వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా పూణే వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇవాళ (నవంబర్ 1) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే బరిలోకి దిగనుంది. బొటవేలి ఫ్రాక్చర్ కారణంగా గత రెండు వారాలుగా జట్టుకు దూరంగా ఉన్న కేన్ మామ నిన్న నిర్వహించిన ఫిట్‌నెస్ట్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ విలియమ్సన్‌కు విశ్రాంతిని పొడిగించాలని భావించింది. ఈ మేరకు జట్టు యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. కాగా, అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కేన్ విలియమ్సన్ బొటవేలి ఫ్రాక్చర్‌కు గురైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో న్యూజిలాండ్ గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఈనెల 22న టీమిండియా.. కివీస్‌ను ఖంగుతినిపించగా.. ఆతర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ సమరంలో కివీస్ పోరాడి ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు పటిష్టంగా కనిపిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉన్న న్యూజిలాండ్, ఒక్కసారిగా కిందకు పడిపోయి భారత్, సౌతాఫ్రికాల తర్వాత మూడో స్థానంలో దిగజారింది. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్‌లో ఇకపై అద్భుతాలేవి జరగకపోతే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment