వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జరిగే రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌లో ఓడినా కివీస్ సెమీస్ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది.
సౌతాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో మేం స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. డికాక్, డస్సెన్‌ల భాగస్వామ్యం తర్వాత ఒత్తిడిలో పడ్డాం. వారు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మా బౌలర్లు ప్రత్యర్ధిని 330 పరుగుల్లోపు పరిమితం చేయాల్సి ఉండింది. అలా చేయడంలో మేం విఫలమయ్యాం.
గ్రౌండ్ చాలా చిన్నగా, బ్యాటింగ్‌కు అనుకువగా ఉండింది. అయితే మేము పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మొదటి 10 ఓవర్లలో (పవర్‌ప్లే) పెద్దగా ఏమీ చేయలేకపోయాం. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి తమను తాము గొప్ప స్థితిలో ఉంచుకుంది. ఏ సందర్భంలోనూ వారు మ్యాచ్‌పై పట్టు కోల్పోలేదు. గాయాలు మా జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ ఓటమిని ఇక్కడితో వదిలేసి, తదుపరి పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం. రాత్రికిరాత్రి మేం చెడ్డ జట్టుగా మారిపోమని అనుకుంటున్నానని అన్నాడు.
కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment