లండన్: మనుషులకే ఓ చోట కాలు నిలవదు. అలాంటిది జంతువులకు ఉన్నచోటే ఉండాలంటే సాధ్యమవుతుందా? అందులోనూ 'కాలు కాలిన పిల్లి' అని మార్జాలం స్వభావం గురించి ఓ సామెత కూడా ఉంది. అయితే సౌత్‌వేల్‌కు చెందిన క్రిస్, అతని గర్ల్‌ఫ్రెండ్ గండాల్ఫ్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని గారాబం చేస్తూ బాగానే చూసుకుంటున్నారు. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్న చందంగా అది ఎప్పుడూ పక్కింట్లోకి వెళ్లేది. అక్కడున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేసి యమ దర్జాగా బయటకొచ్చేది. దీని చేష్టలకు చిరాకొచ్చిన సదరు కుటుంబం ఈసారి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు దాని మెడకు వార్నిగ్ లెటర్‌ను వేలాడదీశారు. ఎప్పటిలాగే ఆ నాలుగేళ్ల పిల్లి తన కడుపు నింపుకున్న తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే దాని మెడలో వేలాడుతున్న లేఖను యజమాని తీసి చదవగా.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?)
"దయచేసి మీ పిల్లిని మీ ఇంట్లోనే ఉంచండి. అది ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతోంది. ఇంట్లో ఆహారాన్ని తింటూ, సోఫాను గీరుతూ నాశనం చేస్తోంది. రాత్రిళ్లు కూడా వంటగదిని విడిచిపెట్టకుండా అక్కడే పడుకుంటోంది. మీరు దానికి తిండి పెడితే మంచిదనుకుంటా! ఈ పిల్లి గోల నా వల్ల కావడం లేదు, నేను విసిగిపోయాను. ఇంకోసారి మీ పిల్లి నా ఇంట్లో కనిపిస్తే దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వస్తానో నాకే తెలీదు" అని హెచ్చరించి ఉంది. అంతేకాదు.. 'పిల్లికి తిండి కూడా పెట్టకండి' అని దాని మెడకు వేలాడదీసిన దానిపై రాసి ఉంది. అయితే తన పిల్లి గురించి ఇంతవరకెన్నడూ ఇలాంటి ఫిర్యాదులు అందలేదని దాని యజమాని క్రిస్ వాపోయాడు. అది అందరితో బాగా కలిసిపోయేదని, మిగతావారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?)
పక్కింట్లో దూరిన పిల్లికి వార్నింగ్ లెటర్
Published Tue, Jul 14 2020 2:22 PM | Last Updated on Tue, Jul 14 2020 2:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment