బ్రిటిష్ పతాకాన్ని హోదా చిహ్నంగా మెడలో ధరించి, గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి వాలకం గమనించండి. ఇది బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో ఉన్నతోద్యోగి. దీని హోదా ‘చీఫ్ మౌసర్ టు ది కేబినెట్ ఆఫీస్’. బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోనికి ఎలుకలు చొరబడకుండా కాపలా కాయడమే దీని పని. దీని కన్ను కప్పి పొరపాటున ఏ ఎలుకైనా సాహసించి ఈ కార్యాలయంలోకి చొరబడితే, ఇది వెంటనే పట్టి, పలారం లాగించేస్తుంది.
లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోని ఉద్యోగులందరూ దీనిని అల్లారుముద్దుగానే కాదు, అత్యంత గౌరవంగా కూడా చూసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో పిల్లులను పెంచే పద్ధతి పదహారో శతాబ్ది నుంచి ఉండేది.
ప్రధాని కార్యాలయంలో పెంచే పిల్లికి ‘చీఫ్ మౌసర్’ హోదాను అధికారికంగా ప్రకటించడం మాత్రం 1997లో జరిగింది. ఇప్పుడు ‘చీఫ్ మౌసర్’గా ఉన్న పిల్లి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 100 పౌండ్లు (రూ.10,597) ఖర్చు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment