బీజేపీ భావి ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమావేశమయ్యారు. మోడీ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
న్యూఢిల్లీ: బీజేపీ భావి ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమావేశమయ్యారు. మోడీ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సోమవారం గుజరాత్ భవన్కు వచ్చిన అనిల్ గోస్వామి.. మోడీ, ఇతర బీజేపీ నాయకులతో చర్చించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ను మోడీకి ప్రమాణ స్వీకారానికి ముందే ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎన్నికైన వెంటనే ఎస్పీజీ భద్రత కల్పించే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడమిక లాంఛనమే.