
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది.
పాతకాలం బల్బుల కంటే ఎల్‌ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా
తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.
రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.
ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.
కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.
గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన
ఉండాలి.సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు.
కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు.
-ఎన్.ఆర్
(చదవండి: