పండగ వేళ.. ఇంటికి శోభ!
♦ ఉచితంగా హోమ్ డిజైన్
♦ కన్సల్టేషన్ అందిస్తున్న దర్పన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పండగ వాతావరణం నెలకొంది. షాపింగ్‌తో ఎవరి బిజీలో వారున్నారు. మరీ ఇంటి సంగతో? పండగొచ్చిదంటే చాలు.. ఇంట్లోని ప్రతి ఫర్నీచర్‌ను, వాడ్‌రోబ్స్‌ను శుభ్రం చేస్తూ.. రీడెకొరేట్ చేస్తూ అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే మళ్లీ కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనుభూతి సొంతమవుతుంది. మరీ, రీడెకరేటివ్ కోసం లేబర్ ఖర్చులు, బోలెడంత సమయం ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి. కానీ, దర్పన్ మీ జేబు కష్టాలకు చెక్ చెప్పేందుకు ముందుకొచ్చింది. దసరా, దీపావళి సందర్భంగా ఉచితంగా హోమ్ డిజైన్ కన్సల్టేషన్ అందించాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ఫోన్ చేయాల్సిన నంబర్లు: అబిడ్స్: 88860 03136, బంజారాహిల్స్: 88860 48882, చందానగర్: 90000 17086, గచ్చిబౌలి: 90000 17082. మరెందుకు ఆలస్యం.. ఫోన్ చేయండి.. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి.