
ఇలాంటి ఫీల్డింగ్ నెవ్వర్ బిఫోర్! (PC: X)
"Craziest Bit Of Cricket"- Video: హోరాహోరీ మ్యాచ్‌లో వైడ్ బాల్‌ను ఆపేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ విఫలమయ్యాడు. అతడి కాళ్ల మధ్య గుండా బౌండరీ లైన్ వైపు బంతి వెళ్తుండగా ఓ ఫీల్డర్ రంగంలోకి దిగాడు.
పాదరసంలా కదిలి సరిగ్గా బౌండరీ రోప్‌ను బాల్ తాకే ముందే ఆపేశాడు. వేగంగా పరిగెత్తుకురావడం మూలాన బ్యాలెన్స్ తప్పి అడ్వర్టైజ్‌మెంట్ బోర్డు వైపు వెళ్లి.. ఎగిరి అవతలకు దూకాడు. వెంటనే మళ్లీ వచ్చి బంతిని వికెట్ కీపర్ వైపు విసరాలని అనుకున్నాడు.
కానీ అప్పటికే వికెట్ కీపర్ బౌండరీ రోప్ వద్దకు పరిగెత్తుకు రాగా.. హడావుడిలో ఆ ఫీల్డర్ బంతిని చేజార్చుకున్నాడు. ఇంకేముంది బాల్ రోప్ అవతల పడింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. ఆ ఫీల్డర్ చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.
యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్- డొనాస్టడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డొనాస్టడ్ ఫీల్డర్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్రేజియెస్ట్ బిట్ ఆఫ్ క్రికెట్’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డొనాస్టడ్ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్ జట్టును 133/5కే కట్టడి చేసి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మార్చి 22న మొదలుకానున్న ఈ మెగా టీ20 లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-2024 తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Fielding heroics meets comedy gold! 😂#EuropeanCricket #StrongerTogether #ECL24 pic.twitter.com/uXAv6Lu5F2
— European Cricket (@EuropeanCricket) March 16, 2024