Darpan
-
ఐదేళ్ల తరువాత అమ్మఒడికి..!
సాక్షి, హైదరాబాద్: దర్పణ్ యాప్.. తెలంగాణ పోలీసుల పనితనానికి నిదర్శనంగా నిలిచింది. టెక్నాలజీలో నిత్యం ముందుండే రాష్ట్ర పోలీసులు.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చి శెభాష్ అనిపించుకున్నారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన సోమ్ సోని అనే బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల వయసున్నపుడు 2015లో జూలై 14న తప్పిపోయాడు. ఈ మేరకు అలహాబాద్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. కానీ, పిల్లాడు అదే నెల 23న అస్సాంలోని గలాపర పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు స్థానిక చిల్డ్రన్స్ హోంకు తరలించారు. ముఖ కవళికల ఆధారంగా గుర్తింపు తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో దర్పణ్‌యాప్‌ను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పనిచేసే ఈ సాఫ్ట్వేర్ ముఖకవళికల ఆధారంగా పిల్లలను గుర్తిస్తుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తప్పిపోయిన, గుర్తించిన పిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ పోలీసులు కేంద్రం ఆధ్వర్యంలోని ‘‘ట్రాక్ ద చైల్డ్ పోర్టల్’’నుంచి మిస్సింగ్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ డేటా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమ్ సోని ఫొటోను ఇందులో అప్లోడ్ చేశారు. వెంటనే సోని అస్సాంలోని ఓ చిల్డ్రన్ హోమ్‌లో ఉన్నాడని యాప్ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు అలహాబాద్ పోలీసులను, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు అస్సాంలోని చిల్డ్రన్ హోంకు వెళ్లి సోమ్ సోనిని కలుసుకున్నారు. సోమ్ తన తల్లిదండ్రులను చూసిన వెంటనే గుర్తుపట్టడం విశేషం. సోమ్ను చూడగానే అతని తల్లి గుండెలకు హత్తుకుని బోరున ఏడ్చింది. ఐదేళ్ల తరువాత తప్పిపోయిన పిల్లాడిని ‘దర్పణ్ యాప్’ద్వారా అమ్మఒడికి చేర్చడం తెలంగాణ పోలీసులకు గర్వకారణంగా భావిస్తున్నామని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తమ పిల్లాడిని తిరిగి తమ వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ పోలీసులకు సోని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన
-
అపురూప దృశ్యం..
సాక్షి, హైదరాబాద్: ఇదొక భావోద్వేగపూరిత సన్నివేశం. ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయిన కన్నకొడుకు కళ్లెదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ మాతృమూర్తి చూపించిన అవాజ్య ప్రేమకు నిలువుటద్దం. ఏమైపోయాడో తెలియని బిడ్డ ఊహించని విధంగా తిరిగిరావడంతో పట్టరాని ఆనందంతో ఆ అమ్మ తన గారాల కొడుకుని ముద్దులతో ముంచెత్తింది. ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావురా కన్నా’ అంటూ గుండెలకు హత్తుకుని రోదించింది. తన ‘ప్రాణాన్ని’ తిరిగి తెచ్చిన పోలీసులకు వందనాలు అంటూ మొక్కింది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఈ ఘటనకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ వేదికగా నిలిచింది. దర్పణ్.. ఇది తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్. తప్పిపోయిన పిల్లలను వెతికి ఈ యాప్ సహాయంతో వారి గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎంతో మంది పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తాజాగా ఓ పిల్లాడిని దర్పణ్ యాప్ సహాయంతో ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ద్వారా గుర్తించిన కుషాయిగూడ పోలీసులకు బాలుడి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఎంతో ఆతృతగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. పిల్లాడి తల్లి కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఐజీ(మహిళల భద్రత) స్వాతి లక్రా ట్విటర్లో షేర్ చేశారు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులను అభినందిస్తూ నెటిజనులు ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: మరో అమ్మ కథ) -
పండగ వేళ.. ఇంటికి శోభ!
♦ ఉచితంగా హోమ్ డిజైన్ ♦ కన్సల్టేషన్ అందిస్తున్న దర్పన్ సాక్షి, హైదరాబాద్: నగరంలో పండగ వాతావరణం నెలకొంది. షాపింగ్‌తో ఎవరి బిజీలో వారున్నారు. మరీ ఇంటి సంగతో? పండగొచ్చిదంటే చాలు.. ఇంట్లోని ప్రతి ఫర్నీచర్‌ను, వాడ్రోబ్స్ను శుభ్రం చేస్తూ.. రీడెకొరేట్ చేస్తూ అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే మళ్లీ కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనుభూతి సొంతమవుతుంది. మరీ, రీడెకరేటివ్ కోసం లేబర్ ఖర్చులు, బోలెడంత సమయం ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి. కానీ, దర్పన్ మీ జేబు కష్టాలకు చెక్ చెప్పేందుకు ముందుకొచ్చింది. దసరా, దీపావళి సందర్భంగా ఉచితంగా హోమ్ డిజైన్ కన్సల్టేషన్ అందించాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ఫోన్ చేయాల్సిన నంబర్లు: అబిడ్స్: 88860 03136, బంజారాహిల్స్: 88860 48882, చందానగర్: 90000 17086, గచ్చిబౌలి: 90000 17082. మరెందుకు ఆలస్యం.. ఫోన్ చేయండి.. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి.