న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రావెర్మన్ తిరిగి యూకే హోం సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కీలక క్యాబినెట్ నియామకాల్లో భాగంగా సుయెల్లా హోంమంత్రి పదవిని దక్కించు కున్నారు. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం కొత్త ఛాన్సలర్ జెరెమీ హంట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సునాక్ విధేయుడు కానప్పటికీ, జేమ్స్ క్లవర్లీని విదేశాంగ కార్యదర్శి పదవిలో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.
కాగా లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఇమ్మిగ్రేషన్ డ్రాఫ్ట్‌ను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించక ముందే అప్పటి హోం సెక్రటరీ సుయెల్లా బ్రావెర్మన్ ఈ పాలసీ డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్ నుంచి పంపడం వివాదాన్ని రేపింది. ఈ వ్యవహారం సుయెల్లా రాజీనామాకు దారి తీసింది. ఈ సందర్భంగా అప్పటి ప్రభుత్వంపై సుయెల్లా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment