home design
-
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
Home Decoration: ‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయకండి!
‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయడానికి లేదు. మట్టి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మట్టికి అద్దం కూడా తోడైతే చూడ్డానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. అలాంటి కళ పేరే లిప్పన్ ఆర్ట్. ఇది కచ్ ప్రజల మనసు కళ. మట్టి–అద్దాలతో కలసిన ఈ ఆర్ట్‌పీస్‌లు ఇంటి గోడలను అందంగా చూపిస్తున్నాయి. మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కళ కచ్ శివారు గ్రామాల్లోని బంజరు భూముల గుండా వెళుతున్నప్పుడు అద్దాలతో అలంకరించిన మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇళ్లల్లోని మహిళల చేతుల్లోనే ఈ లిప్పన్ ఆర్ట్ కనపడుతుంది.. ఇలా మట్టి కళా రూపాలుగా. విశేషమేమంటే వీటి తయారీలో ఎలాంటి అచ్చులను, మూసలను ఉపయోగించరు. క్లిష్టమైన సౌందర్యం మడ్ మిర్రర్ వర్క్.. దాని సౌందర్యం ఆధునిక ప్రపంచపు దృష్టినీ ఆకర్షిస్తోంది. పట్టణాల్లోని ఇంటి గోడలపైన అందంగా మెరిసిపోతోంది. నిరాడంబరమైన ఈ ఆర్ట్ ఆడంబరంగా వెలిగిపోతోందిప్పుడు. ఎలా చేస్తారంటే.. లిప్పన్ ఆర్ట్‌కు డిమాండ్ పెరగడంతో తయారీ తీరు మారింది. ఎలాగంటే.. ముందు.. ప్లైవుడ్ పైన పెన్సిల్‌తో డిజైన్ గీస్తారు. తర్వాత మెత్తని మట్టిని నీటితో కలిపి... దాన్ని డిజైన్‌కి అనుగుణంగా పూసి, దానిపై అద్దాలు అతికించి.. రంగులు వేస్తారు. ఇది చాలా నైపుణ్యంతో కూడుకున్న పని కావడంతో ఈ శైలి అరుదైన కళగా ఆకట్టుకుంటోంది. చదవండి: ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
Home Creations: పండగవేళ కాపర్ కాంతులు.. పాత వస్తువులతో ఇంటి అలంకరణ!
పాతకాలం నాటి ఇత్తడి, ఇనుము, కలప వస్తువులతో గృహాలకంరణ చేయడం అనేది మనకు తెలిసిందే. పూర్తి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ స్టైల్ ఇంటి అందాన్ని ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంది. అయితే, మంచినీటిని నిల్వచేసుకుని తాగే రాగిపాత్రలు ఇప్పుడు ఇంటి కళలో వినూత్నంగా మెరిసిపోతున్నాయి. దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్ముతాయి. సంప్రదాయ జిలుగులే కాదు ఆధునికపు హంగులుగానూ ‘రాగి’ తన వైభవాన్ని చాటుతోంది. ఫ్లవర్వేజ్గానూ, హ్యాంగింగ్ బెల్స్గానూ, క్యాండిల్ స్టాండ్‌గానూ, పూలకుండీలుగా, పార్టిషన్ వాల్స్గానూ రాగి తన దర్జాను చూపుతోంది. పండగ జిలుగులు పండగల వేళ సంప్రదాయ కళ ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు బ్రాస్ లేదా కాపర్ ఎంపిక తప్పనిసరి. ఒక చిన్న మార్పు పండగ కళను ఇంట రెట్టింపు చేస్తుంది. దీపాల పండగకు అలంకరణలో సంప్రదాయ కళ ఎప్పుడూ తన వైభవాన్ని చాటుతుంది. ఇందుకు నాటి రాగి పాత్రలు అలంకరణలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. అలంకరణలో ఎన్ని ఆధునిక వస్తువులున్నా ఒక రాగి పాత్ర హోమ్ క్రియేషన్‌లో భాగం చేస్తే చాలు ఆ లుక్కే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు, రోజువారీ వాడకంలో ఉన్న రాగి ప్లేట్లు, గ్లాసులు, టీ కెటిల్, చిన్న చిన్న రాగి పాత్రలు.. ప్రతీది ఇంటి అలంకరణలో గొప్పగా అమరిపోతుంది. అందుకు నిన్న మొన్నటి తరాలు దాచిన అపురూపమైన రాగి వస్తువులను అలంకరణకు ఎంచుకోవచ్చు. ఆధునిక కాంతి గృహాలంకరణలో కాపర్ కోటింగ్ ఓ అద్భుతాన్ని చూపడానికి ఎంచుకుంటున్నారు ఇటీవల ఇంటీరియర్ డిజైనర్లు. రాగితో డిజైన్ చేసిన టేబుల్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్‌లు ఆధునికంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేలు, ఇండోర్ ప్లాంట్ పాట్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. స్టాండ్లు, షెల్వ్స్, వాల్పేపర్లు, పార్టిషన్గానూ కాపర్ కొత్తగా మెరిసిపోతోంది. పాత్రలకే పరిమితం కాకుండా ఫ్రేమ్స్ రూపంలోనూ మోడర్న్ ఆర్ట్‌గా వినూత్నమైన అందాన్ని చూపుతోంది. ఖరీదులోనూ ఘనమైనదిగా కాపర్ ఇంటికి వింటేజ్ కళతో పాటు గ్రాండ్‌నెస్‌ను మోసుకువస్తుంది. కళాభిమానులు అనే కితాబులనూ అలంకరణ చేసినవారికి అందిస్తుంది. చూపులను కట్టిపడేసే రాగికి దీపకాంతులు జత చేరితే ఇక ఆ ఇంట దివ్యకాంతులు విరబూస్తాయి. -
Home Creations: పండగ వేళ.. ఈ ముగ్గులతో మీ ఇంటికి ప్రత్యేక శోభ!
అందమైన రంగవల్లికలతో పండగల రోజుల్లో ప్రత్యేకంగా ఇంటిని సింగారించుకుంటున్నాం. ఆ రంగవల్లికలే అలంకరణ వస్తువుల మీదా కొత్తగా ముస్తాబు అయితే.. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘సావీస్ హోమ్’ పేజీతో ఈ క్రియేషన్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నారు స్రవంతి. ఇంటి అందాన్ని పెంచడం ఎలాగో ‘ముగ్గు’ను ముచ్చటగా పెయింట్ చేసి మరీ చూపుతున్నారు. మెలికలుగా తీర్చిన ముగ్గును ఏయే రూపాల్లో వేసుకోవచ్చో.. ముఖ్యంగా పండగలు, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ముగ్గు కళతో ఇంటి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఆసనంపైన అందం పూజల్లో ఆసనంగా వాడే పీట, చుట్టూ అలంకరణకు వాడే పొడవాటి చెక్క ముక్కలు, బల్ల వంటివి పసుపు, ఎరుపు, పచ్చ రంగు పెయింట్ మీద వేసిన తెల్లని పెయింట్ ‘ముగ్గు’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాకిట్లో గుమ్మం ముందు వేసిన ముగ్గు డిజైన్‌ను ఇలా పీట మీద పెయింట్‌గా వేసి, ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వచ్చు. మీ అభిరుచిని సరికొత్తగా తెలియజేయవచ్చు. షోకేస్‌కి ముగ్గు వాల్ ఫ్రేమ్స్, కీ హోల్డర్స్, చిన్న సైజు అర లున్న షోకేస్ వంటివి గోడపైన అలంకరణగా ఉంచాలనుకుంటే.. వాటిని ఇలా ముగ్గు ముచ్చటతో మురిసిపోయేలా మెరిపించవచ్చు. కొన్నాళ్లుగా వాడి, ఇక పడేద్దాం అనుకున్న చెక్క స్పూన్లు , గరిటెలను కూడా రంగవల్లిక పెయింట్‌తో వాల్ హ్యాంగర్స్‌గా మార్చుకోవచ్చు. ట్రే.. గ్లాస్ హోల్డ్ర్లు కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ముగ్గుతో ఇంటిని కళాత్మకంగా ముస్తాబు చేసుకోవచ్చు. చెక్కతో చేసిన ట్రే, గ్లాస్ హోల్డర్స్‌ని ముగ్గుతో ‘కళ’గా అలంకరించవచ్చు. కలపకే ప్రాధాన్యం చెక్కతో తయారైన వస్తువులకు, పూల కుండీలకు రంగవల్లిక ఓ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. అయితే, వీటిలో మెలికల ముగ్గుకే ప్రాధాన్యం. కళగా ఉంటుంది కదా అని ప్రతీ వస్తువుపై ‘ముగ్గు’వేస్తే అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అభిరుచితో పాటు ఏ వస్తువును ‘కళ’గా అలంకరించాలో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టడం సముచితం. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
Home Creations: ఒంటి అలంకరణ వస్తువులతో ఇంటి అలంకరణ
ఇంటిని అందంగా అలంకరించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. ఉన్న వస్తువులతో రీ సైక్లింగ్ చేసే పద్ధతులు తెలుసుకుంటే చాలు ఇంటిని వినూత్నంగా మార్చుకోవచ్చు. అందుకు ఫ్యాషన్ యాక్ససరీస్ అదేనండీ ఒంటి అలంకరణ వస్తువులను చూపులను ఆకట్టుకునే విధంగా ప్రతి పీస్‌ను ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. చెవి రింగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్, వేసుకునే హై హీల్స్, పట్టుకొనే గొడుగు.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం. ఫ్యాషన్ యాక్ససరీస్ ఉపయోగించేవాటికన్నా పక్కన పెట్టేసేవి ఎక్కువే ఉంటాయి. అంతగా కొని దాచిపెట్టేస్తారు కాబట్టి, వీటితోనే ఇంటి అలంకరణ చేసేస్తే.. ఇంట్లో వారి మెప్పుతో పాటు ఇంటికి వచ్చే అతిథులు మార్కులు కూడా కొట్టేయొచ్చు. అయితే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం... సిల్క్ స్కార్ఫ్ బయటకు వెళితే కుర్తీ, టాప్‌కి కాంబినేషన్‌గా మెడలో స్కార్ఫ్ ఉండాల్సింది. అందమైన స్కార్ఫ్‌లు ఎన్నో మీ వద్ద ఉండే ఉంటాయి. కొన్ని స్కార్ఫ్ల డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రేమ్‌లో స్కార్ఫ్‌ని సెట్ చేస్తే, అందమైన వాల్ ఆర్ట్ అలంకరణకు రెడీ. ఇందుకు ఫ్రేమ్ ఎంపిక ఒక్కటే మీ ఛాయిస్. మీ అభిరుచిని బట్టి ఎన్ని స్కార్ఫ్‌లు అయినా మార్చుకుంటూ రోజుకో ఆర్ట్‌ని ఆస్వాదించవచ్చు. వేలాడే జూకాలు అతివల హృదయానికి చేరువగా ఉండేది ఆర్ట్. అందుకే, వారికి కావల్సిన ప్రతీ వస్తువూ కళాత్మకంగా ఉండేది ఎంచుకుంటారు. వాటిలో చెవి రింగులు ప్రధానమైనవి. ఒక మంచి ఫ్రేమ్‌లో అమర్చి, లివింగ్ రూమ్‌లో అలంకరించి, ఆ అందమైన తేడాను మీరే గమనించవచ్చు. బరువైన బ్యాంగిల్.. పేపర్‌వెయిట్ ఇత్తడి, రాగి, గాజు మెటీరియల్‌తో తయారైన సింగిల్ హెవీ బ్యాంగిల్స్‌ను మన దగ్గర చాలానే ఉంటాయి. బరువుగా ఉందనో, మరోసారి వాడుదామనో పక్కన పెట్టేసిన ఇలాంటి గాజును టేబుల్ పెపర్వెయిట్గా ఉపయోగించుకోవచ్చు. వీటి డిజైన్ కూడా చాలా కళాత్మకంగా ఉండటంతో చూడగానే ఆకట్టుకుంటుంది. గొడుగు దీపాల జిలుగులు ఎండ, వానల సమయాల్లో అందమైన గొడుగుల సంఖ్య మన దగ్గర చేరుతూనే ఉంటాయి. ఏదైన టూర్లకు వెళ్లినప్పుడు కూడా చిన్న చిన్న గొడుగులను సేకరించే అలవాటు ఉంటుంది. వీటిని ఇలా విద్యుత్ దీపాలకు అడ్డుగా పెట్టి, ఇంటి అలంకరణలో రెట్టింపు కళ తీసుకురావచ్చు. బ్యాగులే శిల్పాలు పాడైన ఫ్యాన్సీ బ్యాగులు, క్లచ్‌లు, శాండల్స్, ఉపయోగించని లిప్‌స్టిక్ వంటివి కవర్లో పెట్టి, మూలన పడేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంచెం సృజనాత్మకత జోడించి, శిల్పాలుగా మార్చుకోవచ్చు. ఇంటి గ్లాస్ షోకేస్‌లో అందంగా అలంకరించుకోవచ్చు. మీకు కావల్సిందల్లా కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత.. ఇలా మీ ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉన్న వస్తువులతోనే ఇంటిని కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: Home Creations: అలంకరణలో ఇదో విధం..! -
మీ అభిరుచికి తగిన గృహాలంకరణ డిజైన్లు
ఉల్లాసరకమైన ఇంటి అలంకరణ ఆ గృహస్తుల అభిరుచిని తెలియజేస్తుంది. కానీ, ‘మరీ ఇంతటి అలంకరణా’ ఆశ్చర్యపోయే ఇంటి లోపలి డిజైన్లు ఇవి. లిథువేనియా వెబ్సైట్ బోర్డ్పాండా ప్రపంచంలో ఉన్న కొన్ని విచిత్రమైన గృహాలంకరణ డిజైన్లను ఇటీవల మన ముందుంచింది. వంటగదిలో కంచె ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా వంటగది అలంకరణ వింతగానే అనిపిస్తుంది. పొయ్యి గట్టును కూడా అలాగే డిజైన్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ, ఎంత శుభ్రం చేసినా వంటగది గజిబిజిగా ఉన్నట్టు కలలోకి వస్తే మాత్రం ఎవరూ బాధ్యులు కారండోయ్. ఇంతకీ ఈ కిచెన్ ఎక్కడ అనేది మీ సందేహమా అమెరికాలోని ఓ గృహస్తుడి ఐడియా ఇది. బాస్కెట్ బాల్ నెట్ ఇంటి హాలులో అందమైన షాండ్లియర్‌ని వేలాడదీయడం ఒక హంగుగా చూస్తూనే ఉంటాం. అరుదైన క్రిస్టల్స్‌తో బాస్కెట్‌బాల్ నెట్‌ను రూపొందించి, ఇలా హ్యాంగ్ చేశారు. ఇది నిజంగానే అరుదైన షాండ్లియర్‌గా మార్కులు కొట్టేసింది. ఇంట్లో జూ పార్క్ సెంటర్ టేబుల్ పక్కనే మూలన అలంకరించిన షో పీస్ చూస్తే ఆ ఇంటి యజమాని గుండె ఎంత గట్టిదో ఇట్టే తెలిసిపోతుంది. మొసలి తన బలాన్నంతా ఉపయోగించి కూర్మాన్ని నోట కరచుకున్నట్టుగా ఉన్న ఈ షో పీస్ జూ పార్క్‌లో ఉంటే ఉండచ్చు గాక. కానీ, ఇంటి అలంకరణలో చోటు ఇవ్వడం అనేది అతి పెద్ద విశేషమే. కమోడ్‌పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. స్నానపు తొట్టె కుర్చీలు పాత బాత్‌టబ్‌ను తీసుకొని, దానిని రెండు కుర్చీలు, ఒక సెంటర్ టేబుల్ చేయడం అనేది ఒక సృజనాత్మక డిజైన్‌గా మెచ్చుకోకుండా ఉండలేం. అంత సౌకర్యంగా లేకపోవచ్చు కానీ, ఈ డిజైనర్‌కి మాత్రం పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. పాడైపోయిన వస్తువులను తిరిగి వాడుకునేలా ఎలా చేయచ్చో ఈ డిజై¯Œ చూస్తే తెలిసిపోతుంది. గడ్డి కుర్చీలు పార్కులో గడ్డిలో కూర్చోవడం మనందరికీ అనుభవమే. కానీ, ఇంటి లాన్లో పచ్చటి గడ్డి పరచుకున్న కుర్చీల మీద కూర్చోవడం ఒకింత తెలియని అనుభూతే. టేబుల్, కుర్చీల మీద ఇలా గడ్డిని అందంగా రూపు కట్టారు. ప్రకృతి అంటే ఎంత ప్రేమ ఇలా చాటి చెప్పారు. గగుర్పాటు కప్పులు టీ తాగడానికి అందమైన కప్పుల సేకరణ అందరూ చేస్తారు. కానీ, గగుర్పాటు కలిగించే విధంగా ఉన్న కాఫీ కప్పుల డిజైన్ మాత్రం చూస్తే జడుసుకోకుండా ఉండలేరు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు. కమోడ్‌పై పెయింటింగ్ కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్ పట్ల డిజైనర్ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. కాళ్ల కుండీలు ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ఇంటి అలంకరణ కోసం చూస్తున్నారా? అయితే, ఇలా ప్రయత్నించవచ్చు. ఇళ్లలో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ కుండీ మానవ శరీరం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. మానవ కాళ్ల రూపాలతో తయారుచేసిన కుండీల కంటైనర్ ఇది. రాక్షస మంచం భారీ కోరలతో రాక్షస నోరును పోలి ఉన్నట్టు ఉన్న మంచం ఇది. ఈ మంచంలో గాఢమైన నిద్ర కోసం ప్రయత్నించడం అసాధారణ వ్యక్తులకే సాధ్యం అనుకుంటే పొరపాటేమీ కాదు. స్పైన్ క్యాండిల్స్ వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు. చదవండి: World Alzheimer's Day: మతిమరుపు వల్ల మెదడు బరువు కోల్పోయి.. క్రమంగా.. -
పండగ వేళ.. ఇంటికి శోభ!
♦ ఉచితంగా హోమ్ డిజైన్ ♦ కన్సల్టేషన్ అందిస్తున్న దర్పన్ సాక్షి, హైదరాబాద్: నగరంలో పండగ వాతావరణం నెలకొంది. షాపింగ్‌తో ఎవరి బిజీలో వారున్నారు. మరీ ఇంటి సంగతో? పండగొచ్చిదంటే చాలు.. ఇంట్లోని ప్రతి ఫర్నీచర్‌ను, వాడ్రోబ్స్ను శుభ్రం చేస్తూ.. రీడెకొరేట్ చేస్తూ అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే మళ్లీ కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనుభూతి సొంతమవుతుంది. మరీ, రీడెకరేటివ్ కోసం లేబర్ ఖర్చులు, బోలెడంత సమయం ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి. కానీ, దర్పన్ మీ జేబు కష్టాలకు చెక్ చెప్పేందుకు ముందుకొచ్చింది. దసరా, దీపావళి సందర్భంగా ఉచితంగా హోమ్ డిజైన్ కన్సల్టేషన్ అందించాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ఫోన్ చేయాల్సిన నంబర్లు: అబిడ్స్: 88860 03136, బంజారాహిల్స్: 88860 48882, చందానగర్: 90000 17086, గచ్చిబౌలి: 90000 17082. మరెందుకు ఆలస్యం.. ఫోన్ చేయండి.. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి.