న్యూఢిల్లీ : కేంద్రం హోంశాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్తో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో గోయల్తో టీ సీఎస్ రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమావేశమయ్యారు. విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వివాదం, కమలనాథన్ కమిటీపై వారు గోయల్తో చర్చిస్తున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు ఉదయం జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. విభజన పూర్తికాకముందే తమను ఉద్యోగాల నుంచి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం అన్యాయమని విద్యుత్ ఉద్యోగులు జంతర్మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.