India tour of England
-
IND VS ENG 5th Test: బాగా ఆడలేదు, ఓడాం.. పరాజయానికి సాకులు చెప్పదల్చుకోలేదు..!
గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. తుది జట్టుపై చర్చ సహజం. శార్దుల్ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చాం. అశ్విన్ స్థాయి ఆటగాడిని పక్కన పెట్టడం అంత సులువు కాదు. అయితే తొలి రోజు పిచ్ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందని అనిపించింది. మ్యాచ్ చివరి వరకు కూడా బంతి పెద్దగా స్పిన్ కాలేదు. పిచ్‌లో కూడా పెద్దగా మార్పు రాలేదు కాబట్టి రెండో స్పిన్నర్ ఉన్నా ఫలితం మారకపోయేదేమో. తొలి నాలుగు టెస్టుల సమయంలో నేను లేను. అప్పుడు ఇంగ్లండ్ కొంచెం ఇబ్బంది పడ్డా, ఇప్పుడు వరుసగా మూడు విజయాల తర్వాత ఇక్కడకు వస్తే, మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. అయినా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ఇంగ్లండ్ కీలక సమయాల్లో బాగా ఆడింది కాబట్టి టెస్టు గెలవగలిగింది. –రాహుల్ ద్రవిడ్, భారత్ హెడ్ కోచ్ -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0. -
IND VS ENG: పంత్ సెంచరీ చేశాడంటే టీమిండియాకు ఓటమి తప్పదా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు టీమిండియా గెలుపుకు మరో 7 వికెట్లు అవసరముండగా.. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగులు కావాల్సి ఉంది. వరుణుడు ఆటంకం కలిగిస్తేనో లేక ఏదైనా అద్భుతం జరిగితేనో తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా అభిమానులు తమ బౌలర్లపై ఏ మూలనో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆఖరి రోజు తమ పేసర్లు చెలరేగి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదో మూలన భారత విజయావకాశాలు మినుకుమినుకుమంటున్నా ఫాన్స్‌ను ప్రస్తుతం ఓ అంశం కలవరపెడుతంది. అదేంటంటే.. విదేశాల్లో రిషబ్ పంత్ సెంచరీ బాదిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే విషయం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. పంత్ తన టెస్ట్ కెరీర్లో మొత్తం 5 సెంచరీలు బాదగా.. అందులో నాలుగు విదేశీ పిచ్‌లపై సాధించినవే ఉన్నాయి. ఈ నాలుగింటిలో పంత్ సిడ్నీలో సెంచరీ చేసిన మ్యాచ్ డ్రా కాగా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను మినహాయించి) టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాకు మరో ఓటమి తప్పదని భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. పంత్ సెంచరీల వివరాలు.. 1. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 114- టీమిండియా ఓటమి 2. 2019 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్ట్) పంత్ 159 నాటౌట్- మ్యాచ్ డ్రా 3. 2021 ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (నాలుగో టెస్ట్) పంత్ 101- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం 4. 2022 ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా (మూడో టెస్ట్) పంత్ 100 నాటౌట్- టీమిండియా ఓటమి 5. 2022 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 146, 57- ? ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. -
రంగంలోకి దిగిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ..!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎనిమిది రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రాగానే ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను రెడీ అంటూ అభిమానులకు సంకేతాలు పంపాడు. ఆదివారం క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కాకుండా డిఫెన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన రోహిత్.. నెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన హిట్‌మ్యాన్ అభిమానులు.. ఇక ఇంగ్లీషోల్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. Exclusive and Latest video 📸 Captain Rohit Sharma is looking in great touch in nets. pic.twitter.com/OsXPZP4r32 — Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 4, 2022 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ రిపోర్డు వచ్చినప్పటికీ మరో పరీక్షకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్‌కు ఇవాళ (జులై 4) గండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్నెస్ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ప్రకారం హిట్‌మ్యాన్ ఈ ప్రొసీజర్ మొత్తాన్ని క్లియర్ చేస్తేనే తొలి టీ20కి అందుబాటులో ఉంటాడు. కాగా, జులై 7 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో మూడు టీ20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి. చదవండి: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 -
భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టిన (టెస్ట్ క్రికెట్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (31)) బుమ్రా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2014 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ పడగొట్టిన 19 వికెట్లే (5 మ్యాచ్‌ల సిరీస్‌లో) ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా సిరీస్‌లో బుమ్రా.. భువీ రికార్డును తిరగరాశాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (2007లో 18 వికెట్లు), ఇషాంత్ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్ గుప్తే (1959లో 17 వికెట్లు) బుమ్రా, భువీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్లకు దక్కుతుంటుంది. అయితే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వికెట్లు (ఓ సిరీస్‌లో) సాధించిన టాప్-5 బౌలర్లలో ఒక్కరే స్పిన్నర్ ఉండటం విశేషం.సుభాశ్ గుప్తే.. 1959 ఇంగ్లండ్ సిరీస్‌లో (5 టెస్ట్ మ్యాచ్‌లు) 17 వికెట్లు సాధించాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో బరిలోకి దిగి బ్యాట్‌తో (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 31 పరుగులు) చెలరేగిన బుమ్రా.. ఆతర్వాత బంతితోనూ, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలుత ఇంగ్లండ్ టాప్ 3 బ్యాటర్లను ఔట్ చేసి బుమ్రా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అద్భుతమైన డైవిండ్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్ప్‌లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత్.. ఓవరాల్‌గా 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. పుజారా (50), పంత్ (30) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా మరో 100 పరుగులు చేయగలిగితే మరింత పటిష్ట స్థితికి చేరుకుంటుంది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం! -
హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓ పక్క టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతుంటే, మరో పక్క యువ భారత జట్టు టీ20ల్లో దుమ్మురేపుతోంది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యువ భారత్.. నార్తంతాంప్టన్షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో డీకే సారధ్యంలోని యంగ్ ఇండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. నామమాత్రపు స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం కాగా.. కెప్టెన్ డీకే (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్), హర్షల్ పటేల్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టీమిండియాను ఆదుకున్నారు. నార్తంతాంప్టన్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3, బక్, ఫ్రెడ్డీ హెల్డ్రిచ్ తలో 2 వికెట్లు, కాబ్ ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో సైఫ్ జైబ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, చహల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ ఆల్‌రౌండర్ షోతో (54, 2/23) టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ విజయం సాధించింది. చదవండి: వారెవ్వా... కెప్టెన్ బుమ్రా -
రోహిత్ శర్మకు ‘నెగెటివ్’
ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగెటివ్ ఫలితం వచ్చింది. ఫలితంగా అతను ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఈనెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. లీస్టర్‌షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. రెండుసార్లు అతనికి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. -
గల్లీ క్రికెట్‌ను తలపించిన టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఔటైనా నాటౌటే..!
భారత్-లీస్టర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ గల్లీ క్రికెట్‌ను తలపించింది. మూడో రోజు టీమిండియా బ్యాటింగ్ సమయంలో కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన మళ్లీ బ్యాటింగ్ కొనసాగించి అర్ధసెంచరీలు స్కోర్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ తరఫున ఆడిన నయా వాల్ పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున.. రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ లీస్టర్‌షైర్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి బ్యాటింగ్‌కు దిగాడు. వార్మప్ మ్యాచ్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు రూల్స్‌ను పక్కకు పెట్టి గట్టిగా ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత ఆటగాళ్లంతా సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్‌లో మరో రోజు (నాలుగో రోజు) ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి లీస్టర్‌షైర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. లీస్టర్‌షైర్ టీమిండియాపై గెలవాలంటే మరో 287 పరుగులు సాధించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ (46), శామ్యూల్ ఈవాన్స్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246/8.. రెండో ఇన్నింగ్స్‌లో 364/7 స్కోర్ల వద్ద డిక్లేర్ చేసింది. లిస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సమయానికి (జులై 1) రోహిత్ కోలుకోకపోతే బుమ్రా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా కేఎల్ రాహుల్, కోవిడ్ కారణంగా అశ్విన్ ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. -
ఫిఫ్టి కొట్టి బుమ్రా ఉచ్చులో చిక్కిన కోహ్లి
లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి అర్ధసెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి.. 98 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో అబ్దైన్ సఖండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడిన కోహ్లి సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. అయితే వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 90/1 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (43), హనుమ విహారి (20), శార్దూల్ ఠాకూర్ (28), పుజారా (22) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (46), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టీమిండియా 246/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
కోహ్లి వికెట్ తీశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటా..!
Roman Walker: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా లీస్టర్‌షైర్‌తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (246/8 డిక్లేర్) పరిమితం కాగా.. టీమిండియా బౌలర్ల ధాటికి లీస్టర్‌షైర్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్, విహారి క్రీజ్‌లో ఉన్నారు. ☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire's finger goes up. Out or not out? 🤔 🇮🇳 IND 138/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpwig48 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/iE9DNCUwLO — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో కోహ్లి, రోహిత్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/25) పడగట్టిన రోమన్ వాకర్ కోహ్లి వికెట్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ కోహ్లి వికెట్ పడగొట్టడంపై స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్ అయిన విరాట్ కోహ్లి వికెట్ నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.. కోహ్లి వికెట్ సాధించిన అనంతరం నా టీమ్ మేట్స్ కొందరు మెసేజ్ చేశారు.. కోహ్లి వికెట్ గురించి నీ మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.. అవును వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వాకర్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! -
షాకింగ్ న్యూస్: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..?
టీమిండియా అభిమానులకు చేదు వార్త. రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. కోహ్లి లండన్‌లో ల్యాండయ్యాక షాపింగ్ అంటూ వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు పోజులిచ్చాడు. అక్కడే అతను కోవిడ్ బారిన పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరక ముందు మాల్దీవ్స్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేశాడు. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 కోహ్లి కొద్ది రోజులగా జట్టు సహచరులతో క్లోజ్‌గా ఉండటంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లి టీమ్ మేట్స్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. కోహ్లి కోవిడ్ బారిన పడ్డాడన్న వార్త నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. కాగా, టీమిండియా ఇంగ్లండ్‌కు బయల్దేరడానికి ముందు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కోవిడ్ కారణంగా గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టీమిండియా పోరు.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు! -
మళ్లీ మొదలైన రగడ.. వాన్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన వసీం జాఫర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ల మధ్య ట్విటర్ వార్ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్ చేసిన ఓ ట్వీట్‌కు వాన్ కౌంటర్ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్ కౌంటర్ ట్వీట్‌ను జాఫర్ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్ వార్ పతాక స్థాయికి చేరింది. జాఫర్-వాన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ క్రికెట్ ఫాలోవర్స్‌కు కావాల్సిన మజాను అందిస్తుంది. జాఫర్-వాన్ల మధ్య వార్ ఎక్కడ మొదలైందంటే.. జాఫర్ జూన్ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై వాన్ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్ వికెట్ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్ తనదైన స్టైల్లో వాన్‌పై కౌంటర్ అటాక్ చేశాడు. Sun is shining, the weather is sweet @HomeOfCricket 😊 pic.twitter.com/ImwcAS5YYh — Wasim Jaffer (@WasimJaffer14) June 20, 2022 2007 ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్ వాన్‌కు ఇచ్చిన ఈ స్ట్రోక్ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. Is it the 20th anniversary of my first Test wicket you are here for Wasim ? https://t.co/7Ul5Jw62ra — Michael Vaughan (@MichaelVaughan) June 20, 2022 Here for the 15th anniversary of this Michael 😄 #ENGvIND https://t.co/Qae4t8IRpf pic.twitter.com/gZC5ShGNwS — Wasim Jaffer (@WasimJaffer14) June 21, 2022 కాగా, ఇంగ్లండ్‌లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్ టెస్ట్‌లో మైఖేల్ వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ విజయం సాధిస్తుంది. చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్
India Tour Of England 2022: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ కోవిడ్ బారిన పడటంతో ఈ నెల 16న టీమిండియా సభ్యులతో పాటు ఇంగ్లండ్‌కు బయల్దేరని విషయం తెలిసిందే. అయితే తాజాగా అశ్విన్‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు లండన్‌కు బయల్దేరనున్నాడని సమాచారం. అతను ఇవాళే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అశ్విన్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, అతనికి ఇంగ్లండ్ వెళ్లాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారని, ఆతర్వాతే అతను టీమిండియాతో కలుస్తాడని ఆయన పేర్కొన్నారు. అయితే అశ్విన్ ఈ నెల 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం మాత్రం లేదని ఆయన వివరించారు. కాగా, ఐపీఎల్ ముగిశాక తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన స్థానిక లీగ్‌లో పాల్గొన్న సందర్భంగా అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్ -
రంగంలోకి దిగిన రాహుల్.. రాగానే రుద్దుడు షురూ
India Tour Of England 2022: దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ముగియగానే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లీసెస్టర్షైర్లో ఉన్న టీమిండియాతో కలిశాడు. రాహుల్ వచ్చీ రాగానే ఆటగాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వారిని టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్దం చేస్తున్నాడు. ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించిన దృశ్యాలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. రాహుల్ రంగంలోకి దిగంగానే రుద్దుడు షురూ చేశాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. Look who's here! Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. 💪💪 #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd — BCCI (@BCCI) June 21, 2022 కాగా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండగానే టీమిండియాలోని కీలక సభ్యులు ఈ నెల 16న లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ బ్యాచ్ బయల్దేరిన తర్వాతి రోజు రోహిత్ శర్మ.. నిన్న ద్రవిడ్, పంత్, శ్రేయస్‌లు లండన్‌లో ల్యాండయ్యారు. అశ్విన్ మినహా భారత టెస్ట్ జట్టంతా ప్రస్తుతం లీసెస్టర్షైర్లో ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. జూన్ 24న లీసెస్టర్‌షైర్ కౌంటీతో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టీమిండియా జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది కోవిడ్ కారణంగా రద్దైన ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డుల సంయుక్త ఒప్పందం మేరకు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరుగగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అది అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆ జట్టు తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌ను 2-0తో మట్టికరిపించి మాంచి జోష్ మీద ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్! -
ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..!
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న వీరి ఫోటోలే ఇందుకు కారణం అని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట లండన్‌లో ల్యాండైన టీమిండియా ప్రస్తుతం లీసెస్టర్షైర్లో ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. అయితే రెండు రోజుల కిందట రోహిత్, కోహ్లిలు షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులివ్వడం నెట్టింట వైరలైంది. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 యూకేలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్, కోహ్లిలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందని సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ రోహిత్, కోహ్లిలతో పాటు టీమిండియా మొత్తాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాళ్లందరూ కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. కాగా, యూకేలో కోవిడ్ తీవ్రత గత కొద్ది రోజులతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా కీ స్పిన్నర్ అశ్విన్ కోవిడ్ కారణంగా జట్టుతో పాటు ట్రావెల్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ జులై 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్-విరాట్ జోడీ -
ఇంగ్లండ్‌తో సిరీస్.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్-విరాట్ జోడీ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి ద్వయం త్వరలో ప్రారంభంకాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పలు అరుదైన రికార్డులపై కన్నేసింది. జులై 1 నుంచి ప్రారంభంకాబోయే ఈ సిరీస్‌లో టీమిండియా తొలుత టెస్ట్ మ్యాచ్ ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. తరుచూ వ్యక్తిగత రికార్డుల పరంగా రికార్డుల్లోకెక్కే రోహిత్, విరాట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జంటగా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 940 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ జోడీ ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌లో మరో 60 పరుగులు జోడిస్తే 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. టీ20ల్లో ఇప్పటివరకు 991 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ ద్వయం రానున్న సిరీస్‌లో మరో 9 పరుగులు జోడిస్తే పొట్టి ఫార్మాట్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. అలాగే వన్డేల్లో ఇప్పటిదాకా 4906 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ దిగ్గజ బ్యాటింగ్ ద్వయం మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో రోహిత్-విరాట్ జోడీ మరో 133 పరుగులు జోడిస్తే రోహిత్-శిఖర్ ధవన్ జోడీ పేరిట ఉన్న 5039 పరుగుల రికార్డును అధిగమించి.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడీగా నిలుస్తుంది. ఈ రికార్డులే కాక టీమిండియా స్టార్ జోడీ మరో అరుదైన రికార్డుపై కూడా కన్నేసింది. ఈ జోడీ టెస్టుల్లో, టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటే, మూడు ఫార్మాట్లలో వెయ్యికి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొట్టమొదటి జోడిగా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకూ ఏ జోడీ కూడా మూడు ఫార్మాట్లలో 1000కి పైగా పరుగులు జోడించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! -
లండన్‌లో ల్యాండైన రోహిత్.. కోహ్లితో కలిసి షాపింగ్‌లో బిజీ
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇదివరకే లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల చేత అప్పుడు జట్టుతో పాటు వెళ్లని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా లండన్‌లో ల్యాండయ్యాడు. జులై 1 నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. రోహిత్, కోహ్లిలు మాత్రం షాపింగ్ చేస్తూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 ఈ క్రమంలో అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. రోహిత్, కోహ్లిలు లండన్ వీధుల్లో ఫ్యాన్స్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు లీసెస్టర్షైర్లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కూడా నెట్టింట సర్ఫేస్ అవుతున్నాయి. కోహ్లితో షాపింగ్ అనంతరం రోహిత్ జట్టుతో పాటు చేరాడు. Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc — BCCI (@BCCI) June 20, 2022 ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 19) దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగియడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు బెంగళూరు నుంచే నేరుగా లండన్‌కు బయల్దేరారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు టీమిండియా ఈ నెల 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. కాగా, ఇంగ్లండ్‌తో గతేడాది జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20 ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..? -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
దుబాయ్: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌పై టీమిండయా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2-1తేడాతో టీమిండియా సిరీస్ గెలిచిందని వివాదాస్పద స్టేట్మెంట్ చేశాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రసవత్తర సిరీస్‌లో టీమిండియానే అసలైన విజేత అని పేర్కొని వివాదానికి తెరలేపాడు. తుది ఫలితం వెలువడకుండానే టీమిండియాను విజేతగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), బీసీసీఐ, ఐసీసీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయంపై రోహిత్ ఎలా ప్రకటన చేస్తాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. చివరి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారత బృందంలో కరోనా కేసు బయటపడడంతో టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు నిరాకరించారు. నాలుగు టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. రద్దైన ఆఖరి టెస్ట్‌ను వచ్చే ఏడాది టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలో షెడ్యూల్ చేసేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సూచనప్రాయంగా అంగీకారం తెలిపాయి. అయితే, ఆ మ్యాచ్ స్టాండ్ అలోన్ టెస్ట్‌గా జరుగుతుందా లేక 5టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుందా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సంచలన స్టేట్మెంట్ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..! -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
కన్నడ టీచర్‌గా మారిన రాహుల్ ద్రవిడ్
నాటింగ్‌హామ్: రాహుల్ ద్రవిడ్ కొద్దిసేపు కన్నడ టీచర్‌గా మారారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు రాహుల్ ద్రవిడ్ కన్నడ నేర్పిస్తున్నాడు. దీనికి సంభందించిన వీడియోను అలెక్స్ ఎల్లీస్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ద్రవిడ్ కన్నడ నేర్పిస్తుండగా.. వేగంగా పరిగెత్తూ అనే పదాన్ని కన్నడలో బేగా ఓడి అని చెప్పాలని రాహుల్ ద్రవిడ్ చేప్పడం విశేషం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. కాగా శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన 50 ఓవర్ల సీరిస్‌ను భారత్ కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. అయితే ఈ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు. Cricket expressions in Indian languages part 2. Today, we’re down south in Bengaluru. What better teacher than ‘The Coach’ #RahulDravid, who taught taught me this in #Kannada ಕನ್ನಡ 👇 pic.twitter.com/tDCtHOcIwa — Alex Ellis (@AlexWEllis) August 7, 2021 -
ధవన్ సేనలోని ఆ ఇద్దరికి ప్రమోషన్..!
ముంబై: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న కోహ్లీ సేనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి రీప్లేస్‌మెంట్‌గా మరో ఇద్దరు క్రికెటర్లను లండన్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు అక్కడ టీ20 సిరీస్ ముగియగానే కోహ్లీ సేనను జాయిన్ అవుతారని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ధవన్ సేనలో కొనసాగుతున్న షా, సూర్యకుమార్‌లకు బంపర్ ఆఫర్ లభించినట్లైంది. 🚨 NEWS 🚨: Injury & replacement updates - India’s Tour of England, 2021 More Details 👇 #ENGvIND — BCCI (@BCCI) July 26, 2021 వీరిలో పృథ్వీ షా ఇదివరకే టెస్టుల్లో అరంగేట్రం చేయగా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడగా, ఇటీవల జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు గాయాలపాలయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరారు. దీంతో ప్రస్తుతం లంక పర్యటనలో సత్తా చాటుతున్న పృథ్వీ షా, సూర్యకుమార్‌లకు లక్కీ ఛాన్స్ లభించింది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే నెల 4న ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్. స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్వాలా -
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపాడు. కౌంటీ ఎలెవెన్ జట్టుతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(75) చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ(51 రిటైర్డ్ ఔట్) ఫిఫ్టి కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(43 నాటౌట్) సైతం రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా 284 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందుంచింది. అనంతరం ఛేదన ప్రారంభించిన కౌంటీ ఎలెవెన్ జట్టు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పుజారాలు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం మయాంక్(47) ఔటవ్వగా.. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహారి(12), జడేజా(11) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి టీమిండియా 205 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. That will be Lunch on Day 3 of the three-day warm-up game against County XI.#TeamIndia 311 & 113/2, lead by 204 runs. pic.twitter.com/GItTWrcN7X — BCCI (@BCCI) July 22, 2021 అంతకు ముందు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా, ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, శార్ధూల్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(101), జడేజా(75) రాణించారు. -
కోహ్లీ సేనకు భారీ షాక్.. యువ ఆల్‌రౌండర్ దూరం..?
డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేనను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తరఫున బరిలోకి దిగిన సుందర్.. గురువారం ఆటలో గాయపడినట్లు సమాచారం. అతని చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని, స్కానింగ్ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. గాయంతో సుందర్ పడుతున్న ఇబ్బంది చూస్తే.. వేలు విరిగినట్లు అర్థమవుతుందని సదరు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే ఇంగ్లండ్ టూర్ నుంచి ఈ యువ ఆల్‌రౌండర్ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజు వార్మప్ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థంతరంగా ముగిసింది. తాజాగా సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాగా, 24 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కోహ్లీ సేనను కలవరపెడుతోంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని కోహ్లీ సేన చేసిన విజ్ఞప్తిని సెలెక్టర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
వాషింగ్టన్ సుందర్‌తో గొడవకు దిగిన సిరాజ్
డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్(150 బంతుల్లో 101 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (146 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించడంతో 311 పరుగల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్ ఆది నుంచి తడబడుతూ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు(వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్) ప్రత్యర్ధి జట్టు తరఫున బరిలోకి దిగారు. Mohammad Siraj exchanged a few words to Washington Sundar. pic.twitter.com/xC5EPuZeZI — Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2021 ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్(1)ను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే అంతకు ముందు సిరాజ్.. సుందర్‌తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ధి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సుందర్ మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఓపెనర్ లిబ్బి (12)ని ఉమేశ్ యాదవ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాబర్ట్ యేట్స్ (1)ను బుమ్రా పెవిలియన్‌కు పంపారు. అనంతరం కెప్టెన్ విల్ రోడ్స్(11) ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేశ్ యాదవ్ అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కౌంటీ ఎలెవన్ జట్టు రెండో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (47), లిండన్ జేమ్స్(5) ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆగష్టు 4 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.