భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు టీమిండియా గెలుపుకు మరో 7 వికెట్లు అవసరముండగా.. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగులు కావాల్సి ఉంది. వరుణుడు ఆటంకం కలిగిస్తేనో లేక ఏదైనా అద్భుతం జరిగితేనో తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని ఆపడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా అభిమానులు తమ బౌలర్లపై ఏ మూలనో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆఖరి రోజు తమ పేసర్లు చెలరేగి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందిస్తారని వారు భావిస్తున్నారు. ఏదో మూలన భారత విజయావకాశాలు మినుకుమినుకుమంటున్నా ఫాన్స్‌ను ప్రస్తుతం ఓ అంశం కలవరపెడుతంది.
అదేంటంటే.. విదేశాల్లో రిషబ్ పంత్ సెంచరీ బాదిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇదే విషయం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. పంత్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 5 సెంచరీలు బాదగా.. అందులో నాలుగు విదేశీ పిచ్‌లపై సాధించినవే ఉన్నాయి. ఈ నాలుగింటిలో పంత్ సిడ్నీలో సెంచరీ చేసిన మ్యాచ్ డ్రా కాగా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను మినహాయించి) టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాకు మరో ఓటమి తప్పదని భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.
పంత్ సెంచరీల వివరాలు..
1. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 114- టీమిండియా ఓటమి
2. 2019 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్ట్) పంత్ 159 నాటౌట్- మ్యాచ్ డ్రా
3. 2021 ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (నాలుగో టెస్ట్) పంత్ 101- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో టీమిండియా విజయం
4. 2022 ఇండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా (మూడో టెస్ట్) పంత్ 100 నాటౌట్- టీమిండియా ఓటమి
5. 2022 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్ (ఐదో టెస్ట్) పంత్ 146, 57- ?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు..
- టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్
- టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3.
చదవండి: Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment