Fielding
-
‘క్రేజియెస్ట్ బిట్ ఆఫ్ క్రికెట్’.. ఇలాంటి ఫీల్డింగ్ నెవ్వర్ బిఫోర్!
"Craziest Bit Of Cricket"- Video: హోరాహోరీ మ్యాచ్‌లో వైడ్ బాల్‌ను ఆపేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ విఫలమయ్యాడు. అతడి కాళ్ల మధ్య గుండా బౌండరీ లైన్ వైపు బంతి వెళ్తుండగా ఓ ఫీల్డర్ రంగంలోకి దిగాడు. పాదరసంలా కదిలి సరిగ్గా బౌండరీ రోప్‌ను బాల్ తాకే ముందే ఆపేశాడు. వేగంగా పరిగెత్తుకురావడం మూలాన బ్యాలెన్స్ తప్పి అడ్వర్టైజ్మెంట్ బోర్డు వైపు వెళ్లి.. ఎగిరి అవతలకు దూకాడు. వెంటనే మళ్లీ వచ్చి బంతిని వికెట్ కీపర్ వైపు విసరాలని అనుకున్నాడు. కానీ అప్పటికే వికెట్ కీపర్ బౌండరీ రోప్ వద్దకు పరిగెత్తుకు రాగా.. హడావుడిలో ఆ ఫీల్డర్ బంతిని చేజార్చుకున్నాడు. ఇంకేముంది బాల్ రోప్ అవతల పడింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. ఆ ఫీల్డర్ చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్- డొనాస్టడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డొనాస్టడ్ ఫీల్డర్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్రేజియెస్ట్ బిట్ ఆఫ్ క్రికెట్’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డొనాస్టడ్ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇండిపెండెంట్ క్రికెట్ క్లబ్ జట్టును 133/5కే కట్టడి చేసి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మార్చి 22న మొదలుకానున్న ఈ మెగా టీ20 లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-2024 తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించనున్న విషయం తెలిసిందే. Fielding heroics meets comedy gold! 😂#EuropeanCricket #StrongerTogether #ECL24 pic.twitter.com/uXAv6Lu5F2 — European Cricket (@EuropeanCricket) March 16, 2024 -
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు. నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది. ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు. పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బ్యాగుల్లో కాకర సాగు పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా.. ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా.. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి. 10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427. వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941. (చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! ) -
కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో?
క్రికెట్లో 35 ఏళ్లు దాటాయంటే సదరు ఆటగాళ్లు రిటైర్మెంట్కు దగ్గరైనట్లే. ఈ వయసులో ఫిట్నెస్ను కాపాడుకుంటూ జట్టులో కొనసాగడమే ఒక్కోసారి కష్టంగా మారుతుంటుంది. అలాంటిది ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ 35 ఏళ్ల వయసులోనూ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుతం వేడ్ హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విజబుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వేడ్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఓవల్ ఇన్విజబుల్స్ ఇన్నింగ్స్ 94వ బంతికి ఇది చోటుచేసుకుంది. జోర్డాన్ థాంప్సన్ వేసిన బంతిని గస్ అత్కిన్సన్ డీప్‌స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న మాథ్యూ వేడ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకొని బౌండరీ ఇవతలకు విసిరేశాడు. ఒకవేళ వేడ్ పట్టుతప్పి ఉంటే కచ్చితంగా సిక్స్ వచ్చేదే. కానీ వేడ్ ఫీల్డింగ్ పుణ్యానా కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. వేడ్ అద్బుత విన్యాసానికి స్టాండ్స్‌లోని ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓవల్ ఇన్విజబుల్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ వంద బంతుల్లో 131 పరుగులు చేసింది. అనంతరం ఓవల్ ఇన్విజబుల్స్ 99 బంతుల్లో విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో చివర్లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టును గెలిపించిన నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. We'll have that on repeat, Matthew Wade! 😮💨🔁#TheHundred pic.twitter.com/LvxjWhgP7T — The Hundred (@thehundred) August 2, 2023 చదవండి: WI Vs IND 1st T20: తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే? Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. -
'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?'
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ గెలిచిన రోహిత్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ సిరాజ్ ఆదిలోనే ఉస్మాన్ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు స్వేచ్చగా బ్యాట్ ఝులిపించడంతో పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులతో పటిష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ పరిగెత్తడంలో ఎంత బద్దకంగా ఉంటాడో మరోసారి చూపించాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ మూడో బంతిని లబుషేన్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. అయితే బంతి రోహిత్, శార్దూల్‌కు గ్యాప్‌లో వెళ్లింది. ఎలాగూ బౌండరీ పోతుంది అనుకున్నాడేమో తెలియదు కానీ మిడాన్‌లో ఉన్న రోహిత్ కనీసం పరిగెత్తే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే షార్ట్ మిడ్‌వికెట్ వద్ద ఉన్న శార్దూల్ మాత్రం బంతి వెనకాలే వేగంగా పరిగెత్తి బౌండరీ రాకుండా అడ్డుపడ్డాడు. దీంతో టీమిండియాకు ఒక పరుగు సేవ్ అయింది. అయితే రోహిత్ తీరుపై టీమిండియా అభిమానులు మండిపడ్డారు. పదేళ్లుగా ఒక్క మేజర్ టైటిల్ గెలవలేదు.. డబ్ల్యూటీసీ రూపంలో మరోసారి ఆ చాన్స్ వచ్చింది.. అంతటి కీలక మ్యాచ్‌లో పరిగెత్తడంలో ఇంత బద్దకం అవసరమా అంటూ కామెంట్ చేశారు. రోహిత్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/k6IiPRI9we — Spider Rashid (@RashidSpider) June 7, 2023 చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..! అందుకే అశ్విన్‌ను పక్కనబెట్టాం: రోహిత్ శర్మ -
'మీ కంటే బాల్ బాయ్ బెటర్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు'
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. డెత్ ఓవర్లలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. అఖరి 5 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా భారత ఫీల్డర్లు కూడా దారుణ ప్రదర్శన కనబరిచారు. ప్రోటీస్ బ్యాటర్లు ఇచ్చిన నాలుగు ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు టీమిండియా భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ప్రోటీస్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో తొలి బంతికి.. క్లాసన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సిరాజ్ జారవిడిచాడు. అదే ఓవర్లో రెండో బంతికి మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బిష్ణోయ్ విడిచిపెట్టాడు. దీంతో ఆ తర్వాతి రెండు బంతులను మిల్లర్ ఫోర్, సిక్స్‌గా మలిచాడు. కాగా మిల్లర్ కొట్టిన సిక్సర్‌ను బౌండరీ లైన్ బయట ఫీల్డింగ్ చేస్తున్న ఓ బాల్ బాయ్ అద్భుతంగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత ఫీల్డర్ల కంటే బాల్ బాయ్ చాలా బెటర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'మీ కన్నా బాల్ బాయ్ బెటర్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు' అంటూ కామెంట్ చేశాడు. pic.twitter.com/gukMzouJI6 — Richard (@Richard10719932) October 6, 2022 చదవండి: T20 World Cup 2022: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం! -
మరీ ఇంత బద్దకమా.. ఒక్క దానితో పోయేది!
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంక లెజెండ్స్ 70 పరుగులతో విజయం సాధించింది. తిలకరత్నే దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.ఈ విషయం పక్కనబెడితే.. బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి దొరికితే త్రో వేయాల్సింది పోయి అలాగే నిల్చుండిపోవడం జట్టుకు నష్టం చేకూర్చింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కేవలం ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు తీయడం ఆసక్తి కలిగించింది. లంక లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ లెజెండ్స్ బౌలర్ వేసిన బంతిని లంక బ్యాటర్ స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. కీపర్ క్యాచ్ అందుకునే క్రమంలో మిస్ అవడంతో అతని కాలికి బంతి తగిలి ముందుకు వెళ్లింది. ఈలోగా అక్కడికి థర్డ్‌మన్ ఫీల్డర్ వచ్చాడు. బంతిని అందుకున్నప్పటికి త్రో వేయలేదు. అప్పటికే లంక లెజెండ్స్ రెండు పరుగులు పూర్తి చేశారు. త్రో వేయకపోవడంతో మూడో పరుగుకు యత్నించారు. ఫీల్డర్ టెన్షన్లో సరిగ్గా త్రో వేయలేకపోయాడు. అలా బంతి మరోసారి మిస్ అయింది. దీంతో లంక బ్యాటర్లు మరో పరుగు పూర్తి చేశారు. అలా ఒక్క పరుగు పోయి నాలుగు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే రోడ్‌సేప్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Oh they ran four 😃 TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n — Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022 చదవండి: సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం -
స్థల వివాదంలో కత్తితో దాడి
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి గ్రామంలో ఒక ఆలయ స్థల వివాదం రక్తసిక్తంగా మారింది. దాడుల్లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ ఘోరం గురువారం రాత్రి జరిగింది. కత్తితో విచక్షణారహితంగా దాడి గ్రామంలో దేవాలయానికి చెందిన ఒక ఎకరా పొలంపై వివాదం నడుస్తోంది. ఈ పొలం పక్కనే ఉన్న భూమి కూడా తనదేనని శ్రీధర్ గుప్త గొడవచేసేవాడు. ఇది కోర్టులో ఉండగా రెండు వర్గాలకు చెందినవారు తరచూ గొడవపడేవారు. రాత్రి కూడా ఇలాగే ఘర్షణ జరిగింది. శ్రీధర్ గుప్త కత్తితో విచ్చలవిడిగా దాడి చేయడంతో రామాంజనయ్య (48), శిల్ప (38) అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మల్లికార్జున అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడి మధుగిరిలో చికిత్స చేయించి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ గుప్త, అతని సంబం«దీకులు తమపై దాడి చేశారని మృతుల కుటుంబీకులు తెలిపారు. ఎస్పీ పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ శహాపూర్వాడ్ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మధుగిరి ఆస్పత్రికి తరలించారు. మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు శ్రీధర్ గుప్త పరారీలో ఉన్నాడు. (చదవండి: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగాజలం జల్లుతూ..!) -
చరిత్రలో నిలిచిపోయే చాన్స్ మిస్.. వైరల్‌గా శ్రేయాస్ అయ్యర్ విన్యాసం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా అదరగొడితే.. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే వీటన్నింటిని మించి శ్రేయాస్ అయ్యర్ చేసిన ఫీల్డింగ్ విన్యాసం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకవేళ ఇది గనుక క్యాచ్‌గా అందుకొని ఉంటే మాత్రం అయ్యర్ పేరు చరిత్రలో నిలిచిపోయేది. విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతిని నికోలస్ పూరన్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా తరలించాడు. బంతి ఎక్కువ హైట్‌లో వెళ్లడంతో పూరన్ సహా అంతా సిక్స్ అని భావించారు. కానీ బౌండరీలైన్ వద్ద శ్రేయాస్ అయ్యర్ గాల్లోకి ఎగిరి శరీరాన్ని విల్లులా మార్చుకొని ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అతని కుడి కాలు బౌండరీలైన్‌కు ఇంచు దూరంలో ఉండడం.. బ్యాలెన్స్ గాక క్యాచ్ అందుకోవడం కష్టమైంది. దీంతో బంతిని ఇవతలికి విసిరేసి తాను బౌండరీ లైన్ అవతలికి వెళ్లిపోయాడు. అలా క్యాచ్ మిస్ అయినా సిక్సర్‌ను తప్పించడంలో అయ్యర్ విజయవంతం అయ్యాడు. అయ్యర్ విన్యాసానికి సంబంధించిన వీడియోను ఫ్యాన్‌కోడ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో రోహిత్ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా.. ఆఖర్లో దినేశ్ కార్తిక్ మరోసారి ఫినిషర్ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ చేదనలో చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయి, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, జడేజాలు చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సోమవారం(ఆగస్టు 1న) జరగనుంది. Well, that's a SUPERMAN move by @ShreyasIyer15! Watch the India tour of West Indies, only on #FanCode👉https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket#WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/GuC3MbdwzV — FanCode (@FanCode) July 29, 2022 చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. Sourav Ganguly: మనసు మార్చుకున్న 'దాదా'.. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో -
విజయం సాధించినప్పటికి నిరాశలో రోహిత్?
శ్రీలంకతో టి20 సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేసింది. లక్నో వేదికగా ముగిసిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 44 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్(57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది. ఇంత భారీ విజయం సాధించినప్పటికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంతోషం లేదంటా. మరి దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ప్రెజంటేషన్లో మాట్లాడాడు. ''లంకతో టి20 మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషమే. కానీ ఒక్క విషయం నన్ను ఇబ్బంది పెట్టింది. మా ఫీల్డింగ్ అనుకున్నంత ప్రమాణాల్లో లేదు. మ్యాచ్‌లో కొన్ని ఈజీ క్యాచ్‌లు జారవిడిచాము. రానున్న మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. దీనికోసం ప్రాక్టీస్ సెషన్లో ఫీల్డింగ్ కోచ్‌తో సంప్రదింపులు జరిపి టెక్నిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తాం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022 వరకు ఫీల్డింగ్‌లో బెస్ట్ టీమ్‌గా తయారవ్వాలి.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బుమ్రాను ఆడించడం ఏమిటి.. నిజంగా ఆశ్చర్యపోయా.. వాళ్ల సంగతి ఏంటి ''ఇక ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి రావడం సంతోషకరమైన విషయం. ఎంతోకాలం నుంచి ఇషాన్ నాకు తెలుసు. ముంబై ఇండియన్స్‌కు ఇద్దరం కలిసే ఆడుతున్నాం. పవర్ ప్లేలో అతను ఎంత విలువైన ఆటగాడో మరోసారి తెలిసొచ్చింది. మంచి రిథమ్‌తో ఇషాన్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక ఎండ్ నుంచి నేను ఎంజాయ్ చేస్తూ వచ్చా. ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్‌ను ఎవరు ఆపలేరు. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే రిపీట్ చేస్తాడని అనుకుంటున్నా.'' అని తెలిపాడు. చదవండి: Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు ''జడేజా రీఎంట్రీ అదిరిపోయింది. రెండు నెలలు మాకు దూరంగా ఉన్నప్పటికి సూపర్ బౌలింగ్‌తో మెరిశాడు. నిజంగా జడేజా రావడం జట్టను మరింత బలోపేతం చేసింది. జడేజా నుంచి రావాల్సింది చాలా ఉంది. రానున్న రోజుల్లో జడేజా బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా టెస్టుల్లో జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. పరిమిత ఓవర్లలోనూ జడ్డూను సరైన రీతిలో వాడుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. Watch Video: రోహిత్ శర్మ వీడియో -
ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్!
న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26 ఓవర్లో కేవలం ఒక బంతికే 7పరుగులును బంగ్లాదేశ్ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్‌లో అఖరి బంతిను విల్ యంగ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుంది. కాగా స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు. అయితే ఫీల్డర్ బౌలర్ ఎండ్ వైపు త్రో చేయగా, బౌలర్ ఆ బంతిని ఆపలేకపోవడంతో ఫోర్ బౌండరీకు వెళ్లింది. దీంతో ఓవర్‌త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అద్భుతంగా ఆడుతంది. తొలి వికెట్‌కు ఓపెనర్లు లాథమ్, యంగ్ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్ 186 పరుగులు సాధించి డబుల్ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. చదవండి: WI vs IRE: 4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ .. Meanwhile, across the Tasman Sea... ⛴️ Chaos in the field for Bangladesh as Will Young scores a seven (yes, you read that correctly!) 😅#NZvBAN | BT Sport 3 HD pic.twitter.com/fvrD1xmNDd — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్‌ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్‌ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మార్క్‌వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! -
మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు
బ్లాక్‌క్యాప్స్ అంటే నాణ్యమైన ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. టి20, పరిమిత ఓవర్లలో వారి ఫీల్డింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది టెస్టుల్లో కూడా తమదైన ఫీల్డింగ్‌తో అదరగొట్టారు కివీస్ ఆటగాళ్లు. అందుకు మిచెల్ సాంట్నర్ ఒక నిదర్శనం. అసలే టెస్టు మ్యాచ్‌ల్లో సిక్సర్లు కొట్టడం అరుదు. అలాంటిది అయ్యర్ కొట్టిన భారీషాట్‌ను సాంట్నర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆపిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. భారత్‌తో ముగిసిన రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. ఇక టీమిండియా- కివీస్ టెస్టు సిరీస్‌లో మిచెల్ సాంట్నర్ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. కేవలం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మాత్రమే జట్టుకు సేవలందించిన సాంట్నర్ అవార్డు గెలుచుకున్నాడు. తన ఫీల్డింగ్‌తో సిక్స్ రాకుండా అడ్డుకున్న సాంట్నర్‌ను ''బెస్ట్ సేవ్ ఆఫ్ ది మ్యాచ్'' కింద రూ.