![Batters Falls Middle Of-Pitch Taking Single Rolls Reach Non-Strike End - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/20/Cr0c.jpg.webp?itok=j306CD7n)
క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. తాజాగా యురోపియన్ క్రికెట్‌లో భాగంగా బ్యాటర్ పరుగు తీసిన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. మ్యాచ్‌లో భాగంగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆఫ్‌సైడ్ అవతల వెళ్తున్న బంతిని మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు పిలుపునిచ్చాడు.
అయితే సింగిల్‌ను తొందరగా పూర్తి చేసే క్రమంలో పిచ్ మధ్యలో జారిపడ్డాడు. ఇక రనౌట్ తప్పదనుకున్న తరుణంలో ఫీల్డర్ వేసిన బంతిని బౌలర్ సకాలంలో అందుకోవడంలో విఫలమయ్యాడు. పిచ్ మధ్యలో పడిపోయిన ఏ బ్యాటర్ అయినా లేచి పరిగెత్తడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం పిచ్‌పై దొర్లుకుంటూ మొత్తానికి కిందా మీదా పడి ఎలాగోలా సింగిల్‌ను పూర్తి చేశాడు.
కనీసం లేచి పరిగెత్తే టైం లేకపోవడంతోనే ఇలా చేసినట్లు సదరు బ్యాటర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసినా ప్రస్తుతం సోషల్ మీడియలో మాత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే అతని కష్టం గుర్తించిన ప్రత్యర్థి ప్లేయర్లు కూడా చప్పట్లతో సదరు బ్యాటర్‌ను అభినందించడం విశేషం. వీలైతే మీరు వీడియోపై ఒక లుక్కేయండి.
It's almost like a dream when you're trying to run but you just can't😄 @HCLSoftware#HCLSoftwareVIPExperience pic.twitter.com/RdWgAlwFjX
— European Cricket (@EuropeanCricket) October 18, 2022
Comments
Please login to add a commentAdd a comment