
లండన్: టీమిండియా సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో డర్హమ్‌లో టీమిండియా తన ప్రాక్టీస్‌ను షురూ చేసింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ నేతృత్వంలో జట్టు సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయింది. కోహ్లి, రోహిత్‌లు ఒక జట్టుకు.. పుజారా, అశ్విన్‌లు మరో జట్టుకు నాయకత్వం వహించారు. కాగా ఈ ఫీల్డింగ్ సెషన్‌లో అశ్విన్, పుజారాల ద్వయంపై కోహ్లి, రోహిత్‌ల జట్టు.. పూర్తి ఆధిపత్యం చెలాయింది.
ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఫీల్డింగ్ డ్రిల్‌లో భాగంగా రన్నింగ్, జంపింగ్, క్యాచ్‌లు ఇలా రకరకాల సెషన్‌లు నిర్వహించారు. వీటన్నింటిని కలిపి చూస్తే.. కోహ్లి, రోహిత్‌ల జట్టు 10-8 తేడాతో అశ్విన్- పుజారా ద్వయంను ఓడించింది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక రిషబ్ పంత్‌కు డెల్టా వేరియంట్ లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమిండియాలో కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి పంత్‌తో పాటు సహాయక సిబ్బంది, వృద్ధిమాన్ సాహాలు ఐసోలేషన్‌లో ఉండగా.. టీమిండియా జట్టు డర్హమ్‌లో బయోబబూల్‌లో ఉంటూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది.
Two squads 🤜🤛
— BCCI (@BCCI) July 19, 2021
Fielding drills 🙌
A run-through #TeamIndia's fun drill, courtesy fielding coach @coach_rsridhar ahead of their practice session 👊 - by @RajalArora #ENGvIND pic.twitter.com/NXZ4LI0aPR
Comments
Please login to add a commentAdd a comment