లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది.
The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V
— IndiaToday (@IndiaToday) September 23, 2023
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు.
నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది.
ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే
Comments
Please login to add a commentAdd a comment