ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు హోంశాఖ కార్యదర్శితో భేటీ అనంతరం గవర్నర్...కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం అవుతారు.
కాగా పార్లమెంటు సమావేశాలు జరుగతున్న తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు విబజన, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఉద్యోగుల విభజన తదితర అంశాలు ప్రస్తుతం కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ రాజ్నాథ్తో సమావేశం అవుతున్నారు. అలాగే అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రముఖలను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతోనే గవర్నర్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది.