పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు జనవరి 22 నుంచి మొదలవుతాయి. తొలుత ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే జరుగుతున్న సిరీస్‌లు కావడంతో ఈ సిరీస్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిమత ఓవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)
ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
వన్డే సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)
వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.
ఇంగ్లండ్ వన్డే జట్టు..
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్
ఇంగ్లండ్ టీ20 జట్టు..
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహన్ అహ్మద్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్
టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించాల్సి ఉంది.
కాగా, భారత జట్టు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (2024-25) ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఆసీస్ బీజీటీని సొంతం చేసుకుంది. బీజీటీ పూర్తయిన 17 రోజుల్లో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది.
ఈ సిరీస్‌ల అనంతరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం (భారత్ వర్సెస్ పాక్) ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది.
గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment