cricket stadium
-
బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్
సాక్షి, అమరావతి: మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. కాస్త తీరిక.. కొద్దిగా ఖాళీ ప్రదేశం దొరికితే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెటర్లు అయిపోతుంటారు. బ్యాట్, బాల్‌తో తమ ప్రతాపం చూపిస్తుంటారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో నగరాల్లో ఖాళీ స్థలాలు కనుమరుగైపోయి క్రికెట్ ఆడుకోవడానికి కొద్దిపాటి స్థలం కూడా లేకుండా పోతోంది. ఈ సమస్యకు పరిష్కారంలా ‘బాక్స్ క్రికెట్’ (box cricket) పుట్టుకొచ్చింది. వయసుతో పాటు ఆడ, మగ అనే సంబంధం లేకుండా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాస్త సమయం దొరికితే.. వెంటనే ‘బాక్స్ క్రికెట్’లో వాలిపోతున్నారు. ఆదరణ పెరుగుతుండటంతో రాష్ట్రంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి.బిజినెస్ రూపంలో కూడా ‘బాక్స్ క్రికెట్’ విజయవంతంగా కొనసాగుతోందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. 300 గజాలకు పైగా స్థలం ఉంటే చాలు.. ఇళ్ల మధ్యలో అయినా బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేయొచ్చు. సొంత స్థలం ఉంటే మరీ మంచిది. ఆ స్థలం ఇనుప కడ్డీలు పాతి బాక్స్ మాదిరిగా ఫ్రేమ్ సెట్ చేయాలి. బాల్ బయటకు పోకుండా చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలి. కిందపడినప్పుడు దెబ్బలు తగలకుండా.. నేలపై గ్రాస్ కార్పెట్ పరచాలి. రాత్రి సమయంలో కూడా క్రికెట్ ఆడుకునే విధంగా ఫ్లడ్‌లైట్ల సదుపాయం కల్పించాలి. రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. గల్లీ క్రికెట్ మాదిరే..బాక్స్ క్రికెట్లో బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించవచ్చు.. బాల్‌ను గింగిరాలు తిప్పవచ్చు. అలాగే చుట్టూ నెట్ ఉండటం వల్ల బాల్ కోసం ఎక్కువ దూరం పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. బాక్స్ క్రికెట్ రూల్స్ అన్నీ.. గల్లీ క్రికెట్ మాదిరిగానే ఉంటాయి. బాల్ నేరుగా నెట్‌కు తగిలితే సిక్స్.. స్టెప్లు పడుతూ వెళ్లి నెట్‌కు తగిలితే ఫోర్.. సింగిల్స్, డబుల్స్, రనౌట్లు.. అన్నీ సేమ్ టూ సేమ్. ఊరికి కాస్త దూరంగా ఉంటే తక్కువ చార్జీ, నగరం మధ్యలో ఉంటే కాస్త ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. గంట సమయం ఆడుకోవాలంటే సుమారు రూ.600 నుంచి రూ.1,000 వరకు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.బ్యాట్, బాల్, వికెట్లు నిర్వాహకులే అందజేస్తారు. ఎండ దెబ్బ కూడా తగలకుండా పైన గ్రీన్ మ్యాట్‌ను వేస్తున్నారు. మంచినీరు, కూల్‌డ్రింక్స్, కేఫ్ వంటి వసతులు అందుబాటులో ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11 గంటల వరకు ఆడుకునే అవకాశం ఉండటంతో అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ తీరిక సమయాల్లో బాక్స్ క్రికెట్ ఆడుతూ సేదతీరుతున్నారు. అలాగే ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలనుకునేవారికి శిక్షణ ఇచ్చేందుకు కూడా కొన్ని బాక్స్ క్రికెట్ క్లబ్‌ల వద్ద కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.ఎవరైనా ఆడుకోవచ్చుబాక్స్ క్రికెట్‌కు ఏ వయసు వారైనా రావచ్చు. పెద్ద వారు చాలా మంది వస్తున్నారు. సరదాగా ఆడుకుని వెళుతుంటారు. అలాగే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలనుకునే 20 ఏళ్లలోపు వారికి శిక్షణ కూడా ఇస్తుంటాం. ముంబై నుంచి వచ్చిన కోచ్‌తో పాటు మొత్తం ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడటానికి వస్తున్నారు. – గుత్తుల ఫణీంద్రబాబు, మేనేజర్, భారత్ బెస్ట్ స్పోర్ట్స్ క్లబ్, విజయవాడసెల్ఫోన్కు దూరం..మా ఇద్దరు పిల్లల్ని రోజూ రెండు గంటల పాటు బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి పంపిస్తున్నాను. మా పెద్దబాబు బరువు కూడా తగ్గి ఆరోగ్యంగా ఉన్నాడు. అలాగే సెల్‌ఫోన్ అలవాటుకు కూడా దూరమవుతున్నారు. – అరవింద్, ఆటోనగర్ఇష్టంతో వస్తున్నా..నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొన్ని నెలలుగా బాక్స్ క్రికెట్ ఆడుతున్నాను. – తులసీ మాధవ్, మాచవరం -
బీసీసీఐతో మాట్లాడాం.. తెలంగాణలో మరో క్రికెట్ స్టేడియం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక స్టేడియంపై ఏర్పాటుపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో క్రీడాకారులకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో లేని విధంగా రూ.361 కోట్లను స్పోర్ట్స్ కోసం కేటాయించాడం జరిగింది. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నాం. బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. చదువులోనే కాదు.. క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది.ఇక, వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తాం. హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. అందుకు మీ అందరి మద్దతు కోరుతున్నా. మండలానికి ఒక మినీ స్టేడియం ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్నారు. బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిపామన్నారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ స్టేడియానికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు. ఇప్పటికే స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరినట్టు చెప్పుకొచ్చారు. క్రీడాకారులకు కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. -
రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు)
-
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..!
