South Wales
-
షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!
ఒక్కోసారి మనకు తెలియకుండానే చిన్న తప్పిదాలు చేస్తాం. అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిపోతాయి. ఇబ్బంది పడ్డాక గానీ అనిపించదు. అబ్బా ఎంత పొరపాటు చేశాం అని నాలుక కరుచుకుంటాం. అలాంటి ఘటనే ఇక్కడొక మహిళ ఫేస్ చేసింది. సౌత్ వేల్స్‌లోని ఒక మహిళా క్లినర్ షాపు షర్టర్ వద్ద క్లీన్ చేస్తుంది. ఇంతలో షాపు యజమాని షాపు ఓపెన్ చేసే నిమిత్తం ఆటోమెటేడ్ షట్టర్ మిషన్ ఆన్ చేశాడు. అతను అక్కడ మహిళ ఉందన్న విషయం గమనించలేదు. అయితే ఈమె కూడా షట్టర్ పైకి లేగుస్తోంది కదా అని అక్కడ నుంచి వచ్చే యత్నం చేయకుండా తన పనిచేసుకుంటుంది. అయితే ఆ షట్టర్లో ఆమె కోటు ఇరుక్కుని ఆమె కూడా అలా షట్టర్ తోపాటే పైకి వెళ్లిపోయి గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ షాపు యజామానిని గట్టిగా పిలిచింది. దేవుడి దయ వల్ల అతను వెంటనే స్పందించి అక్కడకు వచ్చి ఆమెను రక్షించాడు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. షాపు యజమాని స్పందించాడు కాబట్టి సరిపోయింది లేదంటే అలా ఆమె గాల్లో ఎంతసేపు ఉండాల్సి వచ్చేదో లేక ఆ కోటు చిరిగి దబుక్కుని పడిపోయేదో ఊహించుకుంటే వామ్మో అనిపిస్తుంది కదూ. ఇక ఆ క్లినర్ ఆ ఘటన దెబ్బకు ఇంకెప్పుడూ షట్టర్‌కి ఎదురు వెళ్లను, దాని దగ్గర ఉండొన అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This woman was lifted into the air by the shop shutters while waiting to get into work pic.twitter.com/Vx41HFAuOb — Crazed (@crazednet) March 6, 2024 (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!) -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
వైరల్ వీడియో: ఎలుకల వర్షం చూశారా
సిడ్నీ: పొలాలపై పడి ఎలుకలు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్య ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో అధికంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ఓ రైతు తన పంట పొలంలో గొయ్యిను శుభ్రం చేయించగా అందులో గుట్టగుట్టలుగా ఎలుకలు బయటపడ్డాయి. ఆ మట్టిని తీసిన మిషన్ నుంచి వందలాది చిట్టెలుకలు బయటపడ్డాయి. ఆ యంత్రం నుంచి వర్షం కురిసినట్టు ఎలుకలు కింద పడ్డాయి. ఇది ఆ రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలను నష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో ప్లేగు వ్యాధికి కారణంగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని చంపే చర్యలు మొదలుపెట్టారు. ఈ సమస్య ముఖ్యంగా ఈశాన్య ఆస్ట్రేలియాలో అధికంగా ఉంది. పెద్ద ఎత్తున ప్లేగు బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పొలాల వద్ద ఎలుకలను నాశనం చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ రైతు పొలంలోని గుంతను శుభ్రం చేస్తుండగా ఎలుకలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్ లూసీ థాకరే ట్విటర్లో షేర్ చేశారు. ‘ఎలుకల వర్షం’ అంటూ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. యంత్రం పైపు నుంచి ఎలుకలు కిందపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తుంది. అది చూసి వామ్మో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆ ప్రాంతంలోని గోదాముల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదాములపై దాడి చేసి ధాన్యాన్నంతా పాడు చేస్తున్నాయి. గోదాముల్లో ఎలుకల దాడిని చూస్తే భయం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎలుకల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చదవండి: అంత్యక్రియల్లో లేచిన