తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన | Police App reunites lost child with family | Sakshi
Sakshi News home page

తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన

Published Thu, Jan 9 2020 11:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ఇదొక భావోద్వేగపూరిత సన్నివేశం. ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయిన కన్నకొడుకు కళ్లెదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ మాతృమూర్తి చూపించిన అవాజ్య ప్రేమకు నిలువుటద్దం. ఏమైపోయాడో తెలియని బిడ్డ ఊహించని విధంగా తిరిగిరావడంతో పట్టరాని ఆనందంతో ఆ అమ్మ తన గారాల కొడుకుని ముద్దులతో ముంచెత్తింది. ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావురా కన్నా’ అంటూ గుండెలకు హత్తుకుని రోదించింది. తన ‘ప్రాణాన్ని’ తిరిగి తెచ్చిన పోలీసులకు వందనాలు అంటూ మొక్కింది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఈ ఘటనకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ వేదికగా నిలిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement