షాపు షట్టర్‌లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..! | Woman Gets Caught In Shop Shutters And Lifted Into The Air | Sakshi
Sakshi News home page

షాపు షట్టర్‌లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!

Published Thu, Mar 7 2024 11:05 AM | Last Updated on Thu, Mar 7 2024 11:13 AM

Woman Gets Caught In Shop Shutters And Lifted Into The Air - Sakshi

ఒక్కోసారి మనకు తెలియకుండానే చిన్న తప్పిదాలు చేస్తాం. అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిపోతాయి. ఇబ్బంది పడ్డాక గానీ అనిపించదు. అబ్బా ఎంత పొరపాటు చేశాం అని నాలుక కరుచుకుంటాం. అలాంటి ఘటనే ఇక్కడొక మహిళ ఫేస్‌ చేసింది. 

సౌత్‌ వేల్స్‌లోని ఒక మహిళా క్లినర్‌ షాపు షర్టర్ వద్ద క్లీన్‌ చేస్తుంది. ఇంతలో షాపు యజమాని షాపు ఓపెన్‌ చేసే నిమిత్తం ఆటోమెటేడ్‌ షట్టర్‌ మిషన్‌ ఆన్‌ చేశాడు. అతను అక్కడ మహిళ ఉందన్న విషయం గమనించలేదు. అయితే ఈమె కూడా షట్టర్‌ పైకి లేగుస్తోంది కదా అని అక్కడ నుంచి వచ్చే యత్నం చేయకుండా తన పనిచేసుకుంటుంది. అయితే ఆ షట్టర్‌లో ఆమె కోటు ఇరుక్కుని ఆమె కూడా అలా షట్టర్‌ తోపాటే పైకి వెళ్లిపోయి గాల్లో వేలాడుతూ ఉండిపోయింది.

దీంతో ఏం చేయాలో తోచక ఆ షాపు యజామానిని గట్టిగా పిలిచింది. దేవుడి దయ వల్ల అతను వెంటనే స్పందించి అక్కడకు వచ్చి ఆమెను రక్షించాడు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. షాపు యజమాని స్పందించాడు కాబట్టి సరిపోయింది లేదంటే అలా ఆమె గాల్లో ఎంతసేపు ఉండాల్సి వచ్చేదో లేక ఆ కోటు చిరిగి దబుక్కుని పడిపోయేదో ఊహించుకుంటే వామ్మో అనిపిస్తుంది కదూ. ఇక ఆ క్లినర్‌ ఆ ఘటన దెబ్బకు ఇంకెప్పుడూ షట్టర్‌కి ఎదురు వెళ్లను, దాని దగ్గర ఉండొన అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement