India Tour Of England 2022: దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ముగియగానే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లీసెస్టర్‌షైర్‌లో ఉన్న టీమిండియాతో కలిశాడు. రాహుల్ వచ్చీ రాగానే ఆటగాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారిని టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్దం చేస్తున్నాడు. ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించిన దృశ్యాలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. రాహుల్ రంగంలోకి దిగంగానే రుద్దుడు షురూ చేశాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Look who's here!
— BCCI (@BCCI) June 21, 2022
Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. 💪💪 #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd
కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండగానే టీమిండియాలోని కీలక సభ్యులు ఈ నెల 16న లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ బ్యాచ్ బయల్దేరిన తర్వాతి రోజు రోహిత్ శర్మ.. నిన్న ద్రవిడ్, పంత్, శ్రేయస్‌లు లండన్‌లో ల్యాండయ్యారు. అశ్విన్ మినహా భారత టెస్ట్ జట్టంతా ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. జూన్ 24న లీసెస్టర్‌షైర్ కౌంటీతో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టీమిండియా జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
గతేడాది కోవిడ్ కారణంగా రద్దైన ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డుల సంయుక్త ఒప్పందం మేరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అది అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆ జట్టు తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌ను 2-0తో మట్టికరిపించి మాంచి జోష్ మీద ఉంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్..
జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్
జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్
జులై 7న తొలి టీ20
జులై 9న రెండో టీ20
జులై 10న మూడో టీ20
జులై 12న తొలి వన్డే
జులై 14న రెండో వన్డే
జులై 17న మూడో వన్డే
చదవండి: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్!
Comments
Please login to add a commentAdd a comment