cricket league
-
అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ భాగస్వామిగా సచిన్
వాషింగ్టన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికాకు చెందిన నేషనల్ క్రికెట్ లీగ్ (ఎన్సీఎల్) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘క్రికెట్ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్ పేర్కొన్నాడు. ఎన్సీఎల్ తొలి సీజన్లో సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్ ప్రసాద్ (భారత్), జహీర్ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్స్ (వెస్టిండీస్), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్ ఫార్మాట్లో భాగం కానున్నారు. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్ ఫార్మాట్లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్సీఎల్ సిక్స్టీ స్ట్రయిక్స్ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో రైనా, దినేశ్ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు. -
‘క్రేజియెస్ట్ బిట్ ఆఫ్ క్రికెట్’.. ఇలాంటి ఫీల్డింగ్ నెవ్వర్ బిఫోర్!
"Craziest Bit Of Cricket"- Video: హోరాహోరీ మ్యాచ్‌లో వైడ్ బాల్‌ను ఆపేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ విఫలమయ్యాడు. అతడి కాళ్ల మధ్య గుండా బౌండరీ లైన్ వైపు బంతి వెళ్తుండగా ఓ ఫీల్డర్ రంగంలోకి దిగాడు. పాదరసంలా కదిలి సరిగ్గా బౌండరీ రోప్‌ను బాల్ తాకే ముందే ఆపేశాడు. వేగంగా పరిగెత్తుకురావడం మూలాన బ్యాలెన్స్ తప్పి అడ్వర్టైజ్మెంట్ బోర్డు వైపు వెళ్లి.. ఎగిరి అవతలకు దూకాడు. వెంటనే మళ్లీ వచ్చి బంతిని వికెట్ కీపర్ వైపు విసరాలని అనుకున్నాడు. కానీ అప్పటికే వికెట్ కీపర్ బౌండరీ రోప్ వద్దకు పరిగెత్తుకు రాగా.. హడావుడిలో ఆ ఫీల్డర్ బంతిని చేజార్చుకున్నాడు. ఇంకేముంది బాల్ రోప్ అవతల పడింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. ఆ ఫీల్డర్ చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్- డొనాస్టడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డొనాస్టడ్ ఫీల్డర్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్రేజియెస్ట్ బిట్ ఆఫ్ క్రికెట్’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డొనాస్టడ్ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్ జట్టును 133/5కే కట్టడి చేసి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మార్చి 22న మొదలుకానున్న ఈ మెగా టీ20 లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-2024 తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించనున్న విషయం తెలిసిందే. Fielding heroics meets comedy gold! 😂#EuropeanCricket #StrongerTogether #ECL24 pic.twitter.com/uXAv6Lu5F2 — European Cricket (@EuropeanCricket) March 16, 2024 -
ISPL 2024: ఐఎస్పీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
క్రికెట్ లీగ్‌లో రామ్ చరణ్.. సచిన్‌తో కలిసి స్టేడియాన్ని ఊపేసిన హీరో!
మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ క్రికెట్ లీగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలోనే హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అంతే కాదు.. తనతో పాటు టీమ్‌లో చేరాలంటూ ట్విటర్ వేదికగా చెర్రీ పిలుపునిచ్చారు. తాజాగా ఐఎస్పీఎల్ టీ10 లీగ్ మహారాష్ట్రలోని థానేలో ప్రారంభమైంది. దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్టేడియంలో సందడి చేశారు. చీర్ లీడర్స్‌తో కలిసి నాటు నాటు సాంగ్‌కు కాలు కదిపారు. చరణ్ డ్యాన్స్ చేస్తుండగా.. రవిశాస్త్రి, సచిన్ తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సచిన్, సూర్య, అక్షయ్ కుమార్, రవిశాస్త్రితో కలిసి మరోసారి స్టెప్పులు వేశారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీకి చెర్రీకి జంటగా కనిపించనుంది. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Sachin, Ram Charan, Suriya, Akshay Kumar doing the "Naatu Naatu" step in the inaugural function of ISPL. 🔥pic.twitter.com/d6YORP0JL8 — Johns. (@CricCrazyJohns) March 6, 2024 #RamCharan 🤝 #Suriya for @ispl_t10 Opening Ceremony !!@AlwaysRamCharan @Suriya_offlpic.twitter.com/spCjejkRC3 — Raees (@RaeesHere_) March 6, 2024 Man Of Masses @AlwaysRamCharan 🦁👑 Joins With a NAATU NAATU 🕺STYLE the Opening Ceremony Of @ispl_t10 at Dadoni Kondadev Athletics Stadium 📸✨💥🔥 In Frame Master #SachinTendulkar#Ravishastri ❤☺🤩#GameChanger #RamCharan 🦁👑🌟 pic.twitter.com/tNnUUwFCnN — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) March 6, 2024 -
2024లో క్రికెట్ జాతర.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో మొదలుకుని..!
2024లో క్రికెట్ జాతర జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో క్రికెట్ లీగ్‌ల మోత మోగనుంది. జనవరి 9 నుంచి మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఈ ఏడాది క్రికెట్ సంబురాలు ప్రారంభమవుతాయి. ఇదే ఏడాది కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా టీ20 ప్రపంచకప్ కూడా జరుగనుంది. ఈ మెగా టోర్నీ జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి ముందు భారత్‌లో క్రికెట్ మహాసంగ్రామం అయిన ఐపీఎల్ మొదలవుతుంది. ఈ లీగ్‌కు సంబంధించి తేదీలు అధికారికంగా ఖరారు కానప్పటికీ.. మార్చి 23-మే 26 మధ్యలో ఈ లీగ్ జరుగుతుందని తెలుస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (దుబాయ్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, టీ20 వైటాలిటీ బ్లాస్ట్ (ఇంగ్లండ్), ద హండ్రెడ్ లీగ్ (ఇంగ్లండ్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్), టీ10 లీగ్ (అబుదాబీ), బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), లంక ప్రీమియర్ లీగ్ (శ్రీలంక), మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ), సూపర్ స్మాష్ (న్యూజిలాండ్), గ్లోబల్ టీ20 కెనడా (కెనడా), జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ (ఆఫ్రికా) తదితర లీగ్‌లు జరుగనున్నాయి. మొత్తంగా ఏడాది పొడవునా 15 క్రికెట్ లీగ్‌లు జరుగనున్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఇవే కాక ఈ ఏడాది పలు దేశీయ లీగ్‌లు కూడా జరుగుతాయి. మొత్తంగా ఏడాది పొడవునా అభిమానులకు క్రికెట్ కనువిందు చేయనుంది. వరస క్రమంలో ఈ ఏడాది జరుగబోయే వివిధ క్రికెట్ లీగ్‌లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్- జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 ఇంటర్నేషనల్ లీగ్ టీ20- జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్- జనవరి 19 నుంచి మార్చి 1 పాకిస్తాన్ సూపర్ లీగ్- ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19 ఐపీఎల్- మార్చి 23 నుంచి మే 26 (అంచనా) వైటాలిటీ బ్లాస్ట్- మే 30 నుంచి సెప్టెంబర్ 14 టీ20 వరల్డ్‌కప్- జూన్ 4 నుంచి 30 ద హండ్రెడ్- ఆగస్ట్ కరీబియన్ ప్రీమియర్ లీగ్- ఆగస్ట్-సెప్టెంబర్ టీ10 లీగ్- అక్టోబర్ బిగ్‌బాష్ లీగ్-డిసెంబర్-జనవరి షెడ్యూల్ ఖరారు కాని లీగ్‌లు.. లంక ప్రీమియర్ లీగ్ (శ్రీలంక), మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ), సూపర్ స్మాష్ (న్యూజిలాండ్), గ్లోబల్ టీ20 కెనడా (కెనడా), జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ (ఆఫ్రికా) -
MajorLeagueCricket: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటుండగా నాలుగు టీమ్‌లు ఐపీఎల్ యాజమాన్యాలకు (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) చెందినవే ఉన్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. అభిమానులు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా భావిస్తున్నారు. న్యూయర్క్ కెప్టెన్‌గా పొలార్డ్ ఇక మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో ఏంఐ న్యూయర్క్ కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కిరాన్ పొలార్డ్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ పీటర్సన్, బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆఫ్ఘన్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. వీరితో పాటు యువ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఉన్నారు. కాగా జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. చదవండి: Nahida Khan Retirement: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
అగ్రరాజ్యంలో మినీ ఐపీఎల్.. అభిమానులకు పండగే!
ఐపీఎల్ ముగిసింది.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా అయిపోయింది. జూలై 12 వరకు టీమిండియాకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. క్రికెట్ అభిమానులు వచ్చే నెల రోజులు ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న సమయంలో మరో ఆసకక్తికర లీగ్ మొదలుకానుంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా తొలిసారి ఓ పూర్తిస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ జరగనుంది. యూఎస్‌లో అభిమానులను అలరించడానికి సిద్ధమైన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో భాగంగా సీజన్ - 1 షెడ్యూల్ కూడా విడుదలైంది. ట్విటర్ వేదికగా ఎంఎల్సీ పంచుకున్న ఈ షెడ్యూల్ ప్రకారం.. జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. 17 రోజుల పాటు అగ్రరాజ్యాన జరిగే ఈ లీగ్.. జులై 30న ముగుస్తున్నది. మినీ ఐపీఎల్.. ఐపీఎల్‌లోని నాలుగ ప్రధాన జట్లు ఎంఎల్‌సీలో జట్లను సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ లు ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. మిగిలిన రెండు జట్లనూ వేరేవాళ్లు దక్కించుకున్నా వాళ్లు కూడా భారతీయ సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. సియాటెల్ లో ఢిల్లీతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా కో ఓనర్ గా ఉన్నాడు. ఈ నాలుగు జట్లే గాక వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీని భారత సంతతికి చెందిన అమెరికన్ పెట్టుబడిదారుడు సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు. ఇక వాషింగ్టన్ డీసీ టీమ్ ను ఆనంద్ రామరాజన్, వెంకీ హరినారాయణ్ లు దక్కించుకున్నారు. ఈ లీగ్ లో తొలి మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జులై 13న జరుగనుంది. జులై 14న ఎంఐ న్యూయార్క్ - సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తో పాటు ఇదే రోజు సియాటెల్ ఆర్కర్స్ తో వాషింగ్టన్ ఫ్రీడమ్ తలపడతాయి. జులై 25 వరకు లీగ్ దశ మ్యాచ్ లు ముగుస్తాయి. జులై 27న ఎలిమినేటర్, అదే రోజున క్వాలిఫయర్ జరుగుతాయి. 28న ఛాలెంజర్, జులై 30న ఛాంపియన్షిప్ (ఫైనల్) జరుగనున్నాయి. ఈ మేజర్ క్రికెట్ లీగ్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్, ఆన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగ లాంటి స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో ఆరు జట్లు : టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే) లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్) సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీక్యాపిటల్స్) ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్) వాషింగ్టన్ ఫ్రీడమ్ సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 𝑨𝒏𝒅 𝒋𝒖𝒔𝒕 𝒍𝒊𝒌𝒆 𝒕𝒉𝒂𝒕... the first-ever schedule of #MajorLeagueCricket has been released 🤩 🇺🇸 🏏 Where will you be watching from?! pic.twitter.com/gPuUsKtrvk — Major League Cricket (@MLCricket) June 12, 2023 చదవండి: వార్తల్లో పృథ్వీ షా.. సీజ్ చేసిన లాంజ్‌లో తెల్లవారుజాముదాకా ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా! -
ఏడాదికి 50 కోట్లు ఇస్తాం.. దేశానికి ఆడకండి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల బంపర్ ఆఫర్
లండన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో (లండర్ టైమ్స్) ఆ దేశ క్రికెటర్లకు (ఇంగ్లండ్) సంబంధించిన ఓ సంచలన కథనం ప్రసారమైనట్లు భారత దేశ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. టాప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారన్నది ఆ కథనం సారాంశం. సదరు క్రికెటర్లు ఇంగ్లండ్ జాతీయ జట్టును వదిలిపెట్టి, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో (ఈసీబీ) అనుసంధానమైన ఏ జట్టులో (కౌంటీలు) ఆడకుండా, తమతో ఒప్పందం కుదుర్చుకుంటే ఏడాదికి రూ. 50 కోట్లు ఇస్తామని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫర్ చేశాయట. చదవండి: RCB VS KKR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు పీఎస్ఎల్, బీపీఎల్‌లో ఆడకూడదు.. ఆటగాళ్లు ఆఫర్‌కు ఓకే చెబితే ఏడాది మొత్తం ఫ్రాంచైజీకి సంబంధించిన వివిధ జట్ల తరఫున దేశవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్‌ల్లో ఆడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ల్లో ఆటగాళ్లు ఆడటం నిషేధం. లండర్ టైమ్స్ కథనంలో ఆ ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరు, వారిని సంప్రదించిన ఫ్రాంచైజీలు ఏవి అన్న వివరాలు వెల్లడించలేదని పీటీఐ తెలిపింది. కాగా, ఐపీఎల్‌లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తంగా జరిగే ప్రముఖ క్రికెట్ లీగ్‌ల్లో జట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఏ టీ20 లీగ్, యూఏఈ వేదికగా జరిగే ఐఎల్ టీ20 లీగ్, త్వరలో యూఎస్ఏలో జరుగబోయే మేజర్ క్రికెట్ లీగ్‌ల్లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వివిధ జట్లను కొనుగోలు చేశాయి. చదవండి: IPL 2023: గుజరాత్, లక్నో మ్యాచ్ ఫిక్సైంది..! ' -
'దరిద్రం నెత్తిన ఉందంటారు'.. అది ఇదేనేమో?
రనౌట్లు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అలాంటి రనౌట్స్ మనకు నవ్వు తెప్పించినప్పటికి బ్యాటర్‌కు మాత్రం చిర్రెత్తిస్తాయి. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఒక ఫన్నీ రనౌట్ చోటుచేసుకుంది. ఫ్యాన్‌కోడ్ ఈసీఎస్ మాల్టా గేమ్‌లో భాగంగా ఓవర్సీస్ క్రికెట్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఓవర్సీస్ బ్యాటర్ హెన్రిచ్ గెరిక్ బౌన్స్ అయిన బంతిని ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బౌలర్ బంతిని అందుకునే ప్రయత్నంలో మిస్జడ్జ్ అయ్యాడు. దీంతో బంతి అతని నెత్తికి తాకి దిశను మార్చుకుంది. ఇంతలో పరుగు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా వికెట్లవైపు విసిరాడు. అంతే 20 బంతుల్లో 44 పరుగులతో దాటిగా ఆడుతున్న గ్రీక్ కథ అక్కడితో ముగిసింది. '' దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.. అయితే ఇక్కడ దరిద్రం బ్యాటర్ నెత్తిలో కాకుండా బౌలర్ నెత్తిపై ఉండడం అది బ్యాటర్‌కు శాపంగా మారిదంటూ..'' కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఓవర్సీస్ క్రికెట్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 104 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన స్వికీ యునైటెడ్ నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Sometimes you gotta use your head to get a wicket🤭😝 #EuropeanCricket #EuropeanCricketSeries #CricketinMalta pic.twitter.com/fpqDXrsVY1 — European Cricket (@EuropeanCricket) December 24, 2022 చదవండి: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా? -
కిందా మీదా పడి చివరకు ఎలాగోలా!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. తాజాగా యురోపియన్ క్రికెట్లో భాగంగా బ్యాటర్ పరుగు తీసిన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. మ్యాచ్‌లో భాగంగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆఫ్‌సైడ్ అవతల వెళ్తున్న బంతిని మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు పిలుపునిచ్చాడు. అయితే సింగిల్‌ను తొందరగా పూర్తి చేసే క్రమంలో పిచ్ మధ్యలో జారిపడ్డాడు. ఇక రనౌట్ తప్పదనుకున్న తరుణంలో ఫీల్డర్ వేసిన బంతిని బౌలర్ సకాలంలో అందుకోవడంలో విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో పడిపోయిన ఏ బ్యాటర్ అయినా లేచి పరిగెత్తడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పిచ్‌పై దొర్లుకుంటూ మొత్తానికి కిందా మీదా పడి ఎలాగోలా సింగిల్‌ను పూర్తి చేశాడు. కనీసం లేచి పరిగెత్తే టైం లేకపోవడంతోనే ఇలా చేసినట్లు సదరు బ్యాటర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసినా ప్రస్తుతం సోషల్ మీడియలో మాత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే అతని కష్టం గుర్తించిన ప్రత్యర్థి ప్లేయర్లు కూడా చప్పట్లతో సదరు బ్యాటర్‌ను అభినందించడం విశేషం. వీలైతే మీరు వీడియోపై ఒక లుక్కేయండి. It's almost like a dream when you're trying to run but you just can't😄 @HCLSoftware#HCLSoftwareVIPExperience pic.twitter.com/RdWgAlwFjX — European Cricket (@EuropeanCricket) October 18, 2022 -
'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలానే ఉంటాయి. ఆటగాళ్ల తమ చర్యలతో ఒక్కోసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తుంటారు. ఇక బౌలర్లయితే తమ బౌలింగ్ యాక్షన్‌తో దృష్టిని మొత్తం తమవైపు తిప్పుకుంటారు. మలింగ, బుమ్రా, పాల్ ఆడమ్స్ ఇలాంటి కోవకే చెందినవారే. తాజాగా విలెజ్ క్రికెట్ లీగ్‌లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్‌మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు. మాములుగా స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎంతో కొంత లైనఫ్ తీసుకొని బౌలింగ్ చేయడం సహజం. ఇప్పుడు మనం చెప్పుకునే బౌలర్ మాత్రం కాస్త వినూత్న పద్దతిని అనుసరించాడు. క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్‌తో కన్ఫ్యూజ్ అయిన బ్యాటర్ డిఫెన్స్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే తన బౌలింగ్‌పై జార్జ్ మెక్‌మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్‌కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్ యూ క్రికెట్'' అంటూ ట్వీట్ చేశాడు. Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5 — George McMenemy🏏 (@McMcMenemy) June 20, 2022 చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్ అఫ్రిది
Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్ఎస్ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు. పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..! -
మరి ఇంత తొందరేంటి.. రనౌట్ చేయాల్సింది
క్రికెట్లో బౌలర్ బంతి విడవకముందే బ్యాటర్ క్రీజు దాటితే అతన్ని రనౌట్ కాల్ చేయొచ్చు. దీనినే మన్కడింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది క్రీడాస్పూర్తిని దెబ్బతీసేలా ఉందని.. మన్కడింగ్‌ను నిషేధించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. వారి వాదనలు వ్యతిరేకిస్తూ ఇటీవలే మన్కడింగ్‌ను చట్టబద్దం చేస్తూ మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) కొత్త సవరణ తీసుకొచ్చింది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. తాజాగా యురోపియన్ క్రికెట్ లీగ్‌లో బౌలర్‌కు మన్కడింగ్(రనౌట్) చేసే అవకాశమొచ్చినప్పటికి క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ సగం క్రీజు వరకు పరిగెత్తాడు. దీంతో బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం వచ్చినప్పటికి సైలెంట్ అయిపోయాడు. అంపైర్ ఔట్ చేయమని చెప్పినప్పటికి సదరు బౌలర్.. వద్దులే అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో బౌలర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. మన్కడింగ్ చేసే అవకాశమున్నప్పటికి క్రీడాస్పూర్తి ప్రదర్శనతో ఆకట్టుకున్నావు అంటూ కామెంట్ చేశారు. Incredible backing-up from this lad 😂🏃♂️@EuropeanCricket pic.twitter.com/4mbICTxbc5 — That’s so Village (@ThatsSoVillage) March 13, 2022 -
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్..
Amitabh Bachchan: దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బిగ్ బీనే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ లీగ్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. మైదానంలో దిగ్గజాల పోరాటాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఉన్నారని తెలిపాడు. కాగా, లెజెండ్స్ క్రికెట్ లీగ్‌ను 2022 జనవరిలో ఓమన్‌లోని అల్ అమీరట్ స్టేడియం వేదికగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. భారత్, ఆసియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్ల తరఫున భారత్, శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌కు చెందిన దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లు తెలియాల్సి ఉంది. చదవండి: Ashes 1st Test: ట్రావిస్ హెడ్ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్ -
వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు..
క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువలేదు. ఆటగాళ్లు చేసే స్టంట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తాయి. వీటికి తోడూ ఆటగాళ్ల డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ పోతుందని అంతా భావించారు. చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. 30 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్ బౌండరీలైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఫీల్డర్ క్యాచ్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ పేర్కొన్నారు. Can't stop watching this. It's just so ridiculously casual 😂👏 [@EuropeanCricket] pic.twitter.com/2yOdXFvmAV — That’s so Village (@ThatsSoVillage) December 6, 2021 -
ఇన్సైడ్ ఎడ్జ్ హ్యాట్రిక్ సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
Inside Edge Season 3: క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ తగ్గింది. టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఇక క్రికెట్ కోలహాలం తగ్గిందని అనుకుంటున్నారా ? అలా అస్సలు ఆలోచించకండి. నిరాశ పడకండి క్రికెట్లో మరో పెద్ద లీగ్ రానుంది. కానీ ఈ లీగ్ గ్రౌండ్లో జరగదండి. అమెజాన్ ప్రైమ్ వేదికగా హ్యాట్రిక్ కొట్టడానికి 'ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 3' వెబ్ సిరీస్ అనే మ్యాచ్ ప్రారంభంకానుంది. గేమ్ మాస్టర్స్ తిరిగి రానున్నారు. ఈసారి వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తే లేదంటున్నాయి మ్యాచ్‌లో తలపడనున్న జట్లు క్రికెట్ నేపథ్యంగా వచ్చిన వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్. మొదటి రెండు సీజన్లు క్రికెట్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడో సీజన్ కోసం వెబ్ సిరీస్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 1, 2లను ప్రేక్షకులు ఆదరించి, భారీ సక్సెస్ ఇవ్వడంతో మూడో సీజన్‌ను ప్లాన్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ 3వ సీజన్ డిసెంబర్ 3, 2021న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తామని మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ సీజన్ 3లో వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, తనూజ్ విర్వానీ, అమీర్ బషీర్, సయానీ గుప్తా, సప్నా పబ్బి, అక్షయ్ ఒబెరాయ్, సిధాంత్ గుప్తా, అమిత్ సియాల్ నటించారు. కరణ్ అన్షుమాన్ రూపొందించిన ఈ సిరీస్‌కు కనిష్క్ వర్మ దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత రితేష్ సిధ్వాని ' ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌కు వీక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే మమ్మల్ని మరో సీజన్‌ను రూపొందిచేలా ప్రోత్సహించింది. ఇన్సైడ్ ఎడ్జ్ మాకు ఎప్పుడూ ప్రత్యేకమైంది. ఇది అమెజాన్‌తో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ మొదటి ఒరిజినల్ సిరీస్. ఇండియాలో అమెజాన్ మొదటి ఒరిజినల్ సిరీస్ కావడంతో మాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈ సీజన్లో ముంబై మావెరిక్స్ ప్రయాణం, గ్రిప్పింగ్ దశను వివరించామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం.' అంటూ ఆయన భావాలు పంచుకున్నారు. View this post on Instagram A post shared by Kanishk Varma (@kanishk.varma) -
ఉన్ముక్త్ చంద్ పరుగుల సునామీ.. రికార్డు శతకం నమోదు
Unmukt Chand Scores 132 From 69 Balls: అమెరికాలో జరుగుతున్న టోయోటా మైనర్ లీగ్‌లో భాగంగా ఆస్టిన్ అథ్లెటిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్, మాజీ భారత బ్యాటర్ ఉన్ముక్త్ చంద్ బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 69 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ(132 నాటౌట్) నమోదు చేశాడు. ఉన్ముక్త్ వీర విహారం ధాటికి సిలికాన్ వ్యాలీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టిన్ అథ్లెటిక్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. Unmukt Chand scored unbeaten 132 runs from 69 balls including 15 fours and 7 sixes for Silicon Valley Strikers in Minor League Cricket in USA.pic.twitter.com/8iKuoKmJmx — Johns. (@CricCrazyJohns) September 27, 2021 అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉన్ముక్త్ జట్టు.. 3 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉన్ముక్త్ తుఫాను ఇన్నింగ్స్‌తో తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఉన్ముక్త్ చేసిన స్కోర్‌లో 102 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే అతను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ అమెరికన్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తంగా 434 బంతులను ఎదుర్కొన్న అతను.. 53.20 సగటు, 122.58 స్ట్రైక్ రేట్‌తో 534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: "ఆ రెండు నిర్ణయాలే" కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణం..! -
గౌతం గంభీర్ కీలక ప్రకటన.. త్వరలోనే కొత్త లీగ్‌తో ముందుకు..!
