టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్.. తన కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX.
— CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024
- Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq
పడిక్కల్‌కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్‌కు సంబంధించి టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ల్లో భారత టపార్డర్‌లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు.
ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment