హత్యకు గురైన శివాజీనాయుడు
కర్నూలు: కల్లూరు మండలం శరీన్ నగర్‌లో లారీ డ్రైవర్ శివాజీనాయుడు(36) దారుణ హత్యకు గురయ్యాడు. అదే కాలనీకి చెందిన స్వామి శేఖర్, రాజశేఖర్, మద్దమ్మ తదితరులు కలిసి ఇనుప రాడ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్దమ్మ కుటుంబానికి శివాజీనాయుడు తండ్రి ఎనిమిదేళ్ల క్రితం రూ.40 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి చెల్లించే విషయంలో వారం రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రాత్రి శివాజీనాయుడు మరోసారి మద్దమ్మ కుటుంబాన్ని అప్పు తిరిగి చెల్లించే విషయంలో నిలదీశాడు.
ఈక్రమంలో మాటామాటా పెరిగడంతో నిందితులు ఇనుప రాడ్‌తో తలపై బాదడంతో శివాజీ నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని హత్యకు దారితీసిన విషయాలపై ఆరా తీశారు. భార్య బోయ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు నాల్గవ పట్టణ సీఐ రామయ్య నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment