
నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్ తెలిసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా బొటవేలి ఫ్రాక్చర్‌కు గురైన కేన్ మామ.. రెండు వారాల విరామం అనంతరం పూర్తిగా కోలుకుని నెట్స్‌లో సాధన చేయడం ప్రారంభించాడు.
దీంతో అతను న్యూజిలాండ్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు (సౌతాఫ్రికా) జట్టులో చేరతాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ నిజంగానే విలియమ్సన్ పూర్తిగా కోలుకుని జట్టులో చేరితే విల్ యంగ్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో న్యూజిలాండ్ గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఈనెల 22న టీమిండియా.. కివీస్‌ను ఖంగుతినిపించగా.. ఆతర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ సమరంలో కివీస్ పోరాడి ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు పటిష్టంగా కనిపిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉన్న న్యూజిలాండ్, ఒక్కసారిగా కిందకు పడిపోయి భారత్, సౌతాఫ్రికాల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్‌లో ఇకపై అద్భుతాలేవి జరగకపోతే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment