క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి స్టేడియాన్ని ఊపేసిన హీరో! | Tollywood Hero Ram Charan Steps On Cricket Stadium At Thane | Sakshi
Sakshi News home page

Ram Charan: క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి అదరగొట్టిన చెర్రీ!

Published Wed, Mar 6 2024 4:15 PM | Last Updated on Wed, Mar 6 2024 5:05 PM

Tollywood Hero Ram Charan Steps On Cricket Stadium At Thane - Sakshi

మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ క్రికెట్‌ లీగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలోనే హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఐఎస్‌పీఎల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అంతే కాదు.. తనతో పాటు టీమ్‌లో చేరాలంటూ ట్విటర్‌ వేదికగా చెర్రీ పిలుపునిచ్చారు. 

తాజాగా ఐఎస్‌పీఎల్‌ టీ10 లీగ్‌ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్టేడియంలో సందడి చేశారు. చీర్ లీడర్స్‌తో కలిసి నాటు నాటు సాంగ్‌కు కాలు కదిపారు. చరణ్ డ్యాన్స్‌ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ తర్వాత సచిన్, సూర్య, అక్షయ్‌ కుమార్‌, రవిశాస్త్రితో కలిసి మరోసారి స్టెప్పులు వేశారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా తెగ నెట్టింట తెగ వైరలవుతోంది.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీకి చెర్రీకి జంటగా కనిపించనుంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement