Nz Vs Ban 2nd Test Match: Bangladesh Concede Seven Runs Off One Ball, Video Viral - Sakshi
Sakshi News home page

NZ vs BAN: ఇదేం ఫీల్డింగ్‌ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్‌!

Jan 9 2022 11:01 AM | Updated on Jan 9 2022 12:21 PM

Bangladesh concede seven runs off one ball - Sakshi

ఇదేం ఫీల్డింగ్‌ రా బాబు.. ఒక బంతికి 7పరుగులు.. వీడియో వైరల్‌!

న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌లో కేవలం ఒక బంతికే 7పరుగులును బంగ్లాదేశ్‌ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌ వేసిన ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్‌లో అఖరి బంతిను విల్‌ యంగ్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుంది. కాగా స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్‌ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు.

అయితే ఫీల్డర్‌ బౌలర్ ఎండ్‌ వైపు త్రో చేయగా, బౌలర్ ఆ బంతిని ఆపలేకపోవడంతో ఫోర్‌ బౌండరీకు  వెళ్లింది. దీంతో  ఓవర్‌త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్‌ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడుతంది. తొలి వికెట్‌కు ఓపెనర్లు లాథమ్‌, యంగ్‌ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్‌ 186 పరుగులు సాధించి డబుల్‌ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.

చదవండి: WI vs IRE: 4 ఫోర్లు, 4 సిక్స్‌లు.. పొలార్డ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement