యూరోపియన్ క్రికెట్ అంటేనే ఫన్నీకి పెట్టింది పేరు. అక్కడ ఆడే పిచ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. క్లబ్ క్రికెట్‌కు మారుపేరుగా నిలిచే యూరోపియన్ లీగ్‌లో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా బౌలర్.. రనౌట్ చాన్స్‌ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో నేరుగా వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడం బ్యాటర్‌కు కలిసివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్టా లీగ్‌లో బుగిబ్బా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. బ్లాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేశాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంతలో కీపర్ బంతిని విబోర్‌కు విసిరాడు. బంతిని సక్రమంగానే అందుకున్న అతను వికెట్లకు గిరాటేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి మిస్ అయిదంటే పర్వాలేదు.. కానీ ఒక అడుగు దూరం నుంచి కూడా రనౌట్ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపించింది.
Power ✅
— European Cricket (@EuropeanCricket) February 6, 2023
Accuracy ❌
Missed from point-blank range😱 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether #CricketinMalta pic.twitter.com/xTORBNPQx6
Comments
Please login to add a commentAdd a comment