MS Dhoni-Old-Video Turning-Up Ranchi Stadium On Bike For Practice - Sakshi
Sakshi News home page

IPL 2023: ప్రాక్టీస్‌.. స్టేడియానికి బైక్‌పై దూసుకొచ్చిన ధోని

Published Tue, Feb 7 2023 3:58 PM | Last Updated on Tue, Feb 7 2023 4:38 PM

MS Dhoni-Old-Video Turning-Up Ranchi Stadium On Bike For Practice - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌ 2023కి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో తన హోంగ్రౌండ్‌ రాంచీలో ప్రాక్టీస్‌ను ఆరంభించిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. అంతేకాదు ఇటీవలే న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య జరిగిన తొలి టి20 రాంచీ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ఎంఎస్‌ ధోని తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. తాజాగా ధోనికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతుంది. 

రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని ప్రతీరోజు తన TVS అపాచీ బైక్‌పై స్టేడియానికి రావడం విశేషం. ధోనికి బైక్‌లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని గ్యారెజీలో ప్రత్యేకంగా బైక్‌ షెడ్‌ ఉంది. అందులో రకరకాల బైక్‌లు ఉంటాయి. తాజాగా రాంచీ స్డేడియాని ధోని తీసుకొచ్చి బైక్‌.. టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌ 310.

ప్రాక్టీస్‌ అనంతరం ధోని తన బైక్‌పై వెళ్లడం అతని అభిమాని ఒకరు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వీడియో బయటికి వచ్చింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.భారత్‌లో బీఎండబ్ల్యూ, టీవీఎస్‌లు జతకలిసి తర్వాత మార్కెట్లోకి రిలీజైన తొలి బైక్‌ ఇదే. తాజాగా అతని గ్యారేజీలో టీవీఎస్‌ అపాచీ బైక్‌ మోడల్‌ కూడా వచ్చి చేరిపోయింది.

చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే

ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ ​కానుకగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement