అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మ్యాచ్ ఓడిపోయినా.. భారత ఆటగాళ్లు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్‌తో అలరిస్తే.. కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొలి టీ20లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రాహుల్ చేసిన ఒక ఫీట్ అభిమానులకు మజాను పంచింది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. అక్షర్ వేసిన తొలి బంతిని బట్లర్ భారీ షాట్ ఆడాడు.
అయితే బౌండరీ లైన్ వద్ద వేచి ఉన్న రాహుల్ బంతిని అందుకునే క్రమంలో గాల్లోకి లేచాడు. దాదాపు అందుకున్న రాహుల్ నియంత్రణ కోల్పోవడంతో బంతిని మైదానంలోకి విసిరేశాడు. కచ్చితంగా సిక్స్ అనుకున్న షాట్‌ను రాహుల్ ఆపిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ రాహుల్ ఈ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉండేది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
చదవండి:
పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు
కోహ్లి డకౌట్; ఉత్తరాఖండ్ పోలీస్ వార్నింగ్
Amazing fielding by KL Rahul #IndiavsEngland #INDvsEND #1stT20 pic.twitter.com/NebyVSkGDl
— Secret Superstar (@InstaSSKKL) March 12, 2021
Comments
Please login to add a commentAdd a comment