
165 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పిడుగురాళ్ళ రూరల్, న్యూస్‌లైన్,అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు శుక్రవారం తుమ్మలచెరువు గ్రామం వద్ద పట్టుకున్నారు. 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో లోడు చేసుకుని బయలుదేరే సమయంలో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు విజిలెన్స్ సీఐ ఎం.కిషోర్‌బాబు తెలిపారు.
రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌చేసినట్లు చెప్పారు. రేషన్ బియ్యం తుమ్మలచెరువుకు చెందిన బత్తుల బాలయ్యకు చెందినవిగా గుర్తించిన ట్లు తెలిపారు. లారీడ్రైవర్ షేక్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ తహశీల్దార్ టి.శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ రామారావు పాల్గొన్నారు.