Gautam Gambhir announces East Delhi Cricket League: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తూర్పు ఢిల్లీ క్రికెట్ లీగ్‌ను ఆరంభించనున్నట్లు వెల్లడించారు. సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా(కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ జట్ల మాజీ కెప్టెన్) పేరొందిన గౌతం గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన నియోజకవర్గంలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేసిన గంభీర్.. దీనిని ప్రపంచస్థాయి మైదానంగా తీర్చిదిద్దామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు ఢిల్లీ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి జట్లను ఎంపిక చేసి.. ఈస్ట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా నవంబరు రెండో వారంలో ఈ టోర్నీని ప్రారంభించనున్నట్లు సమాచారం. 17- 36 ఏళ్ల మధ్య వయస్కులైన క్రికెటర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు అత్యాధునికంగా యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ రంజీ ట్రోఫీ నిర్వహణ స్థాయికి తగ్గట్లు యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. రెండు డ్రెస్సింగ్‌రూంలు, హైమాస్ట్ లైట్స్, ఆరు పిచ్‌లు, ప్రాక్టీసు పిచ్‌లు, డిజిటల్ స్కోరు బోర్డు డిస్ప్లే, కానపీ, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల 25 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. క్రికెట్‌తో పాటు ఆర్చరీ కోసం కూడా దీనిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: T20 World Cup: అతడు తోలుబొమ్మ.. జట్టులో మార్పులు తథ్యం.. వీళ్లను తీసుకోవాలి! I PROMISE TO DELIVER! 🇮🇳 World Class Stadium ready at Yamuna Sports Complex! East Delhi Cricket League to start very soon! #DelhiNeedsHonesty pic.twitter.com/DpYJ1xUET2 — Gautam Gambhir (@GautamGambhir) September 10, 2021 -
పాకిస్తాన్‌కు ఆడాల్సింది కాదు.. తప్పు చేశా
సమీ అస్లామ్.. 2015 నుంచి 2017 వరకు పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను పాక్ తరపున 13 టెస్టుల్లో 758 పరుగులు.. 4 వన్డేల్లో 78 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అస్లామ్‌కు అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. తాజాగా మేజర్ క్రికెట్ టోర్నీ పేరుతో యూఎస్‌లో టీ20 లీగ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు అస్లామ్ అందులో ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. కాగా తాను పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడి తప్పు చేశానంటూ అస్లామ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. 'అసలు నేను అమెరికాకు వచ్చి క్రికెట్ ఆడుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఈరోజు పాక్‌ను విడిచిపెట్టి ఇలా మేజర్ లీగ్ టోర్నీలో జాయిన్ అవడానికి ఒక కారణం ఉంది. పాక్ జట్టులో నాకు ఎన్నడు సరైన గుర్తింపు లేదు. అక్కడి కోచ్‌లు.. సెలెక్టర్లు నన్నెప్పుడు చిన్నచూపు చూసేవారు. ఒక దశలో జీవితం మీద విరక్తి వచ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయా.. అలా రెండేళ్లు గడిచిపోయాయి. పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాల్సింది కాదు.. అది కరెక్ట్ ప్లేస్ కాదు. నామీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం విడిచి యూఎస్ వచ్చాను. అలా మేజర్ క్రికెట్ టోర్నీలో అడుగుపెట్టాను, ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి దాదాపు 100 మంది ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లు నాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పాక్ క్రికెట్లో జరుగుతున్న అక్రమాలను తెలుసుకొని కొంతమంది మేజర్ లీగ్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం! -
క్రికెట్ రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్తలు
న్యూయార్క్ : కార్పొరేట్ రంగంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు తమదైన ముద్ర వేశారు. తాజాగా వీరిద్దరూ క్రికెట్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అమెరికా క్రికెట్ ఎంటర్పప్రైజస్(ఏసీఈ) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ(ఎంఎల్సీ) పేరుతో లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్‌లో ఇప్పటికే కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ పెట్టుబడులు పెట్టినట్టు స్వయంగా వెల్లడించారు. తాజాగా భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్‌లు ఈ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఎంఎల్సీ లీగ్‌లో పెట్టుబడులు పెట్టనన్నుట్లు తెలిసింది. అమెరికాలో క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకే ఈ లీగ్‌ను ప్లాన్ చేసినట్లు ఏసీఈ కో ఫౌండర్ విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు. (చదవండి : టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ) -
టెంపాలో నాట్స్ క్రికెట్ లీగ్‌కు విశేష స్పందన
టెంపా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో క్రికెట్ లీగ్ నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొన్నాయి. క్రికెట్ సంఘం టెంపా క్రికెట్ లీగ్‌తో కలిసి, నాట్స్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించింది. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో నాట్స్ టీం ఈ క్రికెట్ లీగ్ విజయవంతానికి పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అటు టీసీఎల్ ఛైర్మన్ నితీశ్ శెట్టితో నాట్స్ సమన్వయం చేసుకుంటూ ఈ లీగ్ పోటీలను నిర్వహించింది. ఈ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించడానికి పెద్ద ఎత్తున స్థానికులు వచ్చి క్రికెటర్లను ప్రోత్సాహించారు. ఈ లీగ్ లో విన్నర్స్, రన్నర్స్ తో పాటు.. అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు. నాట్స్ బోర్డ్ నుంచి శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేనిలు వచ్చి ఆటగాళ్లకు బహుమతులు అందించారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది తో పాటు నాట్స్ టెంపా సభ్యులు ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ బైరెడ్డి, శ్రీథర్ గౌరవెల్లి, భరత్ ముద్దన, శ్రీనివాస్ కశెట్టి తదితరులు ఈ లీగ్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. సుధీర్ మిక్కిలినేని ఈ లీగ్ ను వెబ్ క్యాస్ట్ కూడా చేశారు. -
ఇదేమీ బౌలింగ్ యాక్షన్ రా బాబు!
అప్పుడప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వెరైటీ బౌలింగ్ వేసి అలరించడం మనకు తెలిసిందే. తాజాగా ఓ రొమేనియన్ బౌలర్ కూడా తన బౌలింగ్ యాక్షన్‌తో ఇంటర్నెట్లో కితకితలు పంచుతున్నాడు. యూరోపియన్ యూనియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో రొమేనియా బౌలర్ పావెల్ ఫ్లోరిన్ తన బౌలింగ్‌తో సోషల్ మీడియా సెన్సేషనల్‌గా మారిపోయాడు. అతడేమీ చండప్రచండంగా బంతులు విసిరి.. బ్యాట్స్‌మెన్‌ను బెదరగొట్టి వికెట్లు తీయలేదు. పరిగెత్తుకొని వచ్చి.. చాలా నెమ్మదిగా మొత్తం గాలిలోకి బంతిని విసిరేస్తున్నాడు ఈ బౌలర్. అసలు బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. విచిత్రమైన బౌలింగ్ శైలితో వికెట్లకు దూరంగా ఫుల్‌టాస్ బంతిని విసురుతున్నాడు. అతని బౌలింగ్ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదేమీ బౌలింగ్ యాక్షన్రా బాబు అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే బెస్ట్ క్రికెట్ మూమెంట్ అయి ఉంటుందని, ఇతని బౌలింగ్ యాక్షన్ చూస్తే.. కితకితలు ఖాయమని నెటిజన్లుఅంటున్నారు. మీరు ఓసారి లుక్కేయండి Ladies and gentlemen ... welcome to the #EuropeanCricketLeague 🤷🤷🤷 pic.twitter.com/ctrhyJvs4b — Fox Cricket (@FoxCricket) July 30, 2019 -
ఎన్స్‌కాన్స్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఎన్స్‌కాన్స్, కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆటకు చివరిరోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 181/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు ఆటముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 8 వికెట్లకు 418 పరుగులు చేసింది. రాకేశ్ యాదవ్ (287 బంతుల్లో 102 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరిష్ జైదీ (76), ఆశిష్ శ్రీవాస్తవ్ (53) అర్ధసెంచరీలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఎన్స్‌కాన్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 120.2 ఓవర్లలో 381 పరుగులకు ఆలౌటైంది. 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కేంబ్రిడ్జ్ జట్టుకు 3 పాయింట్లు లభించగా... ఎన్స్‌కాన్స్ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 292 (74 ఓవర్లలో), జై హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 224 (శశిధర్ రెడ్డి 52, వినీత్ రెడ్డి 47; తనయ్ త్యాగరాజన్ 5/59), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 22/2 (4 ఓవర్లలో). ఆర్ దయానంద్ తొలి ఇన్నింగ్స్: 291 (103 ఓవర్లలో), ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 295/8 (బి. సుమంత్ 63 నాటౌట్; మోహిత్ సోని 3/66). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 303 (89.5 ఓవర్లలో), ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 343 (69.2 ఓవర్లలో). దక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 238 (67.1 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 249/9 (హెచ్‌కే సింహా 83; పుష్కర్ 3/61, మిలింద్ 3/64). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 635/9 డిక్లేర్డ్ (148.4 ఓవర్లలో), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 249 (ప్రత్యూష్ కుమార్ 75, సంహిత్ రెడ్డి 59; ప్రణీత్ రాజ్ 3/58, గిరీశ్ గౌడ్ 3/26). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 170 (40 ఓవర్లలో), జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 135/5 (అభిరత్ రెడ్డి 79 బ్యాటింగ్; జయసూర్య 3/26). -
ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఎవర్గ్రీన్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ 96 పరుగులతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 93/3తో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎవర్గ్రీన్ 73.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎవర్గ్రీన్ జట్టుకు 243 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బి.మనోజ్ కుమార్ (75), జి. అనికేత్ రెడ్డి (79) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ 33.1 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మొహమ్మద్ ఒమర్ (57 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో వంశీకృష్ణ 4, శ్రవణ్ 6 వికెట్లతో జట్టును గెలిపించారు. ఇన్నింగ్స్ విజయం సాధించిన ఎవర్గ్రీన్ జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్‌ల వివరాలు జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 292 (ఫైజల్ 61, యుధ్వీర్ సింగ్ 62; శ్రవణ్ 5/50), జై హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 92/2 (అనురాగ్ 31 బ్యాటింగ్). ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 291 (ఆకాశ్ భండారి 7/95), ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 265/5 (అనిరుధ్ సింగ్ 54, డానీ డెరెక్ 74, బి. సుమంత్ 53 బ్యాటింగ్). ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 151 (51.2 ఓవర్లలో), ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 167 (అమోల్ షిండే 58; సురేశ్ 5/56), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్: 97 (హితేశ్ యాదవ్ 6/37), ఆంధ్రా బ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 85/1 (రోనాల్డ్ 47 నాటౌట్). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 303 (సాయి అభినయ్ 92; రాజు 6/58), ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 343 (హర్షవర్ధన్ 96, చరణ్ 74, సందీప్ 79). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 238 (వరుణ్ గౌడ్ 102, మిలింద్ 58; ముదస్సిర్ 7/83), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 176/4 (సింహా 70 బ్యాటింగ్, సంతోష్ గౌడ్ 50). ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 381 (ఒవైస్ 140 నాటౌట్; ఆశిష్ 6/111), కేంబ్రిడ్జ్ ఎలెవన్: 181/4 (పి. నితీశ్ రాణా 65). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 635/9 (మికిల్ జైస్వాల్ 186, శిరీష్ 52, నిఖిల్ 100 నాటౌట్, గిరీశ్ 52; అలీమ్ 5/183), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 74/4 (28 ఓవర్లలో). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 170 (శ్రీచరణ్ 63, తాహా షేక్6/48), జెమినీ ఫ్రెండ్స్: 135 (అభిరత్ రెడ్డి 79 బ్యాటింగ్). -
ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలుపొందింది. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్.... బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రవితేజ (3/24), హితేశ్ (3/41), నీలేశ్ (3/07) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టును కుప్పకూల్చారు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌ను 373/9 వద్ద డిక్లేర్ చేయగా... ఇన్కమ్ ట్యాక్స్ 244 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఆకాశ్ భండారికి 14 వికెట్లు... డెక్కన్ క్రానికల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎస్బీఐ ప్లేయర్ ఆకాశ్ భండారి ఓవరాల్‌గా 14 వికెట్లతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులిచ్చి 7 వికెట్లు దక్కించుకున్న ఆకాశ్... రెండో ఇన్నింగ్స్‌లోనూ 74 పరుగులిచ్చి మరో 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని దెబ్బకు డెక్కన్ క్రానికల్ జట్టు 103 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ విజృంభించడంతో 26.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. సాయి వికాస్ రెడ్డి (51) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 23/0 గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎస్బీఐ 34 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎస్బీఐ 197 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ 91కే ఆలౌటైంది. దీంతో ఎస్బీఐ జట్టుకు 6 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 434 (105.3 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 329 (తనయ్ త్యాగరాజన్ 4/103), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 133/7 (సదన్ 3/24). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 295 (91.2 ఓవర్లలో), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 245 (ఎస్సీ మొహంతి 107 నాటౌట్, సురేశ్ 54; అజయ్‌దేవ్ గౌడ్ 3/50). జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 366/4 డిక్లేర్డ్, ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 204 (బెంజమిన్ థామస్ 50; శ్రవణ్ 4/48, కార్తికేయ 3/66). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 308 (101.5 ఓవర్లలో), ఇండియా సిమెంట్: 290 (శ్రేయస్ వాలా 85, సయ్యద్ అలీ 78; కృష్ణ చరిత్ 4/64, ప్రణీత్ రాజ్ 3/69), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 120/5 (23 ఓవర్లలో). ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 380 (90 ఓవర్లలో), హైదరాబాద్ బాట్లింగ్: 245 (60.2 ఓవర్లలో), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 160/6 డిక్లేర్డ్ (సాయివ్రత్ 52), హైదరాబాద్ బాట్లింగ్ రెండో ఇన్నింగ్స్: 296/5 (వినయ్ గౌడ్ 60, రాధాకృష్ణ 90). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 295 (104.2 ఓవర్లలో), జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 314 (ఠాకూర్ తిలక్ వర్మ 89, రవితేజ 52). కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228 (83 ఓవర్లలో), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 124/3 (శివం తివారీ 53 నాటౌట్).