
మీడియాతో నరసింహన్ చమత్కారం
న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఉదయం కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఏ అంశాలను హోం శాఖ కార్యదర్శితో మాట్లాడారన్న మీడియా ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలు చర్చించామని గవర్నర్ చమత్కరించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా గవర్నర్ భేటీ కానున్నారు.