వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి (పూణే వేదికగా). ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తబ్రేజ్ షంషిని సౌతాఫ్రికా ఈ మ్యాచ్ నుంచి తప్పించింది. పిచ్ పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో షంషి స్థానంలో కగిసో రబాడ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ లోకీ ఫెర్గూసన్ స్థానంలో టిమ్ సౌథీని జట్టులోకి తీసుకుంది.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment