home secretary
-
భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్ భర్త ఆత్మహత్య
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటుంటారు. పెళ్లితో ముడిపడిన జంట తాము జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేస్తారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా కలిసి నడుస్తారు. పరస్పరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్న దంపతుల్లో విధివశాత్తూ ఒకరు మరణిస్తే, మరొకరు ఆ ఎడబాటును తట్టుకోలేక విలవిలలాడిపోతుంటారు.అసోం హోమ్‌శాఖ సెక్రటరీ శిలాదిత్య చెతియా(44) తన భార్య మరణంతో తీవ్రంగా కలతచెంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త అసోంలోని అందరినీ షాక్‌నకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో తన భార్య మృతదేహం ముందు శిలాదిత్య చెతియా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతిచెందిన కొద్ది నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య కొంతకాలంగా అదే ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్సపొందుతున్నారు. శిలాదిత్య చెతియా రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న ఐపీఎస్ అధికారి. రాష్ట్ర హోమ్‌శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేప్టటడానికి ముందు ఆయన టిన్సుకియా, సోనిత్పూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా, అసోం పోలీసు నాల్గవ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పనిచేశారు. ఆయన భార్య అగమోని బోర్బరువా(40) నామ్కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ ఘటన గురించి నామ్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా మాట్లాడుతూ ‘బుల్లెట్ శబ్దం వినగానే మేమంతా పరిగెత్తుకుంటూ ఐసీయూలోని వెళ్లాం. అక్కడ శిలాదిత్య చెతియా తన భార్య మృతదేహం పక్కనే రక్తపు మడుగులో పడివున్నారు. మేము అతని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని’ అన్నారు. కాగా చెతియా మృతిపై అసోం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు. -
బెంగాల్ డీజీపీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది. గతంలోనూ చర్యలు 2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్‌కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్‌గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరికి రెండు విధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీఎం కమిషనర్ తొలగింపు ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది. -
కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుపై ఈసీ కొరడా ఝులిపించింది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల మార్పు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం కార్యదర్శులు మారుస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మిజోరం జీఏడి కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ కార్యదర్శులు ఎన్నికల సంఘం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను ఎన్నికల సంఘం మార్చింది. ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఈసీ తొలగించినట్లు తెలిపింది. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్‌మాన్‌ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్, కూపర్లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్‌ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. (చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!) -
రిషీ కేబినెట్:హోం సెక్రటరీగా ఆమె రీఎంట్రీ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రావెర్మన్ తిరిగి యూకే హోం సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కీలక క్యాబినెట్ నియామకాల్లో భాగంగా సుయెల్లా హోంమంత్రి పదవిని దక్కించు కున్నారు. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం కొత్త ఛాన్సలర్ జెరెమీ హంట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సునాక్ విధేయుడు కానప్పటికీ, జేమ్స్ క్లవర్లీని విదేశాంగ కార్యదర్శి పదవిలో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఇమ్మిగ్రేషన్ డ్రాఫ్ట్‌ను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించక ముందే అప్పటి హోం సెక్రటరీ సుయెల్లా బ్రావెర్మన్ ఈ పాలసీ డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్ నుంచి పంపడం వివాదాన్ని రేపింది. ఈ వ్యవహారం సుయెల్లా రాజీనామాకు దారి తీసింది. ఈ సందర్భంగా అప్పటి ప్రభుత్వంపై సుయెల్లా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ
లండన్: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ యూకే కొత్త హొం సెక్రటరీగా భాద్యతలు చేపట్టారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అంతేకాదు ఆమె తల్లి హిందూ తమిళియన్ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్. ఐతే ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు. ప్రస్తుతం బ్రేవర్మన్కి చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రువాండాకు చెందిన కొంతమంది శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె తనతోటి సహోద్యోగి భారత సంతతికి చెందిన ప్రీతీ పటేల్ వారుసురాలిగా ఈ అత్యున్నతి పదవిని చేపట్టారు. ఈ మేరకు బ్రేవర్మన్ మాట్లాడుతూ...బ్రెక్సిట్ అవకాశాలను పొదుపరిచి, సమస్యలను చక్కదిద్దాలనుకుంటున్నాని చెప్పారు. యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ నుంచి యూకేని బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరకుంటున్నాని తెలిపారు. ఆమె తన నాయకత్వ ప్రచార వీడియోలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ..వారు బ్రిటన్‌ని ప్రేమిస్తారని, తమకు ఈ దేశం అత్యంత భద్రతనిచ్చిందని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అదరికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఆమె 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకుంది. ఆమె గతేడాది రెండోవ బిడ్డకు జన్మనిచ్చే నిమిత్తం ప్రసూతి సెలవుల్లో ఉన్న సయంలోనే క్యాబినేట్ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకువచ్చి పేరుగాంచారు. ఆమె బౌద్ధ మతస్తురాలు, పార్లమెంటులో కూడా బుద్ధుని సూక్తులకు సంబంధించిన ధ్మపద గ్రంథంపై ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: 'తక్షణమే రంగంలోకి దిగుతా'... వర్షంలో తడుస్తూనే) -
ఊహించని ట్విస్ట్.. ప్రీతి పటేల్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్.. లిజ్ ట్రస్ హయాంలోనూ బ్రిటన్ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. అయితే.. పదవికి రాజీనామానే చేయాలని నిర్ణయించుకుని ఆమె కన్జర్వేటివ్ పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు.. లిజ్ ట్రస్ నేతృత్వంలోని కేబినెట్లో తాను పని చేయబోనంటూ పరోక్షంగా ఆమె ప్రకటించారు కూడా. ఈ మేరకు ప్రధాని పీఠం నుంచి దిగిపోతున్న బోరిస్ జాన్సన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఛాయిస్. లిజ్ ట్రస్ అధికారికంగా ప్రధాని పదవి చేపట్టగానే.. కొత్త హోం సెక్రటరీ నియమితులవుతారంటూ లేఖ రాసి ఆసక్తికర చర్చకు దారి తీశారామె. కన్జర్వేటివ్ పార్టీలో లిజ్ ట్రస్, ప్రీతి పటేల్‌కు పోసగదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం లిజ్ ట్రస్ బ్రిటన్ అధ్యక ఎన్నికల్లో గెలిచారన్న ప్రకటన తర్వాత.. ప్రీతీ పటేల్, ట్రస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ప్రధానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మూడేళ్లుగా హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారామె. దీంతో.. తర్వాతి హోం సెక్రటరీగా కూడా ఆమె కొనసాగుతారని అంతా భావించారు. అయితే లిజ్ ట్రస్ హయాంలో పని చేయడం ఇష్టం లేకనే ఆమె రాజీనామా చేసినట్లు.. ఆమె అనుచర వర్గం అంటోంది. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్.. సుదీర్ఘకాలం బ్రిటన్ రాజకీయాల్లో కొనసాగారు. 1991లో పటేల్ కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. 2010లో ఆమె తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలో ఆమె సీనియర్ సభ్యురాలిగా ఉన్నారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా పని చేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో ప్రధాని అభ్యర్థిత్వం రేసులో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. బోరిస్ నమ్మినబంటుగా, బ్రెగ్జిట్ క్యాంపెయిన్‌లోనూ పటేల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. ప్రధాని అభ్యర్థి రేసు నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు లిజ్ ట్రస్ చేతిలో ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు.. కేబినెట్ బెర్త్ దక్కడం అనుమానంగానే మారింది. అయితే రిషి సునాక్ మద్దతుదారులకు మాత్రం కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేతులు కలిపిన వేళ.. -
AP: ఐపీఎస్‌లు బదిలీ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా హరీష్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐపీఎస్‌లు బుధవారం బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఇక, రైల్వే అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే..? -
హోం, డీజీపీలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని 14, 19 అధికరణల ద్వారా ప్రజలకు లభించిన నిరసన తెలియజేసే హక్కు అమలుకు రాష్ట్రంలో పోలీసులు అవరోధం కల్పిస్తున్నారని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నిరసన కార్యక్రమాలు తెలియజేసే హక్కులు అమలు కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి షఫీకుజ్జమాన్, సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ఖాద్రీ దాఖలు చేసిన ‘పిల్’లో ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఎక్కడైనా నిరసన కార్యక్రమం చేసేందుకు దరఖాస్తు చేసుకుంటే పోలీసులు నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడమో, గడువు ముగిసే దశలో ఫలానా చోట నిరసన కాకుండా మరో చోట చేసుకోవాలని సూచన చేసి ఆందోళనకారుల స్ఫూర్తిని నీరుగార్చేలాగనో వారి చర్యలున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేసేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోగా పోలీసులు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలని ‘పిల్’లో కోరారు. కాగా, ఇదే తరహాలో తాము నిరసన ర్యాలీ, సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతికి తగిన మార్గదర్శకాలను రూపొందించాలని హోం శాఖను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేశారు. -
హైకోర్టులో హోంశాఖల ముఖ్య కార్యదర్శులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీస్ ఫిర్యాదుల సంస్థ ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని అమలు చేయలేదనే కోర్టు ధిక్కార కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు రవి గుప్త, కేఆర్ఎం కిశోర్ కుమార్‌లు సోమవారం తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని 2017 ఏప్రిల్ 27న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలు చేయలేదంటూ ఎన్ఎస్ చంద్రశేఖర శ్రీనివాసరావు అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా కోర్టుధిక్కార పిటిషన్‌గా పరిగణించింది. కమిషన్, అథారిటీలను ఈ నెల 27లోగా ఏర్పాటు చేయనిపక్షంలో 30వ తేదీన స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఈనెల 4న ధర్మాసనం ఆదేశించింది. దీంతో వారివురూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఎదుట సోమవారం హాజరయ్యారు. కమిషన్, అథారిటీల ఏర్పాటుకు నాలుగు వారాల సమయం ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వాదిస్తూ, హైకోర్టు ఉత్తర్వుల అమలుకు 8 వారాల గడువు కోరారు. ఒక ప్యానల్ తయారు చేసే నిమిత్తం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారని, దీనికి జవాబు రాగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనిపై సీజే స్పందిస్తూ.. ఆలేఖను తాను చూశానని నియమనిబంధనలు రూపొందించకుండా ప్యానల్ తయారు చేయాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది వాదిస్తూ, ఏపీలో కమిషన్, అథారిటీలకోసం ఉత్తర్వులు (జీవో 173) జారీ చేసిందని తెలిపారు. ఏర్పాటుకు 3 నెలల సమయం కావాలని కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. వీటి ఏర్పాటు వల్ల హైకోర్టుకు ఏమీ ప్రయోజనం చేకూర్చడం లేదని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని హితవు చెప్పింది. నేపథ్యం ఇదీ.. పోలీసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారి సమస్యల్ని పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర భద్రతా కమిషన్, జిల్లా స్థాయిలో పోలీసులపై ఫిర్యాదులను విచారించేందుకు పోలీస్ కంప్ల యింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని 2006లో ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.ప్రకాశం, కామారెడ్డి, చిత్తూరు జిల్లాల్లో పోలీసులపై నమోదైన కేసులను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి 2017 ఏప్రిల్ 27న ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు తీర్పులోని మార్గదర్శకాలను అమలు చేయాలని తేల్చి చెప్పారు. సీఎం లేదా హోం మంత్రి చైర్మన్‌గా ఉండే కమిషన్‌లో డీజీపీ ఎక్స్అఫీషియో సెక్రటరీగా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని సభ్యుడిగా ఉండాలని, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల మండలిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడాన్ని చంద్రశేఖర శ్రీనివాసరావు అనే వ్యక్తి 2017 అక్టోబర్ 26న లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తేచ్చారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసుల ఎత్తివేత
సాక్షి, అమరావతి: పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తివేసున్నామని కిశోర్ కుమార్ చెప్పారు. -
‘అయోధ్యపై నివేదికను పీవీ తిరస్కరించారు’
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసే సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే మసీదు కూల్చివేత ఉండేది కాదని అప్పటి హోంశాఖ కార్యదర్శి మాధవ్ గాడ్బొలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చివేతకు ముందు హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికను పీవీ తిరస్కరించారని పేర్కొన్నారు. ‘ప్రధాని పదవిలో ఉన్న పీవీ.. రాజకీయ చొరవ తీసుకుని ఉంటే ఆ సంఘటన జరగకుండా ఉండేది’అని అయోధ్య వివాదంపై గాడ్బొలే రాసిన ‘ది బాబ్రీ మసీద్–రామ మందిర్ డైలెమా: ఆన్ యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్’అనే కొత్త పుస్తకంలో వెల్లడించారు. ఈ వివాదాస్పద కూల్చివేతకు ముందు తర్వాత సంఘటనలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రధాని పీవీ ఆ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, అయితే దురదృష్టవశాత్తు ఆయనొక అసమర్థ కెప్టెన్‌గా మిగిలిపోయారని విమర్శించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన రాజీవ్ గాంధీ గానీ, వీపీ సింగ్ గానీ ఈ వివాద పరిష్కారంలో తమ సరైన వైఖరిని తెలియజేయలేదన్నారు. -
త్వరలో భారత్‌కు విజయ్ మాల్యా!
లండన్: బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావీద్ ఆదివారమే సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు టైముంది. హైకోర్టు మాల్యా అప్పీల్‌ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. విచారణకు స్వీకరిస్తే హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిస్థితులుంటాయి. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గతేడాది డిసెంబర్ 10న తీర్పు చెప్పింది. ఆ తీర్పు హోం శాఖకు చేరింది. కాగా, పాక్ సంతతికి చెందిన మంత్రుల్లో అత్యంత సీనియర్ అయిన జావీద్.. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు. కేసులోని అంశాలు, పరిస్థితులను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు సైతం మాల్యాకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం వల్లే తాను అప్పులు తీర్చలేక పోయానని మాల్యా గతంలో లండన్ కోర్టులో వాదించగా, అప్పు రూపంలో లభించిన డబ్బును మాల్యా అసలైన అవసరానికి వాడకుండా, పక్కదారి పట్టించాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గతంలో గుర్తించింది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయంపై భారతసర్కారు హర్షం వ్యక్తం చేసింది. అప్పీల్ చేసే పని ప్రారంభిస్తా: మాల్యా విజయ్ మాల్యా ఓ ట్వీట్ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే పనిని మొదలుపెడతానన్నాడు. ‘వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్ 10న తీర్పు వచ్చినప్పుడే, అప్పీల్‌కు వెళ్తానని నేను గతంలోనే చెప్పా. హోం మంత్రి దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో, ఇన్నాళ్లూ అప్పీల్ చేయలేకపోయా. ఇప్పుడు ఆ పని మొదలుపెడతా’ అని మాల్యా పేర్కొన్నాడు. మాట నిలుపుకుంటాం మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. మాల్యాను రప్పించడం ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రాబట్టి, దోషులను చట్టం ముందు నిలబెడతామంటూ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చనున్నామని తెలిపింది. ‘బ్యాంకులను మోసగించి పరారైన విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్విరామ కృషి ఫలితమిది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’ అని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కుంభకోణాలు, మోసాలకు చట్టబద్ధమైన ముగింపు తెచ్చేలా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు అవకాశం కల్పించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు తీసుకువచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసిందని మంత్రి జైట్లీ అన్నారు. -
కోర్టులంటే జోక్ అయిపోయింది!
హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టులంటే అధికారులకు జోక్ అయిపోయిందంటూ మండిపడింది. వచ్చే వారానికల్లా కౌంటర్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక అదనపు పీపీల నియామకానికి సంబంధించిన అన్ని రికార్డులను కూడా తమ ముందుంచాలంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు పీపీల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నఎల్సీ గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. -
మీడియాతో నరసింహన్ చమత్కారం
-
మీడియాతో నరసింహన్ చమత్కారం
న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఉదయం కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఏ అంశాలను హోం శాఖ కార్యదర్శితో మాట్లాడారన్న మీడియా ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలు చర్చించామని గవర్నర్ చమత్కరించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా గవర్నర్ భేటీ కానున్నారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు హోంశాఖ కార్యదర్శితో భేటీ అనంతరం గవర్నర్...కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అవుతారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగతున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు విబజన, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఉద్యోగుల విభజన తదితర అంశాలు ప్రస్తుతం కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ రాజ్‌నాథ్‌తో సమావేశం అవుతున్నారు. అలాగే అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రముఖలను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతోనే గవర్నర్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. -
హోంశాఖ కార్యదర్శితో తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
న్యూఢిల్లీ : కేంద్రం హోంశాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్‌తో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో గోయల్‌తో టీ సీఎస్ రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమావేశమయ్యారు. విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వివాదం, కమలనాథన్ కమిటీపై వారు గోయల్‌తో చర్చిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు ఉదయం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. విభజన పూర్తికాకముందే తమను ఉద్యోగాల నుంచి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం అన్యాయమని విద్యుత్ ఉద్యోగులు జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో రాష్ట్ర విభజన పంచాయతీ
-
లాటరీ ఉచ్చులో ఖాకీ
- అక్రమ దందా కింగ్పిన్తో పోలీసులకు సంబంధాలు! - రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న లాటరీ వ్యవహారం - ముఖ్యమంత్రితో భేటీ అయిన హోం శాఖ కార్యదర్శి - ప్రభుత్వాన్నే రద్దు చేయండి: హెచ్.డి.కుమారస్వామి సాక్షి, బెంగళూరు : అక్రమంగా నిర్వహిస్తోన్న సింగిల్ డిజిట్ లాటరీల దందా రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలనే సృష్టిస్తోంది. ఈ దందాలో ఉన్నత స్థాయిలోని పోలీసు అధికారులు సైతం భాగస్వాములయ్యారనే వార్త లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమ లాటరీల దందాలో కింగ్‌పిన్‌గా వ్యవహరించిన పారిరాజన్కు పోలీసు విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగంలో కలకలం రేగుతోంది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సీఐడీ కూడా ధ్రువీకరించింది. అక్రమ లాటరీల దందాలో కొంతమంది పోలీసు ఉన్నత అధికారులకు సంబంధాలున్నాయని మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీంతో ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాన్నే కుదిపేసే స్థాయికి చేరుకుంది. సిద్ధరామయ్య ఆరా సీఐడీ నుంచి మధ్యంతర నివేదికను తెప్పించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ దందాలో ఏయే అధికారులు భాగస్వామ్యులయ్యారే అంశంపై ఆరా తీస్తున్నారు. అక్రమ లాటరీల దందాలో రాష్ట్రానికి చెందిన ఓ ఐజీపీ, ఏడీజీపీతో పాటు కొంతమంది ఎస్పీ స్థాయి అధికారులు సైత ం భాగస్వామ్యులయ్యారని సీఐడీ తన మధ్యంతర నివేదికలో తేల్చినట్లు సమాచారం. ఇక కేజీఎఫ్‌కు చెందిన పారిరాజన్ను ఇప్పటికే ఎక్సైజ్, లాటరీ నిషేధ దళం అధికారులు సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పారిరాజన్ నుంచి మరింత మంది పేర్లను సేకరించే దిశగా సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీఐడీ తన మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేసిన నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఎస్.కె.పట్నాయక్ సిద్ధరామయ్యతో భేటీ అయ్యా రు. శనివారం సాయంత్రం బెంగళూరులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో ఎస్.కె.పట్నాయక్, సీఎం సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. అక్రమ లాటరీల దందా విషయంపై చర్చించారు. ప్రభుత్వాన్నే రద్దు చేయండి ఈ నేపథ్యంలో శాంతిభ ద్రతల రక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గవర్నర్‌ను కోరారు. శనివా రం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఆమ్ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అదనపు కమిషనర్ సస్పెన్షన్ సింగిల్ డిజిట్ లాటరీతో సంబంధం ఉందనే ఆరోపణలపై పశ్చిమ విభా గం అదనపు కమిషనర్ అలోక్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఉత్తర్వులు తన చేతికి అందేంతవరకూ ఈ విషయంపై స్పందించబోనని అలోక్‌కుమార్ మీడియాతో పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
నల్లగొండ కాల్పుల్లో గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య మరణం.. మూడు రోజుల కిందట ఇద్దరు సిమి ముష్కరుల హతం.. ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్.. వరంగల్ జిల్లాలో ఉగ్రవాది వికారుద్దీన్ సహా అతడి గ్యాంగ్‌ను పోలీసులు కాల్చిచంపడం.. గత వారంరోజులగా తెలుగు ప్రజలు సహా పోలీసులు, దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుచేస్తోన్న అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోందంటూ ఆరా తీసింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని గురించే చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లపై సత్వరమే నివేదిక పంపాలని హోం సెక్రటరీ గోయల్.. ఏపీ, తెలంగాణ డీజీపీలను ఆదేశించారు. చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు గవర్నర్ నరసింహన్‌కు వివరణ ఇచ్చారు. మృతులకు ఏపీ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. పలు తమిళపార్టీల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. -
గుర్రమే కాదు రౌతు కూడా మారాలి
ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం చేసే తప్పులలో తన ప్రమేయం లేదని ప్రభుత్వం తప్పించుకోలేదు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. అధికారులు, నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది. దేశ అధికార యంత్రాంగానికి ఇప్పుడు ‘ఫోన్’ అంటేనే వణుకు పుడుతోంది. శారదా కుంభ కోణం నిందితుల అరెస్టును ఆపాలని కోరుతూ సీబీఐ అధి కారులకు ఫోన్ చేసినందుకు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై వేటు పడటమే ఇందుకు కారణం. సీబీఐ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తే సహించేది లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత గంభీరంగా చెబుతున్నా... ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ప్రభుత్వం పనితీరు గొప్పతనాన్ని ఓటర్లకు చాటాలనే ఉద్దేశమే అసలు కారణమనే వాదనను కాదనలేం. ఏదేమైనా, గోస్వామి ఉదంతం అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు మధ్య సంబంధాలు, అధికారుల పనితీరులో, తప్పిదాల్లో నేతల పాత్ర, బాధ్యత ఎంత? అనే అంశాలను చర్చకు తెచ్చింది. ఇది ముదావహం. తన అధికారాల పరిధిని దాటడమే అనిల్ గోస్వామి తప్పయితే ఆయనపై వేటు ఎన్నడో పడాల్సింది. నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి హోదాలో ఆయన పలు రాష్ట్రాల గవర్నర్లకు ఫోన్లు చేశారు. ప్రభు త్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలని కోరారు. అలా గవర్నర్ల తో నేరుగా మాట్లాడటం తన అధికార విధుల్లో భాగ మేనని అప్పట్లో ఆయన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తన చర్యను సమర్థించుకున్నారు. ఆ సంద ర్భంగా బీజేపీ ప్రభుత్వం, గోస్వామిని సమర్థించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్లు మారడం సాంప్రదాయమని సూత్రీకరించింది కూడా. రాజకీయ నాయకత్వం అభీష్టానుసారమే గోస్వామి గవర్నర్ల రాజీనామాలు కోరారనేది స్పష్టమే. ‘‘ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అభీష్టం అనేది కేంద్ర మంత్రివర్గ సలహాపై ఆధారపడి ఉండేదే అయినా అది, అతడు లేదా ఆమెకు మాత్రమే చెందినది. దాని గురించి ఎలాంటి సమాచా రాన్ని చేరవేయడమైనా రాష్ట్రపతి కార్యాలయం నుంచి జరగాల్సిందే. ‘అభీష్టం’ బదలాయించగలిగినది కాదు.’’ ఇవి ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అన్న మాటలు. గవర్నర్ల కు రాజీనామాలు చేయాలనే సమాచారం అందించా ల్సింది రాష్ట్రపతి కార్యాలయం కాగా గోస్వామి ఆ పని చేసి, తన పరిధిని అతిక్రమించారు. అది తప్పుగా అప్ప ట్లో కేంద్రానికి కనిపించలేదు. ఇప్పుడు సీబీఐ అధికా రులతో ఫోన్లో మాట్లాడటమే తప్పుగా కనిపిస్తోంది. అధి కారంలోని నేతల ఆదేశాల మేరకు లేదా అభీష్టం మేరకు పనిచేసే అధికారుల తప్పొప్పులకు కొలబద్ధ నేతల ఇష్టా యిష్టాలు, విచక్షణ మాత్రమేనని అనుకోవాలి! ఈ సమస్య కొత్తదేమీ కాదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిందితుడు ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకు పోయినది నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, రాజీవ్‌గాంధీల అభీష్టం మేరకేననేది బహిరంగ రహస్యం. నిందితులు నిమిత్తమాత్రులైన జిల్లా అధికా రులా? లేక అసలు సూత్రధారులా? ఇలాంటి సందర్భాల్లో చర్య తీసుకోవాల్సింది ఎవరిపైన? ఈ చర్చ దశా బ్దాలుగా సాగుతోంది. మన పార్లమెంటరీ విధానం ప్రకా రం ప్రభుత్వ చర్యలకు కార్యనిర్వహణాధికారులే అంటే మంత్రులే బాధ్యులు. నెహ్రూ హయాంలో హరిదాస్, ముంద్రా కంపెనీల నుంచి ఎల్ఐసీ షేర్ల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయమేమీ లేదని, దానికి ఆర్థిక కార్యదర్శి హెచ్ఎమ్ పటేల్‌దే బాధ్యతని నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి చేసిన వాదన చెల్లలేదు. ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అలాగే గోవధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలకు అనుమతినిచ్చింది తాను కాదన్న నాటి హోం మంత్రి గుల్జారీలాల్ నందా వాదన చెల్లక రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ కార్య నిర్వాహకుల బాధ్యతను గుర్తు చేయడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అంతేగానీ అధికారులు చట్టాలకు అతీతులూ కారు. గోస్వామి ఫోన్ల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనీ కాదు. ప్రజా సేవలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా పని చేయాలనే అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. అయితే వారు ప్రభుత్వ విధానాలకు, నిర్ణయాలకు బద్ధులై పనిచేయాలి. వాటి పట్ల అభ్యంతరాలుంటే అసమ్మతి నోట్ ఇవ్వవచ్చు. ప్రభుత్వాలతో విభేదించి ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసిన శంకరన్ వంటి అధికారులెందరినో చూశాం. కానీ అశోక్ ఖేమ్కా ఉదంతం, సీబీఐ కేసుల పాలైన బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఉదంతం క ళ్లముందుండగా స్వతంత్రంగా ప్రజా సంక్షేమానికి తెగించేదెందరు? అవినీతి, అక్రమాల నుంచి బూటకపు ఎదురుకాల్పుల వరకు అధికార యంత్రాంగం పాత్ర లేదని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం తప్పులలో తమ ప్రమేయం లేదని మంత్రులు తప్పించుకోలేరు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. గుర్రమే కాదు రౌతు కూడా మారాలి. అధికారులే కాదు, వారిని శాసించే నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాహితం కోసం పని చేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది. (వ్యాసకర్త సామాజిక కార్యకర్త మొబైల్ నం: 9394486016) -
కేంద్ర హోం సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ గురువారం హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1979 కేరళ ఐఏఎస్ బ్యాచ్ అధికారి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో అంతర్గత భద్రత విభాగంగా సంయుక్త కార్యదర్శిగా గోయల్ విధులు నిర్వహించారు. అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామికి కేంద్ర సర్కార్ ఉద్వాసన తెలిపింది. దాంతో హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ నియమించాలని కేంద్రం బుధవారం రాత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. శారదా స్కాం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి మాతంగి సిన్హా అరెస్ట్ వ్యవహారంలో అనిల్ గోస్వామి జోక్యం చేసుకున్నారని... సీబీఐ.. ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) ఫిర్యాదు చేసింది. దాంతో పీఎంవో వెంటనే స్పందించి అనిల్ గోస్వామిని పదవి నుంచి తొలగించింది. దాంతో ఎల్ సీ గోయిల్ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు
-
కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు
న్యూఢిల్లీ: శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాతంగ్‌సిన్హ్ అరెస్ట్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల్లో చిక్కుకున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్గోస్వామికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. తొలుత ఆయనను తొలగించాలని నిర్ణయించినప్పటికీ.. గౌరవప్రదంగా తప్పుకునేందుకు అవకాశమిస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే.. స్వచ్ఛం దం పదవీ విరమణకు అవకాశమివ్వాలని గోస్వామి కోరడంతో.. సర్కారు నోటీసు కాలానికి మినహాయింపునిచ్చి వీఆర్ఎస్కు అనుమతించింది. దీంతో గోస్వామి బుధవారం రాత్రి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఎల్.సి.గోయల్(1979 బ్యాచ్ కేరళ కేడర్) హోంశాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించినట్లు రాత్రి పొద్దుపోయాక అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్నతస్థాయి అధికారిని పదవి నుంచి తొలగించటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఉదంతం. గత బుధవారం విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను ప్రభుత్వం అర్థంతరంగా తొలగించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ వద్ద అంగీకరించిన గోస్వామి.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాతంగ్‌సిన్హ్ అరెస్ట్ వ్యవహారంలో అనిల్‌గోస్వామి జోక్యం చేసుకోవటంపై అసంతృప్తిగా ఉన్న సీబీఐ.. గోస్వామి, సీబీఐలోని జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారుల మధ్య సాగిన వ్యవహారంపై ప్రధాని కార్యాలయానికి ఆదివారం నాడు ఒక నివేదిక సమర్పించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం రాజధాని ఢిల్లీకి తిరిగివచ్చిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అదే రాత్రి.. ఈ వ్యవహారంపై గోస్వామితో మాట్లాడారు. బుధవారం ఉదయం గోస్వామిని తన చాంబర్‌కు పిలిపించుకుని గంటసేపు సమావేశమయ్యారు. మాతంగ్‌ను సీబీఐ అరెస్ట్ చేయడానికి ముందు.. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులతో తాను మాట్లాడానని గోస్వామి రాజ్‌నాథ్ వద్ద అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సీబీఐ డెరైక్టర్ అనిల్సిన్హాను కూడా రాజ్‌నాథ్ తన చాంబర్‌కు పిలిపించి సమావేశమయ్యారు. సీబీఐ డెరైక్టర్ కూడా అనిల్‌గోస్వామితో వేరుగా భేటీ అయ్యారు. మొత్తం వ్యవహారంపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారని.. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవి నుంచి అనిల్‌గోస్వామిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వివరించాయి. తక్షణమే వీఆర్ఎస్ అమలు అనిల్‌గోస్వామిని పదవి నుంచి తొలగించినట్లు తొలుత వార్తలు వెలువడినప్పటికీ.. తానే గౌరవప్రదంగా వైదొలగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ.. రాజీనామా చేయాలని ఆదేశించిందని ఆ తర్వాత అధికార వర్గాలు వివరించాయి. అయితే.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు అవకాశమివ్వాలని గోస్వామి కోరారని.. దీంతో నోటీసు కాలం నుంచి మినహాయింపునిచ్చి ఆయన వీఆర్ఎస్ను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపింది. జమ్మూకశ్మీర్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్‌గోస్వామి.. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీకి ఆయనకు 60 ఏళ్ల వయసు నిండింది. అస్సాంకు చెందిన వివాదాస్పద నేత మాతంగ్‌సిన్హ్ ఆయనకు సన్నిహితులని చెప్తారు. మాతంగ్ పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. హోంశాఖ కార్యదర్శిగా గోస్వామి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూన్ వరకూ ఉన్నప్పటికీ.. మాతంగ్ అరెస్ట్ వ్యవహారంలో జోక్యంతో అర్థంతరంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
నరేంద్ర మోడీ భద్రతపై చర్చ
న్యూఢిల్లీ: బీజేపీ భావి ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమావేశమయ్యారు. మోడీ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సోమవారం గుజరాత్ భవన్‌కు వచ్చిన అనిల్ గోస్వామి.. మోడీ, ఇతర బీజేపీ నాయకులతో చర్చించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను మోడీకి ప్రమాణ స్వీకారానికి ముందే ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎన్నికైన వెంటనే ఎస్పీజీ భద్రత కల్పించే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడమిక లాంఛనమే. -
ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా
ముంబై/న్యూఢిల్లీ: ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీచైర్మన్ పదవికి జీకే పిళ్లై రాజీనామా చేశారు. 2008లో ఎక్స్ఛేంజీకి లెసైన్స్ లభించడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పిళ్లై రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్పట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చైర్మన్‌గా పనిచేసిన భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పిళ్లై రాజీనామాతో ఎక్స్ఛేంజీ చైర్మన్ పదవిని ఎల్ఐసీ మాజీ చైర్మన్, ఎక్స్ఛేంజీ వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ చేపట్టారు. వైస్‌చైర్మన్‌గా ఆషిహా గోయల్ నియమితులయ్యారు. పలు సవాళ్ల మధ్య తాను పదవిని చేపట్టానని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని పిళ్లై చెప్పారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీ నడుస్తుందని తెలిపారు. ఇకపై ఎక్స్ఛేంజీ సీఈవో సౌరభ్ సర్కార్ మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిళ్లైసహా నలుగురు సభ్యుల బోర్డును గతేడాది సెబీ నియమించిన విషయం విదితమే. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో బోర్డును సెబీ పునర్వ్యవస్థీకరించింది. అయితే ఎక్స్ఛేంజీకి చెందిన ట్రేడింగ్ సభ్యులు, వాటాదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇటు ప్రభుత్వం, అటు సెబీ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంసీఎక్స్ఎస్ఎక్స్లో ఐఎఫ్సీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. రైట్స్ ఇష్యూకి స్పందన ఒక షేరుకి రెండు షేర్ల నిష్పత్తిలో చేపట్టిన రైట్స్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ కొత్త యాజమాన్యం తెలిపింది. శనివారం నో ట్రేడింగ్ వ్యవసాయ కమోడిటీలలో శనివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) నిషేధించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల కమోడిటీలలోనూ అన్ని ఎక్స్ఛేంజీలూ శనివారం ట్రేడింగ్ నిర్వహించడాన్ని ఎఫ్ఎంసీ తాజాగా నిషేధించింది. ఎన్‌బీహెచ్‌సీ విక్రయం నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్(ఎన్‌బీహెచ్‌సీ)ను ఇండియా వ్యాల్యూ ఫండ్ ట్రస్టీకు రూ. 242 కోట్లకు విక్రయించనున్నట్లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తెలిపింది. వివిధ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ టెక్ ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు సంబంధించి లిస్టింగ్ ఒప్పందంలో భాగంగా ఎన్బీహెచ్సీను విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.5% పతనమై రూ. 361 వద్ద ముగియగా, ఎంసీఎక్స్ సైతం అదే స్థాయిలో దిగజారి రూ. 493 వద్ద నిలిచింది. -
''షిండే హోం మంత్రిగా పనికిరాడు''
''హోం మంత్రిగా సుశీల్ కుమార్ షిండే ఏమాత్రం పనికిరాడు. ఆయన కంటే ఆర్థికమంత్రి చిదంబరం వంద రెట్లు నయం''.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా నిన్న మొన్నటివరకు పనిచేసిన ఆర్.కె. సింగ్!! ఢిల్లీ పోలీసుల బదిలీలు, పోస్టింగులలో కలగజేసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలోను, దావూద్ ఇబ్రహీంను ఇండియాకు రప్పించడంలో అమెరికా సాయం చేస్తోందంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు షిండే రాజీనామా చేసే అవకాశముందా అని టీవీ చానళ్ల విలేకరులు ఆర్కే సింగ్‌ను ప్రశ్నించగా ఆయనీ ఘాటు సమాధానం ఇచ్చారు. హోం మంత్రిగా చిదంబరం వందరెట్లు నయమని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్కే సింగ్ చెప్పారు. దావూద్ ఇబ్రహీం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా దేశాన్ని తప్పుదోవ పట్టించారని షిండేపై విరుచుకుపడ్డారు. ఎఫ్‌బీఐ సమావేశాల్లో తాను కూడా పాల్గొన్నానని, కానీ తాము సాయం చేస్తామని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తనకు, షిండేకు భేదాభిప్రాయాలున్న విషయం ప్రధానమంత్రితో సహా అందరికీ తెలుసన్నారు. అయితే, రిటైరైన తర్వాత ఆర్కే సింగ్‌కు కొత్తగా ఉద్యోగం ఏదీ ఇవ్వలేదన్న దుగ్ధతోనే ఆయనీ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయణసామి అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆయనకు చాలా పత్రాల గురించి తెలుసని, ఎలాంటి ఆధారం లేకుండా అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షిండే మాటల మనిషి కాదు, చేతల మనిషని నారాయణసామి కితాబిచ్చారు. ఆర్కేసింగ్ పదవిలో ఉండగా ఈ ఆరోపణలు చేసి ఉంటే వాటికి విలువ ఉండేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.