క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి పరిగెత్తుకురావడం చూస్తుంటాం. ఒక్కోసారి క్యాచ్ మిస్ కావొచ్చు.. లేదంటే క్యాచ్ అందుకునే సమయంలో ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం జరగొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యాచ్ మాత్రం కాస్త వెరైటీ పద్దతిలో ఉంటుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. ఈసీఎస్ చెకియా టి10 లీగ్‌లో భాగంగా నో క్రికెట్ క్లబ్, పరాగ్ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టైగర్స్ ఓపెనర్ జిఎమ్ హసంత్ భారీ షాట్ ఆడబోయి బ్యాడ్ ఎడ్జ్ తగిలిన బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ రహత్ అలీ, బౌలింగ్ చేసిన రియాజ్ అఫ్రిదిలు ఒకేసారి దూసుకొచ్చారు. అయితే రహత్ అలీ క్యాచ్ ఈజీగా అందుకునే చాన్స్ ఉన్నా రిస్క్ చేసిన రియాజ్ అఫ్రిది తానే క్యాచ్ అందుకున్నాడు.
అదృష్టవశాత్తూ ఇద్దరిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలో రహత్ అలీ రియాజ్ వైపు కోపంగా చూస్తూ..''నేను పట్టుకునేవాడిని కదా.. నాపై నమ్మకం లేదా'' అంటూ పేర్కొన్నాడు. దీనిపై రియాజ్ అఫ్రిది స్పందిస్తూ.. ''నమ్మకం లేక కాదు క్యాచ్ అందుకోవాలనే వచ్చాను'' అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tag a teammate you wouldn't trust under the high ball...😄 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/oxQx5HMPa7
— European Cricket (@EuropeanCricket) July 26, 2023
చదవండి: అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్.. ఫొటో వైరల్
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment