
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment