కేంద్ర హోం సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ గురువారం హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1979 కేరళ ఐఏఎస్ బ్యాచ్ అధికారి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో అంతర్గత భద్రత విభాగంగా సంయుక్త కార్యదర్శిగా గోయల్ విధులు నిర్వహించారు. అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామికి కేంద్ర సర్కార్ ఉద్వాసన తెలిపింది. దాంతో హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ నియమించాలని కేంద్రం బుధవారం రాత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే.
శారదా స్కాం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి మాతంగి సిన్హా అరెస్ట్ వ్యవహారంలో అనిల్ గోస్వామి జోక్యం చేసుకున్నారని... సీబీఐ.. ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) ఫిర్యాదు చేసింది. దాంతో పీఎంవో వెంటనే స్పందించి అనిల్ గోస్వామిని పదవి నుంచి తొలగించింది. దాంతో ఎల్ సీ గోయిల్ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు.