అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది.
ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
స్కోరు వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284;
భారత్ రెండో ఇన్నింగ్స్: 245;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114;
ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378.
వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109.
బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0.
Comments
Please login to add a commentAdd a comment