
Woman Driving Truck Video Viral: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. మగవారికి సమానంగా తాము సత్తా చాటగలమని నిరూపిస్తున్నారురు. భూమినుంచి అంతరిక‌్షం వరకు ఎందులోనూ తీసిపోమంటూని ముందుకు సాగుతున్నారు. ఆటో, బస్సు డ్రైవర్లుగానూ రాణిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ లారీ డ్రైవర్ అవతారమెత్తింది. ముఖంపై చిరునవ్వు చిందిస్తూ మహిళ లారీ డ్రైవ్ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ పెద్ద లారీని మహిళ హైవేపై ఎంతో కాన్ఫిడెంట్‌గా డ్రైవింగ్ చేస్తోంది. ఆమె మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఆ వాహనంలోని వ్యక్తి మహిళను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్ చేశారు. ఈ సమయంలో మహిళ సరదాగా నవ్వడం కెమెరా కంటికి చిక్కింది. అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు లేకుండా లారీ నడుపుతూ దూసుకెళ్లింది. దీనిని అవినాష్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
సోషల్ మీడియోలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.94లక‌్షల మంది వీక్షించారు. దాదాపుగా 11వేలకు పైగా లైకులు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్స్ మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు.. ‘ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆ చిరునవ్వు అద్భుతం, ఇన్సిరేషనల్, మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: హెల్మెట్ ధరించి బస్సు డ్రైవింగ్.. కారణం తెలిస్తే షాక్!
Comments
Please login to add a commentAdd a comment