
మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది ఈ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజుకూడా బంగ్లాదేశ్ పూర్తి అధిపత్యం చలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మోమినుల్ హక్(88), వికెట్ కీపర్ లిటన్ దాస్(86) పరుగులతో రాణించారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ 73 పరుగులు అధిక్యంలోఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీశారు. ఇక న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల!
Comments
Please login to add a commentAdd a comment