వెరిఫికేషన్ అనడంతో పేరు, ఊరు, తదితరాల వివరాలు మొత్తం చెప్పారు. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ నంబర్లు పంపించాం. త్వరగా చూసి చెప్పండని హడావుడి చేశారు. అంతంత మాత్రం చదువు కావటంతో లక్ష్మణ ఓటీపీ నంబరే కదా అని చెప్పేశాడు. ఫోన్ పెట్టిన తర్వాత చూస్తే నగదు డ్రా చేసినట్లుగా మేసేజ్‌లు వచ్చాయి. ఇదేంటని గురువారం బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని చూస్తే అకౌంట్లో నుంచి నాలుగు దఫాలుగా రూ.5 వేలు చొప్పున మొత్తం రూ. 20 వేలు పేటీఎం ద్వారా డ్రా చేసినట్లుగా ఉంది. దీంతో లక్ష్మణ లబోదిబోమంటూ వాపోయాడు. ఇదీ హనుమాన్ జంక్షన్లో చోటు చేసుకున్న సైబర్ నేరం. ఎంతో గోప్యంగా ఉండాల్సిన బ్యాంకు అకౌంట్ వివరాలు పక్కదారి పట్టడం, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కటంతో అమాయకుల జేబుకు చిల్లు పడుతున్నాయి. స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన గేదల లక్ష్మణ ఈ సైబర్ నేరంపై జంక్షన్ పోలీసులతో పాటు ఎస్బీఐ అధికారులను ఆశ్రయించాడు. నాలుగైదు రోజులుగా తరచూ ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అంటూ హిందీలో మాట్లాడుతూ పేరు, వివరాలు చెబుతుండటంతో బ్యాంకు అధికారులే అని నమ్మి మోసపోయానని, అసలు ఓటీపీ అనే నంబర్ ఉంటుందని, దాని ద్వారా కూడా మన ప్రమేయం లేకుండా డబ్బులు డ్రా చేసే యవచ్చనే అవగాహన తనకు ఇప్పటి వరకూ తెలీదని బాధితుడు వాపోయాడు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు..
కర్నూలు: కల్లూరు మండలం శరీన్ నగర్లో లారీ డ్రైవర్ శివాజీనాయుడు(36) దారుణ హత్యకు గురయ్యాడు. అదే కాలనీకి చెందిన స్వామి శేఖర్, రాజశేఖర్, మద్దమ్మ తదితరులు కలిసి ఇనుప రాడ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్దమ్మ కుటుంబానికి శివాజీనాయుడు తండ్రి ఎనిమిదేళ్ల క్రితం రూ.40 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి చెల్లించే విషయంలో వారం రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రాత్రి శివాజీనాయుడు మరోసారి మద్దమ్మ కుటుంబాన్ని అప్పు తిరిగి చెల్లించే విషయంలో నిలదీశాడు. ఈక్రమంలో మాటామాటా పెరిగడంతో నిందితులు ఇనుప రాడ్‌తో తలపై బాదడంతో శివాజీ నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని హత్యకు దారితీసిన విషయాలపై ఆరా తీశారు. భార్య బోయ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు నాల్గవ పట్టణ సీఐ రామయ్య నాయుడు తెలిపారు. -
చోరీ చేయబోయి.. డ్రైవర్లకు చిక్కి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ గోదాం ముందు ఉంచిన మద్యం లారీలకు భద్రత కరువవుతోంది. పార్కింగ్ చేసి ఉన్న లారీ నుంచి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు (ఈశ్వరరావు, గిరి) మద్యం బాటిళ్లు దొంగతనం చేస్తుండగా స్థానిక లారీ డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారం రోజుల్లో 60 సీసాలు ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల మద్యం కంపెనీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్‌కు లారీల్లో మద్యం కేసులు వస్తాయి. గోదాంలో ఉన్న ఖాళీ బట్టి అన్లోడ్ చేస్తారు. గోదాంలో ఖాళీ లేకపోతే జాతీయ రహదారి నుంచి మండల కాంప్లెక్స్ వరకు ఉన్న రోడ్డుపై నిలిపి ఉంచుతారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం, రక్షణ వంటి సౌకర్యాలు లేకపోవడంతో తరచూ లారీల నుంచి మద్యం బాటిళ్లు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదివారం 11 గంటల సమయంలో శుద్ధి జలాలు లగేజ్ ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరరావు, గిరి.. మద్యం లారీలో టార్పాలిన్లు తొలగించి మద్యం బాటిళ్లు చోరీ చేయబోయారు. ఇంతలో వీరిని లారీ డ్రైవర్లు జి.తిరుపతిరావు, జి.రవి పట్టుకున్నారు. వీరిని ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల ఎస్సై వై.కృష్ణ కేసునమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు.వారం రోజులుగా మొత్తం 60 సీసాల వరకూ దొంగతనానికి గురయినట్లు డ్రైవర్లు చెబుతున్నారు. లారీ డ్రైవర్లతోనే పహారా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ వద్ద పదుల సంఖ్యలో మద్యం లోడింగ్ లారీలను నిలిపివేస్తున్నారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. గోదాం లోపల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. లారీ డ్రైవర్లు నిరంతరం పహారా కాస్తుండాలి. వీరు విశ్రాంతి తీసుకునే సమయాల్లో రక్షణ సమస్యగా మారుతోంది. లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం, డ్రైవర్లకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయలేదు. రాత్రివేళల్లో లారీల కింద నిద్రపోతుండటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ సమస్యలు ఉన్నా కనీసం సంబంధిత శాఖలు స్పందించటం లేదు. మరోపక్క గోదాం సామర్థ్యం తక్కువగా ఉన్నా, లారీలు మాత్రం రోజు పదుల సంఖ్యలో కంపెనీల నుంచి వచ్చేస్తున్నాయి. మద్యం లారీల రక్షణకు షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. చోరీ జరిగిన లారీ రోడ్డుపై నిలిచిపోయిన లారీలు -
ఒకరి నిర్లక్ష్యం..కుటుంబానికి శాపం
కంటైనర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబానికి శాపమైంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ముచ్చటగా సాగుతున్న కాపురంపై రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పంజా విసిరింది. కంటైనర్ లారీ బైక్‌ను ఢీ కొన్న ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందగా, తల్లీ, మరో కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలకు పోరాడుతున్నారు. నిర్లక్ష్యం, మద్యం మత్తు వెరసి పచ్చని కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాయి. తిరువొత్తియూరు: చెన్నై పాడి వంతెన వద్ద ఆదివారం రాత్రి మోటారు సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నై విల్లివాక్కం జీకేఎం కాలనీ 47వ వీధికి చెందిన ఆనంద్ (38). చెన్నై వడపళనిలో ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనూష. వీరికి తనుజాశ్రీ (9), కాంచన (3) ఇద్దరు కుమార్తెలు. విల్లివాక్కంలోని ప్రైవేటు పాఠశాల్లో తనుజాశ్రీ 3వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఆనంద్, భార్య పిల్లలతో కలిసి వస్తువులు కొనడానికి పాడిలో దుకాణానికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వస్తుండగా పాడి వంతెన వద్ద బైక్‌ను వెనుక వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆనంద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో తనూజాశ్రీ మృతి చెందింది. అనూష, కాంచనలకు చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూందమల్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కంటైనర్ లారీ డ్రైవర్ కాంచీపురం కొంగులాచేరికి చెందిన మనోహరన్ అని, అతను మద్యం మత్తులో లారీని నడిపినట్టు తెలిసింది. మనోహరన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
పిట్ట కొంచెం..కూత ఘనం
మైసూరు: పెద్దవాళ్లు సైతం విస్తుపోయేలా బైకులు, కార్లను అలవోకగా నడుపుతూ ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏడేళ్ల బాలిక రిఫా తాజాగా లారీని నడిపి గోల్డెన్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రిఫా తష్కిన్ ఇటీవల ముగిసిన దసరా ఉత్సవాల్లో కూడా బైకులు, కార్లతో సాహస విన్యాసాలు చేసి ఔరా అనిపించుకున్నారు. తమ సాహస విన్యాసాలతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాందిచాలనే కాంక్షతో ఆదివారం నగరంలోని ఈద్గా మైదానంలో అశోక్ లైలాండ్తో పాటు పదమూడు రకాల వాహనాలతో సాహస విన్యాసాలు చేశారు. ఏడేళ్ల ప్రాయంలోనే రిఫా చేస్తున్న సాహస విన్యాసాలు ప్రతీఒక్కరినీ అబ్బుపరిచాయి. -
పోలీసుల తీరుకు నిరసనగా టవరెక్కిన బాధితుడు
► సురక్షితంగా కిందకు దింపిన అగ్నిమాపక సిబ్బంది తిరువళ్లూరు: తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం బాధితుడు టవరెక్కి ఆందోళనకు దిగాడు. ఈ సంఘటన తిరువళ్లూరులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెయ్యారు సమీపంలోని వాల్వాడై గ్రామానికి చెందిన మదన్ లారీ డ్రైవర్. ఇతను ఆదే ప్రాంతానికి చెందిన మహిళను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. వీరికి విశాల్ అనే కొడుకు నందిని అనే కూతురు ఉంది. మదన్ కుటుంబం తిరువళ్లూరు జిల్లా గూడపాక్కంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వాల్వాడై గ్రామంలో మదన్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని మదన్ అన్న రాజరాజన్, ఆయన కొడుకులు ఆక్రమించుకుని ఇటీవల అమ్మకానికి ప్రయత్నించడంతో ఇద్దరి మద్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఆదే రోజు ఇంటికి వచ్చిన మదన్ అతని భార్యపై రాజరాజన్, ఆయన కుమారులు గూడపాక్కం వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో మదన్, భార్య రమా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమపై దాడి చేసిన రాజరాజన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత 16న మదన్ వెళ్లవేడు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన మదన్ బుధవారం సాయంత్రం తిరువళ్లూరులోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు భద్రత కల్పించాలని పలు సార్లు వెళ్లవేడు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిం దని వాపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పుహళేంది, సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా కిందకు దిగడానికి ససేమిరా అనడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం మదన్ భార్య రమాను పిలిపించి ఆమెను మాట్లాడిస్తూనే అగ్నిమాపక సిబ్బంది టవర్‌పైకి వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి మదన్‌తో సంప్రదింపులు జరిపారు. టవర్‌పై నుంచి అగ్నిమాపక సిబ్బంది భార్య రమ, పోలీసులతో మాట్లాడించారు. నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో మదన్ కిందకు దిగడానికి అంగీకరించాడు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన పోలీసులు మదన్‌ను సురక్షితంగా కిందకు దింపారు. ఈ ఘటనతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో : యువకుడు టవర్ ఎక్కిన విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. దీంతో ట్రాíఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో స్థానికులకు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొనగా, ట్రాఫిక్ సీఐ కొందరిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన ప్రజలు రాస్తారోకోకు దిగారు. -
ఆ డీఈ కీచకుడే!
– మరిన్ని వెలుగులోకి వచ్చిన ఆపరేషన్స్ డీఈ రాసలీలలు – సీఎస్సీ ఉద్యోగిని, ఆమె సోదరితోనూ అదే వ్యవహారం – ఓ టెక్నికల్ ఏఈకీ తప్పని ఇబ్బదులు – గతంలో పనిచేసిన డివిజన్‌లోనూ డ్రైవరు భార్యకు తప్పని వేధింపులు – ఫలితంగా రూ.లక్షల వాహనం, ఆపరేటర్ పోస్టు నజరాన – జ్వరం పేరుతో 3 రోజులు సెలవు కోరినట్లు సమాచారం కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ (ఎస్పీడీసీఎల్) డీఈ చీకటి కార్యకలాపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అదే సంస్థలోని లారీ డ్రైవర్ భార్యతో డీఈ నడిపిన ‘చీకటి లీలలు’ పై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పలువురు ఉద్యోగులు, బాధితులు మరిన్ని డీఈ లీలలను బయటకు తీసుకొచ్చారు. గతంలో ఆ డీఈ పనిచేసిన చోట్ల జరిపిన వ్యవహారాలను వివరిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల అవసరాలు, బలహీనతలను ఆసరా చేసుకొని లోబరుచుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. – మరిన్ని ఉదాహరణలు: విద్యుత్ శాఖ ఓ ఆపరేషన్స్ డివిజన్ డీఈ చేపట్టిన రాస క్రీడలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఓ సీఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణితో ఇదే తంతు కొనసాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆయన ఆమె సోదరితోనూ ఆలాగే వ్యవహరించినట్లు సమాచారం. గతంలో ఇదంతా ప్రచారం జరగడంతో జిల్లా కేంద్రంలో పనిచేసే అధికారి విచారణ చేపట్టి సమస్య వ్యాపించకుండా అణిచివేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇటు ఒక టెక్నికల్ విభాగంలో పనిచేసిన ఓ ఏఈకి సైతం ఇబ్బందులకు గురి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పనిచేసిన డివిజన్లో ఈయన చేసిన ఘనకార్యం ఇంతా అంత కాదు. అక్కడ కూడా డ్రైవర్ భార్యతో సన్నిహితంగా ఉన్న కారణంగా రూ.4లక్షలు వెచ్చించి మూడు టన్నుల వాహనం కొనుగోలు చేసి బహుమానంగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వాహనం ప్రస్తుతం సంస్థకే అద్దె ప్రతిపాదికన నడుస్తోంది. దీంతోపాటు ఓ ఆపరేటర్ పోస్టును కూడా నజరానా ఇచ్చినట్లు సమాచారం. – గతంలో పని చేసిన చోట్ల ఆరోపణలే: ఆ కరెంటు డీఈ గతంలో పనిచేసిన చోట్లలో కూడా ఇలాంటి ఆరోపణలు భారీగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కర్నూలు చుట్టు పక్కన ఉన్న జిల్లాలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అక్కడ రాసలీలలు, మామూళ్ల దంద నడపడం, వివిధ కాంట్రాక్టు పోస్టులు అమ్ముకోవడం, మామూళ్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం అంతా ఆయన ఖాతాలోనే ఉన్నట్లు సమాచారం. – జ్వరం పేరుతో సెలవులోకి... వ్యవహారం అంతా బయటకు పొక్కి పోలీసు, కేసుల దాక వెళ్లడం, సాక్షిలో ఆయన చీకటిలీలలపై కథనం ప్రచురితం కావడంతో ఆ డీఈకి జర్వం వచ్చినట్లు ఉంది. ‘సాక్షి’ పత్రికలో కథనం చూసిన మరుక్షణమే తనకు జ్వరం వచ్చిందని, మూడు రోజులు సెలవుపై వెళ్తున్నట్లు పై అధికారులకు మెసేజ్ పెట్టినట్లు సమాచారం. – ఎస్పీకి ఫిర్యాదు చేసిన డ్రైవర్? తనకు చేసిన అన్యాయం పట్ల ఆ డ్రైవర్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ డీఈ తన భార్య పట్ల అసభ్యకంగా వ్యవహరించడంతోపాటు ఆమెతో కేసు పెట్టించి అరెస్టు చేయించారని, ఆ డీఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విన్నవించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేసును రాజీ చేసుకునేందుకు బాధితులు, అటు స్థానిక పోలీసులతో తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి
ఆదోని టౌన్: ఆలూరు మండలం ఎ. అగ్రహారం వద్ద జరిగిన ఓ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. నంద్యాల పట్టణం ఎంఎస్ నగర్లో నివాసముంటున్న లారీ ఓనర్ కం డ్రైవర్ పద్మశాలి పోబాద్రి వెంకటేశ్వర్లు(48), హుసేనాపురానికి చెందిన సుధాకర్ మంగళవారం ఉదయం స్థానిక మిల్లులో పత్తిని లోడ్ చేసుకుని బళ్లారికి బయలుదేరారు. ఆలూరు దాటిన తర్వాత ఎ. అగ్రహారం సమీపంలో పొలం పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకు వద్ద నీళ్ల కోసం లారీలను ఆపి ఇద్దరు డ్రైవర్లు కిందకు దిగారు. రహదారి పక్కనే ఒకదాని వెనుక మరో దానిని వరుసగా నిలిపారు. వెనుక నిలిపిన లారీ న్యూట్రల్ కావడం, కొద్దిగా డౌన్ ఉండటంతో ముందుకు కదిలింది. పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు లారీని ఆపే ప్రయత్నం చేస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆలూరు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
సంజామల : ఆకుమళ్లకు చెందిన పూల ఖాజా(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. ఖాజా లారీ డ్రైవరు పని చేస్తూ జీవనం చేçస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం పని మీద తిమ్మనాయునిపేటకు వెళ్లాడు. పనిముగించుకొని మధ్యాహ్నం తిరిగి ఆటోలో వస్తుండగా పేరుసోముల సమీపానికి వచ్చేసరికి ఎండల తీవ్రతకు ఆటోలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి ప్రయాణికులు కిందకు దింపి నీరు తాపించేలోపే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య ఉంది. -
లారీ డ్రైవర్‌పై ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
-
ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
♦ కానిస్టేబుల్‌ను ఢీకొట్టబోయి ఆగిన లారీ ♦ ఆగ్రహించిన ట్రాఫిక్ ఎస్సై ♦ లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదిన వైనం సిరిసిల్ల టౌన్: లాఠీ కోసం రోడ్డుపైకి హఠాత్తుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఢీకొనకుండా ఒక్కసారిగా బ్రేక్‌వేసి ప్రాణాపాయం నుంచి రక్షించిన ఓ లారీ డ్రైవర్‌ను అభినందించాల్సింది పోయి ట్రాఫిక్ ఎస్సై.. ఆగ్రహంతో ఊగిపోయారు. తన లాఠీతో 15 నిమిషాలపాటు డ్రైవర్‌ను చితకబాదారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. ప్రజలు చూస్తుండగానే అతడిని తీవ్రంగా కొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఎస్సై లింగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇరుకైన ఆ రోడ్డుగుండా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వారిని ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించారు. భయపడిన ఆ యువకులు బైక్‌ను ఆపకుండా వెళ్లారు. దీంతో డిస్ట్రిక్ట్ గార్డు షబ్బీర్ ఆగ్రహంతో లాఠీని వారిపైకి విసిరినా.. వారు తప్పించుకుపోయారు. అదే సమయంలో టీఎస్16 యూబీ 1012 నంబరు గల లారీ అటుగా వస్తోంది. ఆ లారీని చూడకుండా షబ్బీర్ రోడ్డుపై పడిన లాఠీని తీసుకునేందుకు వంగారు. ఎదురుగా వాహనాలు ఉండడంతో లారీ డ్రైవర్ మోహన్ సైతం షబ్బీర్‌ను గమనించలేకపోయాడు. స్థానికుల అరుపుతో మోహన్ అప్రమత్తమై సడన్ బ్రేక్‌తో లారీని ఆపాడు. అప్పటికే షబ్బీర్ లారీని గుర్తించి క్షణాల్లో రోడ్డుపైకి పడుకోవడంతో, లారీ కిందకు చొచ్చుకుపోయినా అదృష్టవశాత్తు బతికిపోయాడు. అయితే, కానిస్టేబుల్ చనిపోయాడని భావించిన మోహన్ పారిపోతుండగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. అంతే.. ఇక ఎస్సై లింగమూర్తి వచ్చి ఆ డ్రైవర్‌ను నానాబూతులు తిడుతూ, కాలితో తన్నుతూ, లాఠీతో చితక్కొట్టారు. ఈయనకు మరో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు జత కలిశారు. పోలీసులపైకే లారీ తీసుకొస్తావా? అని ఊగిపోతూ 15 నిమిషాలపాటు ఆ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి జీపులోకి ఎక్కించి, ఠాణాకు తరలించారు. -
లారీ డ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్ రైల్వేగేట్ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎర్నాలకొట్టాలలో నివాసముంటున్న కొండయ్య(55) లారీ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
లారీ డ్రైవర్ బలవన్మరణం
ఉంగుటూరు : జాతీయరహదారిపై ఉంగుటూరు వద్ద శనివారం ఆగి ఉన్న లారీపై మోకుతో ఉరి వేసుకొని అదే లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిలుకూరి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కొపేర్ల నాగరాజు (32) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజమండ్రి నుంచి సిమెంట్ ముడి సరుకు లోడుతో నల్గొండ వెళుతుండగా ఉంగుటూరు వద్ద లారీని ఆపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపారు. మృతునికి భార్య వీరమణి, కుమారై రాఘశ్రీ, కుమారుడు రాకేష్ ఉన్నారు. నాగరాజుకు పదేళ్ల క్రితం వివాహమైందని, అతడు వ్యసనాల బారిన పడటంతో కొద్దికాలంగా భార్య ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుందని తెలిసింది. అమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చావా సురేష్ చెప్పారు. మృతుని భార్య వీరమణికి సమాచారం అందించగా ఆమె హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి పంచనామా చేసి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీకి వేలాడి ఉండటం, ఎటువంటి పెనుకులాట లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. మృతదేహం వద్ద భార్య వీరమణి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
కొణిజర్లలో లారీలు ఢీ..ఆరుగురికి గాయాలు
కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రై వర్ మృతి
దేవరాజుగట్టు (పెద్దారవీడు): ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాణ్యంకు చెందిన ఓ లారీ డ్రై వర్ దుర్మరణం చెందాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు నుంచి నాపరాయితో సున్నిపెంటకు వెళ్తున్న రెండు లారీలు ఆదివారం తెల్లవారు జామున ఒకదాని తర్వాత ఒకటి వరసగా దేవరాజుగట్టు సమీపంలో ఆగాయి. డ్రై వర్లు, క్లీనర్లు కిందకు దిగి టైర్లను పరిశీలించుకుంటున్నారు. ఇంతలో అనంతపురం నుంచి విజయవాడకు పచ్చి మిరపకాయల లోడుతో వెళ్తున్న డీసీఎం లారీ ఆగి ఉన్న రెండు లారీలను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీలకు చెందిన డ్రై వర్ షేక్ గౌసెలాజం (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది కర్నూలు జిల్లా పాణ్యం. మిరపకాయల లోడు లారీలో ఉన్న ఆనంతపురం మండలం కురుకుంట వైఎస్సార్ కాలనీకి చెందిన వ్యాపారి తలారి రమేష్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.మతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవర్ మృతి
నాయుడుపేటటౌన్ : అనుమానాస్పదస్థితిలో ఓ లారీడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మేనకూరులో శనివారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. చిట్టమూరు మండలం మెట్టుకు చెందిన దార్ల రాజశేఖర్ (24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడు తీసుకుని మేనకూరు పరిశ్రమ కేంద్రంలోని హిందూస్తాన్ గ్లాస్ పరిశ్రమకు అన్లోడ్ చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. అప్పటికే మరికొన్ని లారీలు బొగ్గు అన్లోడ్ చేస్తుండటంతో పరిశ్రమ బయట లారీల వెనకే రాజశేఖర్ తన లారీని నిలిపాడు. శనివారం ఉదయం లారీ పక్కనే డివైడర్‌పై చెయ్యి విరిగి అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజశేఖర్‌ను ఇతర డ్రైవర్లు గుర్తించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలపడంతో లారీడ్రైవర్ల సహకారంతో ఆటోలో నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తుండగా రాజశేఖర్ మృతి చెందాడు. అయితే రాజశేఖర్ మృతికి కారణాలు తెలియకపోవడంతో ఏఎస్సై కృష్ణయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారు.. నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారంటూ మృతుడి తల్లి పెంచలమ్మ ఆరోపించింది. కొడుకు మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించింది. భర్త మణెయ్య మృతి తర్వాత ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆధారంగా ఉన్నాడని, నాకు దిక్కెవరంటూ తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ సొమ్మసిలి పడిపోయింది. అందరితో సఖ్యతగా ఉండే సుబ్రహ్మణ్యం మృతితో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
పలాస: జాతీయ రహదారిపై మొగిలిపాడు వద్ద ప్రమోద్ దాబా సమీపంలో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో లారీ డ్రైవర్ మన్సూర్ఖాన్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మన్సూర్ఖాన్కు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని సీఐ కె.అశోక్‌కుమార్ చెప్పారు. దాబా యజమాని 108కు సమాచారం అందించగా 108 సిబ్బంది పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతుండగా ఆయన మరణించాడని తెలిపారు. మన్సూర్ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందినవాడని చెప్పారు. రోడ్డు పక్కన లారీ ఆపి దాబాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
లారీ డ్రైవర్‌పై దుండగుల దాడి
రూ.30 వేల నగదు అపహరణ తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారం ఎర్రకోనేరు సమీపంలో లారీ డ్రైవర్‌పై దుండగులు దాడి చేసి, రూ.30 వేల నగదును దోచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.శివనాగబాబు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట నుంచి విజయనగరం జిల్లా తగరపువలసకు శివనాగబాబు లారీలో సిమెంట్ లోడును తీసుకువెళ్లాడు.lలారీ నుంచి సరుకు అన్లోడ్ చేశాక, కిరాయి రూ.20 వేలను తీసుకుని విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ విశాఖపట్నంలో కెమికల్ పౌడర్ లోడును లారీలో వేసుకుని, అడ్వా¯Œæ్స రూ.10 వేలు తీసుకుని మంగళవారం సాయంత్రం భద్రాచలానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు మహిళలు టార్చిలైట్లు వెలిగించి, లారీ ఆపారు. డ్రైవర్ శివనాగబాబు వారితో ఉండగా, ఆరుగురు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఉంగరం దోచుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ డ్రైవర్‌పై దుండగుల దాడి
రూ.30 వేల నగదు అపహరణ తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారం ఎర్రకోనేరు సమీపంలో లారీ డ్రైవర్‌పై దుండగులు దాడి చేసి, రూ.30 వేల నగదును దోచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.శివనాగబాబు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట నుంచి విజయనగరం జిల్లా తగరపువలసకు శివనాగబాబు లారీలో సిమెంట్ లోడును తీసుకువెళ్లాడు.lలారీ నుంచి సరుకు అన్లోడ్ చేశాక, కిరాయి రూ.20 వేలను తీసుకుని విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ విశాఖపట్నంలో కెమికల్ పౌడర్ లోడును లారీలో వేసుకుని, అడ్వా¯Œæ్స రూ.10 వేలు తీసుకుని మంగళవారం సాయంత్రం భద్రాచలానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు మహిళలు టార్చిలైట్లు వెలిగించి, లారీ ఆపారు. డ్రైవర్ శివనాగబాబు వారితో ఉండగా, ఆరుగురు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఉంగరం దోచుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ ఫక్కీలో దారి దోపిడీ..
మద్నూర్: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి జైపూర్‌కు కూల్‌డ్రింక్స్ లోడుతో లారీ వెళ్తుండగా లచ్చన్ గేటు వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు లారీని ఆపారు. రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారును చూపిస్తూ అది చెడిపోయిందని, అందులో పేషంట్ ఉన్నారని నమ్మబలికారు. అర్జెంటుగా అతడిని ఆస్పత్రికి వెళ్లాలని తొందరపెట్టటంతో లారీ డ్రైవర్ చౌదరి మోహన్‌లాల్ వారిని లారీలోకి ఎక్కమన్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు లారీ డ్రైవర్‌ను కత్తులతో బెదిరించారు. లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ వద్ద నున్న రూ.34 వేలు, రెండు సెల్ ఫోన్లు తీసుకుని పారిపోయారు. దీనిపై బాధితుడు మద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు హిందీలో మాట్లాడారని క్రీం కలర్ కారులో వారు పరారయ్యారని లారీ డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆగంతకులంతా 30-35 ఏళ్ల వారేనని తెలిపాడు. అర్ధరాత్రి ఫిర్యాదు రాగానే దొంగల గురించి గాలించడం ప్రారంభించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
బోనకల్(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్మండలం జానకీపురం వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానిక పాఠశాల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. ఓ లారీ డ్రైవర్ శ్రీనివాసరావు మృతిచెందగా.. మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
మాజీ డీజీపీపై దాడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడు జైళ్లశాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంతూరైన సేలం సూరమంగళంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. తన సొంత పని కోసం సోమవారం సాయంత్రం కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళుతుండగా ఎదురుగా ఒక లారీ అతివేగంతో అతని కారును ఢీకొనే రీతిలో వచ్చింది. కారు నుంచి కిందకు దిగిన రామానుజన్ ఎందుకు ఇంత వేగంగా లారీ నడుపుతున్నావని మందలించారు. దీంతో లారీడ్రైవర్ సైతం కిందకు మాజీ డీజీపీని దుర్భాషలాడడంతో పాటూ పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడిపోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. -
మాజీ డీజీపీపై లారీ డ్రైవర్ దాడి
చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడు జైళ్ల శాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంత ఊరు అయిన సేలం సూరమంగళంలో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఆయన కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా ఓ లారీ అతివేగంతో ఎదురు వచ్చింది. దీంతో కారు ఆపి... కిందకి దిగిన రామానుజన్... లారీని ఆపి... ఎందుకు అంత వేగంగా నడుపుతున్నావంటూ లారీ డ్రైవర్‌ను మందలించారు. దీంతో లారీడ్రైవర్ మాజీ డీజీపీతో దుర్భాషలాడడంతో పాటు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడి పోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టు కొమ్మ గొంతులో దిగినా..
ప్రమాద వశాత్తు చెట్టు కొమ్మ గొంతులో దిగినా.. ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో గురువారం అకస్మాత్తుగా పెనుగాలులు వీచాయి. ఆ తీవ్రతకు జిల్లాలోని కథలాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టు కొమ్మ కూలి పోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీపై పడింది. కొమ్మ ధాటికి లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. చెట్టు ఎండిన కొమ్మ ఒకటి క్యాబిన్ లోకి దూసుకు వచ్చి డ్రైవర్ గొంతులోకి దిగింది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని బాన్స్ వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి.. గొంతులో నుంచి కొమ్మను తొలగించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని.. అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. -
బ్రిడ్జిపై నుంచి పడిన ఆయిల్ ట్యాంకర్: డ్రైవర్ మృతి
వరంగల్ : నగరంలోని హెచ్ఎన్కె హంటర్ రోడ్ బ్రిడ్జిపై నుంచి ఆయిల్ ట్యాంకర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న డీజిల్ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందికి పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్‌లోంచి డీజిల్ లీక్ అవుతోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లీక్ అవుతున్న ట్యాంకర్ వద్ద ప్రమాదం జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ మృతి చెందడంతో వివరాలు తెలియడం లేదు. -
వడదెబ్బతో లారీలోనే కన్నుమూసిన డ్రైవర్
ఇచ్చోడ (ఆదిలాబాద్) : సరుకులు చేరవేసేందుకు రాష్ట్రం దాటి వచ్చిన ఓ లారీ డ్రైవర్ వడదెబ్బకు గురై డ్రైవింగ్ సీటులోనే తనువు చాలించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ (కంటెయినర్) డ్రైవర్ విష్ణుప్రసాద్ (35) లోడ్‌తో హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపునకు వెళ్తున్నాడు. సోమవారం మధ్యాహ్నమంతా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎండకు తోడు లారీ క్యాబిన్లో వేడి పెరగడంతో విష్ణుప్రసాద్‌కు వడదెబ్బ తగిలింది. లారీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ సమీపంలోకి రాగానే విష్ణుప్రసాద్ లారీని పక్కకు ఆపి.. సీట్లోనే పడిపోయి.. వాంతులు చేసుకున్నాడు. డ్రైవింగ్ సీటులోనే కన్నుమూశాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. -
ప్రమాదం తృటిలో తప్పింది
కేకే.నగర్: డ్రైవర్ కునుకు తీయడంతో విరుదునగర్ ఫోర్వే రోడ్డు రైల్వే బ్రిడ్ అడ్డుగోడను ఢీకొన్న లారీ వేలాడుతూ నిలబడింది. 12 గంటల సుదీర్ఘ పోరాటం తరువాత క్రేన్ ద్వారా లారీని సురక్షితంగా వెలుపలకు లాగారు. లారీ, రైల్వే మార్గంలో పడిపోయేటట్లు నిలబడడంతో ఆ మార్గంలో వెళ్లే మదురై - సెంగోట్టై రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. ఫోర్‌వేపై వాహనాల రాకపోకలను వేరే మార్గంలో మళ్లించారు. హైదరాబాద్ నుంచి నోటు పుస్తకాలతో తిరునెల్వేలికి వెళ్లే లారీ, శుక్రవారం ఉదయం విరుదునగర్ ఫోర్వే రోడ్డుపై గల రైల్వే వంతెన సమీపంలో వస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తుతో ఉండడంతో లారీ ఫోర్వే ఇనుప అడ్డగోడను ఢీకొంది. పది అడుగుల దూరం వరకు అడ్డుగోడపై దూసుకెళ్లిన లారీ అక్కడున్న సిమెంటు గోడకు ఢీకొని వంతెన దాటి ముందు చక్రాలు గాలిలో వేలాడుతూ నిలబడింది. లారీలో అధిక బరువు గల నోటు పుస్తకాలు ఉండడం వలన లారీ వేలాడుతూ ఉండిపోయింది. ఈ వంతెన కింద మదురై - సెంగోట్టై రైల్వే మార్గంలో ఉంది. ఈ మార్గంలో మదురై - సెంగోట్టై నుంచి వచ్చిన రైళ్లను విరుదునగర్ శివకాశిలో నిలిపి వెనక్కి పంపారు. ఇంకా ఫోర్వే మార్గంలో వచ్చే వాహనాలను వేరే మార్గంలో పంపారు. లారీలో వస్తువుల బరువు ఎక్కువగా ఉండడం వలన మూడు చిన్న క్రేన్లను తెప్పించినా లారీని పైకి లాగలేక పోయారు. దీంతో మదురై నుంచి140 టన్నుల బరువును లాగే పెద్ద క్రేన్‌ను రైలు ఇంజన్‌కు తగిలించి రప్పించారు. 12 గంటల పోరాటం తరువాత శుక్రవారం సాయంత్రం లారీనిపక్కకు లాగిన తరువాత వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాదంలో లారీ యజమాని మురుగానందం, డ్రైవర్ సెల్వకుమార్‌లకు స్వల్పగాయాలు తగిలాయి. ఇద్దరూ విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విరుదునగర్ బజార్ పోలీసులు డ్రైవర్ నిద్రపోవడం, అజాగ్రత్త వలన ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ లారీ డ్రైవర్ వడదెబ్బతో చనిపోయాడు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య(43) బుధవారం మధ్యాహ్నం లారీ డ్రైవర్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అస్వస్థతగా ఉందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కుదుటపడటంతో సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో తిరిగి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతి
ఉప్పల్: వేగంగా వెళ్తున్న లారీ నాలుగేళ్ల చిన్నారిని ఢీకొట్టింది. దీంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన చిన్నారి(4) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో మృతిచెందింది. దీంతో స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. -
రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు
నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లిలో సోమవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. విశాఖ వైపు వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న లారీలో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికులు వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. -
పొరపాటుతో... అదృష్టం తన్నుకొచ్చింది
లండన్ : ఇంగ్లండ్‌లోని స్టాన్ఫోర్డ్షైర్కు చెందిన స్టువర్ట్ పావెల్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. ప్రతివారం లాటరీ టికెట్ కొనడం అలవాటు. అలాగే నవంబరు 20 యూరో మిలియన్ లాటరీ కోసం రెండు పౌండ్లు (రెండొందల రూపాయలు) పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే షాపు నిర్వాహకుడు బద్ధకస్తుడు. 20వ తేదీన డ్రా తీసే లాటరీకి బదులుగా 24న డ్రా ఉన్న వేరే టికెట్ ఇచ్చాడు. పావెల్ చూసుకోకుండా టిక్కెట్ జేబులో పెట్టుకొని ఇంటికెళ్లిపోయాడు. 20వ తేదీన ఫలితాలను చూసేందుకు కంప్యూటర్ ముందు కూర్చుంటేగాని అతనికి తనకు తప్పుడు టికెట్ ఇచ్చారనే విషయం తెలియలేదు. షాపు అతన్ని తిట్టుకున్నాడు. 24న డ్యూటీలో ఉన్న అతను లారీలో కూర్చొనే భార్య డెనిస్‌కు ఫోన్ చేసి ఫలితాలను చెక్ చేయమన్నాడు. ఆమె ఒకటి రెండుసార్లు చూసి... ‘ఓ మై గాడ్’ అని అరిచేసింది. పావెల్ అతృతగా ఏం జరిగిందని అడిగాడు... దాంతో ఆమె విషయం చెప్పింది. లాటరీలో తమకు మిలియన్ పౌండ్లు (రూ. 10 కోట్ల పైచిలుకు) తగిలాయని చెప్పింది. పావెల్ తాను నడిపే లారీలోనే భార్య డెనిస్‌ను తీసుకొని వచ్చి లాటరీ చెక్‌ను తీసుకున్నాడు. మొత్తం మీద షాపు నిర్వాహకుడు చేసిన పొరపాటుతో పావెల్‌కు అదృష్టం తన్నుకొచ్చింది... అదీ సంగతి. ఉద్యోగం మాననని... ఎదిగొచ్చిన ముగ్గురు కుమారులకు తలా ఓ ఇల్లు కొనిపెడతానని, తండ్రికి ఓ కారు కొంటాడని చెప్పాడు పావెల్. -
లోయలో పడిన లారీ : డ్రైవర్ మృతి
ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంతో వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో లారీ అదుపు తప్పి లోయలో పడింది. లారీ డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పుతున్నారు. -
లారీ డ్రైవర్‌పై కాల్పులు
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కనగానపల్లి మండలం సీతారాంపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
స్టీరింగ్‌పైనే ప్రాణాలొదిలిన లారీ డ్రైవర్
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గుండె పోటుతో స్టీరింగ్ పైనే చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని నరసింహారావుపేటకు చెందిన శివంగి సత్యనారాయణరాజు(55)అనే లారీ డ్రైవర్ సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి కొబ్బరిబొండాల లోడుతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం బయలుదేరారు. నేలకొండపల్లికి తెల్లవారు జామున చేరుకున్న సమయంలో గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన మెల్లగా లారీని రోడ్డు పక్కకు తీశాడు. ఇంజిన్ ఆఫ్ చేయక మునుపే తీవ్ర గుండెపోటుతో స్టీరింగ్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. విషమ పరిస్థితుల్లోనూ ఆయన సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు. -
వెల్డింగ్ గ్యాస్ లీకై లారీ డ్రైవర్ సజీవదహనం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. లారీకి వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలెక్టరేట్ వద్ద లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు మండలం మహేశ్వరపురం గ్రామానికి చెందిన మోరు వెంగళరావు అనే లారీ డ్రైవర్ ఏలూరులోని కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందించేలోపే ప్రాణం విడిచాడు. కాగా ఆస్తి కోసం తన సోదరుడు పెడుతున్న వేధింపులను తట్టుకోలేకే వెంగళరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష
రంగారెడ్డి(తాండూరు): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయవాది రంగారావు గురువారం తీర్పు వెల్లడించారు. తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం..2013 సంవత్సరంలో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన దొరళ్ల చించేడి మాణెయ్య(55) సైకిల్‌పై వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ ఆయనను ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు లారీ డ్రైవర్ వీరప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం తాండూరు మున్సిఫ్‌కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు. జైలు శిక్షను తగ్గించాలని కోరుతూ లారీ డ్రైవర్ వీరప్ప వికారాబాద్‌లోని జిల్లా అదనపు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గురువారం పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి కిందికోర్టుతీర్పును సమర్థిస్తూ అదే శిక్షను విధించారు. -
శ్రీశైలం వద్ద ప్రమాదం: వ్యక్తి మృతి
ఈగలపెంట (కర్నూలు): శ్రీశైలం ప్రాజెక్టు వజ్రాలమడుగు వద్ద వంతెన నిర్మాణం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఒక లారీ డ్రైవర్ చనిపోయాడు. ఈగలపెంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సుండిపెంట మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ కొంత కాలంగా డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా కంపెనీకి చెందిన టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే కంకర లోడుతో డ్యాం వద్దకు రాగానే లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ప్రాజెక్టు దిగువ భాగంలో నిల్వ ఉంచిన నీటిలో పడిపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ లారీతో పాటు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. రఫీకి తల్లిదండ్రులతో పాటూ ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. -
లారీ డ్రైవర్ దారుణ హత్య
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఊలవపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. లారీడ్రైవర్ ను హత్యచేసి మృతదేహాన్ని అదే లారీలో పడేశారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. లారీలోని ఐరన్ మెటల్ ఎత్తుకెళ్లేందుకు డ్రైవర్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లారీ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వర్గీయులకు చెందినదిగా సమాచారం. -
బాలికపై లారీ డ్రైవర్ అత్యాచార యత్నం
గుంటూరు: ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఓ కామాందుడిపై కేసు నమోదు అయింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాలిక(11)పై అదే గ్రామానికి చెందిన గోపి(25) అనే లారీ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు సదరు వ్యక్తిని ప్రతిఘటిస్తూ గట్టిగా అరిచింది. దీంతో గోపి సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. -
యాక్సిడెంట్ చేస్తే 304 కొరడా
- హిట్ అండ్ రన్‌గా పోలీసుల నిర్ణయం - నటుడు సల్మాన్‌ఖాన్‌పై ఇదే తరహా కేసు - గొల్లపూడి ప్రమాదంలో లారీడ్రైవర్పై నమోదు - నగరంలో ఇదే తొలిసారి విజయవాడ సిటీ : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై పెట్టిన రోడ్డు ప్రమాదం కేసు గుర్తుందా? ఇప్పటికే ఆ కేసులో సల్మాన్‌కు శిక్ష పడింది. ఇదే తరహా కేసుల నమోదుకు నగర పోలీసులూ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి గొల్లపూడి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన లారీడ్రైవర్పైనా సల్మాన్‌ఖాన్‌పై నమోదుచేసిన సెక్షన్ 304 (ప్రాణహరణం) కింద కేసు నమోదుచేశారు. ఇదే మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై సీరియస్‌గా దృష్టిసారించిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్య వైఖరిపై సెక్షన్ 304 నమోదుచేయడం నగరంలో ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఎవరైనా మృత్యువాత పడితే సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యపు డ్రైవింగ్) ఐపీసీ కింద ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసేవారు. ప్రమాదాలను అరికట్టేందుకే.. కేసు నుంచి బయటపడిన డ్రైవర్లు పదేపదే వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై వీరిని ఉపేక్షించరాదంటూ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే.. గొల్లపూడిలో మంగళవారం రాత్రి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన లారీడ్రైవర్పై సెక్షన్ 304 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. 304 కింద కేసు అయితే లెసైన్‌స లేనట్టే.. 304 సెక్షన్ ప్రకారం సంబంధిత డ్రైవర్ లెసైన్స్ సస్పెండ్‌చేసి విచారణ జరుపుతారు. కేసు విచారణలో ఉండగా లెసైన్స్ పునరుద్ధరించడం జరగదు. గతంలో మాదిరి జరిమానాలు చెల్లించి బయటపడొచ్చనే ఆలోచించే వారికి నగర పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు. అధికారులతో విచారణ ప్రతి రోడ్డు ప్రమాద కేసును ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రమాద కారణాలను నిష్పక్ష పాతంగా నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నిర్ధారణ అయిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. పెద్ద వాహనాల డ్రైవర్లను నేరస్తులుగా పరిగణించే సంప్రదాయానికి స్వస్తిపలికి వాస్తవాల ఆధారంగా శాస్త్రీయ పరిశోధన నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనాలకు పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన సూచించారు. -
డ్రైవర్ పంట పండింది..!
లండన్: అదృష్టమంటే వీరిదే. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ లాంగ్, క్యాథలీన్ జంటను యూరో లాటరీలో రూ. కోట్లు వరించాయి. అదీ ఒకసారి కాదు రెండుసార్లు! తొలుత 2013లో వీరికి మిలియన్ పౌండ్ల(రూ. 10 కోట్లు) యూరో లాటరీ తగిలింది. అప్పట్లో కోట్లు గెలిచిన ఆ టికెట్‌ను వారు అదివరకే చెత్తకుండీలో పడేశారు. తర్వాత ఓసారి చెక్చేస్తే పోలే.. అని తిరిగి కుండీలోని టికె ట్ను తీసి నంబర్ చెక్‌చేయడంతో లాటరీ దానికే వచ్చినట్లు తెలుసుకున్నారు. తనకు ఎప్పటికైనా లాటరీ తగులుతుందన్న నమ్మకముండేదని చెప్పే డేవిడ్ ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొనడం కొనసాగించాడు. దీంతో శుక్రవారం నాటి ‘యూరోమిలియన్స్ మెగాఫ్రైడే డ్రా’లో వీరిని మళ్లీ మిలియన్ పౌండ్లతో పాటు ఓ జాగ్వార్ కారూ వరించింది. ఏళ్లు లారీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరైన డేవిడ్ విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసి శేష జీవితాన్ని దర్జాగా గడిపేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. -
ఏకంగా ఆర్టీసీ బస్సుకే టెండర్ పెట్టాడు..
ఆదిలాబాద్: ఓ లారీ డ్రైవర్ ఆర్టీసీ బస్సును చోరీచేసి పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు....ఆదిలాబాద్ జిల్లాలోని తాళమడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శర్మకి శ్రీకాంత్(30) శుక్రవారం ఉదయం నిర్మల్ డిపో నుంచి ఓ ఖాళీ బస్సును తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నేరడిగొండ మండలం రోడ్డుమాముల టోల్ ప్లాజా వద్ద బస్సుతోపాటు శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. ఇక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే మహారాష్ట్ర సరిహద్దు వస్తుంది. బస్సును మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించాలని శ్రీకాంత్ ప్రయత్నంగా తెలుస్తోంది. (నేరడిగొండ) -
బైక్ ప్రమాదంలో వ్యక్తి పరిస్థితి విషమం
అద్దంకి(ప్రకాశం): వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీ దిగుతున్న డ్రైవర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శ్రీనివాసనగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు..బలికుదవ మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన పొలిశెట్టి సుధాకర్(35) అద్దంకి జాతీయర హదారిపై వేగంగా బైక్ నడుపుకుంటు వెళ్తున్నాడు. ఈ క్రమంలో టీఫిన్ తీనేందుకు లారీని ఆపి దిగుతున్న డ్రైవర్ సాంబయ్య(50)ను ఢీ కొట్టాడు. దీంతో సాంబయ్యకు స్వల్పగాయాలు కాగా, బైకు నడుపుతున్న సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
సీఐ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
విశాఖపట్నం: అనకాపల్లి మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద సీఐ వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సీఐకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. (అనకాపల్లి) -
ఎంవీఐ అత్యుత్సాహం
మార్టూరు : ఓ ఎంవీఐ (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా.. అని నడి రోడ్డుపై రౌడీయిజం చేశాడు. తన కారు అద్దానికి లారీ తగిలిందంటూ డ్రైవర్‌ను చితకబాదాడు. చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా బాది అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జొన్నతాళి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. క్షతగాత్రుని కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్ నూతలపాటి వరప్రసాద్ ఉలవపాడు నుంచి గుంటూరుకు జామాయిల్లోడుతో బయల్దేరాడు. మార్టూరు మండలం జొన్నతాళి సమీపంలోకి రాగానే ఒంగోలు వైపు నుంచి కారు వేగంగా వచ్చి లారీ ముందు ఆగింది. కారుకు లారీ తగిలి అద్దం పగిలిందంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. తాను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డినంటూ కర్రతో వీపుపై, కాళ్లపై విచక్షణా రహితంగా బాదాడు. పూటుగా మద్యం తాగి ఉండి ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. లారీ డ్రైవర్ దండం పెట్టి బతిమాలినా వదిలి పెట్టకుండా మెడపై కర్ర ఉంచి బలంగా నొక్కాడు. లారీని నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పోలీసులు వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎంవీఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం డ్రైవర్నున చికిత్స కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని ఫిర్యాదు మేరకు ఎంవీఐ రామకృష్టారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
బస్సును ఢీకొన్న లారీ
ధారూరు: నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేరెళ్లి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 07 జెడ్ 4055) తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. నగరం నుంచి తాండూర్లోని విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి ఓ లారీ (ఏపీ 09 వై 5448) వస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ వెంకటేశ్ అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు. ఉదయం 10.15 గంటల సమయంలో కేరెళ్లి గ్రామం సమీపంలో గాలి పోచమ్మ ఆలయ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంకటయ్య తీవ్రంగా హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. బస్సు డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతూ వాహనాన్ని ఎడమ వైపునకు మళ్లించాడు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుడివైపునకు రాంగ్రూట్లో వచ్చాడు. బస్సును సమీపించిన తరుణంలో హారన్‌కు ఉలిక్కిపడిన లారీ డ్రైవర్ వెంకటేశ్ ఒక్కసారిగా లారీని ఎడమ వైపునకు తీసుకున్నాడు. ఈక్రమంలో లారీ వెనుకభాగం బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులు 15 మంది ముందు సీట్లకు తగిలి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ప్రయాణికులు వేరే బస్సులో వెళ్లిపోయారు. బస్సు డ్రైవర్ వెంకటయ్య ధారూరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. లారీతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగభూషణం తెలిపారు. -
లారీ డ్రైవర్ దారుణ హత్య
వెంకటరమణపేట (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ చావిడి సమీపంలో (దిగువ వీధిలో) అడపా శ్రీను (38) అనే లారీడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్సై బి.సాగర్‌బాబు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీను మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బంది, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణపేట గ్రామానికి చెందిన అడపా శ్రీను లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల కిందట ఒక లారీని కొనుగోలు చేసి బాడుగకు తిప్పి నష్టపోవడంతో తిరిగి లారీ డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. వెంకటరమణపేట గ్రామంలోని కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్న శ్రీను సోమవారం అదే గ్రామంలోని దిగువ వీధిలో నివాసం ఉంటున్న మేనమామ గన్ను గోవింద ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం శ్రీను పడుకున్న సమయంలో అతని మేనమామ గోవింద కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె యశస్విని ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. సీఐ ఎస్. లక్ష్మణమూర్తి, ఎస్సై సాగర్‌బాబు మృతుడి తల్లి, అక్క, బంధువులు,స్థానికులను విచారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్ఓ వైవీఎస్ఆర్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేధింపులు భరించలేకే హత్య.. నిందితుడు మేనల్లుడు అడపా శ్రీను వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు గన్ను గోవింద నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. తన కుమార్తెలతో పాటు తనను కూడా నిత్యం వేధిస్తున్నట్లు గోవింద పోలీసులకు చెప్పినట్లు సమాచారం. -
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
జిల్లాలోని చీరాల కారంచేడు మధ్య సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టిన క్రమంలో తప్పించబోయి లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఏలూరు హైవేపై దొంగల బీభత్సం!
-
అధికారులమంటూ ఏలూరు హైవేపై దోపిడి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై దుండగులు మరోసారి తెగబడ్డారు. ఆర్టీఏ అధికారుల ముసుగులో వచ్చిన దుండగులు .... ఓ లారీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి నగదుతో పరారయ్యారు. కోల్కటా నుంచి చెన్నై వెళ్తున్న లారీని అర్థరాత్రి బైక్‌లతో వెంబడించిన అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దుగ్గిరాల సమీపంలోకి రాగానే లారీని ఆపారు. డ్రైవర్ సందీప్‌ను కిందకు దింపి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.25వేల నగదును దోచుకెళ్లారు. వెనుకాలే వస్తున్న అదే కంపెనీకి చెందిన మరో లారీ డ్రైవర్ రక్తపు మడుగులో పడివున్న సందీప్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. తీవ్రంగా గాయపడిన సందీప్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఏలూరు త్రీ టౌన్ సీఐ తెలిపారు. -
బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య
సేలం: కుటుంబకలహాలతో విరక్తి చెంది ఇద్దరు బిడ్డలను కడతేర్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో కొందలం గ్రామానికి చెందిన మునియప్పన్ (35) లారీడ్రైవర్. ఇతని భార్య మహేశ్వరి (30). వీరికి నరేంద్రప్రసాద్(11), కౌసల్య (9) ఇద్దరు పిల్లలు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మహేశ్వరి శనివారం రాత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మునియప్పన్ రాత్రి విషం తీసుకొచ్చి ముందుగా నరేంద్రప్రసాద్, కౌసల్యకు బలవంతంగా తాగించి, తరువాత తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పరమత్తి వేలూరు పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అక్కడ మునియప్పన్, నరేంద్రప్రసాద్, కౌసల్య శవాలుగా పడి ఉన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పిల్లలు ఇద్దరికి నయంకాని చర్మ సమస్య ఉండడం, భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా జీవితంపై విరక్తి చెంది పిల్లలకు విషమిచ్చి మునియప్పన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. -
పశ్చిమగోదావరి జిల్లాలో దొంగల బీభత్సం
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జీలుగుమిల్లి మండలం సమీపంలో ఓ డాబా వద్ద గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్, క్లీనర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ మరణించగా, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ లారీ ఆపి నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో దొంగలు దాడి చేసి 19 వేల రూపాయిల నగదు దోచుకెళ్లారు. డ్రైవర్, క్లీనర్ సమీప బంధువులు. వీరిని మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ ప్రియుడి దారుణం
సామర్లకోట : స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి ఓ వ్యక్తి ఏడాది బాలుడు, ఓ వివాహితను చెరువులోకి తోసేసిన సంఘటన ఇది. సామర్లకోట పోలీసుల కథనం ప్రకారం... కిర్లంపూడి మండలం వేలంకి గ్రామానికి చెందిన మణి ఏడాదిగా భర్త బాలరాజు నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. మూడు నెలలుగా అదే గ్రామానికి చెందిన లారీ క్లీనర్ శేషుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మణి, ప్రియుడు శేషు స్థానిక ఓవర్‌బ్రిడ్జిపై ఘర్షణ పడ్డారు. దీంతో శేషు ఆగ్రహించి, బ్రిడ్జిపై నుంచి తల్లి, బిడ్డను సుమారు 25 అడుగుల దిగువలోనున్న చెరువులోకి నెట్టేశాడు. దీంతో మణి తన ప్రాణాలను రక్షించుకొనే ప్రయత్నంలో ఈదుకుంటూ చెరువు నుంచి బయటపడింది. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ సిబ్బంది ఆమెను ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచి, సామర్లకోట పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చెరువులో మునిగిపోయిన ఏడాది బాలుడు చనిపోయి చెరువులో తేలుతూ కనిపించాడు. పోలీసులు మణి నుంచి సమాచారం సేకరించారు. మణి ప్రియుడు పరారయ్యాడు. మణి ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు ఎండీ అలీఖాన్, నాగార్జున పరిశీలించారు. -
165 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పిడుగురాళ్ళ రూరల్, న్యూస్‌లైన్,అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు శుక్రవారం తుమ్మలచెరువు గ్రామం వద్ద పట్టుకున్నారు. 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో లోడు చేసుకుని బయలుదేరే సమయంలో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు విజిలెన్స్ సీఐ ఎం.కిషోర్‌బాబు తెలిపారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌చేసినట్లు చెప్పారు. రేషన్ బియ్యం తుమ్మలచెరువుకు చెందిన బత్తుల బాలయ్యకు చెందినవిగా గుర్తించిన ట్లు తెలిపారు. లారీడ్రైవర్ షేక్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ తహశీల్దార్ టి.శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ రామారావు పాల్గొన్నారు. -
చేపల దొంగలు అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అర్థరాత్రి వేళ చెరువులో గుట్టుచప్పుడు కాకుండా చేపలు పట్టి టాటా ఏస్ వాహనంలో మార్కెట్‌కు తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మన్మదకుమార్ కథనం మేరకు.. మిర్యాలగూడ మండలంలోని యాదగిరిపల్లికి చెందిన నాగరాజు, నాగబోయిన నాగరాజు, ఎండీ జానీ, అన్నపురి సతీష్, బంటు వెంకటరమణ, చిత్తూరి కృష్ణ, శ్రీరామోజు శివ, బెరైడ్డి అశోక్‌కుమార్‌లు స్నేహితులు. వీరంతా ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా చెరువుల్లో చేపల దొంగతనానికి పాల్పడుతున్నా రు. ఈ క్రమంలో వారు బుధవారం అర్థరాత్రి టాటా ఏస్ వాహనంలో పోచంపల్లి చెరువు వద్దకు చేరుకున్నా రు. గుట్టు చప్పుడు కాకుండా చేపలు పట్టుకొని వాటిని వాహనంలో మార్కెట్‌కు తరలిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. అనుమానం వచ్చి వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో చేపలు ఉన్నాయి. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా యువకులే.. నిందితులంతా 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నారు. మొ త్తం 8 మంది రాగా ప్రధాన నిందితుడు నాగరాజు పరారయ్యారు. వీరిలో ఆటో, లారీ డ్రైవర్లు, ఇద్దరు విద్యా ర్థులు కూడా ఉండటం గమనార్హం. కఠినంగా శిక్షించాలి నిందితులను కఠినంగా శిక్షించాలని మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షుడు చెక్క రమేష్, భిక్షపతి, జంగయ్యలు డిమాండ్ చేశారు. గురువారం పోలీసుస్టేషన్లో ఫిర్యా దు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్, పెద్దరావులపల్లి, గౌస్‌కొండ చెరువుల్లో చేపల దొంగతనాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరువుల వద్ద కపలా ఉన్న వ్యక్తులను మారణ ఆయుధాలతో బెదిరించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. -
డామిట్ కథ అడ్డం తిరిగింది
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దారిదోపిడీ చేసి డబ్బు దోచుకున్నారని నాటకం ఆడిన ఓ లారీ డ్రైవర్ చివరికి కటకటాలపాలయ్యాడు. అత్యాశతో డబ్బు కాజేయడానికి అతను వేసిన పథకం కాస్తా అడ్డం తిరిగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసు చేధించి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. సీఐ శ్రీనివాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేరు గ్రామానికి చెందిన వనం లింగయ్య అలియాస్ లింగస్వామి(29)కి ఓ లారీ ఉంది. అతనే సొంతంగా నడుపుకుంటూ నల్లగొండకు చెందిన పత్తి వ్యాపారి దాస్వామి వద్ద రెండేళ్లుగా నమ్మకంగా సరకు రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో దాస్వామి నల్లగొండలో సేకరించిన 69 క్వింటాళ్ల పత్తిని లింగస్వామి లారీలో లోడ్ చేసి, మెదక్ జిల్లా సంగారెడ్డిలోని మంజిత్ కాటన్ మిల్లుకు పంపించాడు. లింగస్వామిపై నమ్మకం ఉండడంతో పత్తి అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. ఈనెల 5న నల్లగొండ నుంచి వెళ్లిన లారీ సంగారెడ్డిలోని మిల్లు వద్ద పత్తిని అన్లోడ్ చేసింది. పత్తి అమ్మగా వచ్చిన రూ.3,08,180 తీసుకుని లింగస్వామి సోమవారం రాత్రి నల్లగొండకు బయలుదేరాడు. దారి దోపిడీ జరిగిందంటూ.. ఒకేసారి అంత డబ్బు చూసే సరికి లింగస్వామి మనసు పక్కదారి మళ్లింది. డబ్బు కాజేయడానికి ఓ పథకాన్ని రచించాడు. మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలో ఉన్న ఔటర్ రోటరీ వద్దకు రాగానే రాత్రి 11 గంటల సమయంలో లారీని ఆపాడు. లారీ ముందు భాగం అద్దాలను రాయితో పగలగొట్టి, తన షర్టను చించివేసుకున్నాడు. డబ్బు ను డీజిల్ ట్యాంకు పక్కన ఉన్న ఒక పెట్టెలో దాచి పెట్టాడు. తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీ చేసి డబ్బు దోచుకున్నారని దాస్వామికి ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న దాస్వామి అదేరోజు రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్‌పై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించ గా నేరం అంగీకరించాడు. దీంతో అతని నుంచి డబ్బు ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐ న ర్సింహ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కూలీ బతుకులు ఛిద్రం
అమ్మా...అమ్మా.... గాదెనబోయిన సంతోష రోజువారికూలీ. భర్తేమో లారీ డ్రైవర్. వారి కుమారుడు జశ్వంత్(4), కూతురు శరణ్య(2). రోజు మాదిరిగానే సాయంత్రానికి ఇంటికి చేరే తల్లి ఎంతకీ రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పాపం ఆ పిల్లలకు తెలియదు తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని. అయితే సంతోష రెండు రోజుల క్రితమే పౌల్ట్రీ ఫామ్‌లోకి పని కుదిరింది. జనవరి ఫస్ట్‌న పనికి వెళ్లలేదు. కూలికి వెళ్లిన రెండోరోజే లారీ సంతోషను పొట్టనపెట్టుకుంది. వారంతా కూలీలు.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. భర్తలు వివిధ పనులు చేస్తుండగా ఇంటి బండి లాగడానికి తమవంతు కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాల్లో లారీ చీకటి నింపింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని చిదిమేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. - న్యూస్‌లైన్, కట్టంగూర్ కట్టంగూర్, న్యూస్‌లైన్ : నార్కట్‌పల్లి మండల పరిధిలోని ఏపీలింగో టం వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మం డలంలోని ముత్యాలమ్మగూడానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెరుకు వెంకమ్మ(50), కట్టెకుంట్ల ధనమ్మ(30), గాదెనబోయిన సంతోష(28), కట్టెకుంట్ల ముత్తమ్మ(50) మృతి చెందారనే వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బంధువుల, గ్రామస్తుల రోదనలతో గ్రామం శోకసంద్రంగా మారింది. పొట్టకూటి కోసం వెళ్లిన తొలిరోజే మృత్యుఒడికి చేరిన అత్తాకోడళ్లు గ్రామానికి చెందిన కట్టెకుంట్ల ముత్తమ్మ, కట్టెకుంట్ల ధనమ్మలు అత్తాకోడళ్లు. డిసెంబర్ 31న నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో పనికి వెళ్లలేదు. దీంతో గురువారం పనుల్లోకి వెళ్లిన తొలిరోజునే మృత్యువాత పడడంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. మృతురాలు ముత్తమ్మకు ఒక్కడే కొడుకు. కాగా ధనమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అత్తాకోడళ్లు ఇద్దరు వృత్తిరీత్యా కూలీలు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో పంటపొలాలు, పత్తి పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో కూలీ పనులు దొరకపోవటంతో పౌల్ట్రీ ఫాంలో పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రహదారిపై ఉండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. రె క్కాడితే డొక్కాడని కుటుంబం వెంకమ్మది చెరుకు వెంకమ్మ వృత్తిరీత్యా కూలీ. గతంలోనే భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలినాలీ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెల వివాహం చేసింది. కొడుకు కుమార్‌ను ఇంటర్ చదివిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మహిళా కార్మికురాలి ప్రాణాన్ని బలిగొంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండపాక గ్రామానికి చెందిన పెనుమాల అరుణ కుమారి (37) తేతలి వై జంక్షన్ సమీపంలోని వెంట్రుకల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఫ్యాక్టరీకి వె ళ్లేందు కు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి క్యారేజి తీసుకుని బయల్దేరిన ఆమె 8.30 గంటల సమయంలో తేతలి వై జంక్షన్ దాటుతుండగా మండపాక నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న పేపరు లోడులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ డివైడర్ మీదుగా జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలోకి వెళ్లిపోయింది. ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త రాజేం ద్రప్రసాద్తో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త వడ్లూరులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి.సీతాపతిరావు పోలీసులకు సమాచారం అందించారు. తణుకు సీఐ గుమ్మళ్ల మధుబాబు సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రూరల్ పోలీ సులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది లారీడ్రైవర్ పళ్లు తోముకుంటూ స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం వలనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైడిపర్రు రోడ్డు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి వచ్చిన డ్రైవర్ ఒకచేత్తో స్టీరింగ్ తిప్పుతూ డ్రైవింగ్ చేస్తున్నాడని అదే సమయంలో సైకిల్‌పై అరుణ రోడ్డు దాటుతుండగా లారీని అదుపుచేయలేక ఢీకొట్టాడని పేర్కొన్నారు. లారీకి అలంకరణ కోసం అమర్చిన గొలుసులు సైకిల్ ఊసలకు చిక్కుకుని లాక్కుపోయినట్లు తెలుస్తోంది. సైకిల్ చక్రాలకు గొలుసులు చిక్కుకుని ఉండడమే దీనికి నిదర్శనం. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ నోట్లో బ్రష్‌తో కిందకు దూకి పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విడివాడ మండపాక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు విడివాడ రామచంద్రరావు ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే ఘటనా ప్రాంతానికి వచ్చి మృతురాలి భర్త రాజేంద్రప్రసాద్, కుటుంబసభ్యులను పరామర్శించారు. పేదలైన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. విలవిల్లాడిన తోటి కార్మికులు అక్కా.. అరుణక్కా... అంటూ తోటి కార్మికుల రోదనలతో ఘటనా ప్రాంతం హోరెత్తింది. రక్త సంబంధం కాకపోరుున మృతదేహాన్ని చుట్టేసుకుని బోరున విలపించారు. అరుణ మరణించిందన్న వార్త తెలుసుకున్న తోటి మహిళా కార్మికులు పరుగు పరుగున ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటుందని కార్మికులు లక్ష్మి, నాగమణి, ధనలక్ష్మి కన్నీళ్లపర్యంతమయ్యారు. పోలీసులు, స్థానికులు కలిసి వారందరినీ బలవంతంగా ఫ్యాక్టరీకి పంపించారు. -
లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుప్రక్కనే వున్నఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు పసిప్రాణాలు గాలిలో కలిసిపోయ్యాయి. అతడు నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మాకు దిక్కెవరు దేవుడా..
పామిడి/గుత్తి, న్యూస్‌లైన్ : అయ్యో.. దేవుడా ఎంతపనిచేశావ్. ఇక మాకు దిక్కెవరు.. అంటూ కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన వెంకటనారాయణ కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. 44వ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్- గుత్తి ఎస్కేడీ ఇంజనీరింగ్ కళాశాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన నారాయణస్వామి (38) దుర్మరణం చెందాడు. ఇతని కుమారుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పెద్దవడుగూరు ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి కథనం మేరకు... లారీ డ్రైవర్ వెంకటనారాయణ తన కుమారుడు నారాయణస్వామి(11)ని అనంతపురం సమీపంలోని సోములదొడ్డిలోని కార్పొరేట్ స్కూల్లో వదిలేందుకని బుధవారం బైక్‌పై బయల్దేరాడు. సరిగ్గా భారత్ పెట్రోల్ బంక్‌వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వచ్చిన తమిళనాడు లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామికి మాటపడిపోయింది. స్థానికులు హుటాహుటిన బాలుడిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి పంపించారు. వెంకటనారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భార్య వెంకటలక్ష్మి, కుమార్తె శ్రావణి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. భర్త ప్రాణం పోయి.. కుమారుడు మాట కోల్పోయాక ఇక తాము ఎలా బతకాలిరా దేవుడా అంటూ గుండెలు బాదుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం తమ పరిధిలో లేదంటూ వెంకటనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు గుత్తిలో వైద్యులు నిరాకరించడంతో పామిడికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. -
నయ వంచకుడు
వల్లూరు, న్యూస్‌లైన్ : తాను ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యానంటూ ఓ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసిన ఓ నయవంచకుని కథ ఇది. ఆ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని, కొంతకాలం కాపురం చేస్తూ, గర్భవతిగా వుండగా శిక్షణకంటూ ఉడాయించిన ఘటన ఇది. దాదాపు 8 నెలలుగా ఆచూకీ లేకపోవడంతో తాను మోసపోయానని భార్య తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా వున్నాయి. వల్లూరు మండలంలోని పైడికాలువకు చెందిన వెంకట సుబ్బయ్య లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. లారీకి వస్తూ పోతూ ఉండగా మరో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌తో పరిచయం పెరిగింది. ఈ క్రమంలో తాను అనాథనని, ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. ఆ యువకుని మాటలను నమ్మిన వెంకటసుబ్బయ్య పైడికాలువలోనే వుంటున్న తన చెల్లెలు కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. నలుగురు ఆడ పిల్లల తల్లిగా, భర్తను పోగొట్టుకుని పేదరికంలో వున్న ఆమె తన అన్న మాట మీద నమ్మకంతో మూడో కూతురైన విజయలక్ష్మిని ఇచ్చి బంధువుల సమక్షంలో 2012 ఆగస్టు 15న గండి క్షేత్రంలో వివాహం చేసింది. కొంతకాలం ఆమెతో కొంతకాలం కాపురం సాగించాడు. ఆమె 5 నెలల గర్భవతిగా వుండగా తనకు ఎస్ఐ ట్రైనింగ్ ఆర్డర్ వచ్చిందని, అందుకు గానూ గుజరాత్‌కు వె ళ్లాల్సి వుందని నమ్మించాడు. అయితే అక్కడ కొంత డబ్బు కట్టాలని చెప్పి భార్య మెడలో వున్న 6 తులాల బంగారు ఆభరణాలతో బాటు, అతని వద్ద వున్న రూ.30 వేలను, లారీ ఓనర్ దగ్గర వెంకటసుబ్బయ్య హా మీగా వుండి ఇప్పించిన రూ.20 వేలను, బంధువుల దగ్గర మరో రూ.20 వేలను తీసుకుని వెళ్లాడు. శిక్షణ పూర్తి చేసుకొని వస్తాడని భర్త కోసం ఎదురు చూసిన విజయలక్ష్మి ఐదు నెలల క్రితం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత కాలంగా భర్త ఫోన్ కూడా చేయకపోవడమే కాక, అతని ఫోన్ నెంబర్ స్విచ్ఆఫ్ చేసి వుంటుండడంతో తాను మోసపోయాయని తెలుసుకున్న విజయలక్ష్మి శుక్రవారం వల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వారి పెళ్లి ఫొటోలతోపాటు, పోలీస్ డ్రస్‌లతో తీయించుకున్న ఫొటోలను పోలీసులకు అందజేసింది. తనకు న్యాయం చేయాలని తన 5నెలల పసి బిడ్డతో వేడుకుంటోంది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహరావు తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 9440796916 నంబరుకు తెలియజేయాలని ఆయన కోరారు. -
యువతిపై అత్యాచారం చేసి లారీలోంచి తోసేశాడు
-
యువతిపై అత్యాచారం చేసి లారీలోంచి తోసేశాడు
మెదక్: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం ఘటన మరువక ముందే మన రాష్ట్రంలో అటువంటి సంఘటనే జరిగింది. అయితే అక్కడ బస్సు అయితే, ఇక్కడ లారీ. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ యువతి హైదరాబాద్ వెళ్లేందుకు లారీ ఎక్కింది. మార్గమధ్యంలో లారీడ్రైవర్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి దగ్గర లారీ నుంచి తోసివేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీడ్రయివర్ నుంచి స్మగ్లర్ దాకా...
వెంకటరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ వద్ద లారీ డ్రైవర్‌గా చేరాడు. అక్రమ మార్గాలన్నీ తెలుసుకుని కోట్లకు పడగలెత్తాడు. సొంతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ 32 ఏళ్లుగా అటవీ, పోలీసు అధికారులకు చెమటలు పట్టించాడు. చివరకు రేణిగుంటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ పోలీసులకు శనివారం అడ్డంగా దొరికిపోయాడు. సాక్షి, తిరుపతి/మంగళం: అటవీ, పోలీసు అధికారులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఎర్రచందనం స్మగ్లర్ వెంకటరెడ్డి శనివారం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లారీ క్లీనర్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా మారిన అతని అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు. మండల కేంద్రమైన ఎర్రావారిపాళానికి చెం దిన తిమ్మసముద్రం రామిరెడ్డికి వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి కుమారులు. వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి రేణిగుంటలోనే కాపురం ఉంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఒక్కొక్కరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. తొలుత లారీ క్లీనర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వెంకటరెడ్డి తిరువళ్లూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ నాయుడు వద్ద డ్రైవర్‌గా చేరాడు. రెండేళ్లపాటు లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. అతని వేతనంగా ఒక్కో ట్రిప్పునకు రూ.50వేలు తీసుకునేవాడు. బ్రహ్మంగారిమఠం, కోడూరు, కడప, ఆళ్లగడ్డ, నం ద్యాల, తలకోన, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించేవాడు. అడవిలో నరి కిన ఎర్రచందనం దుంగలను కర్నూలులోని ఓ గోదాములో దాచేవారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరవేసేవారు. చెన్నైలోని రెడ్‌హిల్స్‌కు చెందిన మణి, సత్యవేడుకు చెందిన మురళి సహకారంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు చేరవేసేవారు. అలా ఎర్రచందనం రవాణాకు అన్ని మార్గాలు తెలుసుకున్న వెంకటరెడ్డి కొంతకాలానికి తానే స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. రేణిగుంటలోని శ్రీవెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం పూజలు చేస్తూ పట్టుబడ్డాడు. కోట్లకు పడగలెత్తిన వెంకటరెడ్డి కుటుంబం స్మగ్లర్‌గా అవతారమెత్తిన వెంకటరెడ్డి కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించింది. రేణిగుంట, తిరుపతి, ఎర్రావారిపాళెం, కర్నూలు, కడప ప్రాంతాల్లో భవ నాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డి పేరుపై రూ.100 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అతని సోదరులకు కూడా రూ.50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా సా గిస్తూనే తాజాగా హైదరాబాద్‌లో బిల్డర్ అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఎర్రావారిపాళెం నుం చి ఢిల్లీ దాకా ఎర్రచందనం అక్రమరవాణాను విస్తరించినట్లు వెల్లడించాడు. ఈ అక్రమరవాణాలో ఎవరెవరు ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారే కీలక సమాచారం సైతం పోలీసులకు వెంకటరెడ్డి వివరిం చినట్లు విశ్వసనీయ సమాచారం.