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. As a sports and cricket enthusiast, I would like to add one more promise to our election manifesto for #Elections2024: 🏏🏟️ We will take efforts to establish a state-of-the-art cricket stadium in Coimbatore, with the active participation of the sports loving people of… https://t.co/B6rpHJKSBI — M.K.Stalin (@mkstalin) April 7, 2024 క్రికెట్ ఔత్సాహికుడినైన నేను #Elections2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, తమిళనాట ఇదివరకే ఓ అంతర్జాతీయ స్టేడియం (చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం) ఉందన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది సొంత మైదానం. 1916లో స్థాపించబడిన చిదంబరం స్టేడియం దేశంలో రెండో పురాతన క్రికెట్ స్టేడియం. -
విశాఖలో ఐపీఎల్ సందడి..అడుగుపెట్టిన DCvsCSK జట్లు (ఫొటోలు)
-
IPL 2024: విశాఖ చేరిన ఆటగాళ్లు.. రేపు ఢిల్లీతో సీఎస్కే మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐపీఎల్లో భాగంగా తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ), చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్లకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు జట్ల సభ్యులు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్ వెళ్లారు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో ఆది వారం ఇరు జట్లు తలపడనుండగా.. శనివారం ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ మినహా హోం గ్రౌండ్ జట్లే విజయకేతనం ఎగురవేస్తున్నాయి. డీసీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. డీసీ విశాఖను తొలి సెషన్ మ్యాచ్‌లకు హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లను హోం గ్రౌండ్‌లోనే ఆడి గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇదే ఊపును సీఎస్కే కొనసాగిస్తుందా లేక హోం గ్రౌండ్ సెంటిమెంట్‌తో డీసీ గెలుపునకు శ్రీకారం చుడుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్‌కు అంతా సిద్ధం విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 31న డీసీతో తలపడే సీఎస్కే మ్యాచ్‌కు వైఎస్సార్ స్టేడియం సిద్ధమైందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీస్ అధికారుల సహకారంతో బీసీసీఐ నిబంధనల మేరకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో నాలుగేళ్లలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడంతోనే ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో క్రీడాకారులు, మ్యాచ్ నిర్వహణ సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. -
క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి స్టేడియాన్ని ఊపేసిన హీరో!
మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ క్రికెట్ లీగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలోనే హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అంతే కాదు.. తనతో పాటు టీమ్‌లో చేరాలంటూ ట్విటర్ వేదికగా చెర్రీ పిలుపునిచ్చారు. తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్టేడియంలో సందడి చేశారు. చీర్ లీడర్స్‌తో కలిసి నాటు నాటు సాంగ్‌కు కాలు కదిపారు. చరణ్ డ్యాన్స్ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సచిన్, సూర్య, అక్షయ్ కుమార్, రవిశాస్త్రితో కలిసి మరోసారి స్టెప్పులు వేశారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీకి చెర్రీకి జంటగా కనిపించనుంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Sachin, Ram Charan, Suriya, Akshay Kumar doing the "Naatu Naatu" step in the inaugural function of ISPL. 🔥pic.twitter.com/d6YORP0JL8 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 #RamCharan 🤝 #Suriya for @ispl_t10 Opening Ceremony !!@AlwaysRamCharan @Suriya_offlpic.twitter.com/spCjejkRC3 — Raees (@RaeesHere_) March 6, 2024 Man Of Masses @AlwaysRamCharan 🦁👑 Joins With a NAATU NAATU 🕺STYLE the Opening Ceremony Of @ispl_t10 at Dadoni Kondadev Athletics Stadium 📸✨💥🔥 In Frame Master #SachinTendulkar#Ravishastri ❤☺🤩#GameChanger #RamCharan 🦁👑🌟 pic.twitter.com/tNnUUwFCnN — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) March 6, 2024 -
విశాఖలో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిం చనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న వైఎస్సార్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 27 వేల లోపు ఉందని, క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మరో ప్రపంచ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తున్నామని, దానికి త్వరలోనే శంకుస్థాన చేస్తామని తెలిపారు. విశాఖ స్టేడియంలోని బి గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఏసీఏ క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి జోన్‌కు ఒక స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ రూ.10 కోట్లతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు కేసులు పరిష్కరించి, ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడు జోన్లలోనూ ఏపీఎల్ మ్యాచ్‌లు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండు సీజన్లు విజయవంతమయ్యాయని, మూడో సీజన్‌ను విశాఖ, విజయవాడ, కడపలో మూడు జోన్లలోనూ నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఎల్ ద్వారా ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వచి్చ, ఐపీఎల్ జట్లలో స్థానం సంపాదించారన్నారు. దేశంలో తొలిసారిగా మహిళా ఏపీఎల్ నిర్వహణతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ఉమెన్ ఏపీఎల్ స్ఫూర్తితోనే బీసీసీఐ ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలోనే ఏకైక మహిళా క్రికెట్ అకాడమీ ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అండర్–14 ఇంటర్ క్లబ్ క్రికెట్ లీగ్‌లు ప్రారంభించామని, త్వరలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్ క్రికెట్ లీగ్‌లు నిర్వహిస్తామన్నారు. సుమారు 20 వేల మంది యువ క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించేలా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్‌లో శిక్షణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ జట్టులో చోటు సంపాదించేలా ప్రతిభ గల క్రీడాకారులకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో వరల్డ్ క్లాస్ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. క్రికెటర్లతో పాటు కోచ్‌లకు కూడా ఆటలో మెళకువలు, ఫిట్నెస్ కోసం భారత జట్టు మాజీ కెపె్టన్ రవిశాస్త్రి, మాజీ బౌలింగ్ కోచ్ శేఖర్ భరత్‌కు చెందిన ‘కోచింగ్ బియాండ్’ సంస్థతో ఏసీఏ ఒప్పందం చేసుకుందన్నారు. అకాడమీలు, కోచింగ్ క్యాంప్‌లలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పౌష్టికాహారం కోసం ఇంటి దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నెలకు రూ.3 వేల చొప్పున 400 మంది క్రికెటర్లకు ఏటా రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీఏ సిబ్బందితో పాటు క్రికెటర్లకు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. బీసీసీఐ పరిధిలోకి రాని రంజీ మాజీ క్రికెటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.90 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆర్.వి.చంద్రమౌళి చౌదరి, సీఈవో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో KA పాల్
-
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
-
వైజాగ్‌లో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు. -
ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది. The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V — IndiaToday (@IndiaToday) September 23, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది. ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే -
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన
-
విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యత
విశాఖ: భారత్ హోం సిరీస్‌లో విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిచ్చిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌తో తలపడనున్నాయని తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. వరల్డ్ కప్ వ్యచ్లు ముగియగానే ఆస్ట్రేలియా ఆడనున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 23న, ఫిబ్రవరి 2 నుంచి భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసిందని వివరించారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియం ఇప్పటికే అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిందని, ఇటీవల సీఎం జగన్ విశాఖలో మరో స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలు ఆడుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 25 ఎకరాల్లో నిర్మించాలన్నారు. దీనిపై ఏసీఏ ప్రణాళిక సిద్ధం చేస్తుందని, స్థల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గోపీనాథ్ రెడ్డి తెలిపారు. చదవండి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్
ఏషియన్ గేమ్స్ 2023కి ఈసారి చైనా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. ఈసారి గేమ్స్‌లో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ టీమిండియా పరుషుల, మహిళల జట్లను పంపనుంది. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్లను ప్రకటించింది. పురుషుల జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుంది. ఇక చైనాలో క్రికెట్ ఆడడం చాలా తక్కువ. అక్కడి వాళ్లు ఎక్కువగా ఇండోర్ గేమ్స్ సహా ఇతర క్రీడలు ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే చైనాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు లేవు. ఉన్నా ఏదో మొక్కుబడిగా నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడంతో హాంగ్జూ నగరంలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. మాములుగా క్రికెట్ ఆడే మైదానాలు గుండ్రంగా ఉండడమే లేదంటే కాస్త స్క్కేర్ షేప్‌లో ఉండడం చూస్తాం. కానీ ఆసియా గేమ్స్ కోసం హాంగ్ఝౌలో నిర్మించిన క్రికెట్ స్టేడియం కాస్త వింతగా అనిపిస్తుంది. హాకీ మైదానాన్ని తలపించేలా ఉన్న స్టేడియంలో స్ట్రెయిట్స్ ఎక్కువ దూరం ఉంటే.. ఆఫ్‌సైడ్, లెగ్ సైడ్ బౌండరీలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియం షేపు వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి. హాంగ్జూలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఇక ఐదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఏషియన్ గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి. The Cricket Stadium for Asian Games in Hangzhou, China. Massive Score on Cards..! pic.twitter.com/38AgLsZP6U — Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023 చదవండి: Lionel Messi: సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ -
అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..!
దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్విల్లేలోనే జన్మించాడు. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు. ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు హాంకాంగ్, పాపువా న్యూ గినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు అఖరిలో ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
సెంట్రల్ జైలు స్థలాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించండి
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 200 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 1999లో ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి నాటి సీఎం చంద్రబాబు శిలాఫలకం వేశారని, అప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత పాలన చేపట్టిన వైఎస్సార్ హయాంలో సెంట్రల్ జైలులోని సువిశాల స్థలంలో పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రతిపాదన చేశారని చెప్పారు. అది సాకారమవుతున్న సమయంలో ఆయన మృతి చెందడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయిందన్నారు. అప్పట్లో స్టేడియం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ జైలు శాఖ ఇచ్చిన ఉత్తర్వుల నకలును కూడా లేఖకు జత చేశారు. -
అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్
ఐపీఎల్ జట్టైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ సంబంధిత వ్యాపారంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. త్వరలోనే ఓ భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. భారీ వ్యయంతో, సుమారు పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో (15 ఎకరాల విస్తీర్ణంలో), అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రాంతంలో (ఐర్విన్ సిటీ) నిర్మించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టాడు. 🚨 STADIUM NEWS 🚨 Plans are underway to build an iconic home for cricket in the Greater Los Angeles metropolitan area! "MLC venue in Southern California takes significant step forward with Great Park in the City of Irvine" 👉 https://t.co/WLUigjldoU 👈 #buildamericancricket pic.twitter.com/BKo9CGKpGq — Major League Cricket (@MLCricket) April 29, 2022 మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) తో కలిసి అతను సహా యజమానిగా ఉన్న నైట్‌రైడర్స్ గ్రూప్ (కేఆర్జీ) ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ మేరకు ఎంఎల్సీ-కేఆర్జీల మధ్య ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కింగ్ ఖాన్ ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇదే విషయమై బాద్షా స్పందిస్తూ.. అమెరికాలో రాబోయే రోజుల్లో క్రికెట్ వ్యాప్తి పెరుగుతుందనే నమ్మకంతో ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నామని తెలిపాడు. చదవండి: ఫాస్టెస్ట్ డెలివరీ వేసింది అక్తర్ కాదు, నేనే.. అప్పట్లో మిషన్లు పని చేయక..! -
ఆ మ్యాచ్‌కు "స్టేడియం ఫుల్"గా అనుమతివ్వండి.. బీసీసీఐ విజ్ఞప్తి
BCCI Requests To Have Full Capacity Spectators For T20 World Cup Final Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నవంబర్ 14న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యం( 25 వేలు) మేరకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐతో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు యూఏఈ ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆతిధ్య దేశం అనుమతి తప్పనసరి కావడంతో బీసీసీఐ, ఈసీబీలు ఎమిరేట్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కరోనా కారణంగా మెగా టోర్నీ నిర్వహణ భారత్ నుంచి యూఏఈకి తరలిపోయినప్పటికీ.. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐతోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనతో పాటు 48 గంటల వ్యవధిలో చేయించుకున్న నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్‌ను తప్పనిసరి చేశారు. కాగా, అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం మొదలుకానుంది. ఆ మరుసటి రోజు( అక్టోబర్ 24న) దాయాదుల(భారత్, పాక్) మధ్య రసవత్తర పోరు జరుగనుంది. చదవండి: టీమిండియాకు 'ఆ చాణక్య బుర్ర' తోడైతే.. -
ప్రపంచపు అతిపెద్ద స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ భారీ ఆర్ధిక సాయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని జైపూర్ పరిసరాల్లో నిర్మించేందుకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 75 వేల మంది సీటింగ్సామర్థ్యంతో నిర్మంచ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ.100 కోట్ల భారీ అర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్తర్వాత మూడో అతిపెద్ద నిర్మాణంగా ఈ స్టేడియం నిలవనుంది. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ఆర్సీఏ లీజుకు తీసుకుంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. జైపూర్శివారులో చోప్గ్రామంలో ఈ మైదానాన్ని నిర్మంచనున్నట్లు ఆర్సీఏ అధికారులు తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్సీఏ.. మిగతా నిధులను కార్పొరేట్బాక్స్ల విక్రయం ద్వారా సమీకరించనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి వసతులతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనున్నట్లు ఆర్సీఏ పేర్కొంది. ఇందులో ఇండోర్‌గేమ్స్, శిక్షణ అకాడమీలు, క్లబ్ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్ గ్రౌండ్లు నిర్మించనున్నట్లు తెలిపింది. స్టేడియం నిర్మాణ పనులను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభిస్తామని, రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం మొత్తాన్ని పూర్తి చేస్తామని ఆర్సీఏ వెల్లడించింది. కాగా, ప్రపంచపు అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాను రూ.800 కోట్లు వచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ లక్షా 10 వేలు. 1,00,024 సామర్థ్యంతో అప్పటిదాకా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును మొతేరా మైదానం బద్దలు కొట్టింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మైదానాల విషయానికొస్తే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మేడే స్టేడియం అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో మొతేరా మైదానం ఉంది. -
రికార్డులకెక్కిన ‘షర్మస్’ క్రికెట్ స్టేడియం
సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్’ ఆకారంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్ షర్మస్.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు. ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తూ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్కు మెడల్, సర్టిఫికెట్ పంపారు. ఈ డెమాతో షర్మస్ పలు రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్ హక్కును కూడా పొందాడు. మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ కమ్ కాలేజీ కరస్పాండెంట్ రవికుమార్ అభినందించారు. స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. ► క్రికెట్ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్) ఆడాలి. ► షర్మస్ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. ► వర్షం వస్తే మ్యాచ్ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. ► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్. ► హీటింగ్ ప్యాడ్స్ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. ► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఏర్పాటు. ► లోయర్ కంపార్ట్మెంట్, మిడిల్ కంపార్ట్మెంట్, అప్పర్ కంపార్ట్మెంట్ల ఏర్పాటు. ► మిడిల్ కంపార్ట్మెంట్ ఫైబర్ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్. ► పైభాగంలో ప్రొటెక్టివ్ వాల్ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్ చేయాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మెయిల్లో కూడా అప్లోడ్ చేశారు. – మనేగర్ షర్మస్ -
మోదీ స్టేడియంగా మారిన మొతేరా
-
మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం
-
నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
అహ్మదాబాద్: కొత్తగా నిర్మించిన స్టేడియానికి కొత్త పేరు పెట్టారు. ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్ పేరుతో ఉన్న మైదానానికి ఉక్కు సంకల్పంతో అడుగువేసే భారత ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం’గా మార్చారు. అయితే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించేదాకా పేరు మార్పుపై గోప్యత పాటించారు. లాంఛనంగా ప్రారంభించాక రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానం భారత్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు 90 వేల సీట్ల సామర్థ్యమున్న మెల్బోర్న్ స్టేడియంను చూశానని... అదే అప్పుడు అతిపెద్ద మైదానమని ఇప్పుడు అతిపెద్ద స్టేడియానికి భారత్ వేదికయిందని కోవింద్ వివరించారు. మోదీ పేరెందుకంటే... గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ)లో భాగమైన ఈ స్టేడియం కాబట్టి అంతా సర్దార్ పటేల్ పేరుతోనే కొత్తగా ముస్తాబైందనుకున్నారు. బుధవారం జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో నూతన సర్దార్ పటేల్ స్టేడియంలోనే పింక్‌బాల్ టెస్టు అనే రాశారు. కానీ రాష్ట్రపతి ఆవిష్కరించే సరికి ఇది మోదీ మైదానమని బయటపడింది. ఇది ఇప్పటి ప్రధాని, ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని స్టేడియాల్ని తలదన్నేలా ఓ ఎవరెస్ట్ అంతటి క్రికెట్ మైదానాన్ని నిర్మించాలనే సంకల్పంతో మోదీ పునాదిరాయి వేశారు. ఆఖరిదాకా అదే సంకల్పంతో పూర్తి చేశారు కాబట్టే మోదీ స్టేడియంగా మన ముందుకొచ్చింది. సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్... మోదీ స్టేడియం ఆవిష్కరించినప్పటికీ సర్దార్ పటేల్ నామఫలకం కనుమరుగేం కాలేదు. ఎందుకంటే 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలోనే ‘ది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్’కు రాష్ట్రపతి భూమిపూజ చేశారు. ఇందులో ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్‌టెన్నిస్ తదితర స్టేడియాలను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్నారు. అధునాతన సదుపాయాలతో బహుళ క్రీడా మైదానాల సముదాయంగా సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు అంతర్జాతీయ స్థాయి మెరుగులు దిద్దనున్నారు. అందుకే ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు అహ్మదాబాద్ క్రీడానగరిగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. When I went to Australia in Nov 2018, I learnt that 90,000-seater Melbourne Cricket Ground was the largest in world. It is a proud moment for India today that Motera's 1,32,000-seater stadium has become the world's largest cricket stadium: President Ram Nath Kovind in Ahmedabad pic.twitter.com/p7IoBsHjyf — ANI (@ANI) February 24, 2021 Coupled with Sardar Vallabhbhai Patel Sports Enclave & Narendra Modi Stadium in Motera, a sports complex will also be built in Naranpura. These 3 will be equipped to host any international sports event. Ahmedabad to be known as the 'sports city' of India: Union Home Min Amit Shah pic.twitter.com/4qkn4gBs04 — ANI (@ANI) February 24, 2021 -
ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి
న్యూఢిల్లీ : ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డీడీసీఏ నిర్ణయంపై భారత స్పిన్ దిగ్గజం ,బిషన్ సింగ్ బేడీ మండిపడ్డారు. తన నిరసనను తెలుపుతూ డీడీసీఏ ప్రస్తుత అధ్యక్షుడు, అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని లేఖలో వ్యాఖ్యానించిన ఆయన క్రికెటర్ల కన్నా ఎక్కువగా పాలకులను ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కోట్లా స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండుకు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. అంతేకాకుండా డీడీసీఏలో తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నానని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు బేడీ అందించిన సేవలకు గుర్తింపుగా 2017లో ఆయన పేరుతో స్టాండును ఏర్పాటు చేశారు. ఈ లేఖపై స్పందించేందుకు డీడీసీఏ విముఖత వ్యక్తం చేసింది. -
సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సుదీర్ఘ కాలంగా మైదానంలో ఉన్న వైరంపై సాగిన చర్చలోనే వారిద్దరి మధ్య పరిచయం, ఆపై స్నేహం మొదలైంది. అది అలా పెరిగి ప్రేమగా మారింది. అయితే తర్వాతి అడుగు వేసేందుకు ఇద్దరూ వెనుకాడుతున్న వేళ... అబ్బాయే కాస్త చొరవ చూపించాడు. పెళ్లి ప్రతిపాదన చేసేందుకు తాము ఇష్టపడే క్రికెట్ స్టేడియంకంటే సరైన వేదిక... అందులోనూ భారత్–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మించిన సందర్భం ఏదీ లేదని భావించాడు. అందుకే వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మోకాలిపై కూర్చొని తన మనసులో భావాన్ని వెల్లడించాడు. అటు గ్యాలరీల్లో ప్రేక్షకులు, ఇటు టీవీల్లో లక్షల మంది చూస్తుండగా అమ్మాయీ ‘ఎస్’ అనేసింది. క్రికెటర్లు మొదలు కామెంటేటర్ల వరకు అందరూ ఆ జోడీని అభినందిస్తూ ఆశీర్వదించారు! బెంగళూరుకు చెందిన దీపేన్ మాండలియా ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే జెట్‌స్టార్ సంస్థలో ప్రాజెక్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మెల్‌బోర్న్‌కే చెందిన రోజ్ వింబుష్‌ని అతను ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. ‘ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది కానీ నాకు అంతకంటే సరైన సమయం లేదనిపించింది’ అని దీపేన్ చెప్పగా... ‘నిజంగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయా. కానీ ఇది నన్ను చాలా ఆనందంలో ముంచెత్తింది’ అని రోజ్ స్పందించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరి ఫోన్లు ‘కంగ్రాట్స్’ మెసేజ్‌లతో హోరెత్తిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. బీసీసీఐ ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమానికి ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రంప్ పర్యటన నేపథ్యంలో మైదానాన్ని నిర్వహకులు అత్యంత సుందరంగా తీర్చదిద్దారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం రికార్డును బ్రేక్ చేస్తూ.. అత్యంత విశాలమైన స్టేడియంగా మొతేరా స్టేడియం నిర్మితమైంది. #MoteraStadium gearing up for #NamasteTrump !! Witness the world's biggest cricket stadium host the oldest and biggest democracies of the world! Watch all the action only on @DDNewslive @DDNewsHindi @DDIndialive @PBNS_India @shashidigital @Chatty111Prasad pic.twitter.com/q2Wevmd72Z — Meghna Dev (@DevMeghna) February 18, 2020 -
కెమ్ ఛో ట్రంప్!