లక్ష ప్రైజ్‌మనీ ఇవ్వడం విశేషం. చదవండి: Ashwin-Ajaz Patel: ఎజాజ్ పటేల్‌కు అశ్విన్ సాయం.. ఫ్యాన్స్ ఫిదా టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇన్నింగ్స్ 47వ ఓవర్లో సోమర్ విల్లే బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కచ్చితంగా సిక్స్ అనుకుంటున్న తరుణంలో సాంట్నర్ మ్యాజిక్ చేశాడు. బౌండరీలైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న అతను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం కావడంతో బంతిని బౌండరీ ఇవతలకు వేయడంతో సిక్స్ రాకుండా అడ్డుకున్నాడు. అలా జట్టుకు ఐదు పరుగులు కాపాడిన సాంట్నర్‌ను సహచర ఆటగాళ్లు అభినందించారు. ఇక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడి గడ్డపై 3 టెస్టులు.. 3 వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. చదవండి: Babar Azam: బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు Terrific work by #MitchellSantner, he saved 5 runs for his team. @StarSportsIndia #AskTheExperts @BLACKCAPS #INDvsNZTestSeries #INDvNZ pic.twitter.com/3P9hOot8Nw — Pharmacists kunal Sharma (@KunalJmu) December 3, 2021 -
ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Mustafizur Rahmans Outstanding Effort Saves SIX For Side: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో.. గ్లెన్ మాక్స్వెల్ బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ సరైన సమయంలో జంప్ చేసి ఆ బంతిని సిక్స్‌గా వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో సిక్స్‌కు బదులుగా సింగిల్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముస్తాఫిజుర్ సూపర్ ఫీల్డింగ్కునెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(58), యశస్వి జైస్వాల్(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. చదవండి: రాజస్తాన్ స్టార్ ఆటగాడిపై ఆ జట్టు కోచ్ కీలక వాఖ్యలు. Mustafizur Rahman's brilliance 😍#RCBvRR #IPL2021 pic.twitter.com/i2vXWZI6D8 — Kart Sanaik (@KartikS25864857) September 29, 2021 -
ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని..
లండన్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. తాను దేన్నీ అంత తేలిగ్గా తీసుకోనని, తనది నిరంతర ప్రయాణమని, ప్రస్తుతం ఆట, ఫిట్నెస్లపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజమే.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. ఇందుకోసం నేను విపరీతంగా కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే నా ఫీల్డింగ్ బాగుంటుంది. క్రెడిట్ గోస్ టూ విరాట్ కోహ్లీ. అతను ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అతడిని చూసే జట్టు సభ్యుందరూ తమ ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకున్నారు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పాడు. త్వరలో యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 2021 ఆడటం ఉపయోగకరమని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రస్తుతం జడ్డూ మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేస్తున్నాడు. సరైన సమయంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును ఆదుకుంటూ 3డీ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127), రహానే(1) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ(83), కోహ్లీ(42) రాణించగా.. పుజారా(9) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. -
అశ్విన్, పుజారాలపై.. కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం; వీడియో వైరల్
లండన్: టీమిండియా సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో డర్హమ్‌లో టీమిండియా తన ప్రాక్టీస్‌ను షురూ చేసింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ నేతృత్వంలో జట్టు సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయింది. కోహ్లి, రోహిత్‌లు ఒక జట్టుకు.. పుజారా, అశ్విన్‌లు మరో జట్టుకు నాయకత్వం వహించారు. కాగా ఈ ఫీల్డింగ్ సెషన్లో అశ్విన్, పుజారాల ద్వయంపై కోహ్లి, రోహిత్‌ల జట్టు.. పూర్తి ఆధిపత్యం చెలాయింది. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు ఫీల్డింగ్ డ్రిల్‌లో భాగంగా రన్నింగ్, జంపింగ్, క్యాచ్‌లు ఇలా రకరకాల సెషన్లు నిర్వహించారు. వీటన్నింటిని కలిపి చూస్తే.. కోహ్లి, రోహిత్‌ల జట్టు 10-8 తేడాతో అశ్విన్- పుజారా ద్వయంను ఓడించింది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక రిషబ్ పంత్‌కు డెల్టా వేరియంట్ లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమిండియాలో కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి పంత్‌తో పాటు సహాయక సిబ్బంది, వృద్ధిమాన్ సాహాలు ఐసోలేషన్‌లో ఉండగా.. టీమిండియా జట్టు డర్హమ్‌లో బయోబబూల్‌లో ఉంటూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. Two squads 🤜🤛 Fielding drills 🙌 A run-through #TeamIndia's fun drill, courtesy fielding coach @coach_rsridhar ahead of their practice session 👊 - by @RajalArora #ENGvIND pic.twitter.com/NXZ4LI0aPR — BCCI (@BCCI) July 19, 2021 -
ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి
న్యూఢిల్లీ: విదేశీ జట్లపై నిలకడగా విజయాలు దక్కాలంటే భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ విభాగంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ అభిప్రాయపడ్డారు. చాలాకాలం భారత అండర్–19 పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అభయ్ శర్మ... గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టుకు తొలిసారి ఫీల్డింగ్ కోచ్‌గా వచ్చారు. చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఏర్పాటు కావడం... జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు తగినంత సమయం కూడా లభించకపోవడంతో ఆయన ఫీల్డింగ్ విభాగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన మాత్రం అభయ్ శర్మ పనితీరు ఎలా ఉందనే విషయం తెలియజేస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ‘ఫీల్డింగ్ విషయానికొస్తే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలంటే, పరుగులు ఎక్కువ ఇవ్వకూడదంటే ఫీల్డర్లు మైదానంలో ఎల్లవేళలా చురుకుగా కదలాల్సి ఉంటుంది. సాంకేతికంగా కూడా కొన్ని అంశాల్లో మనం మెరుగుపడాలి. ముఖ్యంగా త్రోయింగ్‌లో మన అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే మనం సరైన పద్ధతిలో శిక్షణ తీసుకోకపోతే ఆ తర్వాత మనకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అభయ్ శర్మ విశ్లేషించారు. ‘విదేశీ మహిళా క్రికెటర్లతో పోలిస్తే మనం కొన్ని విభాగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నామని అంగీకరించాలి. దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలో చురుకుగా కదులుతారు. శారీరకంగా కూడా విదేశీ మహిళా క్రికెటర్లు పటిష్టంగా ఉంటారు’ అని అభయ్ శర్మ వివరించారు. -
వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మ్యాచ్ ఓడిపోయినా.. భారత ఆటగాళ్లు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్‌తో అలరిస్తే.. కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొలి టీ20లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రాహుల్ చేసిన ఒక ఫీట్ అభిమానులకు మజాను పంచింది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. అక్షర్ వేసిన తొలి బంతిని బట్లర్ భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద వేచి ఉన్న రాహుల్ బంతిని అందుకునే క్రమంలో గాల్లోకి లేచాడు. దాదాపు అందుకున్న రాహుల్ నియంత్రణ కోల్పోవడంతో బంతిని మైదానంలోకి విసిరేశాడు. కచ్చితంగా సిక్స్ అనుకున్న షాట్‌ను రాహుల్ ఆపిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ రాహుల్ ఈ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉండేది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు కోహ్లి డకౌట్; ఉత్తరాఖండ్ పోలీస్ వార్నింగ్ Amazing fielding by KL Rahul #IndiavsEngland #INDvsEND #1stT20 pic.twitter.com/NebyVSkGDl — Secret Superstar (@InstaSSKKL) March 12, 2021 -
హెల్మెట్‌తో స్లిప్ ఫీల్డింగ్.. సూపర్ అంటున్న నెటిజన్లు
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో అతను హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆ తరువాత రోహిత్ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. అయితే రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఓ కారణం ఉంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జో రూట్ డిఫెన్స్ ఆడుతున్న సందర్భంలో బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇది చూసి భారత క్రికెటర్లతో సహా గ్రౌండ్లో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. రోహిత్ ఇలా చేయడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
చెత్త ఫీల్డింగ్‌పై సన్నీ సెటైర్లు
