ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని ఎదుర్కొని బాధలో ఉన్న టీమిండియాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం విడుదల చేసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక డ్రా, రెండు పరాజయాలు, రెండు విజయాలు నమోదు చేసింది. ఈ సైకిల్‌లో టీమిండియా విజయాల శాతం 43.33 శాతంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు, రెండింట్లో అపజయాలు, ఓ మ్యాచ్ డ్రా చేసుకుని 29.16 విజయాల శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది.
కాగా, టెస్ట్ క్రికెట్‌లో నిన్న రెండు ఊహించని ఫలితాలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలిగి కూడా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు కాగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చిన్న జట్టైన వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్ విండీస్ చేతిలో ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సంచలన విజయంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో బోణీ కొట్టిన విండీస్ ఏడో స్థానానికి ఎగబాకింది.
ఆసీస్ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో ప్లేస్‌లో పాకిస్తాన్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ స్కోర్ వివరాలు..
ఇంగ్లండ్: 246 & 420
భారత్: 436 & 202
28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
Comments
Please login to add a commentAdd a comment