
ఢిల్లీ పర్యటనలో గవర్నర్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీ పయనమయ్యారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవనున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.