
ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏమన్నారంటే..
- కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది
- నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏపీ తీసుకెళుతున్న అధిక జలాలను ఆపాలని కోరాం
- కేంద్రం అత్యవసర జోక్యం చేసుకుని అన్యాయాన్ని ఆపాలి
- ఏపీ తీసుకెళుతున్న పదివేల క్యూసెక్కుల నీటిని అయిదువేలకు తగ్గిస్తామని కేంద్రమంత్రి చెప్పారు
- ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మేము అభ్యంతరం చెప్పాం
- ఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని, ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం
- కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు ఎక్కువ నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరాం
- పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధులు ఇవ్వాలని అడిగాం
- కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలి
- టెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పాము
- ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు
- ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరాం
- మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి నివేదిక త్వరగా ఇవ్వాలని కోరాం
- తెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, నేను కేంద్రం వద్ద మా వాదన బలంగా వినిపించాం
- కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చింది
- దీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని కోరాం
- తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నాం
- ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించాం
- కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కోరాము
Comments
Please login to add a commentAdd a comment