అహ్మదాబాద్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరాలో ప్రధాని మోదీ, ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్?’ అని అర్థం. గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ఇది జరగనుంది. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) స్నైపర్ బలగాలను మోహరించనుంది. ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి. 22 కిలోమీటర్ల రోడ్ షో ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్ అధికారులు, 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం, అటునుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షోలో ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నాం. అమెరికా సీక్రెట్ సర్వీస్ దళాలతోపాటు నిఘా విభాగం, సీక్రెట్ సర్వీస్ పోలీసులు నిఘాలో పాలుపంచుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేసిన కొత్త అతిథులను, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం. రోడ్ షోతోపాటు స్టేడియం వద్ద అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేసి, సహకరించాలి’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ ప్రజలను కోరారు. ఫేస్బుక్ ఇచ్చిన గౌరవం: ట్రంప్ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తనకు తొలిస్థానం, మోదీకి రెండో స్థానం ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో ప్రకటించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్..ఫేస్బుక్ తనకు మొదటి స్థానం, భారత ప్రధాని మోదీకి రెండో స్థానం ఇవ్వడాన్ని ప్రస్తావించారు.మోదీ ఫేస్బుక్ ఖాతాలో 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2.75 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. లైక్‌ల దృష్ట్యా చూసినా ఇద్దరి మధ్య అంతరం భారీగా∙ఉంది. మోదీకి 4.45 కోట్ల లైక్‌లు వస్తుండగా, అందులో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 2.6 కోట్లు ట్రంప్‌కు వస్తుంటాయి. రూ.800 కోట్లతో.. అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు. నూతనంగా నిర్మించిన స్టేడియంలోని సుమారు 1.20 లక్షల మంది ప్రజలు, ప్రముఖులు వారికి స్వాగతం పలుకుతారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ చెప్పారు. ‘ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా తిరిగి నిర్దేశిత మార్గాల్లో వెళ్లిపోతారు. స్టేడియం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి’ అని ఆయన తెలిపారు.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో కూడా ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి అతిథులకు స్వాగతం పలకనున్నారు. ఈ మార్గంలో సాంస్కృతిక ఘనతను చాటే పలు చిత్రాలను ఏర్పాటు చేశారు. -
అతిపెద్ద క్రికెట్ స్టేడియం సిద్ధం..
అహ్మదాబాద్: ఇప్పటివరకూ వరల్డ్‌లో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మరికొద్ది రోజుల్లో రెండో స్థానానికే పరిమితం కానుంది. భారత్‌లోని అహ్మదాబాద్ నగరంలో నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఇక నుంచి ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం కానుంది. అహ్మదాబాద్‌లోని కొత్త క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడంతో వచ్చే ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు షురూ చేశారు. దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు. దాంతో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లక్ష కెపాసిటీని అహ్మదాబాద్ నూతన స్టేడియం అధిగమించనుంది. ఇందులో 70 కార్పోరేట్ బాక్స్‌లను, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మరొకవైపు ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్ పూల్ సైతం ఇందులో ఉంది. 2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించగా పూర్తి కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది. అంతకుముందు ఇక్కడ ఉన్న సర్దాల్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ మ్యాచ్ జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసియా ఎలెవన్-వరల్డ్ ఎలెవన్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో భారత్‌లో అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ ఉండేది. దాని కెపాసిటీ సుమారు లక్ష కాగా, ప్రధాన బిల్డింగ్ పునః నిర్మాణంలో దాన్ని 66 వేలకు తగ్గించారు. -
అనంతపురంలో క్రికెటర్ గిల్‌క్రిస్ట్ సందడి
-
అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్‌క్రిస్ట్
సాక్షి, అనంతపురం: భారత్‌తో క్రికెట్‌కు ప్రోత్సాహం బాగుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన జట్లకు టీమిండియా ప్రమాదకరంగా మారిందన్నారు. ఆసీస్ జట్టు ఆటతీరుపై స్పందిస్తూ.. సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయని, ఫీల్డింగ్‌లో కాస్త తడబాటు ఉందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తదితరులు ఉన్నారు. కాగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్‌క్రిస్ట్ ఇక్కడికి వచ్చారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇదే కానుంది..!
గాంధీనగర్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ పట్టణంలో గల మోటేరా స్టేడియం అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. త్వరలోనే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు దక్కించుకోబోతుందంటూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నథ్వాని ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ స్టేడియం విస్తరణ పనులు చేపట్టారని.. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా నిలవనుందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిమల్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. మెల్బోర్న్ కంటే పెద్ద స్టేడియాన్ని అహ్మదాబాద్‌లోని మోటేరాలో నిర్మిస్తున్నాం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలల ప్రాజెక్ట్ అయిన ఈ మైదానం పూర్తయితే యావత్ దేశానికి కీర్తి తీసుకోస్తుందం’టూ పరిమల్ ట్వీట్ చేశారు. 2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. దాదాపు 49వేల మంది ఈ మైదానంలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ వెస్టిండిస్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. World's Largest Cricket Stadium, larger than #Melbourne, is under construction at #Motera in #Ahmedabad,#Gujarat. Once completed the dream project of #GujaratCricketAssociation will become pride of entire India. Sharing glimpses of construction work under way. @BCCI @ICC #cricket pic.twitter.com/WbeoCXNqRJ — Parimal Nathwani (@mpparimal) January 6, 2019 -
వాజ్‌పేయీ కోసం మరోటి కట్టుకోండి..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో క్రికెట్ స్టేడియం పేరు మార్చడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హయాంలో రూపుదిద్దుకున్న ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చిన విషయం తెలిసిందే. మంగళవారం భారత్-వెస్టిండీస్ టీ-20 మ్యాచ్‌కు ఒక్కరోజు ముందే యోగి ప్రభుత్వం పేరును మార్చింది. దీనిపై స్పందించిన అఖిలేష్.. ప్రస్తుతం ఉన్న స్టేడియంకు పాతపేరునే కొసాగించి, వాజ్‌పేయీ పేరుతో మరో నూతన స్టేడియంను నిర్మించాలని సూచించారు. నగరాల, స్డేడియాల పేర్లు మార్చడం తప్ప బీజేపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. పాత వాటికి కొత్త పేర్లు పెట్టి యోగి సంతోషిస్తున్నారని.. వాజ్‌పేయీ పేరు మీదుగా రాష్ట్రంలో ఒక్క నిర్మాణం కూడా బీజేపీ ప్రభుత్వం చేపట్టలేకపోయిందని మండిపడ్డారు. కాగా అఖిలేష్ హయాంలో 50వేల సామర్థ్యంతో నిర్మితమైన ఇకానా మైదానంలో మంగళవారం తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. -
క్రికెట్ స్టేడియంలో రక్తపు ముద్దలు
కాబూల్: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్హర్ ప్రొవిన్స్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థ నైట్‌టైమ్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్‌ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు స్పింగర్ క్రికెట్ స్టేడియానికి వచ్చారు. ఆ సమయంలో వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రక్తపు ముద్ధలు చెల్లాచెదురుకాగా, హాహాకారాలతో ప్రేక్షకులు పరుగులు తీశారు. మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ‘అష్రఫ్ ఘని’ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. -
మూలపాడులో క్రికెట్ సందడి
-
స్టేడియంలో సచిన్ కేకలు
-
మూలపాడులో భద్రత కట్టుదిట్టం
మూలపాడు (ఇబ్రహీంపట్నం) : మూలపాడు క్రికెట్ స్టేడియంలో భారత్–వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, అమలాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కలెక్టర్ బాబు.ఏ మంగళవారం విడివిడిగా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించి సమీక్షించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తును పర్యవేక్షించారు. గ్రౌండ్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. వీరి వెంట సబ్‌కలెక్టర్ సృజన, స్టేడియం ఇన్చార్జి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఇరుజట్ల ప్రాక్టీస్ కాగా, మంగళవారం ఇరుదేశాల జట్లు ప్రాక్టీస్ చేశాయి. ఉదయం వెస్టిండీస్ జట్టు, మధ్యాహ్నం భారత్ క్రీడాకారిణులు ప్రాక్టీస్ చేశారు. క్రికెట్ అభిమానులు కూర్చునేందుకు వీలుగా తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటుచేశారు. -
కేరళలో స్టేడియానికి సచిన్ పేరు
త్రివేండ్రం : తమ రాష్ట్రంలోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును పెట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) నిర్ణయించింది. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఓ పెవిలియన్‌కు ఇప్పటికే సచిన్ పేరు ఉండగా.. కొత్తగా స్టేడియానికి మాస్టర్ పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఏ అధ్యక్షుడు టీసీ మాథ్యూ తెలిపారు. ‘ఏ స్టేడియానికి సచిన్ పేరును పెట్టాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే వాయనాడ్‌లో మైదానం పూర్తయ్యింది. ఇంకా కొన్ని ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే ఏ విషయమూ తేల్చేస్తాం. సచిన్‌ను కూడా సంప్రదించాం. మరోవైపు త్వరలో అందుబాటులోకి రాబోయే ప్రతీ క్రికెట్ స్టేడియంను అన్ని క్రీడలకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నాం’ అని మాథ్యూ తెలిపారు. ఈ ఏడాది కేరళలో జరిగిన జాతీయ క్రీడలకు సచిన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అలాగే ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్‌కు సహ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఓ సొంతిల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. -
కరీంనగర్లో క్రికెట్ స్టేడియం!
