
క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువలేదు. ఆటగాళ్లు చేసే స్టంట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తాయి. వీటికి తోడూ ఆటగాళ్ల డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్‌లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ పోతుందని అంతా భావించారు.
చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. 30 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫీల్డర్ బౌండరీలైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఫీల్డర్ క్యాచ్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ పేర్కొన్నారు.
Can't stop watching this.
— That’s so Village (@ThatsSoVillage) December 6, 2021
It's just so ridiculously casual 😂👏
[@EuropeanCricket] pic.twitter.com/2yOdXFvmAV