బామ్మ: షాకైన కుటుంబీకులు Even if grain’s in silos, mice can get to it. Like Tyler Jones discovered in Tullamore when cleaning out the auger and it started raining mice #mouseplague #mice #australia pic.twitter.com/mWOHNWAMPv — Lucy Thackray (@LucyThack) May 12, 2021 Meanwhile in Australia 😳 Oh good god. I can’t deal with mice. At all, not even one! The rodent plague in Australia would have me seeking asylum immediately *shudder* pic.twitter.com/6jSC5yIvwr — Bernie's Tweets (@BernieSpofforth) May 13, 2021 -
ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా
లండన్: మనుషులకే ఓ చోట కాలు నిలవదు. అలాంటిది జంతువులకు ఉన్నచోటే ఉండాలంటే సాధ్యమవుతుందా? అందులోనూ 'కాలు కాలిన పిల్లి' అని మార్జాలం స్వభావం గురించి ఓ సామెత కూడా ఉంది. అయితే సౌత్వేల్కు చెందిన క్రిస్, అతని గర్ల్‌ఫ్రెండ్ గండాల్ఫ్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని గారాబం చేస్తూ బాగానే చూసుకుంటున్నారు. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్న చందంగా అది ఎప్పుడూ పక్కింట్లోకి వెళ్లేది. అక్కడున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేసి యమ దర్జాగా బయటకొచ్చేది. దీని చేష్టలకు చిరాకొచ్చిన సదరు కుటుంబం ఈసారి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు దాని మెడకు వార్నిగ్ లెటర్‌ను వేలాడదీశారు. ఎప్పటిలాగే ఆ నాలుగేళ్ల పిల్లి తన కడుపు నింపుకున్న తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే దాని మెడలో వేలాడుతున్న లేఖను యజమాని తీసి చదవగా.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) "దయచేసి మీ పిల్లిని మీ ఇంట్లోనే ఉంచండి. అది ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతోంది. ఇంట్లో ఆహారాన్ని తింటూ, సోఫాను గీరుతూ నాశనం చేస్తోంది. రాత్రిళ్లు కూడా వంటగదిని విడిచిపెట్టకుండా అక్కడే పడుకుంటోంది. మీరు దానికి తిండి పెడితే మంచిదనుకుంటా! ఈ పిల్లి గోల నా వల్ల కావడం లేదు, నేను విసిగిపోయాను. ఇంకోసారి మీ పిల్లి నా ఇంట్లో కనిపిస్తే దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వస్తానో నాకే తెలీదు" అని హెచ్చరించి ఉంది. అంతేకాదు.. 'పిల్లికి తిండి కూడా పెట్టకండి' అని దాని మెడకు వేలాడదీసిన దానిపై రాసి ఉంది. అయితే తన పిల్లి గురించి ఇంతవరకెన్నడూ ఇలాంటి ఫిర్యాదులు అందలేదని దాని యజమాని క్రిస్ వాపోయాడు. అది అందరితో బాగా కలిసిపోయేదని, మిగతావారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?) -
చెంప చెళ్లుమనిపించిన చేప
సౌత్ వేల్స్: సౌత్ వేల్స్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అక్కడి సముద్రం ఒడ్డుకు వెళ్లి తుఫాను అనంతరం వాతావరణ పరిస్థితులపై కెమెరా ముందు నిల్చుని వ్యాఖ్యానిస్తున్న యూట్యూబ్ మహిళా ఉద్యోగిని చెంపను పెద్ద చేప వచ్చి వాయించింది. ఆ చేప దెబ్బకు ఆ మహిళ డామ్మని పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే 40 వేల మంది చూశారు. క్రెయిగ్, ఎయిమీ అనే ఇద్దరు యూట్యూబ్ కోసం పనిచేస్తుంటారు. ఎప్పుడూ కొన్ని వీడియోలు చిత్రించి యూట్యూబ్‌లో పెడుతుంటారు. అందులో భాగంగా వారు తుఫాను వచ్చిన తర్వాత సౌత్ వేల్స్‌లోని బ్యారీ ఐలాండ్ బీచ్ వద్దకు కెమెరా తీసుకొని వెళ్లారు. క్రెయిగ్ కెమెరా ఆన్ చేసి చూస్తుండగా.. ఎయిమీ దాని ఎదురుగా వ్యాఖ్యానిస్తోంది. అదే సమయంలో ఓ భారీ అలా ఎగిసి ఆమెపై భారీ వర్షపు జల్లుగా పడింది. అప్పుడే ఆ అలలో ఓ పెద్ద చేప ఎగిరి వచ్చి ఆమె చెంపను బలంగా తాకింది. దీంతో ఎయిమి కిందపడింది.