- స్థలసేకరణ దిశగా అడుగులు - శాతవాహన పీజీ సెంటర్ స్థలంలో ఏర్పాటు - తెలంగాణ రాష్ట్రంలో రెండోది - ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక చొరవ - ప్రభుత్వానికి ప్రతిపాదనలు కరీంనగర్ స్పోర్ట్స్ : క్రికెట్.. క్రికెట్.. ఈ పేరు వింటేనే అందరిలో ఏదో ఫీలింగ్. జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. చాలా మంది అభిమానులు అక్కడికి వెళ్లి చూసి వచ్చిన సందర్భాలు అనేకం. మనకూ ఒక స్టేడియం ఉంటే బాగుండు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి క్రీడాభిమానులందరి కల సాకారం కానుంది. బోర్డ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అడుగులు పడుతున్నారు. ఇందుకు ఎంపీ, ఎమ్మెల్యే, క్రికెట్ సంఘాల బాధ్యులు చురుకుగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఉప్పల్ తర్వాత రెండో క్రికెట్ స్టేడియం కరీంనగర్లో ఏర్పడనుంది. దీంతో కరీంనగర్ జిల్లా క్రీడారంగం దశ తిరగనుంది. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, క్రికెట్ సంఘం పెద్దలు ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కలిసి స్టేడియం నిర్మాణంపై చర్చించారు. స్పందించిన సీఎం జిల్లా కేంద్రంలో స్థలం చూసుకోవాలని.. తర్వాత స్టేడియం మంజూరుకు కృషిచేస్తానని చెప్పి.. వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ ఫార్వర్డ్ చేయమని చెప్పినట్లు సమాచారం. ఆ లేఖ ఇటీవలే కలెక్టర్, ఆర్డీవోలకు అందినట్లు తెలిసింది. 10 ఎకరాల్లో స్టేడియం జిల్లా కేంద్రంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహణలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నారు. లోయర్ మానేరు డ్యాం సమీపంలోని శాతవాహన పీజీ సెంటర్, ఎల్ఎండీ కాలనీలోని వేంకటేశ్వర దేవాలయం సమీపంలో, కొత్తపల్లిలో స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శాతవాహన పీజీ సెంటర్ స్థలంలో స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. కలెక్టర్ అనుమతి రాగానే నిధుల మంజూరు.. నిర్మాణంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నారుు. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ రెడీ చేశారు. రూ.20 కోట్ల వ్యయంతో 25 నుంచి 30 వేల మంది కూర్చునే సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు. గతేడాది హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పలు లీగ్, అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో జిల్లా జట్లు విజయడంకా మోగించాయి. అంతకుముందు ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి క్రికెట్లో కరీంనగర్ తిరుగులేని జట్టుగా నిలిచింది. గతేడాది అండర్-14, 19 విభాగంలో ఒకసారి, 2013-14 లో అండర్-16, 19లో మరోసారి విజేతగా నిలిచింది. జిల్లా క్రీడాకారిణి సునీత జాతీయస్థాయి పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించి జిల్లా ఖ్యాతిని పెంచారు. క్రికెట్ సంఘాల బాధ్యులూ ఔత్సాహికంగా వ్యవహరిస్తుండడంతో స్టేడియం నిర్మాణానికి అడుగులు పడుతున్నారుు. -
వైజాగ్‌కు టెస్టు హోదా తెప్పిస్తాం!
విజయవాడ స్పోర్ట్స్/గుంటూరు, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంకు త్వరలో టెస్ట్ హోదా వస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐసీసీ ప్రతినిధుల పరిశీలన పూర్తయ్యిందని, త్వరలో బీసీసీఐ టెక్నికల్ కమిటీ పరిశీలన కూడా పూర్తయితే వైజాగ్‌కు టెస్టు హోదా లభిస్తుందని ఆయన అన్నారు. బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన అనంతరం ఆయన సోమవారం ఇక్కడి ఏసీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత్-వెస్టిండీస్ మధ్య త్వరలో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను విశాఖకు కేటాయించే అవకాశం ఉందని గంగరాజు వెల్లడించారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ప్రస్తుతం ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రికెట్ అకాడమీకి బీసీసీఐ గుర్తింపు ఇచ్చిందని, ఇకపై నేరుగా బోర్డు ఇక్కడి కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో భారత సీనియర్ జట్టులో ఆంధ్రనుంచి ఆటగాళ్లు ఎంపికవుతారని గంగరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. -
‘బ్లూ’ను గెలిపించిన అభిషేక్
ఇండోర్: దాదాపు ఆరు నెలల విరామం తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టినా వీరేంద్ర సెహ్వాగ్ శైలి మాత్రం అదే! ఓపెనర్నుంచి మిడిలార్డర్ స్థానానికి మారడం మినహా దూకుడులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన మైదానంలోనే తనదైన ఆటతీరుతో వీరూ (38 బంతుల్లో 59; 9 ఫోర్లు, 1 సిక్స్) అలరించాడు. అయితే మ్యాచ్ ఫలితం మాత్రం ఢిల్లీ జట్టుకు ప్రతికూలంగా వచ్చింది. చాలెంజర్ వన్డే ట్రోఫీలో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఇండియా ‘బ్లూ’ 18 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ‘బ్లూ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అభిషేక్ నాయర్ (73 బంతుల్లో 91; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి (77 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చావ్లా (50 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు), భువనేశ్వర్ (23 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో భాటియా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. భాటియా (89 బంతుల్లో 65; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చివర్లో నెహ్రా (41 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి భాటియా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.