Practice Session
-
కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో పాటు షాట్ సెలెక్షన్ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు రంజీ మ్యాచ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి... ఆ తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్లను హెచ్చరించడంతో స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ బాటపట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఆరో రౌండ్ రంజీ మ్యాచ్‌ల్లో ఆడగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో కోహ్లితో పాటు కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, హైదరాబాద్ తరఫున మొహమ్మద్ సిరాజ్ కూడా ఆడుతున్నారు. మంగళవారం ఢిల్లీ జట్టుతో కలిసి కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన కోహ్లి ... కోచ్‌లతో చర్చిస్తూ కుర్రాళ్లలో ఉత్సాహం నింపుతూ సందడి చేశాడు. కోహ్లి... ‘కడీ చావల్’ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్... తిరిగి 13 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న నవ్‌దీప్ సైనీ మినహా మిగిలిన 17 మంది ప్లేయర్లు కేవలం టీవీల్లో మాత్రమే చూసిన స్టార్ ఆటగాడితో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ‘చీకూ’గా మొదలైన విరాట్ కోహ్లి ప్రస్థానం... దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ‘కింగ్’ వరకు చేరింది. ఢిల్లీ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్, బ్యాటింగ్ కోచ్ బంటూ సింగ్ పర్యవేక్షణలో విరాట్ ప్రాక్టీస్ సాగించాడు. భారత అండర్–19 జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కోచ్‌గా పనిచేసి, ప్రస్తుత జట్టుకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేశ్ భాటీ విరాట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘అతడేం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. విరాట్‌కు ‘ఛోళే పూరీ’ బాగా ఇష్టమని అతడి కోసం అవి తెప్పించాం. కానీ ఇప్పుడు తినడంలేదని విరాట్ చెప్పాడు’ అని మహేశ్ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ అనంతరం ప్లేయర్లతో కలిసి ‘కడీ చావల్’ (పప్పన్నం) తిన్నాడని వెల్లడించాడు. మొదట ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించకపోయినా... విరాట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జియో సినిమా లైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. కుర్రాళ్లతో కలిసి... ఉదయం తొమ్మిది గంటలకు ఖరీదైన పోర్షే కారులో మైదానానికి చేరుకున్న విరాట్... ఒక్కసారి ప్రాక్టీస్ ప్రారంభించాక నిత్యవిద్యార్థిలా శ్రమించాడు. తొలుత 35 నిమిషాల పాటు ప్లేయర్లతో కలిసి వార్మప్ చేసిన కోహ్లి... ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది. ఆ సమయంలో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోనీ వద్దకు వెళ్లిన కోహ్లి... ‘ఆయుశ్ నువ్వు ముందు బ్యాటింగ్ చేయి. ఆ తర్వాత మనిద్దరం స్థానాలు మార్చుకుందాం’ అని చెప్పాడు. స్టార్ ఆటగాళ్లు రంజీల్లో ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ బోర్డు రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లికి కెపె్టన్సీ చేపట్టాలని కోరగా... ఈ ఇద్దరూ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఐపీఎల్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. నెట్స్‌లో గంటకు పైగా ప్రాక్టీస్ చేసిన విరాట్... త్రోడౌన్స్ వేయించుకొని పుల్ షాట్లు సాధన చేశాడు. పేసర్లు నవ్‌దీప్ సైనీ, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ, మోనీ గ్రెవాల్, స్పిన్నర్లు హర్‡్ష త్యాగి, సుమిత్ మాథుర్‌ను సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే ఆఫ్ వికెట్ లైన్ బంతులను ఎక్కువగా వదిలేశాడు. కోహ్లికి కబీర్ ఆసక్తికర ప్రశ్న! మంగళవారం విరాట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లి సాధన ముగించుకొని వెళ్తున్న సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు... ‘విరాట్ అంకుల్’ అంటూ పిలవడంతో అటు వైపు వెళ్లిన కోహ్లి అతడితో సుదీర్ఘంగా ముచ్చటించి కీలక సూచనలు చేశాడు. ఆ కుర్రాడి పేరు కబీర్ కాగా... అతడి తండ్రి ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి ఢిల్లీ అండర్–17, అండర్–19 జట్లకు ఆడిన షావేజ్. భారత జట్టుకు ఆడాలంటే ఏం చేయాలని కబీర్ ప్రశ్నించగా... ‘కఠోర సాధన చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడూ వదిలేయొద్దు. మీ నాన్న నిన్ను ప్రాక్టీస్‌కు వెళ్లు అని చెప్పకూడదు. నువ్వే నాన్నా నేను గ్రౌండ్‌కు వెళ్తున్నా అని చెప్పాలి’ అని కోహ్లి సూచించాడు. -
‘ఈడెన్’లో టీమిండియా సాధన
కోల్‌కతా: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. గాయం కారణంగా ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. మూడు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్లో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, శుబ్‌మన్ గిల్, హార్దిక్‌పాండ్యా, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు ప్రాక్టీస్ చేశారు. -
Ind vs Ban: విరాట్ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్
సుమారు ఆరు నెలల తర్వాత టీమిండియా తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి తాజా సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రోహిత్ సేన.. బంగ్లాదేశ్‌పై గెలుపొంది మార్గం సుగమం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.వారం రోజుల సెషన్చాలా కాలం తర్వాత.. తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు వారం రోజుల పాటు ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటోంది. ఇందుకోసం ఇప్పటికే మొదటి టెస్టుకు వేదికైన చెన్నైకి చేరుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ప్రాక్టీస్లో ఈసారి తాను రెండు సెగ్మెంట్లను ప్రవేశపెట్టానని తెలిపాడు. చెన్నై వాతావరణం బాగా పొడిగా ఉన్న దృష్ట్యా జట్టును రెండు టీమ్‌లుగా విభజించి.. కాంపిటీషన్ డ్రిల్ నిర్వహించానని పేర్కొన్నాడు. క్యాచింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయించానని.. సోమవారం నాటి సెషన్లో విరాట్ కోహ్లి టీమ్ గెలిచిందని టి.దిలీప్ వెల్లడించాడు. ఇలాంటి మినీ కాంపిటీషన్ల ద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోరని.. వీలైనంత ఎక్కువసేపు నెట్స్‌లో గడిపేందుకు ఇలాంటి సెషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.యాక్టివ్‌గా ఉన్నారుఏదేమైనా ప్రాక్టీస్ అద్భుతంగా సాగుతోందని.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తమ ప్లేయర్లు యాక్టివ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారని టి.దిలీప్ వారిని ప్రశంసించాడు. కాగా ఈ సెషన్లో దిలీప్‌తో పాటు అభిషేక్ నాయర్ కూడా ఆటగాళ్లతో మమేకమయ్యాడు. ఇక నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్ బౌలర్లను ఎదుర్కోగా.. కోహ్లి బుమ్రా బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. చెన్నై, కాన్పూర్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్Intensity 🔛 point 😎🏃♂️Fielding Coach T Dilip sums up #TeamIndia's competitive fielding drill 👌👌 - By @RajalArora #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/eKZEzDhj9A— BCCI (@BCCI) September 16, 2024 -
జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతుంది. భారత ఆటగాళ్లంతా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. కుల్దీప్, సిరాజ్, బుమ్రా, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, అశ్విన్, జడేజా, యశస్వి, గిల్ ఈ వీడియోలో ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియాకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ సహచరులతో గేమ్ ప్లాన్స్ డిస్కస్ చేస్తున్నాడు.Team India's practice session at the Chepauk Stadium. 🇮🇳pic.twitter.com/WM8piciC03— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2024కాగా, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు వారం రోజుల ముందుగానే ప్రాక్టీస్ షూరు చేసింది. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బంగ్లాతో సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఘోరంగా ఓడించింది. ఈ కారణంగానే భారత్ బంగ్లాదేశ్‌ను లైట్‌గా తీసుకోదలచుకోలేదు. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ తమదైన రోజున అద్భుతాలు చేయగలదు.Virat Kohli in the batting practice session at Chepauk yesterday. 🔥- The GOAT is getting ready to Rule..!!!! 🐐pic.twitter.com/g3O1Q9eHaR— Tanuj Singh (@ImTanujSingh) September 15, 2024ఇదిలా ఉంటే, రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలోని తొలి టెస్ట్ చెన్నై వేదికగా, రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. రెండో టెస్ట్ సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి. టీమిండియాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. టీమిండియా మాత్రం తొలి టెస్ట్‌కు మాత్రమే జట్టును ప్రకటించింది.టీమిండియాతో టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, మొమినుల్ హక్, షకీబ్ అల్ హసన్, మెహిది హసన్ మీరజ్, ముష్ఫికర్ రహీం, లిట్టన్ దాస్, జాకిర్ అలీ, జాకిర్ హసన్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. విజేత ఎవరో చెప్పేసిన షమీ! -
CSK DC Practice Session Photos: విశాఖలోలో డీసీ, సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
వరల్డ్‌కప్ ఫైనల్.. చివరి ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
-
'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
టెన్నిస్‌లో ప్రస్తుతం కార్లోస్ అల్కారాజ్ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కారాజ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అల్కారాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); డానిల్ మెద్వెదెవ్‌తో అల్కారాజ్ తలపడనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, అల్కారాజ్ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్ తండ్రికి టెన్నిస్ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సందర్భంగా మ్యాచ్‌లను చూడడానికి వచ్చిన అల్కారాజ్ తండ్రి.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాక్టీస్ వీడియోనూ ఫోన్లో బంధించాడు. అయితే తన కొడుక్కి జొకోవిచ్ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్‌కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. ''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్‌లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్ వన్ నుంచి టాప్-20 ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్‌ను గమనిస్తూనే ఫోన్లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్ లైఫ్‌లో నేను జొకోవిచ్‌తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్‌కే సపోర్ట్ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీ నాన్న జొకోవిచ్ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్ఫామ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: T10 League: బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్! -
అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్‌తో విధ్వంసం
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ కూడా అందరికంటే ముందుగానే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. శుక్రవారం ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాకతో సీఎస్కే క్యాంప్‌లో మరింత జోష్ వచ్చింది. స్టోక్స్ చెన్నైలో అడుగుపెట్టిన వీడియోనూ సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. అయితే స్టోక్స్ వచ్చీ రాగానే ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అస్సలు సమయం వృథా చేయకూడదనే కాన్సెప్ట్‌తో వచ్చాడనుకుంటా.. గ్రౌండ్లో అడుగుపెట్టిందే మొదలు సిక్సర్ల వర్షం కురిపించాడు. మార్చి 24న చెన్నైలో అడుగుపెట్టిన స్టోక్స్ అదే రోజు సాయంత్రం సెంటర్-పిచ్‌లో తన ప్రాక్టీస్ కొనసాగించాడు. నెట్ బౌలర్స్ సంధించిన బంతులను స్టోక్స్ చాలావరకు బౌండరీ అవతలకు పంపించాడు. స్టోక్స్ ప్రాక్టీస్ వీడియోనూ సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేసుకుంది. బెన్.. డెన్ #Super Force అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక బెన్ స్టోక్స్‌ను గతేడాది జరిగిన మినీవేలంలో సీఎస్కే రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్ల సరసన స్టోక్స్ నిలిచాడు. మరోవైపు ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయంటూ రూమర్లు వస్తున్నాయి. అయితే స్టోక్స్ ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయ క్రికెట్‌కు ఎక్కువ విలువనిచ్చే స్టోక్స్ దృష్టి ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్‌పై దృష్టి పెట్టాడు. మార్చి 31న డిపెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్కే తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. Ben Den 🔥 #SuperForce 🦁💛 Live Now ➡️ https://t.co/Twii0Iazaw pic.twitter.com/7uX2ctwwfT — Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2023 చదవండి: క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్! పాపం తగలరాని చోట తగిలి.. -
కొట్టిన బంతిని చూసిన పాపాన పోలేదు.!
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2023కి సమాయత్తమవుతున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. తనకిది చివరి ఐపీఎల్ అని భావిస్తున్న తరుణంలో సీఎస్కే టైటిల్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోని తన ప్రాక్టీస్‌పై దృష్టి సారించాడు. జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ముందే వచ్చిన ధోని క్రమం తప్పకుండా మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. గత మూడు సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో ధోని బ్యాట్‌తో మెరవాలని ప్రతీ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. మార్చి 31న మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్లో తొలి మ్యాచ్ సీఎస్కే , డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ధోని సిక్స్ కొడితే గ్రౌండ్ అవతల పడడం ఖాయం. ఇప్పటికే ప్రాక్టీస్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన ధోని తాజాగా సిక్స్ కొట్టిన తర్వాత కనీసం బంతిని చూసిన పాపాన పోలేదు. అతను తాను కొట్టిన సిక్సర్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మార్చి 14న(మంగళవారం) చెన్నై స్టేడియంలో సాయంత్రం ప్రాక్టీస్ చేసిన ధోని బంతి పడిందే ఆలస్యం.. బ్యాట్ ఎడ్జ్‌ను ఆనించి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పైకి వెళ్లిన తరుణంలో అతని కళ్లు మాత్రం కిందనే ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికి పైకి చూశాడు. అప్పటికే బంతి గ్రౌండ్ బయట పడింది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది ఐపీఎల్లో సీఎస్కే అంతగా ఆకట్టుకోలేకోపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే సీజన్ మొదట్లో జడేజా జట్టును నడిపించాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేని జడ్డూ.. పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే మరోసారి ధోనికే బాధ్యతలు అప్పగించింది. అయితే అప్పటికే జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈసారి కొత్తగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి రావడంతో సీఎస్కే బలంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ధోని స్థానంలో బెన్ స్టోక్స్ జట్టును నడిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. “Nonchalant!” 🚁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/glafNLF1gk — Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2023 చదవండి: వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ -
రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లి భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. అంతకముందు వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లి టెస్టు సిరీస్‌కు వచ్చేసరికి మాత్రం మాములు బ్యాటర్‌గా మారిపోయాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లో పిచ్ బౌలింగ్‌కే ఎక్కువగా అనుకూలించడంతో కోహ్లిని కూడా తప్పుబట్టడానికి లేదు. అయితే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అసలు ఏ మాత్రం బౌన్స్, స్పిన్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లి కనీసం నాలుగో టెస్టులోనైనా సెంచరీ మార్క్ అందుకుంటాడని సగటు అభిమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి ప్యాడ్లు కట్టుకొని గ్రౌండ్లోకి వచ్చాడు. చాలాసేపు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మూడో రోజు ఆటతో టీమిండియా భవితవ్యం తేలనుంది. పిచ్‌పై ఎలాంటి బౌన్స్ లేకుంటే మాత్రం మ్యాచ్ నుంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు విఫలమైతే మాత్రం ఆసీస్ ఈ టెస్టును గెలవడం గ్యారంటీ. ఒకవేళ టీమిండియా బ్యాటర్లు కూడా సమర్థంగా ఆడితే మ్యాచ్ డ్రా అవడం ఖాయం. King at work 🥳 pic.twitter.com/yCSSlz9YhB — Sunil (@Hitting_Middle) March 10, 2023 చదవండి: 'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు -
ధోని సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్
మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది. మరో 27 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. సీఎస్కేను నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోని కూడా తన ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. ఇప్పటికే ఐపీఎల్ ఆడేందుకు చెన్నై చేరుకున్న ధోని ప్రాక్టీస్‌లో భాగంగా సిక్సర్ల వర్షం కురిపించాడు. 'తలా'(ధోని) వచ్చాడని తెలియగానే చేపాక్ స్టేడియం పరిసరిరాలు అభిమానులతో నిండిపోయాయి. తమ ఫెవరెట్ ఆటగాడి ప్రాక్టీస్‌ను కళ్లారా చూడాలని వచ్చిన ఫ్యాన్స్‌ను ధోని ఖుషీ చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధోని అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఇక 2023 ఐపీఎల్ ధోని కెరీర్లో చివరిది కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈసారి ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేక జట్టులోకి కొత్తగా వచ్చిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. గతేడాది సీజన్లో సీఎస్కే అంతగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. Dhoni smashing the ball 🏏💥@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 4, 2023 చదవండి: WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం -
IPL 2023: ప్రాక్టీస్.. స్టేడియానికి బైక్‌పై దూసుకొచ్చిన ధోని
టీమిండియా మాజీ క్రికెటర్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2023కి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో తన హోంగ్రౌండ్ రాంచీలో ప్రాక్టీస్‌ను ఆరంభించిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇటీవలే న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరిగిన తొలి టి20 రాంచీ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ఎంఎస్ ధోని తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. తాజాగా ధోనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ధోని ప్రతీరోజు తన TVS అపాచీ బైక్‌పై స్టేడియానికి రావడం విశేషం. ధోనికి బైక్‌లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని గ్యారెజీలో ప్రత్యేకంగా బైక్ షెడ్ ఉంది. అందులో రకరకాల బైక్‌లు ఉంటాయి. తాజాగా రాంచీ స్డేడియాని ధోని తీసుకొచ్చి బైక్.. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310. ప్రాక్టీస్ అనంతరం ధోని తన బైక్‌పై వెళ్లడం అతని అభిమాని ఒకరు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వీడియో బయటికి వచ్చింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.భారత్‌లో బీఎండబ్ల్యూ, టీవీఎస్‌లు జతకలిసి తర్వాత మార్కెట్లోకి రిలీజైన తొలి బైక్ ఇదే. తాజాగా అతని గ్యారేజీలో టీవీఎస్ అపాచీ బైక్ మోడల్ కూడా వచ్చి చేరిపోయింది. View this post on Instagram A post shared by MS Dhoni Fans Club ❤ (50k) (@msdhoni.zealot) చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ కానుకగా.. -
అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్-గావస్కర్ ట్రోపీ షురూ కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్‌కు చేరుకొని తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయగా.. మరోవైపు శుక్రవారం నాగ్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా నేటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. కోహ్లి, రోహిత్, పుజారా సహా మరికొంతమంది ఇవాళ జట్టుతో కలిసే అవకావం ఉంది. ఇదిలా ఉంటే గత సిరీస్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా స్పిన్ అటాకింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఆసీస్ జట్టు కర్ణాటకలోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఆసీస్ జట్టు కోరిక మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఉన్న మూడు పిచ్‌లపై స్పిన్ ట్రాక్నే రూపొందించారు. భారత్ లాంటి ఉపఖండం దేశంలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందునా పిచ్ పాతబడేకొద్ది స్పిన్నర్లు ప్రభావం చూపడం చూస్తుంటాం. భారత్ లాంటి పిచ్‌లపై ఇదంతా సహజం. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది వారి గేమ్‌ప్లాన్. అయితే ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేస్తున్న పిచ్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఇదేంటి అన్నట్లుగా ముక్కున వేలేసుకున్నారు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు స్పిన్ బౌలింగ్‌కు ఇంత భయపడుతుందా.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తుంది.. ఈసారి ఆసీస్ తమ వ్యూహాలలో పదును పెంచినట్లుంది.. స్పిన్ బౌలింగ్ అంటే అంత భయమేలా.. భారత్ స్పిన్ బౌలింగ్ అంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందేలే అంటూ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియాకు కోల్పోయింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ 333 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకఫీ 12 వికెట్లతో టీమిండియాను శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న టీమిండియా రెండు, నాలుగు టెస్టుల్లో గెలిచి.. మూడో టెస్టు డ్రా చేసుకొని 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. స్పిన్ పిచ్‌లపై ఆడడంలో అప్పుడు ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా రహానే సారధ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. తాజాగా ఐదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా సిరీస్‌ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. అందుకే ఏరికోరి తమ ప్రాక్టీస్‌కు స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించుకుంది. The spin pitch Australia is using to practice forBorder–Gavaskar Trophy. #INDvsAUS #CricketTwitter pic.twitter.com/kEvJHp2JOm — Himanshu Pareek (@Sports_Himanshu) January 29, 2023 Training pitches of Australia in Alur ahead of the Test series. (Source - Cricket Australia) pic.twitter.com/V4Xif64MLB — Johns. (@CricCrazyJohns) February 3, 2023 చదవండి: పిల్లనిచ్చిన మామకు అల్లుడి బౌలింగ్ 'భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది' -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్ జోరు పెంచిన పుజారా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా పుజారా.. ఇండియా జెర్సీని ధరించి గ్రౌండ్లో తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పుజారా స్వయంగా ట్విటర్లో పంచుకున్నాడు. ''గెట్టింగ్ రెడీ ఫర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. టీమిండియా టెస్టు జట్టులో కీలక ఆటగాడైన పుజారా గతేడాది ఐదు టెస్టులు కలిపి 10 ఇన్నింగ్స్‌లు ఆడి 45.44 సగటుతో 409 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. 1400 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా 54.08 సగటుతో 1893 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 204 పరుగులుగా ఉన్నది. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు. ఇక తొలి టెస్టు నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, రెండో టెస్టు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, మూడో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు, నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్నాయి. అనంతరం మూడు వన్డే మ్యాచ్‌లు మార్చి 17, 19, 22 తేదీల్లో జరగనున్నాయి. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. Getting ready for 🇮🇳 vs 🇦🇺 pic.twitter.com/g8c1RRqUbO — Cheteshwar Pujara (@cheteshwar1) January 31, 2023 చదవండి: 'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు' IND Vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి 23న గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టిని రాహుల్ వివాహమాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతు ముగియగానే రాహుల్ తన ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే పెళ్లి కోసం న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన రాహుల్ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో కలవనున్నాడు. సిరీస్‌కు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండడంతో ముంబైలోని బాంద్రా క్రికెట్ క్లబ్లో నెట్‌ప్రాక్టీస్ చేశాడు. కాగా రాహుల్ అంతగా ఫామ్‌లో లేకపోవడం భారత్‌కు ప్రతికూలం. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ గైర్హాజరీలో జట్టును నడిపించిన రాహుల్ కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి బ్యాటర్‌గా ఫెయిలయ్యాడు. టీమిండియా 2-0తో సిరీస్ నెగ్గగా.. రాహుల్ మాత్రం నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 22, 23, 10, 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9న ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు జతగా గిల్ వచ్చే చాన్స్ ఉన్నప్పటికి.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చినా రావొచ్చు. అయితే శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టుకు దూరం కావడంతో సూర్యకు లైన్ క్లియర్ అయింది. ఒకవేళ గిల్, రోహిత్‌లు ఓపెనర్లుగా వస్తే.. కేఎల్ రాహుల్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. #KLRahul𓃵 is back doing what he does best after his marriage with #AthiyaShetty. The stylish batsman was seen batting at MIG CC in Bandra. Video courtesy my friend Nishant Patankar. #CricketTwitter pic.twitter.com/GPbg6SIlnT — Taus Rizvi (@rizvitaus) January 30, 2023 చదవండి: IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం.. జడ్డూ రీఎంట్రీ -
కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం కొనసాగుతుంది. ఎంతలా అంటే కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 22 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌ను జట్టు నుంచి తొలిగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు(బుధవారం) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడిపింది. ఈ సందర్భంగా టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి.. కేఎల్ రాహుల్‌కు బ్యాటింగ్ పాఠాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెట్స్‌లో చాలాసేపు రాహుల్, కోహ్లి మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా రాహుల్ ప్రాక్టీస్‌ను గమనించారు. కోహ్లితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ కోహ్లి అతని దగ్గరికి వెళ్లాడు. ఫుట్‌వర్క్, స్టాన్స్ విషయంలో రాహుల్‌కు చిట్కాలు చెప్పాడు. అయితే కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు చెప్పడంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. ''ఫామ్‌లో లేని ఆటగాడికి సలహాలు ఇచ్చి ఏం లాభం.. కోహ్లి భాయ్ ఇక సలహాలు అవసరం లేదనుకుంటా.. ఎలాగూ జట్టు నుంచి దూరం కానున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మంగళవారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. అతను ఫెంటాస్టిక్ ప్లేయర్ అని.. టి20ల్లో రాహుల్ ట్రాక్ రికార్డు గొప్పగా ఉందన్నాడు. రాహుల్ ఫామ్‌లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలని.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బలమైన మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ బౌలింగ్‌ను తట్టుకొని రాహుల్ 60 పరుగులు చేసిన విషయాన్ని మరువద్దని పేర్కొన్నాడు. అతని క్వాలిటి, ఎబిలిటీపై మాకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. గ్రూప్ 2లో ఉన్న టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్‌కు మంచి ఆరంభాన్నిచ్చినా.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో ఇంకా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు. బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న ఇండియా దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. చదవండి: ఇంగ్లండ్ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు అంచనాలు తలకిందులైన వేళ.. అతడి ఆట తీరుపై మాకెలాంటి ఆందోళన లేదు! సంతృప్తిగా ఉన్నాం: ద్రవిడ్ -
తొలి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల సాధన (ఫొటోలు)
-
రంగంలోకి దిగిన రాహుల్.. రాగానే రుద్దుడు షురూ
India Tour Of England 2022: దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ముగియగానే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లీసెస్టర్షైర్లో ఉన్న టీమిండియాతో కలిశాడు. రాహుల్ వచ్చీ రాగానే ఆటగాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారిని టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్దం చేస్తున్నాడు. ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించిన దృశ్యాలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. రాహుల్ రంగంలోకి దిగంగానే రుద్దుడు షురూ చేశాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. Look who's here! Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. 💪💪 #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd — BCCI (@BCCI) June 21, 2022 కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండగానే టీమిండియాలోని కీలక సభ్యులు ఈ నెల 16న లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ బ్యాచ్ బయల్దేరిన తర్వాతి రోజు రోహిత్ శర్మ.. నిన్న ద్రవిడ్, పంత్, శ్రేయస్‌లు లండన్‌లో ల్యాండయ్యారు. అశ్విన్ మినహా భారత టెస్ట్ జట్టంతా ప్రస్తుతం లీసెస్టర్షైర్లో ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. జూన్ 24న లీసెస్టర్‌షైర్ కౌంటీతో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టీమిండియా జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది కోవిడ్ కారణంగా రద్దైన ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డుల సంయుక్త ఒప్పందం మేరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అది అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆ జట్టు తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌ను 2-0తో మట్టికరిపించి మాంచి జోష్ మీద ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్! -
IPL 2022: సింగమ్స్ ఇన్ సూరత్.. అప్పుడే రంగంలోని దిగిన ధోని అండ్ కో
CSK Training Camp Starts In Surat: ఐపీఎల్ 2022 ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. సూరత్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ధోని సేన ప్రాక్టీస్ మొదలెట్టేసింది. సూరత్‌లో పరిస్థితులు ముంబైకి దగ్గరగా ఉంటాయనే కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌ను అక్కడ నిర్వహించాలని సీఎస్కే యాజమాన్యం నిర్ణయించింది. కెప్టెన్ ధోనితో పాటు అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్‌పాండే తదితరులు మార్చి 2నే సూరత్‌లో ల్యాండైనట్లు తెలుస్తోంది. 𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరంతా మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్న అనంతరం, ఆదివారం స్థానిక లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సింగమ్స్ ఇన్ సూరత్ అనే క్యాప్షన్ జోడించి సీఎస్కే యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. కాగా, మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కరోనా కారణంగా ఈసారి లీగ్ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లోని స్టేడియాల్లోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. https://t.co/9EmchH33HC #SingamsInSurat 🦁🔥 — 🌈 𝒥𝓊𝒿𝓊 ♡〽️SD🦁 (@Jxjx7x_x) March 7, 2022 చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
కోహ్లి సుధీర్ఘ బ్యాటింగ్.. ద్రవిడ్ సలహాలు
Coach Rahul Dravid Batting Tips To Test Captain Virat Kohli.. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియా తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. కోహ్లి నాయకత్వంలోని టీమిండియా సఫారీ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించి ఆదివారం ట్విటర్ వేదికగా ఒక వీడియోనూ రిలీజ్ చేసింది. తొలి టెస్టు జరగనున్న సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌కు బస్‌లు బయలుదేరిన ఫోటోలు షేర్ చేసింది. చదవండి: Kohli-Ganguly: విరాట్ కోహ్లిపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన క్రికెటర్లు ప్రాక్టీస్‌కు ముందు వార్మప్ సెషన్ కింద జాగింగ్, స్ట్రెచింగ్ లాంటివి చేశారు. ఇదే సమయంలో కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి సలహాలు ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా, షమీలు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్ వీరితోపాటు ఇషాంత్ శర్మ, వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌లు కూడా సుధీర్ఘంగా బౌలింగ్ చేశారు. ఇక చివరగా ప్రాక్టీస్ ముగించిన కోహ్లి థంప్సమ్ సింబల్ ఇవ్వడంతో ఉదయం ప్రాక్టీస్ సెషన్ ముగిసినట్లు బీసీసీఐ పేర్కొంది. ''సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం.. తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన స్నిపెట్స్పై ఒక లుక్కేయండి'' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Getting Test-match ready 👌 👌 🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959 — BCCI (@BCCI) December 19, 2021 -
భారత్, కివీస్ జట్ల ప్రాక్టీస్ రద్దు
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో టెస్టు సన్నాహాలకు అవాంతరం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షం కారణంగా బుధవారం ఇరు జట్ల ప్రాక్టీస్ రద్దయింది. శుక్రవారం నుంచి వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా, వాతావరణం అనుకూలిస్తే భారత్, కివీస్ క్రికెటర్లు గురువారం సాధన చేసే అవకాశముంది. మరో వైపు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ టెస్టులో ఆడతాడా లేదా అనే విషయంపై మ్యాచ్ సమయానికే నిర్ణయం తీసుకుంటామని భారత బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. మెడ పట్టేయడంతో తొలి టెస్టులో చాలా భాగం సాహా వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉన్నాడు. సాహా స్థానంలో శ్రీకర్ భరత్ సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు. -
IND Vs NZ 1st Test: ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
-
జిమ్నాస్టిక్ చేయాలంటే కాళ్లు అవసరం లేదు!
న్యూఢిల్లీ: అన్ని సక్రమంగా ఉన్న ఏదో ఒక కారణాలతో ఏమి చేయకుండా కూర్చొండిపోతారు. పైగా అన్ని అవయవాలు బాగా ఉన్నా ఏవో చిన్న చిన్న సాకులతో కష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఒక పదేళ్ల బాలికకు కాళ్లు లేకపోయిన జిమ్నాస్టిక్ నైపుణ్యంతో అందరీ మనసులను గెలుచుకుంది. (చదవండి: అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!) వివరాల్లోకెళ్లితే...ఒహియోకు చెందిన పైజ్ క్యాలెండైన్కు కాళ్లు లేవు. అయినా తన జిమ్నాస్టిక్ నైపుణ్యాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శిసిస్తోంది. ఈ మేరకు ఆమె తన జిమ్నాస్టిక్ సాధనలో భాగంగా తాను చేసే రోజువారి ప్రాక్టీస్‌లకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు ఆమె నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఆమె పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) 10-year-old Paige Calendine of Ohio is a force!🌟🏅🏆. (🎥:heidi.calendine)💪😃💪 pic.twitter.com/DI23hHRO4r — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 25, 2021 -
నెట్స్‌లో ఇరగదీసిన శిఖర్ ధావన్.. వీడియో వైరల్
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. స్థిరత్వ ప్రదర్శన ఉంటే సరిపోదని.. ఆటలో వేగం ఉండాలనే కారణంతో ధావన్ స్థానంలో మూడో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup 2021: శిఖర్ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా! ఈ విషయం పక్కనపెడితే శిఖర్ ధావన్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో పాల్గొనేందుకు ధావన్ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాడు. తాజాగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్యాడ్స్ కట్టుకోవడం దగ్గర్నుంచి బ్యాటింగ్ చేసేవరకు ప్రతీది వీడియోలో పొందుపరిచాడు. వీడియో కింద 'సూర్మా' అని క్యాప్షన్ జత చేశాడు. సూర్మా అంటే పంజాబీ భాషలో ''డేరింగ్ అండ్ డాషింగ్'' అని అర్థం. ఇక శిఖర్ ధావన్ ఐపీఎల్ 14వ సీజన్లో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లాడిన ధావన్ 134.27 స్ట్రైక్ రేట్‌తో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రదర్శనతో దుమ్మురేపి టేబుల్ టాపర్‌గా నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: T20 World Cup: వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే! Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
మరోసారి గోల్డెన్ డక్ అవ్వకూడదని సీరియస్‌గా ప్రాక్టీస్
నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లి బంతిని అంచనా వేయడంలో పొరబడి కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కోహ్లిని విమర్శిస్తూ భారత అభిమానులు కామెంట్స్ చేశారు. మరోసారి ఇది రిపీట్ కాకూడదని భావించాడేమో. అందుకే కోహ్లి నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చి సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి. కాగా కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఐదుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో కోహ్లి మూడుసార్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గోల్డెన్ డక్ అవడం ద్వారా చెత్త రికార్డును నమోదు చేశాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా తొలి టెస్టులో విజయానికి ఇంకా 157 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రూట్ సెంచరీతో(109 పరుగులు) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్, ఠాకూర్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. WOWWWW! 🔥@jimmy9 gets Kohli first ball and Trent Bridge is absolutely rocking! Scorecard/Clips: https://t.co/5eQO5BWXUp#ENGvIND pic.twitter.com/g06S0e4GN7 — England Cricket (@englandcricket) August 5, 2021 -
అశ్విన్, పుజారాలపై.. కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం; వీడియో వైరల్
లండన్: టీమిండియా సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో డర్హమ్‌లో టీమిండియా తన ప్రాక్టీస్‌ను షురూ చేసింది. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ నేతృత్వంలో జట్టు సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయింది. కోహ్లి, రోహిత్‌లు ఒక జట్టుకు.. పుజారా, అశ్విన్‌లు మరో జట్టుకు నాయకత్వం వహించారు. కాగా ఈ ఫీల్డింగ్ సెషన్లో అశ్విన్, పుజారాల ద్వయంపై కోహ్లి, రోహిత్‌ల జట్టు.. పూర్తి ఆధిపత్యం చెలాయింది. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు ఫీల్డింగ్ డ్రిల్‌లో భాగంగా రన్నింగ్, జంపింగ్, క్యాచ్‌లు ఇలా రకరకాల సెషన్లు నిర్వహించారు. వీటన్నింటిని కలిపి చూస్తే.. కోహ్లి, రోహిత్‌ల జట్టు 10-8 తేడాతో అశ్విన్- పుజారా ద్వయంను ఓడించింది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక రిషబ్ పంత్‌కు డెల్టా వేరియంట్ లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమిండియాలో కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి పంత్‌తో పాటు సహాయక సిబ్బంది, వృద్ధిమాన్ సాహాలు ఐసోలేషన్‌లో ఉండగా.. టీమిండియా జట్టు డర్హమ్‌లో బయోబబూల్‌లో ఉంటూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. Two squads 🤜🤛 Fielding drills 🙌 A run-through #TeamIndia's fun drill, courtesy fielding coach @coach_rsridhar ahead of their practice session 👊 - by @RajalArora #ENGvIND pic.twitter.com/NXZ4LI0aPR — BCCI (@BCCI) July 19, 2021 -
టోక్యోలో భారతీయం: ప్రాక్టీస్ ప్రారంభించిన మన క్రీడాకారులు
టోక్యో: ఒలింపిక్స్ పతకాల పట్టికలో అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించాలనే ఏౖకైక లక్ష్యంతో భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్రీడల వేదికకు చేరుకున్న ఒకరోజు తర్వాత భారత తొలి బృందం సోమవారం పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొంది. అన్ని క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు సాధనలో చెమటోడ్చారు. కరోనా కేసుల కారణంగా భారత్ నుంచి వచ్చే ఆటగాళ్లకు మూడు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ అంటూ గతంలో ప్రకటించిన ఒలింపిక్ కమిటీ తర్వాత ఆ ఆంక్షలను తప్పించడంతో మొదటి రోజే నేరుగా మైదానంలోకి దిగే అవకాశం మన క్రీడాకారులకు కలిగింది. ఆర్చరీ జంట దీపిక కుమారి, అతాను దాస్ స్థానిక యుమెనొషిమా పార్క్‌లో తమ బాణాలకు పదును పెట్టగా... తొలి ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. జిమ్నాస్టిక్స్‌లో ఆశలు రేపుతున్న ప్రణతి నాయక్ తన కోచ్ మనోహర్ శర్మ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసింది. బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా తమ జట్టు కోచ్‌లతో కలిసి కోర్టులోకి దిగారు. భారత సింగిల్స్, డబుల్స్ కోచ్‌లు పార్క్ సంగ్, మథియాస్ బో సాధనలో పీవీ సింధు, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు సహకరించారు. సింధు, సాయిప్రణీత్ కోర్టులో చెరో వైపు నిలిచి తలపడగా, పార్క్ వారి మధ్యలో నిలబడి ప్రాక్టీస్ చేయించాడు. అసాకా రేంజ్లో భారత షూటర్లకు ప్రాక్టీస్ అవకాశం దక్కింది. ఇదే వేదికపై పోటీలు జరగనుండటంతో నాలుగు రోజుల సాధన వల్ల మేలు కలుగుతుందని షూటర్లు భావిస్తున్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా షూటింగ్ పోటీలు ఇక్కడే నిర్వహించారు. వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా సెయిలింగ్‌లో పోటీ పడుతున్న వి.శరవణన్, నేత్ర కుమనన్, కేసీ గణపతి, వరుణ్ ఠక్కర్‌లతో పాటు రోయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ కూడా సీ ఫారెస్ట్ వాటర్ వే జలాల్లో సన్నద్ధమయ్యారు. 100 ‘టీ కెటిల్స్’ కావాలి... ఒలింపిక్ విలేజ్‌లోకి అడుగు పెట్టగానే సాధారణంగా అథ్లెట్ల నుంచి ఏదో ఒక రూపంలో ఫిర్యాదులు మొదలవుతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. నిజంగా సమస్య ఉన్నా సర్దుకుపోవడమే తప్ప గట్టిగా అడిగే పరిస్థితి లేదు. భారత అథ్లెట్లకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజులకు ఒక సారి మాత్రమే ఆటగాళ్ల గదిని శుభ్రపరుస్తారు. టవల్స్ కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి ప్రతీ రోజు తెచ్చుకోవాల్సిందే. ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు ప్రతీ రోజు ఆటగాళ్లు తమ కోవిడ్ శాంపిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కూడా రోజూవారీ ప్రాతిపదికనే ఇస్తున్నారు. భోజనం విషయంలో మాత్రం మన అథ్లెట్లు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అయితే మరీ మన ఇంటి భోజనంతో పోల్చి చూడవద్దని, కొన్నిసార్లు సరిగా ఉడకకపోయినా సరే సర్దుకుపోవాల్సిందేనని భారత బృందంలో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. స్థానిక జపాన్ ఫుడ్‌ను బాగా వండుతున్నారని, మరీ భారతీయ వంటకాలపై మోజు పడకుండా దానిని కూడా అలవాటు చేసుకుంటే మంచిదని కూడా ఆయన సూచించారు. మరోవైపు ఉదయమే వేడి నీళ్లు తాగేందుకు వీలుగా తమ గదుల్లో ఎలక్ట్రిక్ టీ కెటిల్స్ కావాలని భారత అథ్లెట్లు విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్ల కోరిక మేరకు భారత రాయబార కార్యాలయం 100 కెటిల్స్ ఏర్పాటు చేయనుందని చెఫ్ డి మిషన్ ప్రేమ్ వర్మ వెల్లడించారు. మరోవైపు టెన్నిస్ ప్లేయర్లు సానియా మీర్జా, అంకిత రైనా, సుమిత్ నగాల్ సోమవారం న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయలుదేరి వెళ్లారు. సానియా–అంకిత ద్వయం మహిళల డబుల్స్‌లో, సుమిత్ పురుషుల సింగిల్స్‌లో పోటీపడతారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు ఈ నెల 18 నుండి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)ఫైనల్నేపథ్యంలో ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇంగ్లండ్ గడ్డపై కాలు మోపాక మూడు రోజులు కఠిన క్వారంటైన్లో గడిపిన భారత జట్టు.. తొలిసారి ఓ బృందంగా సాధనచేసింది. దాదాపు నాలుగు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ పర్యటనలో ఇదే మా తొలి గ్రూప్ ప్రాక్టీస్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు' అంటూ క్యాప్షన్ జోడించింది. We have had our first group training session and the intensity was high 🔥#TeamIndia's 🇮🇳 preparations are on in full swing for the #WTC21 Final 🙌 pic.twitter.com/MkHwh5wAYp — BCCI (@BCCI) June 10, 2021 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్ సెషన్లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారాలు సాధనలో మునిగిపోయారు. అందరూ నెట్ సెషన్లో చమటోడ్చారు. కోహ్లీ బ్యాట్ లేకుండా కెమెరాకు పోజులివ్వగా.. రోహిత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ సాధన చేశారు. ఇక బౌలర్లు సిరాజ్, అశ్విన్, బుమ్రా, ఇషాంత్, షమీలు హుషారుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. డ్యూక్ బంతులతో సాధన చేస్తూ ఊహించని స్వింగ్‌ను రాబడుతూ.. సంతోషంలో మునిగితేలారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ముంబైలో రెండు వారాలు క్వారంటైన్లో గడిపారు. అనంతరం జూన్ 3న భారత బృందం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు చేరుకుంది. అక్కడ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆతర్వాత మూడు రోజుల పాటు ఒక్కో ఆటగాడు మాత్రమే సాధన చేశారు. గురువారం నుంచే భారత బృందం కలిసికట్టుగా సాధన మొదలుపెట్టింది. కాగా, ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే డబ్యూటీసీ ఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ పేరు ఖరారు..? -
క్వారంటైన్ కంప్లీట్.. ప్రాక్టీస్ షురూ
సౌతాంప్టన్: మూడు రోజుల కఠిన క్వారంటైన్ ఆనంతరం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. క్వారంటైన్ శనివారం ముగియడంతో ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే మొదటి ట్రైనింగ్ సెషన్ కావడంతో ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. First outing in southampton🙌 #feelthevibe #india pic.twitter.com/P2TgZji0o8 — Ravindrasinh jadeja (@imjadeja) June 6, 2021 స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సౌతాంప్టన్‌లో ఫస్ట్ ప్రాక్టీస్ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ సాధన చేస్తూ హుషారుగా కనిపించాడు. వీరితో పాటు మరికొందరు టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజీగా గడిపారు. టీమిండియా క్రికెటర్లు ఏజియస్ బౌల్ స్టేడియానికి పక్కనే ఉన్న హిల్టన్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ముంబైలో రెండు వారాల క్వారంటైన్ అనంతరం టీమిండియా జూన్ 3న ఇంగ్లండ్‌కు చేరుకుంది. అనంతరం ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, డబ్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ధి న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ఆ జట్టు ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్‌లో తలపడతాయి. దీంతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా డబ్యూటీసీ ఫైనల్ ముగిసాక(జూన్ 22) 42 రోజుల పాటు ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్ట్4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. చదవండి: టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం -
కోహ్లి లేకుండానే ఆర్సీబీ ప్రాక్టీస్ ప్రారంభం
చెన్నై: ఐపీఎల్ 2021 సన్నాహకాల్లో భాగంగా తొమ్మిది రోజుల ప్రాక్టీస్ సెషన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మంగళవారం ప్రారంభించింది. హెడ్ కోచ్ సైమన్ కటిచ్, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ మార్గదర్శకత్వంలో స్పిన్నర్ యుజువేంద్ర చహల్, పేసర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ సహా 11 మంది ఆటగాళ్లు సాధన మొదలు పెట్టారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రతిపాదించిన ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసిన తర్వాతే ఆటగాళ్ళు శిబిరంలో చేరతారు. అయితే, కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆర్సీబీ ప్రాక్టీస్‌ను ప్రారంభించడం విశేషం. కోహ్లి గురువారం(ఏప్రిల్ 1న) జట్టులో చేరనున్నాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. కోహ్లికి కూడా వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధన వర్తిస్తుందని, జట్టులో చేరిన తరువాత ఆయన కూడా వారం రోజులు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని ఆర్సీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ప్రారంభంకానున్న సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. చదవండి: ముంబై జట్టును లోడెడ్ గన్‌తో పోల్చిన సన్నీ -
అభిమానుల కోసం కేకేఆర్ సాంగ్ రిలీజ్
కోల్‌కతా: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్ కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 31 నుండి ట్రైనింగ్ సెషన్‌ను ప్రారంభించనుంది. తాజాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా త్వరలో ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్ ఐపీఎల్ క్వారంటైన్ సాంగ్‌ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. వరుసగా రెండో సీజన్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో, కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కోల్పోయిన తమ అభిమానులకు అంకితం చేస్తూ ఓ పాటను రూపొందించింది. వీ విల్ మిస్ యూ అంటూ సాగే ఈ పాటను కేకేఆర్ తమ ట్విటర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసింది. Kuch din ki yeh majboori hai, lekin yeh doori bhi zaroori hai. Tere pyaar pe bharosa hai, Kyunki #TuFanNahiToofanHai 🔥 We will miss you, #Kolkata 💜#WorldPoetryDay #IPL2021 pic.twitter.com/QQIs4LJeKx — KolkataKnightRiders (@KKRiders) March 21, 2021 మరోవైపు ఏ జట్టుకు కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడే వెసులుబాటు లేకపోవడంతో.. ఆయా జట్లు తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడనున్నాయి. కోల్‌కతా తమ మ్యాచ్‌లను చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో ఆడనుంది. కాగా, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్కోటి, బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్లో చేరారు. ఏప్రిల్ 11న కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. IT'S QUARANTIME and the #Knights are checking in for the season! ✅ The beginning of the camp is just around the corner... ⏳@DineshKarthik @abhisheknayar1 @ImRTripathi #KamleshNagarkoti #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/KM84PxOPw9 — KolkataKnightRiders (@KKRiders) March 21, 2021 -
ధోని నేతృత్వంలో వినూత్న సాధన..
చెన్నై: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 సీజన్ కోసం ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించిన చెన్నై జట్టు వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలనే అంశంపై ధోనీ ఇప్పటి నుంచే ఆటగాళ్లను సన్నద్ధం చేస్తున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, వేగంగా పరుగులు రాబట్టడం, ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేయడం లాంటి అంశాలపై ధోని పర్యవేక్షణలో జట్టు సాధన చేస్తోందని ఆ జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. రెగ్యులర్ ప్రాక్టీస్‌కు భిన్నంగా తమ సాధన సాగుతుందని ఆ జట్టు ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. కాగా, చెన్నై జట్టు టాప్ ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. రైనా ఈనెల 24లోగా క్యాంప్‌లో చేరనుండగా, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో కోలుకుంటున్న రవీంద్ర జడేజా.. ఈ వారం చివర్లో జట్టుతో కలువనున్నాడని సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ ఏడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరుతో ఢీకొట్టనుండగా, చెన్నై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 10న జరుగనుంది. Gearing up for the #SummerOf2021! EP 2️⃣ - Anbuden Diaries brings the Pride's strategic preparations in upping their concentration and intensity levels. #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/aNodduo9km — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2021 -
ఏంది రెడ్డి.. ఏకంగా ధోని వికెట్‌నే లేపేసావు
చెన్నై: టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలనుకున్న ఓ యువ ఆటగాడు.. ఏకంగా అతని వికెట్‌నే పడగొట్టేశాడు. తన అభిమాన ఆటగాడితో ఓ ఫొటో చాలనుకున్న ఆ కుర్రాడు.. ఏకంగా అతని సారథ్యంలోనే ఆడబోతున్నాడు. అతనెవరో కాదు మన తెలుగు బిడ్డ, రైతు బిడ్డ, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఈ సీమ బిడ్డను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. టైటిల్ సాధనే లక్ష్యంగా సన్నాహకాలను మొదలు పెట్టిన సీఎస్కే జట్టు.. అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. క్యాంప్‌లో కెప్టెన్ ధోనితో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీషన్, సాయి కిషోర్, హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డి తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. Hari Shankar Reddy taking Dhoni's wicket during the practice#IPL2021 pic.twitter.com/zpEv8gHsp8 — Vinesh Prabhu (@vlp1994) March 17, 2021 ప్రాక్టీస్ సెషన్లో భాగంగా 22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి.. అద్భుతమైన బౌలింగ్‌తో ధోనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో హరిశంకర్ రెడ్డి వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన ధోని.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరిశంకర్ రెడ్డి బంతి వేగం ధాటికి ధోని లెగ్ స్టంప్ గాల్లో పల్టీలు కొడుతుంది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ 'ఏంది రెడ్డి.. ఎంత పని చేశావ్.. ఫోటో దిగితే చాలనుకొని ఏకంగా ధోని వికెట్‌నే గాల్లోకి లేపేసావ్' అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు 'సూపర్ రెడ్డి.. అద్భుతంగా బౌలింగ్ చేశావు.. ఏకంగా ధోని లెగ్ స్టంప్‌కే ఎసరు పెట్టేసావు' అంటూ అభినందిస్తున్నారు. కాగా, ప్రాక్టీస్‌లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో ఆడే అవకాశం దొరుకుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: ఐపీఎల్‌లోకి రాయచోటి క్రికెటర్ ఎంట్రీ.. చెన్నై ట్వీట్ -
ప్రాక్టీస్ సెషన్.. ఒకరినొకరు తోసుకున్నారు..
అడిలైడ్ : ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ వీడియో వైరల్‌గా మారింది. అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేశారు. దీనిలో భాగంగా భారత ఫిజియో టీమ్ టీమిండియా ఆటగాళ్లతో కొన్ని యాక్టివిటీస్‌ను చేయించింది. మొదటి యాక్టివిటీలో ఆటగాళ్ల మధ్య కుస్తీ పోటీలు నిర్వహించారు. రెండో యాక్టివిటీ సెషన్లో క్యాచ్‌లను ప్రాక్టీస్ చేయించారు. ఈ సెషన్లో టీమిండియా ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించారు. ఇక మూడో యాక్టివిటీలో ఇద్దరు ఆటగాళ్లను ఒక జంటగా విడదీసి కింద క్యాప్‌ను పెట్టి ఎవరు ముందుగా అందుకుంటే వారు గెలిచినట్లు లెక్క. టీమిండియా ఆటగాళ్ల యాక్టివిటీస్‌ను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది.(చదవండి : ఒక్క మ్యాచ్.. రెండు రికార్డులు) 'సరదాగా ఎవరైనా డ్రిల్ చేయాలని భావిస్తున్నారా..అయితే నెట్‌సెషన్‌కు ముందు స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీ బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సిందే' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా తొలి టెస్టు అడిలైడ్ వేదికగా డే నైట్ పద్దతిలో జరగనుంది. టీ20 సిరీస్ గెలిచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని భావిస్తుంటే.. మరోవైపు గాయాలతో సతమతవుతున్న ఆసీస్ మొదటి టెస్టులోనే ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను') Fun drill anyone? 😃😃 Sample that to get your batteries🔋charged before a solid net session 💪💥 #TeamIndia #AUSvIND pic.twitter.com/DyqKK66qOa — BCCI (@BCCI) December 15, 2020 -
ఆరు బంతులు.. ఆరు రకాలుగా
దుబాయ్ : జస్ప్రీత్ బుమ్రా.. వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. మలింగ తర్వాత యార్కర్ల వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో సెస్టెంబర్ 19న చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తన ట్విటర్లో షేర్ చేసింది. (చదవండి : పంత్.. సిక్సర్ల మోత!) ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో బుమ్రా ఆరు బంతులను ఆరు రకాలుగా సంధించాడు. ఫన్నీ మూమెంట్లో సాగిన ప్రాక్టీస్‌లో బుమ్రా.. ప్రతి బాల్‌ను ఇతర బౌలర్లకు సంబంధించిన యాక్షన్‌ను ఇమిటేట్ చేస్తూ ఆరు బంతులును వేశాడు. బుమ్రా వేసినవాటిలో మాజీ బౌలర్‌తో పాటు ప్రస్తుత బౌలర్లకు సంబంధించిన బౌలింగ్ యాక్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోను ముంబై తన ట్విటర్లో షేర్ చేస్తూ.. బుమ్రా వేసిన ఆరు బంతులు ఎవరిని ఇమిటేట్ చేస్తూ సంధించాడో చెప్పగలరా అంటూ క్యాప్షన్ జత చేసింది. ముంబై ఇండియన్స్ షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషలల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📹 Can you guess all 6️⃣ bowlers Boom is trying to imitate? 🤔 PS: Wait for the bonus round 😉 #OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @Jaspritbumrah93 pic.twitter.com/RMBlzeI6Rw — Mumbai Indians (@mipaltan) September 7, 2020 మునాఫ్ పటేల్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్, కేదార్ జాదవ్, శ్రేయాస్ గోపాల్, అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను బుమ్రా అనుకరించాడంటూ ఎక్కువ మంది అభిమానులు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం లసిత్ మలింగ, షేన్ వార్న్‌లను ఇమిటేట్ చేసినట్లు పేర్కొన్నారు. బుమ్రా నీలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అంటూ జోకులు పేల్చారు. మరోవైపు వ్యక్తిగత కారణాల రిత్యా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకుంటున్నట్లు యార్కర్ కింగ్, స్టార్ బౌలర్ లసిత్ మలింగ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో బుమ్రా ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర వహించనున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో బుమ్రా ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో వేచి చూద్దాం. 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 82 వికెట్లు పడగొట్టాడు. -
మైదానంలో ధోని సేన
దుబాయ్: ఐపీఎల్ జట్లలో అందరికంటే చివరగా మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలోకి అడుగు పెట్టింది. ఆరు రోజుల తప్పనిసరి ఐసోలేషన్, ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా సోకిన విఘ్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు. ధోని సారథ్యంలోని సీఎస్కే శుక్రవారం తమ సాధన మొదలు పెట్టింది. అయితే కరోనా సోకిన దీపక్ చహర్, రుతు రాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించాకే వీరికి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారని టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. వీరందరికీ వరుసగా మూడో సారి నిర్వహించిన పరీక్షలు కూడా నెగెటివ్‌గా వచ్చాయని, అందుకే ఆట మొదలు పెట్టామని ఆయన చెప్పారు. కోచ్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్ మైక్ హస్సీ పర్యవేక్షణలో ప్రాక్టీస్ కొనసాగింది. చెన్నై జట్టు తాజా పరిస్థితిని చూస్తే ఈ నెల 19న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కోహ్లి సాధన షురూ..
దుబాయ్: ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లు తొలిసారి కలిసికట్టుగా మైదానంలోకి దిగారు. శుక్రవారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఆరు రోజుల కనీస క్వారంటీన్ సమయం ముగియడంతో ఆర్సీబీ సభ్యులంతా సాధన చేశారు. ఉదయం సరదాగా నగరంలో తిరిగొచ్చిన ఆటగాళ్లు సాయంత్రం నెట్స్‌లో శ్రమించారు. యూఏఈ బయల్దేరడానికి ముందు బెంగళూరు టీమ్ ఎలాంటి సన్నాహకాల్లో పాల్గొనలేదు. ఆ జట్టు సభ్యుల్లో దాదాపు ప్రతీ ఒక్కరు వేర్వేరు సమయాల్లో విడిగా వచ్చి సహచరులతో చేరారు. టీమ్ డైరెక్టర్ మైక్ హెసన్ మొదటి సెషన్‌ను పర్యవేక్షించారు. 12 ఐపీఎల్ సీజన్లలో రాయల్ చాలెంజర్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. -
జిమ్నాస్ట్ మెరిక... సాధన షురూ ఇక
అగర్తలా (త్రిపుర): కరోనా లాక్‌డౌన్‌తో దేశంలోని అన్ని స్టేడియాలు మూతపడ్డాయి. దాంతో క్రీడాకారులందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక మూడో దశ సడలింపుల్లో భాగంగా స్టేడియాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టగా... తాజాగా త్రిపుర రాజధాని అగర్తలాలో భారత మేటి మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌తోపాటు ఇతర జిమ్నాస్ట్‌లు తమ సాధన ప్రారంభించారు. స్థానిక నేతాజీ సుభాష్ రీజినల్ కోచింగ్ సెంటర్ (ఎన్‌ఎస్‌ఆర్‌సీసీ) ఇండోర్ స్టేడియంలో దీపా కర్మాకర్ తన కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్టింగ్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ ఆ తర్వాత గాయాలబారిన పడి మరో మెగా ఈవెంట్లో బరిలోకి దిగలేకపోయింది. ‘మార్చి 16న జిమ్నాజియం మూతపడింది. ఐదున్నర నెలలు ఇంట్లోనే గడిపా. సుదీర్ఘకాలంపాటు క్రీడా పరికరాలకు దూరంగా ఉంటే క్రీడాకారులందరికీ ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. అయితే ట్రైనింగ్ లేని సమయంలో నా వ్యక్తిగత కోచ్ బిశ్వేశ్వర్ నంది ఆన్లైన్లో ఫిట్నెస్ తరగతులు తీసుకున్నారు’ అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది. -
సూపర్ కింగ్స్ ట్రైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్
చెన్నై: మూడు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ యూఏఈ వెళ్లడానికి ముందు స్వల్పకాలిక శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది. చెన్నైలో జరిగే ఈ ట్రెయినింగ్ సెషన్‌కు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని జట్టు యాజమాన్యం ఆదివారం తెలిపింది. ఈ నెల 15న ఈ శిబిరం ఆరంభం కానుంది. ఇందులో కెప్టెన్ ధోనితో సహా జట్టు సభ్యులు సురేశ్ రైనా, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, తదితర భారత ఆటగాళ్లు పాల్గొంటారని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. -
న్యూజిలాండ్ క్రికెటర్ల ప్రాక్టీస్ షురూ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోనూ క్రికెట్ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. కివీస్ టాప్ క్రికెటర్లు టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, మ్యాట్ హెన్రీ, డరైల్ మిచెల్ సోమవారం ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. క్రికెటర్ల కోసం సెప్టెంబర్ వరకు ఆరు జాతీయ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) ప్రకటించింది. ‘లింకన్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఈ వారం జరిగే తొలి జాతీయ శిబిరంలో కివీస్ అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెటర్లు పాల్గొంటారు. రెండో శిబిరం మౌంట్ మాంగనీలోని బే ఓవల్‌లో ఈనెల 19–24 జరుగుతుంది. మూడోది ఆగస్టు 10–13 వరకు, నాలుగో శిబిరం ఆగస్టు 16–21 వరకు, మిగతా రెండు సెప్టెంబర్‌లో నిర్వహిస్తాం’ అని ఎన్‌జడ్‌సీ పేర్కొంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మౌంట్‌మాంగనీలో జరిగే రెండో శిబిరంలో పాల్గొననున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల కివీస్ మహిళల వైస్ కెప్టెన్ ఆమీ సాటర్‌వైట్ ఆనందం వ్యక్తం చేసింది. -
ఇలా అయితే కష్టమే
మ్యాచ్ ప్రాక్టీస్‌కు దూరమయ్యేకొద్దీ క్రీడాకారులు తిరిగి గాడిన పడటం కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఆటకు ఇలాంటి ఎడబాటు ఎప్పుడూ లేదన్నారు. ఇది ఆటగాళ్ల ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. న్యూఢిల్లీ: సుదీర్ఘ లాక్డౌన్ ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసే ప్రమాదముందని, ఇన్ని నెలలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే మళ్లీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం చాలా కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఇది ప్లేయర్లకే కాదు... ద్వితీయశ్రేణి కోచ్‌లు, క్రీడా పరికరాల దుకాణాలకు నష్టాలనే తెచ్చిపెట్టిందన్నారు. మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో ఈ 46 ఏళ్ల చీఫ్ కోచ్ పలు అంశాలపై స్పందించారు. ఇలాగే కొనసాగితే... ఆటలు, పోటీలు లేకపోవడం ఇప్పటికైతే ఫర్వాలేదు కానీ ఇదే పరిస్థితి ఇంకో నెల, నెలన్నర కొనసాగితే మాత్రం ఆటగాళ్లకు కష్టమే! వాళ్ల సహనానికి ఇది కచ్చితంగా విషమ పరీక్షే అవుతుంది. లాక్డౌన్ మొదటి నెలంతా విశ్రాంతి తీసుకున్నారు. కొందరైతే గతంలో చేయని పనుల్ని సరదాగా చేసి మురిశారు. తర్వాత రెండు నెలలు కసరత్తు ప్రారంభించారు. ఆన్లైన్ ట్రెయినింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఆటగాళ్లకు శారీరక, మానసిక సవాళ్లు ఎదురవుతాయి. విశ్రాంతితో మానసిక బలం చేకూరుతుందేమో కానీ... నెలల తరబడి ఇలాగే ఉంటే ఫిట్నెస్ (శారీరక), ఫామ్ సమస్యలు తప్పవు. పైగా ఒలింపిక్స్‌కు ముందు ఇది మరింత ప్రమాదకరం కూడా! తొలిసారి ఈ ఎడబాటు... నా కెరీర్లో నేనెప్పుడూ ఇన్ని నెలలు బ్యాడ్మింటన్‌కు దూరం కాలేదు. ఆటగాడి నుంచి కోచ్ అయ్యేదాకా ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. ఆన్లైన్ కోచింగ్, ఫిట్నెస్ సెషన్లతో అందుబాటులో ఉండటం ద్వారా ఆ వెలితిని కాస్త పూడ్చుకోగలుగుతున్నా. నా వరకైతే ఇది ఓకే. ఈ తీరిక సమయాన్ని చదివేందుకు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు వినియోగించుకుంటున్నా. కోచింగ్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లతో బిజీగా మారుతున్నా. ఎటొచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ లేని ఆటగాళ్లకే ఇది నష్టం. మారే క్రీడా క్యాలెండర్... కరోనా పరిస్థితులతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నీలన్నీ వాయిదా వేసింది. కొన్ని రద్దు చేసింది. సాధారణంగా ప్రత్యేకించి ఏదైనా దేశం, టోర్నీ వాయిదా పడితే అందులో ఆడేవారిపై ప్రభావం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు, వీసాలతో ఇపుడు ఏ టోర్నీ అయినా ఆగొచ్చు. క్రీడా క్యాలెండర్ మరిన్ని మార్పులకు గురికావొచ్చు. కోచ్‌లకూ కష్టకాలం... ఈ ప్రతిష్టంభనతో ఒక్క ఆటగాళ్లే కాదు దీన్ని నమ్ముకున్న కోచ్‌లు, క్రీడా పరికరాల షాపులకు నష్టాలే. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సెలవులతో ఉంటాయి. అప్పుడు పిల్లలంతా ఆటలపై మరలుతారు. క్రీడా వస్తువులు కొంటారు. స్థానిక కోచ్‌లతో తమ ఆటల ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. ప్రొఫెషనల్ కోచ్‌లకు ఏ ఇబ్బంది లేకపోయినా ఢిల్లీలోని సిరిఫోర్ట్, త్యాగరాజ్ స్టేడియాల్లో స్వతంత్రంగా పనిచేసే కోచ్‌లకు జీవనాధారం కరువైంది. ఇలాంటి వారి కోసం అర్జున అవార్డీలు అశ్విని నాచప్ప, మాలతి హోలలతో కలిసి ‘రన్ టు ద మూన్’ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించాం. -
నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా
కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లో తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు. -
ధోని ‘ఆట’ ముగిసింది!
చెన్నై: ఐపీఎల్లో వీరాభిమానుల గురించి చెప్పాల్సి వస్తే ముందు వరుసలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్సే ఉంటారు. ఐపీఎల్ సన్నాహాల్లో భాగంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సాధన చేస్తుంటే జనం విరగబడి వచ్చారు. ఒక మ్యాచ్‌కు వచ్చినట్లుగా తలపించే రీతిలో ప్రాక్టీస్ సెషన్లకు ప్రేక్షకులు కనిపించారు. ఇదంతా తమ ఆరాధ్య ఆటగాడు ధోని కోసమే! గత ఏడాది జులైలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడని ధోని ఐపీఎల్లో బరిలోకి దిగుతుండటంతో వారిలో ఉత్సాహం రెట్టింపయింది. ఐపీఎల్లో మెరుపులకు ముందు ప్రత్యక్షంగా ధోని బ్యాటింగ్‌ను చూసేందుకు తరలి వచ్చారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ధోని సాధన ముగిసింది. ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితిలో ఫ్రాంచైజీ తమ సన్నాహాలను నిలిపివేసింది. దాంతో ధోని కూడా ఆదివారం రాంచీకి బయల్దేరాడు. ధోనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా ఫ్రాంచైజీ వీడియో పోస్ట్ చేసింది. అన్నట్లు ధోని భవిష్యత్తు, ప్రపంచ కప్ జట్టులో చోటు వంటివి ఐపీఎల్ ప్రదర్శనతో ముడిపడి ఉన్నాయని గత కొంతకాలంగా కోచ్, సెలక్టర్లు పదే పదే చెబుతూ వచ్చారు. మరి ఐపీఎల్ జరగకపోతే ధోని ఫామ్‌ను, ప్రదర్శనను ఎలా అంచనా వేస్తారో! -
భారత్‌ను గెలిపించిన పూనమ్
బ్రిస్బేన్: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శిఖా పాండే (16 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, దీప్తి శర్మ (21) మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేయగలిగింది. లీ ఆన్ కిర్బీ (41 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హేలీ మాథ్యూస్ (25) రాణించారు. పూనమ్ యాదవ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి ఓవర్లోనే పూనమ్ 2 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించింది. -
భువీ ఈజ్ బ్యాక్
మాంచెస్టర్ : పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. భూవీ బ్యాకప్ ప్లేయర్‌గా నవదీప్ సైనీ ఇంగ్లండ్‌కు వెళ్లడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందోళనలు కలిగాయి. అయితే తాజాగా స్థానిక ఇండోర్ నెట్స్‌లో భువనేశ్వర్ బౌలింగ్ చేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోనూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. పాక్‌తో మ్యాచ్‌లో గాయపడిన భువనేశ్వర్ మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం భారత్‌కు ఊరటకలిగించే వార్తే. కాగా, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భువీ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. భారత్ ఇప్పటికే 5మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని జట్లుగా భారత్, న్యూజిలాండ్‌లు దూసుకుపోతున్నాయి. అయితే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌లతో కూడిన భారత్ పేస్ బలగం మరింత పటిష్టంగా తయారయ్యింది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్‌కు క్రికెటర్ల గాయాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే బొటనవేలి గాయంతో శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది. Look who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn — BCCI (@BCCI) 25 June 2019 -
శంకరా... ఏంటి సంగతి?
సౌతాంప్టన్: ఇప్పటికే బొటన వేలి గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిగా దూరమై, ఫిట్నెస్ సమస్యలతో పేసర్ భువనేశ్వర్ ఇబ్బంది పడుతున్న వేళ... టీమిండియాను కొంత కలవరపరిచే సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎడమ కాలి పాదానికి బంతి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అనంతరం పరిస్థితిని పర్యవేక్షించిన జట్టు మేనేజ్మెంట్ సాయంత్రానికి శంకర్ కోలుకున్నాడని, ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. మరోవైపు గురువారం ప్రాక్టీస్‌లో దినేశ్ కార్తీక్ చాలాసేపు బ్యాటింగ్ సాధన చేశాడు. ఈ తీరు చూస్తుంటే శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. శంకర్ మాత్రం బ్యాట్ పట్టలేదు. కాసేపు జాగింగ్ చేశాడు. ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను గమనిస్తూ ఉండిపోయాడు. గాయం ప్రభావం లేనట్లు సాధారణంగానే నడిచాడు. చివర్లో కొద్దిసేపు బౌలింగ్‌కు దిగినా షార్ట్ రనప్‌తో సరిపెట్టాడు. ప్రస్తుత సమీకరణాల్లో జట్టు కూర్పులో కీలకంగా మారిన శంకర్‌కు టోర్నీ ప్రారంభానికి ముందు సైతం నెట్స్‌లో బంతి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడిని న్యూజిలాండ్‌పై సన్నాహక మ్యాచ్ ఆడించలేదు. ధావన్ దూరమై, రాహుల్ ఓపెనింగ్‌కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చోటుదక్కిన శంకర్ రెండు కీలక వికెట్లు తీశాడు. శుక్రవారం టీమిండియా ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోనుంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. భువీ పరిస్థితేమిటో! ప్రపంచకప్‌లో జట్టు రెండో ప్రధాన పేసర్‌గా నమ్మకం ఉంచిన భువనేశ్వర్ మరో 8 రోజుల తర్వాతే మైదానంలో దిగే పరిస్థితి కనిపిస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో పాక్‌తో మ్యాచ్ నుంచి మధ్యలో తప్పుకొన్న భువీ ఇంగ్లండ్‌తో మ్యాచ్ (జూన్ 30) సమయానికి కానీ కోలుకోడని తెలుస్తోంది. ఇప్పటికైతే అతడు ఫిట్నెస్ సాధిస్తాడనే బీసీసీఐ భావిస్తోంది. భువీ... బుధవారం జాగింగ్‌కే పరిమతమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ చేయలేదు. బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చాలని బౌలర్లెవరూ కోరుకోరు. మా ప్రాక్టీస్ మేం చేసుకోవాలి కదా?. నావరకైతే బ్యాట్స్‌మెన్‌కు బంతులేయడమే మంచి సాధన. ఆ దిశగానే ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇదంతా ఆటలో ఒక భాగమే. నేనేం విజయ్ను లక్ష్యంగా చేసుకోలేదు (నవ్వుతూ). అతడు క్షేమంగానే ఉన్నాడు. ధావన్ జట్టుకు ముఖ్యమైన ఆటగాడు. తను దూరమవడం దురదృష్టకరం. దీనిని మర్చిపోయి ముందుకెళ్లాలి. –జస్ప్రీత్ బుమ్రా, భారత పేసర్ -
క్రికెట్.. క్లిక్
-
మీడియా సమావేశానికి కోహ్లి గైర్హాజరు
కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో కాన్పిడెంట్‌గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా.. ‘కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. అంతేకాదు సౌతాఫ్రికా కెప్టెన్ హాజరవుతున్నాడన్న సమాచారం లేదని తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం గురువారం ప్రాక్టీస్ సెషన్‌నూ ఎగ్గొట్టారు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉండే. కానీ, ఎవరూ రాలేదు. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. గతంలో ఇలా భారత కెప్టెన్ మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం ఎప్పుడు జరగలేదు. మాజీ కెప్టెన్ ధోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ సారి ఇషాంత్‌ను పంపించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. -
ధోనీ-అభిమాని: ఓ అరుదైన ఘటన!
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న ధోనీ.. భారత్-లంక నాలుగో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ లంక అభిమాని అకస్మాత్తుగా మైదానంలో దూసుకొచి.. ధోనీ ప్రాక్టీస్ సెషన్ అడ్డుకున్నాడు. ఎందుకంటే.. ధోనీతో సెల్ఫీ తీసుకోవడానికి.. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అతను సెల్ఫీ తీసుకోవడం భారత ఆటగాళ్లను విస్మయపరిచింది. గురువారం జరిగే నాలుగో వన్డేతో ధోనీ 300 వన్డేలు ఆడిన ఘనతను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా మంగళవారం ఆయన మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగా ఓ లంక అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. మైదానంలోకి వచ్చాడు. మొదట రోహిత్ శర్మను చూసి ధోనిగా పొరపడి అతని వద్దకు వెళ్లాడు. దీంతో ధోనీ అక్కడ ఉన్నాడని రోహిత్ చూపించాడు. అభిమాని మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ధోనీ వద్దకు వెళ్లి అడిగి సెల్ఫీ తీయించుకున్నాడు. అభిమానితో హుందాగా ప్రవర్తించిన ధోనీ సెల్ఫీ దిగిన అనంతరం గప్‌చుప్‌గా వెళ్లాలని అతనికి సూచించాడు. ఆ తర్వాత అతను వెళ్లిపోగా.. ఇంతలోనే భద్రతాసిబ్బంది భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మైదానంలో మధ్యలోకి అతను ఎలా వచ్చాడని ఆరా తీయగా.. అతను నాలుగో వన్డే జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియం సిబ్బంది అని, అందుకే ధోనీ వద్దకు రావడంలో అతనికి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని తెలిసింది. -
కోహ్లీ మళ్లీ మొదలుపెట్టాడు
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. వచ్చే నెలలో అత్యంత కీలకమైన వెస్టిండీస్ టూర్ ఉండటంతో 27 ఏళ్ల డాషింగ్ బ్యాట్స్‌మన్ నెట్స్వద్దకు వచ్చాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 9వ సీజన్లో 973 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ సాధించిన కోహ్లీ.. అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. దానికి ముందు జరిగిన టి20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టును సెమీస్ వరకు నడిపించాడు. కారులో కిట్ బ్యాగ్ వేసుకుని శిక్షణకు వెళ్తున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. దాంతో కొన్నాళ్ల పాటు ఊరుకున్న విరాట్.. ఇప్పుడు వెళ్లేది విండీస్ కావడంతో గట్టిగా సిద్ధం అవ్వాలని భావిస్తున్నాడు. విండీస్‌లో 49 రోజుల పాటు జరిగే పర్యటనలో టీమిండియా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. దానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. జూలై 9న సెయింట్ కిట్స్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు జూలై 21వ తేదీ నుంచి మొదలవుతుంది. Guess who is back. On my way for my first net session. And that's how I feel; that good old feeling #Grateful -
ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు. -
సిడ్నీ టెస్టుకు జాన్సన్ అనుమానం!
ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన పేసర్ సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. దీంతో సిడ్నీలో భారత్‌తో ఈనెల 6న మొదలయ్యే నాలుగో టెస్టులో అతను ఆడటంపై అనుమానం నెలకొంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో జట్టుతో పాటు నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లొద్దని పేసర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్టు సమయానికి జాన్సన్ కోలుకోకపోతే అతని స్థానంలో స్టార్క్, సిడిల్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ‘జాన్సన్ ఫిట్‌నెస్‌పైనే నేను బరిలోకి దిగడం ఆధారపడి ఉంది. ఆడటానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నా. బిగ్‌బాష్‌లో నేను బాగానే బౌలింగ్ చేయగలిగా. అవకాశం వస్తే నాలుగో టెస్టులోనూ అదే విధంగా రాణించాలని కోరుకుంటున్నా. ఏ ఫార్మాట్లోనైనా నా సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని స్టార్క్ పేర్కొన్నాడు. పిచ్‌లు మరీ నెమ్మదిగా ఉన్నాయి: హారిస్ గత యాషెస్ సిరీస్‌తో పోలిస్తే... భారత్‌తో సిరీస్‌కు నెమ్మదైన పిచ్‌లను రూపొందించారని పేసర్ హారిస్ అన్నాడు. బంతులు తక్కువ ఎత్తులో వస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందన్నాడు. ‘పిచ్‌లపై బౌన్స్, వేగం లేదు. అయినప్పటికీ తొలి రెండు టెస్టుల్లో ఫలితాలను రాబట్టాం. ఇప్పటికీ మేం కోరుకుంటున్నది ఒక్కటే... పిచ్‌పై కొంత పచ్చిక, బౌన్స్ ఉండాలి’ అని హారిస్ తెలిపాడు. ఆసీస్ అటాక్ అద్భుతంగా ఉన్నప్పటికీ జట్టులో సిడిల్ ఉంటే మరింత బాగుంటుందన్నాడు. ‘సిడిల్‌ను తీసుకోవడమనేది సెలక్టర్ల ఇష్టం. హాజెల్‌వుడ్ బాగా రాణిస్తున్నాడు. మెల్బోర్న్లో మంచి పేస్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సిడిల్ అనుభవాన్ని మేం కోల్పోతున్నాం’ అని హారిస్ అన్నాడు. -
ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంటాం: మాల్యా
న్యూఢిల్లీ: ‘కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్’లో సాబెర్ (45 పాయింట్లు) జట్టు నుంచి ముప్పు పొంచి ఉన్నా.... ప్రస్తుతం ఉన్న ఆరో స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఫోర్స్ ఇండియా (62 పాయింట్లు) టీమ్ ప్రిన్సిపల్ విజయ్ మాల్యా ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు రేసుల్లో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం ఫోర్స్ అవకాశాలను బాగా దెబ్బతీయగా... సాబెర్ చివరి నాలుగు రేసుల్లో 38 పాయింట్లు గెలవడం వారికి కలిసొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య తేడా 17 పాయింట్లకు పడిపోయింది. ఈ సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉన్నాయి. ‘2014 సీజన్ కోసం కారును అభివృద్ధి చేసేందుకు చాలా ఖర్చు చేస్తున్నాం. అదే సమయంలో ఈ సీజన్‌లోని మిగతా నాలుగు రేసుల్లో సాబెర్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలి. సిల్వర్‌స్టోన్ రేసులో టైర్లు మార్చాల్సి రావడం దెబ్బతీసింది. దీంతో కారును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. టైర్ల గురించి తెలుసు కాబట్టి ప్రాక్టీస్ సెషన్ ఫలితాలపై సంతృప్తిగానే ఉన్నాం. మిగతా రేసుల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏడాది పడిన కష్టం వచ్చే సీజన్లో మాకు మంచి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది’ అని మాల్యా వ్యాఖ్యానించారు.