అడిలైడ్ : టీమిండియా చెత్త ఫీల్డిండ్పై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తన దైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లు జారవిడిచారు. దీనిపై సునీల్ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా ఆటగాళ్ల వరస్ట్ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాకు వారం ముందుగానే క్రిస్మస్ పండుగ వచ్చిందని ఎద్దేవా చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా నేలపాల్జేశాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. క్రిస్మస్ మూడ్‌లో ఉన్న భారతీయులు వారం ముందుగానే బహుమతులు పంచిపెట్టారని వ్యాఖ్యానించాడు. (చదవండి: పృథ్వీ షా ఏందిది?) 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్యాచ్‌ను జస్ప్రీత్ బుమ్రా జారవిడిచాడు. భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్‌పై మరింత ఒత్తిడి పెంచే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అయితే, అశ్విన్, ఉమేశ్ యాదవ్, బుమ్రా సమష్టిగా రాణించడంతో చివరకు తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియాను టీమిండియా కట్టడి చేయగలిగింది. 191 పరుగుల వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ రనౌటయ్యాడు. కెప్టెన్ పైన్(73) ఒంటరి పోరాటం చేసి నాటౌట్‌గా నిలిచాడు. (చదవండి: ఆసీస్ 191 ఆలౌట్, అశ్విన్ సక్సెస్) -
‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’
న్యూఢిల్లీ: టీమిండియా అల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమ ఫీల్డర్ అని కితాబిచ్చారు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో అందరు ఆటగాళ్లు ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో రాజీపడటం లేదని దీంతో ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో, అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది బెస్ట్ ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజానే అందరికంటే అత్యుత్తమని అభిప్రాయపడ్డారు. ('జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్.. ఇక్కడితో వదిలేయండి') ‘ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్. అంతేకాకుండా అతడు జట్టుకు అవసరమైన నాణ్యమైన ఆల్‌రౌండర్. అవసరమైన సమయంలో బ్యాట్‌తో రాణించి మెప్పించగలడు.. బంతితో మాయ చేయగలడు.. అదేవిధంగా మెరుపు ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మనవైపు తిప్పగలడు. ఇక ఔట్‌ఫీల్డ్, కవర్స్‌లో అతడిని మించిన ఫీల్డర్ మరోకరు ఉండరు. గల్లీ, స్లిప్‌లో అతడు ఎక్కువగా ఫీల్డింగ్ చేయడు. అయినా బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ఏ ఫీల్డింగ్ పొజిషన్ నుంచైనా వికెట్లపైకి నేరుగా విసరగల సామర్థ్యం అతడికి ఉంది. ఇక క్యాచ్‌లు అందుకోవడంలో అతడివి సేఫ్ హ్యాండ్స్. బంతి అతడి చేయి దాటి పక్కకుపోదు. బహుశా అందుకే అనుకుంటా జడేజా బెస్ట్ పీల్డర్ అని కీర్తింపబడుతున్నాడు’ అని గంభీర్ పేర్కొన్నారు. (నా ఆట అప్పుడు మొదలవుతుంది!) -
ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్!
తిరువనంతపురం: వెస్టిండీస్‌తో తొలి టీ-20లో వీరోచితంగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు రెండో టీ-20లో షాక్ తగిలిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని జరిగిన రెండో టీ-20లో భారత్ విసిరిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. 1.3 మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి.. భారత్‌తో వరుసగా ఏడు పరాజయాల అనంతరం విజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా మూడు సిరీస్‌ను 1-1తో సమం చేసి.. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయానికి చెత్త ఫీల్డింగ్ ప్రధాన కారణం. విండీస్ ఓపెనర్లు సిమన్స్, లూయిస్ ఇచ్చిన క్యాచ్‌లను ఓకే ఓవర్లో నేలపాలు చేయడం టీమిండియాను గట్టిగా దెబ్బతీసింది. ఐదో ఓవర్లో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద విండీస్ ఓపెనర్ సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. అనంతరం 17 పరుగుల వద్ద ఎల్విన్ లూయిస్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ జారవిడిచాడు. దీంతో లైఫ్ పొందిన సిమన్స్ అజేయంగా 67 పరుగులు చేయగా.. లెవిస్ 40 పరుగులు చేసి లక్ష్యఛేదనను అలవోకగా మార్చేశాడు. చదవండి: వాహ్ క్యాచ్... వారెవ్వా కోహ్లి! మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టుకొని.. శిమ్రన్ ఔట్‌ను చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి చెత్త ఫీల్డింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి చెత్త ఫీల్డింగే కారణమని, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కాదని మ్యాచ్ అనంతరం అభిప్రాయపడ్డాడు. 2018 జనవరి నుంచి భారత్ ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేయగా.. ఎనిమిది సార్లు ఓటమిపాలైంది. అదే ఛేజింగ్‌లో 18 మ్యాచ్‌లు ఆడగా 14 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే, ఈ లెక్కలను తోసిపుచ్చిన కోహ్లి.. ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించబోవని అన్నారు. 16 ఓవర్ల వరకు తమ బ్యాటింగ్ బాగానే సాగిందని, కానీ చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులే రావడం కొంత ప్రతికూలతకు కారణమైందని, దీనిపై ఫోకస్ చేయాల్సిన అవసరముందన్నారు. శివం దూబే అద్భుతంగా ఆడటంతో భారత్ 170 పరుగులు చేసిందన్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే విండీస్ బౌలర్లు కటర్లు, పేస్ బౌలింగ్‌లో మార్పుతో మాకు ఒరిగిందేమీ లేదు. కానీ, మేం ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తే.. ఎన్ని పరుగులు చేసినా ప్రయోజనం ఉండదు. గడిచిన రెండు మ్యాచ్‌లోనూ మా ఫీల్డింగ్ బాలేదు. ఒక్క ఓవర్లో రెండు క్యాచ్‌లను జారవిడిచాం. ఒకే ఓవర్లు రెండు చాన్సులు వారికి వచ్చాయి. మేం మా ఫీల్డింగ్‌ను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. -
టీమిండియా ఆటగాళ్లపై యువీ ఫైర్
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తొలి టి20లో టీమిండియా ఫీల్డింగ్ చెత్తగా ఉందని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విమర్శించాడు. యువ ఆటగాళ్లలో చురుకుదనం లేదని కామెంట్ చేశాడు. ‘ఈరోజు మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ చెత్తగా ఉంది. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు ఆలస్యంగా స్పందించారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఫీల్డింగ్ చేయలేకపోతున్నారా’ అని యువీ ట్వీట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లతో పాటు కోహ్లి కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయకపోవడంతో విండీస్ భారీ స్కోరు సాధించింది. 16వ ఓవర్లో హేట్‌మెయిర్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. దీంతో హేట్‌మెయిర్ టి20ల్లో మొట్టమొదటి అర్ధసెంచరీ సాధించాడు. కీరన్ పొలార్డ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ పట్టలేకపోయాడు. చాహర్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా మూడు క్యాచ్‌లు నేలపాల్జేశారు. India very poor on the field today ! Young guns reacting a bit late on the ball! Too much cricket ? ? Let’s get these runs come on lads — yuvraj singh (@YUVSTRONG12) December 6, 2019 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపంతో కరీబియన్ల భరతం పట్టాడు. మరోవైపు బ్యాటింగ్‌లో చెలరేగి చివరకు వరకు క్రీజ్‌లో ఉండి జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసలు కుపించాడు. ‘అమేజింగ్.. జస్ అమేజింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. విండీస్, టీమిండియా మొదటి టి20 మ్యాచ్ మంచి వినోదం అందించిందని వ్యాఖ్యానించాడు. (చదవండి: కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్) Amazing. Just amazing, @imVkohli — Sir Vivian Richards (@ivivianrichards) December 6, 2019 -
బ్రాడ్‌మన్ తర్వాత కోహ్లినే!
రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్ డాన్ బ్రాడ్‌మన్ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది. ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. -
అదిరే ఫీల్డింగ్..కళ్లు చేదిరే క్యాచ్‌లు
-
ప్రాక్టీస్ జోరుగా...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ నెల 24 నుంచి ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివారం వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సెంచూరియన్ పరాజయం తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకొని సరదాగా విహరించిన జట్టు సభ్యులంతా నెట్స్‌కు హాజరై చెమటోడ్చారు. ఫుట్‌బాల్ ఆడి వార్మప్ చేసిన తర్వాత ముందుగా జట్టు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టింది. పార్థివ్, రాహుల్, రహానే, రోహిత్, దినేశ్ కార్తీక్‌లతో కోచ్ ఆర్. శ్రీధర్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. మంగళవారమే జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రాక్టీస్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని బంతులు విసరగా రాహుల్, విజయ్, పుజారా ఒకేసారి సాధన చేశారు. విజయ్, రాహుల్‌కు స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఎక్కువ సేపు బౌలింగ్ చేశారు. అనంతరం కోహ్లి, రహానే, పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు. తొలి రెండు టెస్టులకు జట్టులో స్థానం లభించని రహానే చాలా సేపు ఆడటం విశేషం. ప్రధాన పేసర్లు భువీ, షమీ వీరికి బౌలింగ్ చేశారు. మరో వైపు పిచ్‌పై ఉన్న పచ్చికను ఆదివారం కొంతవరకు తొలగించారు. ‘వికెట్‌పై తగినంత పచ్చిక ఉంచాం. మ్యాచ్‌కు ముందు దీనిని తగ్గించకపోవచ్చు. సరిపోయేంత నీటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంచూరియన్ తరహాలో పొడిబారిపోయే ప్రమాదం లేదు. దక్షిణాఫ్రికా జట్టు కోరిక మేరకే దీనిని సిద్ధం చేశాం. పేస్, బౌన్స్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది’ అని వాండరర్స్ క్యురేటర్ బేతుల్ బుతెలెజి చెప్పారు.